విదేశీ సంస్కృత విద్వాంసులు
43-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
1-కెనడా దేశం –1996-2001
అశోక్ అక్లుజ్ కర్- వాన్కూవర్ లోని యూని వర్సిటి ఆఫ్ బ్రిటిష్ కొలంబియా లో ఏషియన్ స్టడీస్ డిపార్ట్ మెంట్ లో రిసెర్చ్ స్కాలర్ .భర్తృహరి ,ఆయన వ్యాఖ్యాతలపై పరిశోధన చేశాడు .కకెనడలో సంస్కృతం పై పరిశోధన చేశాడు .ముక్తాక్ అక్లుజ్ కర్ –భర్తృహరి పునరావృత్తులు పై పరిశోధన చేశాడు .విద్యుత్ అక్లుజ్ కర్ –సంత్ సంప్రదాయం పై నా ,లియోనా ఆండర్సన్ –హిందూమతం పండుగలు ,ఎ. డబ్ల్యు. బార్బర్ –దక్షిణ తూర్పు ఆసియా బౌద్ధం పైనా ,మందాక్రాంత బోస్ –సంస్కృతసాహిత్యం లో నృత్యం , జాన్ బ్రెజినిస్కి –కృష్ణభక్తి ,విత్ బుబెనిక్ –సంస్కృతం –అపభ్రంశ సంబంధాలు ,వి.కృష్ణ చారి –సంస్కృత విమర్శ, ఆండ్రే కొట్యూర్-హరివంశ౦ భారతం లో భాగం ,గిల్లెన్ బ్రెండాన్ – సంస్కృత భాషా శాస్త్రం –ఫిలాసఫీ ,రిచర్డ్ హేయస్-ధర్మాకృతి రాసిన ప్రమాణ వార్తిక స్వ వృత్తి,క్లాస్ క్లోస్టర్మీర్ –మాధవాచార్య కృత శంకర దర్శనం ,రోజేర్ మార్కో రేల్లీ –అద్వైత వేదాంత ,టిఎస్ రుక్మణి-అద్వైత వేదాన్త,,భక్తి ,యోగ ,అరవింద్ శర్మ –శంకర ఆన్ స్థిత ప్రజ్ఞ,బ్రజ్ మోహన్ సిన్హా –హిందూమతం- గీత ,శ్రీనివాస్ తిలక్ –మహాభారతం ,-వ్యాకరణం ,నాటకీయత ,అలంకార శాస్త్రం,ఎ.కే. వార్డర్ –కావ్య ,పాళీ ,బౌద్ధం .లపై పరిహోధనలు చేసి పుస్తకాలు ప్రచురించారు .
2-క్రోషియా దేశం
18వ శతాబ్దం లో పాలినాస్ ఆన్ పిలువబడే ఫిలిప్ వేస్డిన్-1748-1806మొదటి సంస్కృత గ్రామర్ ‘’సిధారుబం సేయు గ్రమాటికా సాంస్కర్డమికా ‘’1790లో రాసి రోమ్ లో ప్రచురించాడు.19వ శతాబ్దిలో క్రోషియన్ ఫైలాలజిస్ట్ లు ఓల్డ్ స్లావోనిక్ మరియు సంస్క్రుతాలను రిసెర్చ్ కోసం ఎన్నుకున్నారు .జాగ్రెబ్ యూని వర్సిటిలోమొదటి బోధనాంశంగా సంస్కృత౦ ఉండేది . .1959లో ఇండాలజీ పీఠంఏర్పడి , స్వెటోజర్ పెట్రోవిక్ కంపారటివ్ లిటరేచర్ ప్రొఫెసర్ అయ్యాడు .మొదటి ఇండాలజీ ప్రొఫెసర్ రాడోస్లావ్ కాటికిక్ తో కలిసి ఇండియన్ స్టడీస్ కర్రిక్యులం తయారు చేశాడు .తర్వాత ఫిలాసఫీలో ఇండియన్ ఫిలాసఫీ శాఖ ఏర్పడి,కంపల్సరి చేశారు .ఇండియన్ ఫిలాసఫీకి మొదటిప్రోఫేసర్ సేదోమిన్ వేల్జాకిక్ .తర్వాత శ్రీలంక వెళ్లి బౌద్ధ సన్యాసి అయి చాలా రాశాడు .ఆయన శిష్యురాళ్ళు డా.రాదా ఇవేకోవిక్ ,ఇండియన్ ఫిలాసఫిపై చాలా రాసింది .కాటికిక్ తర్వాత ఆయన శిష్యురాలు డా.మిల్కా జాక్ పింహాక్ ప్రోఫెసర్ అయి , వేదిక్ గ్రామర్ పై పరిశోధనలు చేయించింది .కాటికిక్ శిష్యురాలు ప్రొఫెసర్ డ్వార్కా మాటిసిక్ సంస్కృత ఇతిహాసాలు కావ్యాలపై అభిరుచి చూపింది .చాలా విలువైన రిసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించింది.తంత్రాఖ్యాయిక,ఉభయాభిసారిక లకు కు క్రోషియన్ భాషాను వాదం చేసింది.ప్రస్తుత ప్రొఫెసర్ మిస్లావ్ జేజిక్ భగవద్గీత,ఋగ్వేద మంత్రాలపై పరిశోధన చేశాడు .ఇటీవలే ఉపనిషత్ లకు అనువాదం రాసి ప్రచురించాడు .సారా గోంక్ మొకానిన్ భారతీయ సాహిత్యం పై ఎన్నో వ్యాసాలూ రాసింది .నాట్యం పై రిసెర్చ్ చేసింది మృచ్చకటిక నాటకం అనువాదం చేసి ప్రదర్శించింది .జేరాన్ మిసురాక్ ఈమధ్యే మేఘదూత కావ్యాన్ని భగవద్గీతనూ అనువాదం చేసింది .
1874నుంచి క్రోషియాలో సంస్కృత బోధన జరుగుతోంది .యూనివర్సిటి ఆఫ్ జాగ్రెబ్ ,లో అతిముఖ్యమైన సంస్కృత గ్రంథాల అనువాదం జరిగింది.పెరో బుడామిని –కాళిదాస శాకుంతలం ,భేతాళపంచ వింశతిక లనుక్రోషియన్ భాషలొకిఅనువది౦చాడు .దియేటర్ లలో సంస్కృత నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నారు .1895లో మృచ్చకటిక నాటకాన్ని వసంత సేన పేరుతొ జాగ్రెబ్ లో ప్రదర్శించారు .1897లో శాకుంతలం ప్రదర్శించారు.
3-ఫ్రాన్స్ దేశం
ఫ్రెంచ్ జెసూట్ మిషనరీ జీన్ ఫ్రాన్కోసిస్ పాన్స్ 1698నుండి ఇండియాలోబెంగాల్ లో ఉండి బోపదేవ్ వ్యాకరణం ద్వారా సంస్కృతం అధ్యయనం చేశాడు .సంస్కృత గ్రామర్ ను సగం లాటిన్ సగం ఫ్రెంచ్ భాషలో రాశాడు .అమరకోశం లాటినీకరించాడు .సంస్కృత బెంగాలీ భాషలలో ఉన్న 250 తాళపత్ర గ్రంథాలు సేకరింఛి పారిస్ లోని కింగ్ లైబ్రరీకి పంపాడు .మరో జెసూట్ మిషనరీ ఫ్రాంకోయిస్ కోర్డాక్స్ సంస్కృత భాష కు ,యూరోపియన్ భాషలకు ఉన్న సంబంధంపై శోధించి గొప్ప వ్యాసాలూ రాశాడు .యాన్క్విటిల్ డుపెరాన్ 1731-1805 హిందూ ,పార్సీ గ్రంథాల అధ్యయనం కోసమే ఇండియా వచ్చాడు .చాలా ఏళ్ళు ఉండి జెండ్ అవస్తా , ,ఉపనిషత్తులను లాటిన్ అనువాదం చేశాడు .తర్వాత దారా షికో రాసిన పర్షియన్ కావ్యాన్ని కూడా అనువాదం చేసి 1802-03లో ప్రచురించాడు .ఇతడి ప్రభావం చాలా ఎక్కువ .
కాలేజ్ డీ ఫ్రాన్స్ లో సంస్కృత పీఠం1814లో ఏర్పడిన తర్వాత ఫ్రాన్స్ లో సంస్క్రుతాభిరుచి పెరిగింది .యూరప్ లో ఏర్పడిన మొదటి పీఠం ఇదే .ఏ ఎల్ చేజి పోన్స్ గ్రామర్ ద్వారా సంస్కృతం నేర్చి ,1830లో బెంగాలి భాషలో ఉన్న కాళిదాసు శాకుంతలం ను అనువదించి ప్రచురించాడు .ఇతడితర్వాత యూజీన్ బర్నౌఫ్ 1801-1852 శాస్త్రీయంగా సంస్కృత అధ్యయనం పై దృష్టిపెట్టాడు .హిందూ బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేయించాడు .భాగవత పురాణం కు ఫ్రెంచ్ అనువాదం చేసి ప్రచురించాడు సంస్కృత బౌద్ధ గ్రంథం’’సద్ధర్మ పుండరీక సూత్రా ‘’ను అనువదించాడు .రెండు శతాబ్దాలకాలం లో సంస్కృత వాజ్మయం అంతా ఫ్రాన్స్ వారు అధ్యయనం చేసి తమభాషలోకి అనువది౦చుకొన్నారు .
1663లో స్థాపించబడిన మరో విద్యాకేంద్రం అకాడెమి ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ హ్యుమానిటీస్ లో 55మంది పరిశోధనలు చేశారు ప్రాథమిక స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు సంస్కృత బోధన జరిగింది .ఋగ్వేదం పై కూలంకషంగా పరిశోధన జరిగింది .లియాన్ యూనివర్సిటి లో మహాభారతం పై విస్తృత పరిశోధనలు చేశారు .మూడవ విద్యాకేంద్రం ఈకోల్ లో1868లో ఏర్పడిన ‘’ప్రాక్టికల్ స్కూల్ ఫర్ హయ్యర్ స్టడీస్’’సార్వత్రిక విద్యకు ద్వారాలు తెరిచి మహోపకారం చేసింది .హిస్టరీ, ఫైలాలజి, రిలీజియన్ లకు అధికప్రాధాన్య మిచ్చింది .తాంత్రికం శైవం ,వ్యాకరణ మీమాంస ,న్యాయ అలంకార శాస్త్ర సాంఖ్య యోగ ఆయుర్వేదాలకు విశేఖ ప్రాముఖ్యత నిచ్చింది .సంస్కృత గణితాధ్యయనం పై అభి రుచి కల్పించింది .పతంజలి మహాభాష్యానికి వ్యాఖ్యానం రాసిన సాంప్రదాయ మహా విద్యావేత్త ఎం.ఎస్. నరసింహా చార్య వద్ద సిల్వేనియాన్ ఫిల్లిజోట్ వ్యాకరణం అభ్యసించాడు .మహాభాష్య౦ లోని ప్రదీప, ఉద్దోత అనే రెండు భాగాలకు అనువాదం రాసి ప్రచురించాడు .శైవ ఆగమాలకూ అనువాదాలు చేశారు .మధ్యయుగానికి చెందిన ‘’సోమ శంభు పధ్ధతి ‘’ని హెలెన్ బ్రన్నార్ లాకక్స్ కృషితో వెలువడిం ది.మరోముఖ్యమైన సంస్థ –నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రిసెర్చ్ ‘’ఏర్పడి అన్ని సైన్స్ విషయాలపై రిసెర్చ్ కు అవకాశం కల్పించింది .సంస్కృత అధ్యయనానికీ అవకాశం కల్పించింది .ఈవిధంగా ఫ్రాన్స్ దేశం సంస్కృత అధ్యయనానికి అన్ని విధాలా తోడ్పడి అగ్రభాగాన నిలిచింది .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-20-ఉయ్యూరు .