విదేశీ సంస్కృత విద్వాంసులు
44-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
4-జర్మని దేశం
జర్మనీ దేశం లో సంస్కృతం పై అభిమానం 19వ శతాబ్ది ప్రారంభం లో క్లాసిక్ రచయిత జే .డబ్ల్యు .వాన్ గోథే తో ప్రారంభమై,జే బి హెర్డర్ తో స్థిరపడింది .వాన్ షెలేగల్ ,అనే హంబోల్ట్ ఇండియన్ స్టడీస్ కు పీఠాలను 1818లో బాన్ ,1821లో బెర్లిన్,1826లో కీన్స్ బెర్గ్ యూని వర్సిటీలలో నెలకొల్పటం తో గొప్ప ప్రోత్సాహం లభించింది .యూని వర్సిటీలలో సంస్కృత విద్యాబోధన 2001లో ప్రారంభమైంది .రాజకీయాలు ,ప్రోత్సాహం లేకపోవటం నిధులు సమకూరక పోవటం ఇబ్బందులు కల్పించాయి .తర్వాత కొన్ని పీఠాల తొలగింపు కూడా జరిగింది .
బెర్లిన్ లో ‘’వశిష్ట ధర్మ సూత్ర’’ రూపు దాల్చుతోంది .లేఖా పధ్ధతి తయారౌతోంది .జైమినీయ బ్రాహ్మణం ముద్రి౦ప బడింది.హిదూ దేవతారాధన పై పరిశోధనలు జరిగాయి .బోఖం లో శ్రౌత సూత్రాలు పై పరిశోధన జరిగింది .బాన్ లో భారతీయ పంచాంగ గణనం పై పరిశోధన జరిగింది .చాళుక్యులకాలం నాటి బ్రాహ్మణాలు,కంబోడియా శాసనలలో సంస్కృతం ,బౌద్ధసంస్కృతం లపై పరిశోధనలు జరిగాయి . ఫ్రాంక్ ఫర్ట్ లో సంస్కృత రచనలన్నీ డిజిటలైజ్ చేయటం జరిగింది .ఫ్రీ బర్గ్ లో పాకిస్తాన్ శిలాశాసనాలపై ,కావ్యాలలో,త్రిపిటకాలపై సంస్కృతం పై ,అనర్ఘ రాహ్జవం అనువాదం ,గిలిగిత్ వ్రాతప్రతులు పై పరిశోధన జరుగుతోంది .గోట్టేన్ బెర్గ్ లో శ్రీలంకలో సంస్కృతం ,సర్వాస్తి వాదం ,మహా పరి నిర్వాణ సూత్రంప్రచురణ , బౌద్ధ గ్రంధాలపై సంస్కృత నిఘంటువు ,ఉత్పత్తి ప్రకరణ ప్రచురణ జరిగాయి .హాం బర్గ్ లో గ్రందాల పరిరక్షణ జరిగింది రఘు వంశం ,న్యాయ వైశేషిక పై పరిశోధన జరిగింది .హీడేల్ బెర్గ్ లో ఒరిస్సాలో మహిమా ధర్మం ఉద్యమం ,సంస్కృత సింటాక్స్,పశుపతి నాథ దేవాలయం లో పూజారుల సంఘర్షణ లపై అధ్యయనం చేశారు .కీల్ లో హరి వంశం పై ,భట్టికావ్యం లో పదవ సర్గ ,,ప్రాచీన భారత ,గ్రీక్ ఫిలాసఫీ లలో విభేదాలు ,.లేప్జిగ్ లో ప్రాకృత కావ్యాలు ఖాట్మండు లోని స్వయంభూ చైత్య వేదసూక్తులు,కౌటిల్య అర్ధ శాస్త్రం పై గొప్ప పరిశోధనలు జరిగాయి .మైంజ్ లో ఋగ్వేదం శాకుంతలం పైనా ,పంచతంత్ర అధ్యయనం చదరంగ చరిత్ర ,కాళిదాస కవిత్వం లో రూపక శోభ .మార్బర్గ్ లో టిబెట్ లోని సంస్కృత గ్రంధాలు ,ఆర్యసూర జాతకమాల లో వేదాంత విషయాలు ,కావ్యాదర్శం ,మహాసంవరతుని కథలపై రిసెర్చ్ జరిగింది .మ్యూన్ చెన్ లో సంస్కృత నాటకాలు ,జైనం భారతీయ క్రీడలు ,కాలచక్రం ,మృత్యువనాన లపై పరిశోధనలు జరిగాయి .మ్యూన్ స్టర్ లో సర్వాస్తివాదం ,శంకర ,వేదసాహిత్యం ట్యూ బింగెన్ లో సంస్కృత నాటక శాలలుపై ,వ్యూర్జ్ బర్గ్ లో వేద వచన గ్రంథాలు పై విశిష్ట పరిశోధనలు జరిగాయి . ,,
5-హంగేరి దేశం
బుడాపెస్ట్ లోని రొట్వోస్ లోరాండ్ యూనివర్సిటి ఇండో యూరోపియన్ లింగ్విస్టిక్స్ డిపార్ట్ మెంట్ లో సంస్కృతం లోనాలుగేళ్ళ ఎం .ఏ. క్లాసులు ప్రారంభించారు .1995లో బోధనకు అంతరాయం కలిగింది .రీడర్ పోస్ట్ తీసేశారు .యూని వర్సిటి ఆఫ్ స్వేజ్డ్ లో ప్రాచీన హిస్టరీ శాఖలో అడ్వాన్సేడ్ సంస్కృత ప్రాధమిక క్లాసులు నిర్వహించారు .మతగ్రంధాల అధ్యయనం చేయించారు .బుడాపెస్ట్ లోని టాన్ కపూజా అంటే ధర్మద్వారం కాలేజిలో సంస్కృత కోర్సుల బోధన జరిగింది .బుద్ధిష్ట్ కాలేజి సంస్కృత ఉపాధ్యాయుడు టైబార్ కోర్ట్ వెలేసి పైకాలేజిలో ప్రాక్టికల్ సంస్కృత గ్రామర్ బోధించాడు .ప్రపంచ సంస్కృత సమ్మేళనాలు నిర్వహించారు .ప్రొఫెసర్ జోజేఫ్ వెక్రేడి వాల్మీకి రామాయణంకు అశ్వ ఘోషుని బుద్ధచారితం కు హంగేరియన్ భాషానువాదం చేశాడు .బౌద్ధ గ్రంథాలు జాతక,ధమ్మపద లకు అనువాదం జరిపాడు .మానవ ధర్మ శాస్త్ర ,దశకుమార చారిత్ర లకు జూడిత్ ఫీయర్ అనువాదాలు రాశాడు.నాగార్జునుని రత్నావళి కి మూలమధ్యమకారిక కు ఫెరెంక్ రుజ్సా అనువాదాలు రాశాడు బ్రహ్మసూత్ర శంకరభాష్యానికి అనువాదం జరిగింది .ప్రొఫెసర్ గూలా వోజ్టిల్లామనుధర్మశాస్త్రం లోని ఏడవఅధ్యాయం పై పరిశోధన పత్రం రాశాడు .కృషి శాస్త్ర ను ప్రచురించాడు .కృషి సమయనిర్ణయం రాశాడు ఇండో ఆర్యన్ భాషలపై పరిశోధనలు జరిగాయి .’’గోధూమ’’ అనేమాట అనేక ఇండో యూరోపియన్ భాషలలోకి చేరింది .ప్రస్తుతం కామశాస్త్రం ,దామోదర గుప్తుని కుట్టానీమాటం లపై పరిశోధనలు జరుగుతున్నాయి .అనేక జర్నల్స్ కూడా సంస్కృత వ్యాప్తికి సహకరిస్తున్నాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-12-20-ఉయ్యూరు