శ్రీ చర్ల గణపతి శాస్త్రి, శ్రీమతి చర్ల సుశీల దంపతుల సాహిత్య ,సేవా పురస్కార ప్రదానం
సాహితీ బంధువులకు శుభకామనలు –2021నూతన ఆంగ్లసంవత్సరం ,సంక్రాంతి శుభాకాంక్షలు –
శ్రీ చర్ల సుశీల వృద్ధాశ్రమ నిర్వాహకులు డా చర్ల మృదుల గారు నాలుగు రోజులక్రితం నిడదవోలు నుంచి ఫోన్ చేసి 10-1-2021 ఆదివారం ఉదయం 10గంటలకు నిడద వోలు దగ్గర మల్లవరం లోని తమ తలిదండ్రుల పేర వున్న వృద్ధాశ్రమ ప్రాంగణం లో తమ పితృదేవులు బహు గ్రంథ కర్త , కళాప్రపూర్ణ, బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి స్మారక సాహిత్య పురస్కారం నాకూ ,తమ మాతృమూర్తి సాంఘిక సేవా తత్పరురాలు శ్రీమతి చర్ల సుశీల గారి స్మారక సేవా పురస్కారాన్ని మా శ్రీమతి శ్రీమతి ప్రభావతికి అందజేయటానికి చర్ల సిస్టర్స్ మరియు వృద్ధాశ్రమ నిర్వాహకులు నిర్ణయించామని తెలియజేయగా ,వినమ్రంగా అంగీకరించామని సంతోషంగా మీకు తెలియ జేస్తున్నాను .మిగిలిన వివరాలు ఆహ్వానపత్రం ద్వారా తెలియ జేస్తాము .మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-12-20-ఉయ్యూరు