విదేశీ సంస్కృత విద్వాంసులు
47-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
12-ఆస్ట్రేలియా దేశం
1979-81 మధ్యకాలం లో ఆస్ట్రేలియాలో ని నేషనల్ యూని వర్సిటిలో సంస్కృత అధ్యయనానికి అంతరాయం కలిగింది .1979లో ప్రొఫెసర్ ఏ.ఎల్.బషాం రిటైరయ్యాక పోస్ట్ ఖాళీ గా ఉంది .సౌత్ ఏషియన్ బుద్ధిష్ట్ స్టడీస్ ప్రొఫెసర్ ,రీడర్ ,సీనియర్ లెక్చరర్ సంస్కృతం బోధించారు .పార్ట్ టైం రిసెర్చ్ అసిస్టంట్ పదేళ్ళు కస్టపడి పని చేసిన ,సంస్కృత టిబెటన్ గ్రందాథాలనువాదం చేసిన ఆమెను తొలగించేశారు .ఆతర్వాత సంస్కృత బోధనకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు .పై నాలుగేళ్ళలో జరిగిన రిసెర్చ్ పని మాత్రమమే చెప్పుకోవాలి .హారిసన్ పాల్ మాక్స్వెల్ –ప్రత్యుత్పాతన బుద్ధ సమ్ముఖావనిత సమాధి సూత్రను ఇంగ్లీష్ లోకి అనువదించాడు .మట్సు మూరా హిస్సాషి –నాలుగు అవదానాలు ,రాహులా టేల్వెట్టే-రసవాహిని ,కపూర్ ఇంద్రాణి –బౌద్ధ సింబాలిజం ,ప్రిసియాడో బెంజమన్ –పురాణాలలో కృష్ణుడు ,జిస్క్ కెన్ –ఋగ్వేద అధర్వణ వేదాలలో జబ్బులు నివారణోపాయాలురాశారు .
13-ఆస్ట్రియా దేశం –
విశిష్టాద్వైత మతచరిత్ర ,పరాశరభట్టు రాసిన తత్వరత్నకార ,నాథముని రాసిన న్యాయ తత్త్వం అనువాదాలు జరిగాయి .రత్నకీర్తి రాసిన సర్వజ్ఞ సిద్ధి ,చంద్రకీర్తి రాసిన మధ్యమాకావతార లపై పరిశోధన జరిగింది .వియన్నాలో సంస్కృత జర్నల్స్ సంస్కృత వ్యాప్తికి దోహదం చేశాయి .ఫ్రాన్సిస్ డి.సా – కుమారిల ,శంకరర రచనలలో శబ్దప్రామాణ్యం రాశాడు .
14-బెల్జియం దేశం –
1841నుండి బెల్జియం లో సంస్కృత అధ్యాయనం సాగుతోంది .లూవెన్ లోని కేధలిక్ యూని వర్సిటి లో సంస్కృత బోధన జరిగింది .ప్రొఫెసర్ ఏ షర్పే-కాళిదాస నిఘంటు ‘’నిర్మాణం చేశాడు.కే యు లూవెన్ –వేద, రామాయణ, భారత పురాణాలలో నైసర్గిక –నామాలు –టోపోగ్రాఫికల్ నేమ్స్ పై పరిశోధన చేశాడు .
15-చైనా దేశం
బీజింగ్ యూని వర్సిటిలో రెండేళ్ళనుంచి భారతీయ ప్రాచీన తత్వశాస్త్ర అధ్యయనం జరుగుతోంది .చాలా గ్రంథాలు చైనీస్ భాషానువాదం పొందాయి .ప్రొఫెసర్ జి .జియన్లిన్ –ప్రిలిమినారి స్టడీ ఆన్ రామాయణ ,అభిజ్ఞాన శాకుంతలం ,రాశాడు ప్రొఫెసర్ జిన్ కేము –ప్రాచీన భారతం లో కథలు గాథలు ,ప్రొఫెసర్ హుయాంగ్ జిన్ చువాన్ –రామాయణం 2,7కాండల అనువాదం ,పాణినిసూత్రాలు ,పంచతంత్రం ,ప్రొఫెసర్ జు ఫ్రాన్చేన్ -50 ఉపనిషత్తులు ,బోయేషింగ్ –భగవద్గీత ,లెక్చరర్ ఝావో గువో హువా –నలోపాఖ్యానం పై వ్యాసం ,ఏ జున్ –విశుద్ధిమాగ్గా లురాశారు .కాళిదాస,జాతకలధ,మహా వంశ ,మను స్మ్రుతి లపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి .
16-డెన్మార్క్ దేశం
కోపెంహాన్ యూని వర్సిటిలో ఇండియన్ ఫిలాసఫీ నేరుస్తున్నారు .ఐవో ఫీజర్-ది వేదిక్ ఆర్యన్స్యాజ్జ్ సీన్ బై దెం సెల్వ్స్ ,పాలీ త్రిపిటక అనువాదం.బౌద్ధ ఫిలాసఫీ పై పరిశోధన ,బుద్ధపాలితలేక శూన్యవాదం , మాతృ సేనుని ‘’ప్రణిధాన సప్తతి ‘’,ఆచార్య నాగార్జున వేదాంతం ,కంబోలుని అలోకమాల ,శాంత రాక్షసుని తత్వ శుద్ధి ,పై పరిశోధనలు జరిగాయి పాలి నిఘంటు ను హీర్మాన్ ,కొప్ నార్మన్ లు తయారు చేశారు .ఈ యూని వర్సిటి క్విన్ శతాబ్ది ఉత్సవ సందర్భంగా ఈ విద్యాలయం పై 14భాగాల యూని వర్సిటీ చరిత్ర అభివృద్ధి ,ఓరియెంటల్ వ్రాతప్రతులు తో ప్రచురించారు .
17-ఫిన్లాండ్ దేశం
10-12-1980న హేల్సిన్కిలో నార్డిక్ సౌత్ ఏషియా సమావేశం జరిగింది .డెన్మార్క్ ఫిన్లాండ్ నార్వే ,స్వీడెన్ మొదలైన 80దేశాల ప్రతినిధులు పాల్గొనగా ,లీడెన్ యూని వర్సిటి ప్రొఫెసర్ జే
హెచ్ హీస్టార్ ‘’వేదం -సమాజం ‘’ పై ప్రారంభోపన్యాసం చేశాడు .50మంది వివిధ అంశాలపై పరిశోధన పత్రాలు రాసి సమర్పించారు .ఏప్రిల్ 17నుండి జూన్ నెలాఖరు వరకు బౌద్ధ విషయక వస్తు ప్రదర్శన జరిగింది .1981ఆగస్ట్ 10నుంచి 18వరకు నార్డిక్ రిసెర్చ్ వర్క్ షాప్ నిర్వహించారు .30మంది ప్రతినిధులు చురుకుగా హాజరయ్యారు .1958నుంచి హెల్సింకి యూని వర్సిటిలో సంస్కృతం బోధిస్తున్న ప్రొఫెసర్ పెనిట్టీ ఆల్టో1980లో రిటైరయ్యాడు . ,బెర్టిల్ తిక్కనేన్ ఋగ్వేద ,అధర్వ వేద్దాలలో అబ్సల్యూటివ్స్ అంటే పూర్ణత్వ పై దిసీస్ సమర్పించాడు .జైమినీయ శ్రౌత సూత్రాలకు భావత్రాత రాసిన వ్యాఖ్యానం ను డోసేంట్ ఆస్కో పర్పోలా ప్రచురించాడు .ఇండస్ లిపి లోని పుస్తకాలకు డాక్యుమెంటేషన్ జరిగింది .పర్పోలా వేదకాలం వరకు ఇండస్ మతం రాసి ప్రచురించాడు .
18-ఫ్రాన్స్ దేశం
లుడ్విక్ స్టెన్ బాచ్ –ఘోరకుని అశుధార ,వ్యాస సుభాషిత సంగ్రహం ప్రచురిస్తే ,డేనియల్ డోన్నేట్ట్-నలోపాఖ్యానం ,సిల్వేనియా ఫిల్జోట్ –రత్నావళి కొటేషన్స్ ,మేరీ క్లాడీ పోర్చేర్- ప్రహేళిక,ఫిల్జోట్- వేదాలపైనా,కొందరు వైష్ణవ శైవ ఆగమాలపై రిసెర్చ్ చేశారు .బ్రూనో డేజేన్స్-శైవాగమ పరిభాషా మంజరి ప్రచురించాడు .మైకేల్ హూలిన్ –మృగేంద్రగమ,భట్ట నారాయణ కంఠ, అఘోర శివాచార్య ప్రచురించాడు .ఆండ్రేపడాక్స్-జప విధానం పై ,అభినవ గుప్తుని పరమార్ధసరం పై మరికొందరు జైన బౌద్ధాలపై ,మతగ్రంథాలపై కృషి చేశారు .ఫిల్జోత్-మహాభాష్యం పై, కమలేశ్వర భట్టాచార్య –సిద్ధాంత లక్షణ ప్రకరణం పై సిద్ధాంత వ్యసాలురాశారు ఆయుర్వేదం ఆర్కియాలజీ లనూ వెలుగులోకి తెచ్చారు .
19-జపాన్ దేశం
సంస్కృత ,ఇండాలజీ పండితుడు ప్రొఫెసర్ యెన్ .త్సూజీ టోక్యో యూని వర్సిటి ఎమిరిటస్ ప్రొఫెసర్ 1979లో చనిపోయాక ,ఆయనస్థానం లో ప్రొఫెసర్ జె.తకకూసు వచ్చి సంస్కృత ,ఇండియన్ స్టడీస్ వ్యాప్తికి విశేష కృషి చేశాడు .చైనా నుంచి సంస్కృత విద్వాంసుల బృందం పెకింగ్ యూనివర్సిటి ప్రొఫెసర్ ,వైస్ ప్రెసిడెంట్ ఛీ హీసిన్ లిం నాయకత్వం లో వచ్చి ఇక్కడి పరిస్థితులు అధ్యనం చేసి సంస్కృత విద్యార్ధులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేశారు .తర్వాత ప్రొఫెసర్ నకమూరా నాయకత్వం లో ఒకబృంద చైనా వెళ్లి ,రెండు వారాలుండి,అక్కడి విద్యావేత్తలతో చర్చించారు .1979లో టోక్యోలో 1980లో క్యోటో లో జపాన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అండ్ బుద్ధిష్ట్ స్టడీస్ సమావేశాలు జరగగా 400 రిసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించారు . ప్రొఫెసర్ యెన్ .ట్సూజీ –అధర్వ వేద సూక్తాలలో వంద సూక్తాలకు జపనీస్ అనువాదం చేశాడు .వై.కనకూర బ్రహ్మసూత్రాలకు శంకరాచార్య రాసిన భాష్యాను వాదం చేశాడు .ఎస్.మయేదా-శంకరుల ఉపదేశ సహస్రికి ఇంగ్లీష్ అనువాదం చేశాడు ,వేదాంత్ ఫిలాసఫీ ని జపనీస్ భాషలో అనువదించాడు .జపాన్ విద్యా వేత్తలకు సాంఖ్యం పై మోజు ఎక్కువ .ఎస్ మురకాని సాంఖ్య సిద్ధాంతాన్ని అనువదించాడు .నాకుమార –వైదేశిక సూత్రా ,పదార్ధ ధర్మ సూత్రాలనుతర్క సంగ్రహంను దీపికతో సహా అనువదించాడు ,ఒ.తనక ,కె.కమిమూర కలిసి పంచతంత్రం అనువాదం చేశారు .కమిమూర కథా సరిత్సాగరం ,బేతాళల పంచ వి౦శతి లను కూడా అనువదించాడు .వై .ఇవామోకో వాల్మీకి రామాయణం ను ఇంగ్లీష్ అనువాదం ఆధారం గా అనువదించాడు సద్ధర్మ పుండరీకం ,కామసూత్ర ,మృచ్చకటికం ,ఉపనిషత్ లను కూడా అనువాదం చేశాడు .ఆర్యభటీయం, లీలావతి, ఆపస్త౦భ సూత్రాలను యానో, హయాషి ,ఇకారి లు తమభాషలోకి మార్చారు .ప్రాకృతం జైనిజం పై మక్కువ ఉన్న కుర్రాడు ఎస్.సుచిహాసి గొప్ప కృషి చేసి 1981లో 30ఏళ్ళ చిన్నవయసులోనే మరణించాడు .ప్రొఫెసర్ఏం ఎల్ మెహతా ,ప్రొఫెసర్ హెచ్ సి బయానీ బెనారస్ ,అహ్మదాబాద్ వర్సిటీలనుంచి ఇక్కడికొచ్చి టోకాయ్ యూని వర్సిటిలో విద్యాబోధన చేస్తున్నారు .ఉత్తర జిఘాయ ,పద్మలేష్య ,లపై పరిశోధనలు జరిగి ప్రచురితమయ్యాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-20-ఉయ్యూరు