పూలదండకు మరణ శిక్షా ?
కలలు కనమని చెప్పి యువతను తీర్చిదిద్దిన
భారత రత్న అబుల్ కలాం పై నీ ఆరాధనా భావం
అసూయకు దారితీసిందా శివదాసన్ !
కొచ్చీ మెరైన్ డ్రైవ్ వీధిలోనే పడుకుంటూ
నిత్యం కలా౦భాయ్ విగ్రహానికి ఏమీ ఆశించక
నీఖర్చుతో పూలమాల వేసి సంతృప్తి చెందే
నీపైనే అసూయా ? ఎంత దారుణం ?
మనుషులున్న సమాజం లోనే జీవిస్తున్నామా ?
నువ్వేదో కీర్తి సంపాదిస్తున్నావన్న అసూయ
గూడుకట్టుకొని నిన్నే హత్య చేశాడా ఆ కిరాతకుడు ?
మాటు వేసిదారి కాచి చంపేశాడా?
‘’సమసమాజం వల్లించే’’ పాలనలోనే జరిగిందంటే
తల్లడిల్లిన మనసుతో తలవంచుకొంటున్నాను
శివ దాసన్ ! నీకు నా కన్నీటి కైమోడ్పు.
ఆధారం -ఇవాల్టి జ్యోతిలో వార్త చదివాక కలిగిన స్పందన
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-20-ఉయ్యూరు
—