విదేశీ సంస్కృత విద్వాంసులు
48-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
20- రుమేనియా దేశం
ఈ దేశం లోని బోఖా రెస్ట్ యూనివర్సిటిలో ప్రొఫెసర్ అమితా భోస్ సంస్కృతం బోధించాడు .బెంగాలీ హిందీ విద్యార్ధులకు ఇది రెండేళ్ళ కోర్సు .ప్రఫెసర్ సూరజ్ భాన్ సింగ్ బోస్ కు సహకరించాడు .మాన్యుయల్ ఆఫ్ హిందీ ,ఇండియా –రుమేనియా సంస్కృతీ పుస్తకాలు సింగ్ రాశాడు .భోస్ –గోథే-భారతీయ మేధావులు ఆర్టికల్ రాసి ప్రచురించాడు .రవీంద్రుని ,రాబిన్సన్ క్రూసో ను తులనాత్మక పరిశోధన చేశాడు డా.డి.భట్టాచార్య .
21-స్పెయిన్ దేశం
స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్ ,సలమాంకా యూని వర్సిటీలలో సంస్కృత అధ్యయనం జరుగుతోంది .మాడ్రిడ్ లో ప్రొఫెసర్ విల్లార్ 1978-79లో ,సలమా౦కా లో 80-81లో బోధించాడు .ఆత్మ –బ్రహ్మ ను,మేఘ దూతం ను విల్లార్ ,భగవద్గీతను, మాండూక్య ఉపనిషత్ పై గౌడపాదుని కారికను, డా అడ్ర డోస్, మార్టిన్ కాన్స్యులో –వివేకం ను ,డా జొసీ గోమేజ్ –భారతీయ వేదాంత గ్రంథాలను అనువదించి ప్రచురించారు .
22-శ్రీ లంక దేశం
శ్రీలంకలో కేల నీయ ,జానా యూని వర్సిటీలో అండర్ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సంస్కృత బోధన జరుగుతోంది .స్కూలు స్థాయిలో అమలు సరిగా లేక నిరాశగా ఉంది ,కొన్ని దశాబ్దాలక్రితం గ్రీక్ లాటిన్ తో పాటు సంస్కృతం కూడా ఒక వెలుగు వెలిగింది .పాలీకూడా అదే స్థాయి పొందింది .పుస్తకప్రచురణ చాలా అరుదు .ప్రస్తుతం కేలననీయ యూనివర్సిటిలో సంస్కృతం లో 8మంది ఆనర్స్ డిగ్రీవిద్యార్ధులు ,15మంది మగిలిన సబ్జెక్ట్ లు నేరుస్తున్నారు .నానాటికీ చేరే విద్యార్ధుల సంఖ్య తగ్గి పోతోంది .ఉపయోగకరమైన లైబ్రరీ లేకపోవటం ,రిసెర్చ్ సౌకర్యం లేకపోవటంకారణాలు .జాఫ్నా యూని వర్సిటి -1974లో స్థాపన జరిగిన నాటి నుంచి సంస్కృత బోధన జరుగుతోంది .జనరల్ స్పెషల్ డిగ్రీ కోర్సులున్నాయి .భరతనాట్యం స౦గీతం లలో డిప్లొమా కోర్సులు దీనికి అనుబంధంగా ఉన్న రామనాధన్ అకాడెమీలో నేర్పుతున్నారు .ఏం ఏ ,పిహెచ్ డికోర్సులు పెట్టె యోచనా ఉంది .పెరడీనియా యూనివర్సిటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు సంస్కృతం ఉంది .డిగ్రీ లెవెల్ లో యాన్సిలరి సబ్జేక్ట్ గా బోధిస్తారు.హిస్టరీ విద్యార్ధులకు సంస్కృతం ఉంటుంది .శాసన పరిశోధన మనుస్మృతి అధ్యయనానికి తోడ్పడుతుంది
23-స్వీడెన్ దేశం
నాలుగవ ప్రపంచ సంస్కృత సమ్మేళనం ఈ దేశం లోని వీమార్ లో జరిగి ,ఇండలాజికల్ రిపోర్ట్ ప్రచురించారు .స్టాక్ హోం లో అనేక కాన్ఫరెన్స్ లు జరిపారు .భారత దేశంనుండి నిష్ణాతులు ఇక్కడికి విజిటింగ్ ప్రొఫెసర్స్ గా వచ్చారు .సామవేదానికి చెందిన ఉప్సల ఉపనిషత్ ను జెన్ ఎక్లుండ్ ,విష్ణుపురాణం ను జి లీబర్ట్ ,కావ్య నిర్మాణం ను లీన్ హార్డ్ ,మానస మంగళ అధ్యయనం ను డబ్ల్యు స్మిత్ లు వారిభాషలోకి అనువదించి ప్రచురించారు .
24-సోవియెట్ రిపబ్లిక్ ఆఫ్ రష్యాదేశం –
పుస్తకప్రచురణ –ప్రాచీన భారతీయ సంస్కృతీ –బొంగార్డో లెవిన్ ,పి.గ్రీన్స్టర్-భాసుడు ,సేరేబ్రియకోవ్ –భర్తృహరి శతకత్రయం,వేదం వాజ్మయ చరిత్రను ఏర్మాన్ ఓ కెర్క్ ,బౌద్ధవేదాన్తంను క్రితికా మిరోవోజ్ ,మధ్యయుగ భారతీయ కవిత్వం లో అమరప్రేమ ను సేరేబ్రేయిని ,భారతీయ యాత్రా స్థలాలు ను రుద్నేవ్ పో లు అనువదించారు .హరివంశపురాణ౦,రాజశేఖరుడు,,అర్ధ శాస్త్రం ,లోకాయత ,భారతంలో మహిళలు ,జైన బౌద్ధాలు మొదలైన వాటిపై పరిశోధనా వ్యాసాలూ రాసిప్రచురించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-12-20-ఉయ్యూరు