కిరాతార్జునీయం-.33
15వ సర్గ – 4(చివరి భాగం )
శివుడు అర్జున బాణ మేఘాన్నితన బాణాలతో తొలగించాడు .అర్జునుడికి దీటుగా బాణ ప్రయోగం చేశాడు శివుడు .శివుడి బాణాలు తీక్షణాలై,భయోత్పాతం కలిగిస్తాయి –‘’తేన వ్యాతే నిరా భీమా-భీమార్జున ఫలాననాః-న నాను కంప్య విశిఖాః-శిఖా ధరజ వాససః ‘’ఇది శృ౦ఖలా యమక శ్లోకం .శివ బాణాలు స్వర్గ ,అంతరిక్షాలలో సంచరి౦చ గలిగేవి .చెవులు చిల్లులు పడే శబ్దం చేయగలవి .విద్యుత్ సమూహం తో సమానమైనవి .-‘’దయు వియద్గామినీ -తార సంరావ విహత శ్రుతిః-హైమీషు మాల శుశుభే -విద్యుతా మివ సంహతిః’’.నాలుగవ పాదం లోని విద్యుతామివ సంహతి ‘’అనే అక్షరాలూ మొదటి ,రెండుపాదాల్లో కూర్చబడ్డాయి దీన్ని గూఢ చతుర్ధ పాదశ్లోకం అంటారు .శివబాణ ప్రయోగానికి అర్జునుడు ఏమాత్రమూ చలించలేదు .తర్వాత శ్లోకం కు మూడు అర్ధాలున్నాయి ఆవైభోగం చూద్దాం -. ‘’జగతీ శరణో యుక్తో హరికాతః-సుధా సితః –దాన వర్షీ కృతా శంసో నాగరాజ ఇవా బభౌ ‘’
మొదటి భావం-అర్జునుడు హిమవంతుని శోభతో .ఉన్నాడు శివుడితో యుద్ధం చేయగల తత్పరుడు .ప్రజాపాలన సక్రమంగా చేసేవాడు .నల్లని వాడు .దాత .యుద్ధ విజయం కోరుతున్నాడు .భూపాలనకోసం బ్రహ్మ సృష్టించిన వాడు. నివాస ,స్థానాలు ఇవ్వటం తో సింహాలకు ప్రియమైనవాడు .హిమవంతుడు .మంచు ఆవరించి తెల్లగా ఉన్నాడు. దానవ రుషి మన్మథులచే కీర్తింప బడినవాడు .
రెండవ భావం –భూమికి శరణ్య మైనవాడు .ఇంద్రునికిష్టుడు ,అమృతం లాగా శీల స్వచ్చత ఉన్నవాడు. దానాన్ని జలరూపం లో ఇచ్చేవాడు .భూమిని బాధపెట్టే రాక్షసులతో పోట్లాడే వాడు ..అంటే ఇంద్రుని ఐరావతం తో పోలిక .
మూడవ భావం-ఆది శేషుని తో పోలిక –భూ రక్షణ కోసం విధాత ఏర్పాటు చేశాడు .కృష్ణుడికి ఇస్టమైనవాడు.అమృత స్వచ్చ శరీరి .దానవ ,రుషి ,లక్ష్మీ దేవులచే పూజింప బడే వాడు .
శివుడు బాణాలతో అర్జున పరాక్రమం తగ్గించ లేకపోయాడు .అర్జున ఇంద్రియాలనుంచి కోపకారణంగా అగ్ని బయల్దేరింది . పిశంగవర్ణ తేజస్సుతో అర్జునుడు తన తేజస్సును విస్తరించాడు .అడవి చెట్ల వలన పుట్టే దావాగ్నిలా చెలరేగాడు .తన అమోఘ పరాక్రమం చూపిస్తూ శివుడు అర్జునుని పై గాయ పరిచి ప్రాణం తీయని బాణం వేశాడు .దాన్ని అర్జునుడు నివారించి ,తనబాణాల నీడలో భూమిని కప్పేశాడు .శంకరబాణ౦ సూర్యకిరణమే .ఆబాణం.మహా వేగంగా వచ్చి ,అసంఖ్యాక అర్జున బాణాలను ఖండించింది .అన్నిటినీ చీలుస్తూ,అర్జునుని బాణం లోకి కూడా ప్రవేశించింది .శివుని బాణాలను కూలుస్తూ ,అనేక విధాలుగా కదుల్తూ ,అన్ని చోట్లా అర్జునుడే ఉన్నట్లు గా మహర్షులకు కనిపించాడు .క్షణం తీరికలేక అంతా తానే అయి పోరాడాడు .అర్జున బాణ విజ్రు౦భణ పెరిగి ,శంకర బాణాలు భంగపడుతున్నాయి .దేవ రుషి గణం ఆకాశం లో ఈ మహా యుద్ధం చూడటానికి చేరారు .శంకర బాణ విస్తృతి ,విజయలక్ష్మీ సమేతుడైన విజయుని పరాక్రమం చూసి తత్వజ్ఞులైన మునుల ఒళ్ళు గగుర్పొడిచింది .తత్వజ్ఞులు అన్నమాటవలన అర్జునుడు నారాయణ అంశ ఉన్నవాడు అని తెలుసుకొన్నారు అని భావం లక్ష్మీ వతః అనే మాట కూడా దీన్నే తెలియ జేస్తుంది .-‘’సంశ్యతామివ శివేన వితాయమానం –లక్ష్మీ వతఃక్షితి పతేస్తనయస్య వీర్యం –అ౦గా న్యభిన్న మపి తత్వవిదాంమునీనాం –రోమాంచ మంచిత తర౦భిభారాం బభూవుః’’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-20-ఉయ్యూరు