విదేశీ సంస్కృత విద్వాంసులు
49-విదేశాలలో సంస్కృతాధ్యయనం (చివరి భాగం )
25-లాటిన్ అమెరికా
లాటిన్ అమెరికా సంస్కృత విద్వాంసులు సమావేశమై ,ఏకీకృత సంస్థ ద్వారా సంస్కృత అధ్యయనం జరగాలని భావించి ‘’ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్ ‘’ ‘’ALAS’’కు అనుబంధంగా పని చేయటం ప్రారంభించారు .అనేక రిసెర్చ్ పేపర్లు తయారు చేసి ముద్రించారు .అందులో కొన్ని –జువాన్ మైగుల్ డీ మోరా –భవభూతి ,వర్ణాలు ,ప్రొఫెసర్ మేరియో ఫెరీరా –అయిదు అమర శ్లోకాలు ,లుడ్వికా జరోకా –పంచతంత్రం –సేర్వా౦ టేస్ రాసిన ‘’డైలాగ్ ఆఫ్ ది డాగ్స్ ‘’ల సంబంధం ,డాఫెర్నాండో టోలా,ప్రొఫెసర్ కార్మెన్ డ్రాగో నెట్టి-భారతీయ తత్వ శాస్త్రం లో అనాదిత్వం .మొదటి లాటిన్ అమెరికన్ సంస్కృత విద్యా వేత్తల సమావేశం 1981ఫిబ్రవరి 23నుంచి 27వరకు యూని వర్సిటి ఆఫ్ సావో పాలో లో జరిపారు .చాలామంది విద్యా వేత్తలు హాజరై ,ఎన్నో విషయాలపై పత్ర సమర్పణ చేశారు .ముద్రించిన పుస్తకాలు –సంస్కార సంస్కృతీ డీ మోరా అనువదించిన ఋగ్వేదం రెండవ ఎడిషన్ ,ఉత్తర రామ చరితకు స్పానిష్ అనువాదం ,శంకరాచార్య ఆత్మబోధ ,.
26-నెదర్ లాండ్
డా బో౦క్ హోర్స్ట్ – పాణిని వ్యాకరణం పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.పొందాడు .బృహదారణ్య ఛాందోగ్య ఉపనిషత్ లకు శంకర వ్యాఖ్యానం పై డా. హెచ్. ఎల్ .డేనీల్సన్ పరిశోధన చేశాడు డా.జే ఎల్ ఈస్టర్ మాన్-వేదాలలో కర్మకాండ ,డా ఏం నిహోం –బౌద్ధ హి వజ్రతంత్ర పై వ్యాఖ్యానమైన యాగరత్నమాల అనువాదం రాశాడు .డా.జి .హెచ్ .షోక్కోర్ -,రస అలంకారశాస్త్రాలు,కేశవదాసు భక్తిపై హిందీలోరాసిన రసిక ప్రియపై పరిశోధన జరిపాడు .డా జె. హెచ్ .టీకేన్-హాలుని సప్తశతి అనువాదం చేశాడు .డా సిజె బర్గ్ –అత్రి రాసిన సముర్తరాచనాధికారం పై శోధన చేశాడు .డా వాన్ డాలెన్-వాల్మీకి సంస్కృతం పై రిసెర్చ్ చేశాడు .డా ఎస్ గుప్త –వైష్ణవం ,తాంత్రిక పీఠ స్థానాలు పై పుస్తకం రాశాడు .,డా.వాన్ కూయి – కాళికాపురాణ౦ అనువాదం చేశాడు .డా ఎ.నూగ్టేరాన్-పతంజలి యోగశాస్త్రం లో ఈశ్వర ప్రణి ధానం అధ్యయనం చేశాడు డా ఇ.నిజెంతునియస్-సంగీత శిరోమణినకి ఆంగ్లానువాదం ,డా గుప్తా ముత్తుస్వామి దీక్షితార్ రాసిన –నవరత్న కృతులను అనువాదం చేశాడు .డా.జే షూలేమాన్ –కుబ్జికామ తంత్రం ముద్రించాడు .సత్సహస్ర సంహిత పై పరిశోధన వ్యాసం రాశాడు .యోని తంత్రం ప్రచురించాడు .అగ్నిపురాణం ఆధారం గా పురాణాలకు తంత్రానికి ఉన్న సంబంధం పై పుస్తకం రాసి ప్రచురించాడు .ఆమ్ స్టర్ డాం యూనివర్సిటీలో ,గ్రోనిన్జేన్ ఇన్ ష్టిట్యూట్,మొదలైన విద్యా కేంద్రాలలోనూ సంస్క్రుతధ్యనం సంతృప్తిగా జరిగి పత్రాలు పుస్తకాల ప్రచురణ జరిగాయి .
27-ఇంగ్లాండ్
బ్రిటన్ యూని వర్సిటీలలో సంస్కృతం చదివే విద్యార్ధుల సంఖ్య సంతృప్తికరం గానే ఉంది .ఎడిం బర్గ్ లో బ్రూకి౦ గ్టన్-వాల్మీకి క్రియలు రాసి ప్రచురించాడు .రామాయణం లో వాక్యనిర్మాణం –సింటాక్స్,యజ్ఞోపవీతం ,ఇవల్యూషన్ ఆఫ్ ఎపిక్ , సకాయ నిరుత్తీయ ,సంస్కృతం లో ’’ష్వా’’సమస్యలు ,సంస్కృతం లో ‘’మా ‘’,ప్రాకృతం లో ‘’అవ్వో ‘’,సంఖ్యయోగం పై ఎన్సైక్లోపీడియా ,పతంజలి యోగ శాస్త్రం పై అల్ బిరూని అరబ్ అనువాదం కు ఇంగ్లీష్ అనువాదం ప్రచురితాలయ్యాయి .,విజ్ఞాన భిక్షురాసిన యోగ వార్తికను .జె.హంఫ్రీస్ అధ్యయనం చేశాడు .బౌద్ధ జాతకమాలకు ఆంగ్లానువాదం ,యూజేస్ అండ్ మిస్ యూజేస్ ఆఫ్ ధర్మ ,లంకావతార సూత్ర ముద్రణ జరిగింది.శ్రీరాముని నైతిక నిర్ణయాలు ,న్యాయ బౌద్ధ జైనాలలో సమస్యలు ,కదావత్తులో మాగధీయం ,ఉత్తర జిహ్హాయన సూత్రా,నైన్ పాలిఎమిటాలజీస్,పాలీ గోత్రాభు,దిటు సాంస్క్రిట్ ఎపిక్స్ ,పాలి నీతిపుస్తకాలు , పన్నాస జాతక లపై అధ్యయనం వ్యాఖ్యానం రచన ముద్రణ జరిగాయి
28-అమెరికా
అమెరికాలో రోడ్ ఐలాండ్ లోని బ్రౌన్ యూనివర్సిటి లో డేవిడ్ పింగ్రీ –సెన్సెస్ ఆఫ్ ది సైన్స్ ఇన్ సంస్కృత రాశాడు ,కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్సిటి లో రామాయణం మొదటికా౦డకు రాబర్ట్ పి.గోల్డ్ మాన్ ఇంగ్లిష్ అనువాదం చేసి ప్రచురించాడు.చికాగో లోని అమెరికన్ ఇన్ స్టి ట్యూ ట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ లో ప్రొఫెసర్ డిమోక్ –భారతీయ సంస్కృతీ నాగరకత పై అధ్యయనం చేశాడు.మాసా చూసేట్స్ లోని హార్వర్డ్ యూని వర్సిటీలో ప్రొఫెసర్ డేనియల్ ఇనగాల్ –కంప్యూటర్ డిటర్మిండ్ లిటరరీ స్టడీస్ చేస్తున్నాడు .సియాటిల్ లోని వాషింగ్టన్ యూని వర్సిటిలో ప్రొఫెసర్ కె .హెచ్ .పోటర్ ఆధ్వర్యం లో భారతీయ వేదాంతం పై సమగ్ర విజ్ఞాన సర్వస్వం తయారౌతోంది .ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా యూని వర్సిటీ లో సిస్టమ్స్ ఆఫ్ కమ్యూని కేషన్ అండ్ ఇంటర్ యాక్షన్ ఇన్ సౌత్ ఏషియా ,ఐడెంటిటి,అండ్ డివిజన్ ‘’పై సెమినార్లు విస్తృతంగా జరిగాయి .
డా.క్రమిరీషి-మానిఫెస్టేషన్ ఆఫ్ శివ ,శివతత్వం లపై సెమినార్లు జరిపాడు .
29-యుగోస్లేవియా
యుగోస్లేవియాలోని బోర్డ్ ఆఫ్ ఓరియెంటల్ స్టడీస్ ఆఫ్ యుగేస్లేవియా అకాడమి ఆధ్వర్యం లో సైన్స్ ఆర్ట్స్ ,జాగ్రేబ్ ఆధ్వర్యం లో అధ్యయనం జరుగుతోంది .కల్లోక్వియం అనే సమావేశాలు జరుగుతాయి .1981మార్చి 26,27 తేదీలలో జరిగిన కల్లోక్వియం లో 23పరిశోధన పత్రాల రచన జరిగితే అందులో 8సంస్కృతం భారతీయసంస్కృతి పైనే ఉన్నాయి .పంచతంత్రాన్ని దర్వాక మాస్టిసిక్ జాగ్రెబ్ అనువదించాడు .భారతీయ ఇతిహాసాలు ,ఉపనిషత్ వేదాంతం మొదలైనవాటిపై మోనోగ్రాఫ్ లు రాశారు .
విదేశాలలో సంస్కృత అధ్యయనం సమాప్తం
మనవి –‘’విదేశాలలో సంస్కృత అధ్యయనం ‘’లోని 47నుండి 49వరకు రాసిన 3 ఎపిసోడ్ లకు ఆధారం –వారణాసి లో 1981 అక్టోబర్ 21-26 తేదీలలో జరిగిన 5వ అంతర్జాతీయ సంస్కృత సమ్మేళనం లో, ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ప్రచురించిన ‘’Sanskrit Studies Out side India ‘-1979-1981 .పుస్తకం ఆధారం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-20-ఉయ్యూరు