కిరాతార్జునీయం-.38
17వ సర్గ -2
అత్యంత లాఘవంగా సునాయాసంగా బాణాలు వదులుతున్న అర్జునుడు ప్రమథులకు ,కంటి దోషమున్నవారికి ఒకే చంద్రుడు అనేక బింబాలుగా కనిపించినట్లు ,అనేకంగా కనిపించాడు –‘’శశీవ దోషావృతలోచనానం –విభిద్యమానః ప్రుథ గా బభాసే ‘’.సేన దయనీయం చూసి శివుడుకూడా క్షోభ చెందాడు .పెద్ద చెరువే అయినా తరంగాలవలన సూర్యబింబం వణుకుతున్నట్లు – శివుడి పరిస్థితీ అలానే అయింది –‘’తరంగ కంపేన మహా హ్రదానాం –ఛాయా మయస్యేవ దినస్య కర్తుః’’.అర్జునుడిపై నిర్వికార పరమాత్మ కనుక శివుడికి ఆగ్రహం రాలేదు .కానీ ఆకారం లో వికారం చూపాడు మహాత్ముల చేష్టలు ఎవరూ తెలుసుకోలేనివి –‘’ప్రసే దివామ్సం న తమాప కోపః –కుతః పరస్మిన్పురుషే వికారః అకార వైషమ్యమిదం చ భేజే –దుర్లక్ష్య చిహ్నా మహతాం హి వృత్తిః.’’తర్వాత శివుడు రెండు భుజాలతో అల్లెత్రాడు లాగగా ,అది కదులుతూ రెండు గా కనిపించింది .అది తక్షకుని నాలుకేమో అనుకొన్నారు చూసే వాళ్ళు .’’’విస్ఫార్య మాణస్య తతో భుజాభ్యాం –భూతాని భర్త్రా ధను రంతకస్య –భిన్నా కృతిం జ్యా౦ దదృశుః స్ఫురంతీం- కృద్ధస్యజిహ్వామివ తక్షకస్య ‘’.అర్జునుడు సవ్యాపసవ్యం గా ధనువును ధ్వని౦ప జేస్తూ కిరాతపతిని చూసి ‘’ఎప్పుడూ కుడి ఎడమల చెవులను ఒకటి తర్వాత ఒకటి కదిలిస్తూ ధ్వని చేసే ఏనుగుపై మావటి వాడు ఉన్మత్తంగా అనుమానిఛినట్లు చూశాడు .శివుని బాణాలు సముద్రం లో తిమింగలాదులు నదులద్వారా వచ్చే చిన్న జలచరాలను మింగినట్లుగా.అర్జున బాణాలను వ్యర్ధం చేశాయి-‘’ఊర్జస్విభిః సింధు ముఖాగతాని యాదాంసి యాదో భిరివా౦బు రాశేః ‘’.. శంకర బాణాలు కనిపించకుండానే, మధ్యలోనే తు౦చేయటం ,అడ్డుకోవటం ,ధ్వంసం చేయటం అనే మూడు విధాల అర్జునుడు-జయాభిలాష ఉన్నవాడు శత్రువు ఏ ఉపాయాలు ఉపయోగిస్తాడో అవే ఉపాయాల ప్రయోగంతో నిర్వీర్యం చేశాడు ,శివుడు వేసే వాటికి రెట్టింపు బాణాలు ప్రయోగించి అర్జునుడు శివ సేనను భయపెట్టి సాఫల్యం సాధించాడు .ఐతే ద్రోణాది గురువులద్వారా అస్త్ర విద్య నేర్చి ఆ లాఘవం ప్రయోగించిన అర్జునుడికి శివుని బాణాలతో భంగపాటు కలగటం ధైర్యాన్ని కుంగదీసి రుజుమార్గం లో ధర్మ శాస్త్రాదులు నేర్చిన నిర్దేశించిన ఆచార వ్యవహారాలను అనుష్టించే వారికీ సైతం ఆపదల లో ధైర్యం తగ్గినట్లు తగ్గింది –‘’సతామివాప ర్వణిమార్గ ణానాం-భంగః స జిష్ణొర్ధ్రుతిమున్ము మాద’’.అర్జున బాణాలను ఖండించిన శివ బాణాలు నేలకొరిగి అర్జునునికి వెంటనే ప్రతిఫలం దక్కింది .
హస్తలాఘవం తో అర్జునుడు ఆశ్చర్య౦గా శివ బాణాలను ఖండించేబాణాలను శివసేన గుండెల్లో సూటిగా నాటాడు .అర్జున పరాక్రమం చూసి శివుడు ,ఎండాకాలపు మేఘం నీటిని కురిపించినట్లు,అతి తీవ్ర బాణ వృష్టి కురిపించాడు.అంటే ఎండాకాల వర్షం చాలా ఎక్కువ అని భావం ..అర్జును డికి మేలు చేకూర్చే శివ బాణాలు మర్మ స్థానాలు తాకకుండా ,మిత్రులు చెప్పే పరిహాసపు మాటల్లాగా అర్జునుడికి ఆనందాన్ని కలిగించాయి –‘’’’అనామృశంతః క్వచి దేవ మర్మ-ప్రియైషిణా ను ప్రహితాః శివేన –సు హృత్పయుక్తా ఇవ నర్మ వాదాః-షరా మునేః ప్రీతికరా బభూవః ‘’.ఒకసారి తన బాణాలతో సమానంగా, మరోసారి చాలా హెచ్చుగా ప్రయోగించే అర్జున బాణ శక్తి చూసి వివశం నిందా పొందే సేనతో కలిసి శివుడుమళ్ళీ తన తడాఖా చూపించాలను కొన్నాడు .-‘’విషాద వక్తవ్య బలహ ప్రమాథీ-స్వమాల లంబే బలమిందు మౌలిః’’.
తర్వాత శివుడు శక్తి పరాక్రమాలతోసూర్యుడు నీటిని ఇంకింప జేసినట్లు అర్జున తీవ్ర బాణాలను నాశనం చేసి ప్రతాపం చూపాడు –‘’మహేషు జాలా న్యఖిలాని జిష్ణో-రర్కః పయం సీవ సమాచచామ’’.అర్జునుడు మరో బాణం తీయటానికి బాణాలు లేని అమ్ముల పొదిలో చేయి పెట్టాడు .పర్వతంలో మరో ఏనుగు చెలమలోని నీరంతా తాగి ఖాళీ చేయగా, ఆ ఏనుగు దాహంతో అలమటించి తొండం సాచినట్లుఅయింది .-‘’అన్యద్విపా పీత జలేసతర్షం-మత౦గ జస్యేవ నాగా శ్మరంధ్రే’’ ‘’.ధనం లేని స్నేహితుడిని తాను పూర్వం చేసిన ఉపకారాల జ్ఞాపకం తో కృతజ్ఞత చెప్పటానికా అన్నట్లు అర్జున చెయ్యి అమ్ములపొది చేరింది –.-‘’తాత్కాల మోఘ ప్రణయః ప్రపేదే –నిర్వాచ్యతా కామ ఇవాభి ముఖ్యం ‘’.కర్తవ్యం లో ఉత్సాహం, జయేచ్ఛ ఉన్న నాయకుడి బుద్ధి ఏవిధంగా ,నీతి-ఉపాయం అనే రెండిటిని సహాయంగా చేసుకొంటాడో అలాగే అర్జునుడి చెయ్యి రెండు అమ్ముల పొదుల లోకి పోయింది .ఖాళీ గా ఉన్న అమ్ములలపొదులను ప్రళయం లో నీరు లేని పూర్వా పర సముద్రాలను లోకం భరించినట్లు భరించాడు –‘’యుగాంత సంశుష్క జలౌ విజిహ్మః –పూర్వా పరౌ లోక ఇవా౦బు రాశీ ‘’.అమ్ములపొది శూన్యం అయినందుకు బాధ పడినంతగా బాణాలు వ్యర్దమైనందుకు అర్జునుడు బాధ పడలేదు .ఆపదలలో ఉన్న సత్పురుషులు ,తమకు ఉపకారం చేసిన వారి దుఖాన్ని గురించే ఎక్కువ తపిస్తారు .–‘’ తేనా నిమిత్తేన తథా వ పార్థ-స్తయోర్యథా రిక్తతయా నుతెపే –స్వామాపదంప్రోజ్ఘ్య విపత్తి మగ్నం –శోచంతి సంతో హ్యుపకారి పక్షం ‘’.
శ్రీ హనుమత్ వ్రత౦ శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-12-20-ఉయ్యూరు