కిరాతార్జునీయం -40
18 వ చివరి సర్గ -1
తన భుజబలం శివునిపై ప్రదర్శించాలనుకొన్న అర్జునుడిని శివుడు ముద్గరం అనే ఇనుప ఆయుధం వంటి పిడికిలితో పొడిచాడు –‘’ధనురపాస్య సబాణధిశంకరః –ప్రతి జఘాన ఘనైరివ ముష్టిభిః’’ .కిరాతార్జునులు ముష్టి యుద్ధం చేస్తూ వ్రేళ్ళతో చేతులు చరఛి పట్టుకొ౦టే కలిగిన బండరాళ్ల వంటి ధ్వని పర్వత గుహలలో ప్రతిధ్వనించింది –‘’స్ఫుట దనల్ప శిలారవ దారుణః-ప్రతి నినాద దరీషు దారీ భ్రుతః’’.శ౦కర ముష్టిఘాతాలు,కి౦కరునికి చమ్మగానే ఉన్నాయి .పరాక్రమ శీలురు తేజస్వంతుల అనుకరణలో కూడా విశిష్టంగా నే ఉంటారు. అర్జున మనస్వి ఆవేశం తో రౌద్రం పొందినా ,సుఖ దుఖాల భేదం గుర్తించలేదు అని భావం –‘’క ఇవ నామ బృహన్మనసాం భవే-దను కృతే రపి సత్వవతాం క్షమః ‘’.శంకర వక్షస్థలం పర్వత తట ప్రాంతం లా విశాలమైనది .అర్జునుడి దెబ్బలతో గాయమై రక్తం కారుతూ సంధ్యాకాల ఎరుపు రంగు మేఘం లా ఉన్నాడు ‘’ –‘’అభిన వౌష సరాగభ్రుతా బభౌ –జలధరేణ సమాన ముమాపతిః ’ఉరసి శూల భ్రుతఃప్రహితా ముహుః-ప్రతిహతం’’
అర్జున ముష్టి ఘాతాలు సహ్యపర్వత తీరాన్ని సముద్ర కెరటాలు మాటి మాటికీ కొట్టు కొంటు న్నట్లుగా ఉంది .పర్వతాన్ని కెరటాలేమీ చేయలేనట్లే అర్జునుని పిడి గుద్దులు స్థాణశివుడిని ఏమీ చేయలేకపోయాయి –‘’ఉరసి శూల భ్రుతఃప్రహితా ముహుః-ప్రతిహతం యయు రర్జున ముష్టయః –భ్రు శరయా ఇవ సహ్య మహీ భ్రుతః –పృథుని రోథసి సింధు మహో ర్మయః’’
శివుడు రెండు చేతులతో పిడికిలి బిగించి అర్జున భుజాలపై కొట్ట గా ,కళ్ళు తిరిగి తడబడి తూలి పడ్డాడు –‘’త్రి చతురేషు పదేషు కిరీటినా –లులిత దృష్టిమదాదివ చస్థలే’’.అవమాన కోపాలతో మండిపడి దగ్గరకెళ్ళి శివుడి రెండు భుజాలు వేరు చేసి గట్టిగా పట్టుకొన్నాడు పార్ధుడు –‘’భుజ యుగేన విభజ్య సమాదదే –శశి కళా భరణస్య భుజ ద్వయం ‘’.కిరాతార్జున మల్లయుద్ధం హిమాలయాన్ని కంపింప జేసింది .తమ భుజబలాన్ని వారిద్దరూ గర్వంగా భావించారు .ఒకరి భుజాలు మరొకరు పట్టుకొని శృ౦ఖలాలు కూర్చినట్లు పోరాడారు –‘’కరణ శృ౦ఖల సంకలనాగురు –ర్గురు భుజాయుధ గర్విత యోస్తయోః’’.ముష్టి యుద్ధ లో ఇద్దరూ కిందపడ్డారు .ఎవరు కిందపడ్డారు, ఎవరు పైన ఉన్నారో తెలియక తికమక పడ్డారు ప్రమథులు .శివార్జునుల బరువును సహించలేని ఇంద్రకీల పర్వతం వారితో పాటు కదులుతూ ,వాళ్ళు కదలకుండా ఉంటే స్థిరంగా ఉంటూ ,వంగినపుడు వంగి నుల్చుంటే నిటారుగా నిలబడి ,ఎక్కడ తాను నశి౦చి పోతానో అనే భయం పొందింది –‘’ప్రచాలితే చలితం స్థిత మాస్థితే-వినమితే నతమున్నత మున్నతౌ –వృష కపిధ్వజయో రస హిష్ణునా –ముహురభావ భయాదివ భూ భ్రుతే’’
కళ్ళు చేతుల కలయిక ఆపేసి జబ్బలు చరవటం మొదలెట్టారిద్దరూ .ఆ ధ్వనికి పర్వత నదులు ఎల్లలుదాటి ప్రవహించాయి –‘’చరణపాత నిపాతిత రోధనః –ప్రససృపుఃసరితః పరితః స్థలీః’’.ఆకాశం లోకి వేగం గా ఎగిరిన శివపాదాలు అర్జునుడు యెగిరి లాఘవంగా పట్టుకొన్నాడు –‘’చరణయోశ్చరణానమితక్షితి –రనిజ గృహేతిస్రుణాం జయినం పురాం’’.తను కళ్ళు పట్టి నేలకేసి కొట్ట దలచిన అర్జున పరాక్రమానికిశివుడు ఆశ్చర్యపోయి ,తన వక్షస్థలం తో గట్టిగా ఆలింగనం చేసి నలిపేశాడు –‘’’’విస్మితః సపది తేన కర్మణా –కర్మణాంక్షయకరః పురః పుమాన్ –క్లేప్తుకామ మవనౌ తమక్లమం –నిష్పిపేష పరిరభ్య వక్షసా ‘’.అర్జునుడి పరాక్రమానికి సంతోషించినంతగా అతడి తపస్సుకు సంతోషించ లేదు శివుడు. సత్పురుషుల కు తపస్సు మొదలైన గుణాలకు మించి ,సహజ పరాక్రమమే ఉపకారమై వన్నె తెస్తుంది –‘’’’గుణ స౦హతేః సమతిరిక్త మహో –నిజ మేవ సత్వముపకారి సతాం ‘’
శంకరుడు తెల్లని భస్మంతోఅల౦కారుడై చంద్ర రేఖ తో మనసును ఆకర్షించే రూపం తో ప్రత్యక్షం కాగా అర్జునుడు వెంటనే నమస్కరించాడు –‘’అథహిమ శుచి భస్మ భూషితం –శిరశి విరాజమిత మిందు లేఖయా – స్వవపురతిమనోహరం హరం –దదత ముదీక్ష్య ననామ పాణ్డవః ‘’.అనుకుకుండా బాణాలు అమ్ములపొదులు గాండీవం ఖడ్గం కవచం తో ప్రకాశిస్తున్న తన శరీరం చూసుకొని అర్జునుడు ఆశ్చర్య పోయాడు –‘’సహా శరధి నిజం తథా కార్ముకం –వపురతను సంవర్మితం –నిహిత మపి తథైవ పస్యన్నసిం-వృషభగతి రూపాయ యౌవిస్మయం ‘’.అప్పుడు మేఘాలు తు౦పురులతో నేలను తడిపి చల్ల బరిచాయి. చిత్రంగా మందార పుష్ప పరిమళం వ్యాపించి ,స్వచ్ఛకాంతి ఆకాశాన్ని ఆవరించి భేరీ వాదన లేకుండానే ధ్వనించింది .-‘’విమల రుచి భ్రుశంనభో దు౦దుభే-ర్ధ్వని రఖిల మనాహత స్యానతే ‘’.ఇంద్రునితో సహా దేవతలంతా విమానాలలో వచ్చి ఆకాశాన్ని ఆవరించారు .ఆ విమానాల కాంతులతో ఆకాశం లో నక్షత్రాలు పొడమినట్లు తోచింది .-‘’రోచిష్ణురత్నావలిభిర్వి మానైః-ద్యౌరా చితా తారకితేవ రేజే ‘’.దేవ విమానాలు మోసే హంసలు మెడలలోధ్వనించే గంటలతో ,ఎగురుతూ రెక్కలు నాడించి ఆకాశాన్ని కౌగలించు కునేట్లు చేరాయి .మేఘం లాంటి వృషభం పై కూర్చున్న మహేశ్వరునికి వాయుదేవుడు ,తుమ్మెదలు మందార మాలలను పైన వెన్నెల లాగా వ్యాపింప జేసి ఆహ్లాదం కలిగించాయి –‘’ముదిత మధులిహో వితానీ కృతాః-స్రజ ఉపరి వితత్య సంతానికీః-జలద ఇవ నిషేది వా౦స౦ వృషే-మరుదుప సుఖయాం బ భూవేశ్వరం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-12-20-ఉయ్యూరు