40 ఏళ్ళుగా కోర్టు కేసులు సంస్కృతం లోనే వాదిస్తున్న న్యాయవాది-ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ
అతధునిక 21 వ శతాబ్దం లో భారత దేశం లో న్యాయవాదులంతా ఇంగ్లీష్, హిందీ లేక వారి ప్రాంతీయ భాష లో మాత్రమే కేసులు వాదిస్తుంటే, వారికి భిన్నంగా సంస్కృతం లోనే కేసులు వాదించే ఏకైక లాయర్ వారణాసి లోని ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ .ఇప్పటికి సుమారు 40 సంవత్సరాలనుంచీ ఆచార్య ఉపాధ్యాయ సంస్కృతం లోనే కేసులు వాదిస్తూ రికార్డ్ సృష్టించారు .
ఆచార్య ఉపాధ్యాయ అఫిడవిట్ లు ,లీగల్ డాక్యుమెంట్ లు అన్నీ సంస్కృతం లోనే రాస్తారు .ఆయన సంస్కృత బి.యే. బి .ఎల్ .మరియు ఆచార్య .ఈయన తండ్రి భారతదేశం లోని కోర్టులలో సంస్కృతం వాడకం లేదని చెప్పినప్పుడు అవాక్కయ్యారు .అందుకే తనతో అది ప్రారంభం కావాలని దీక్ష బూని అనుసరిస్తున్నారు .వీరికుమారుడికీ దీనిపై అభిలాష బాగా ఉన్నది .సంప్రదాయ బద్ధమైన నల్లకోటు ధరించిదట్టమైన విభూతి రేఖలతో ,తిలకం తో కోర్టుకు హాజరౌతారు ఆచార్య .సంస్కృతంలో ఉపాధ్యాయ వాదం ప్రారంభించగానే కోర్టు హాలు లో నిశ్శబ్దం తాండవించి ఆయన గంగా ప్రవాహ సదృశ వాగ్దోరణినికి ముగ్దులౌతారు .అయన మాట్లాడే సంస్కృతం అత్యంత సరళంగా ఉండి,అందరికీ అతి తేలికగా అర్ధమౌతుంది .తన క్లెయింట్ లకు కూడా కేసు వివరాలు సంస్కృతం లోనే వివరిస్తారాయన .న్యాయమూర్తులు కూడా ఆయన సంస్కృత దీక్షను అభినందించి ,ప్రోత్సహిస్తున్నారు .ఆయన ప్రభావం వారిపైనా పడటం తో,తీర్పులు కూడా హిందీలో కాని ,సంస్కృతం లో కాని ఇస్తున్నారు . ఆయన సంస్కృత భాషకు 1978నుంచి అంకితభావంతో చేస్తున్న విలువైన కృషిని,సేవ గుర్తించి 2003లో ఆచార్య ఉపాధ్యాయకు ‘’సంస్కృత మిత్ర ‘’బిరుదు ప్రదానం చేసి కేంద్ర మానవ వనరుల శాఖ గౌరవించి సత్కరించింది .సంస్కృతం లో కేసులు వాదించటమే కాదు సుమారు 60కి పైగా నవలలు సంస్కృతం లో రాసి ఆదర్శంగా నిలిచారు శ్యాం ఉపాధ్యాయ ఆచార్య .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-21-ఉయ్యూరు