10-1-21ఆదివారం ఉదయ౦ ధనుర్మాస సందర్భంగా త్ల్లవారుజామున 3-30గం లేక్ లేచి స్నాన స౦ధ్యా పూజాదికాలు పూర్తి చేసుకొని ,మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో స్వామివార్లకు ఉదయం 5గం.లకు అరిసెలతోప్రత్యేకపూజ జరిపించి ,ఇంటి వద్ద టిఫిన్ తిని కాఫీ తాగి ,ఉదయం 8-30గం.లకు రెండు కార్లలో నేనూ ,మా శ్రీమతి ప్రభావతి ,సరసభారతి కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి శ్రీ శ్రీనివాస శర్మ దంపతులు మా కోడలు శ్రీమతి రాణి ,సరసభారతి కార్యవర్గ సభ్యులు శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు గారు,ఒక కారులో, మా అబ్బాయి వెంకటరమణ , కోడలు శ్రీమతి మహేశ్వరి ,జాగృతి సంస్థ నిర్వాహకులు శ్రీమతి రాజీవి శ్రీమతి కనకమహా లక్ష్మి ఒక కారులో బయల్దేరి తేలప్రోలు ఏలూరు దెందులూరు మీదుగా మా గబ్బిట వారి అగ్రహారం రామారావు గూడెం లో మా స్థలం లో శ్రీ కొలచిన ప్రసాద రావు శ్రీమతి భారతి దంపతులు నిర్మించిన శ్రీ భక్తాంజనేయ స్వామి కి ఉయ్యూరునుంచి తెచ్చిన తమలపాకులు చామ౦తి పూలతో అష్టోత్తర సహస్ర నామ పూజ చేసి తెచ్చిన, కట్టిన పుష్పమాలలతో స్వామిని అలంకరించి మంత్రపుష్పాదులు పూర్తిచేసి ఉదయం 11గం.లకు భీమడోలు ,చాగల్లు మీదుగా మల్లవరం చేరటానికి ట్రాఫిక్ ,రోడ్లు వంతెనల నిర్మాణం దారి మళ్లింపు సమస్యలను ఎదుర్కొని మధ్యాహ్నం 1-30కు మల్లవరం శ్రీ చర్ల గణపతి శాస్త్రి శ్రీమతి చర్ల సుశీల స్మారక వృద్ధాశ్రమం కు ఉదయం 10గం లకు చేరాల్సింది , మూడున్నరగంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1-30కి చేరాం .అప్పటికే వారి సమావేశాలు పూర్తయి ,భోజనాలు చేసి మా కోసం ఎదురు చూస్తున్నారు .మాకు కూడా భోజనాలు వడ్డించగా తిన్నాం .రచయిత శ్రీ బద్రి దంపతులకు సరసభారతి పుస్తకాలు అందించి బద్రి గారు తాము రాసిన పుస్తకాలు ఇవ్వగా తీసుకొన్నాం .ఉయ్యూరు నుంచి 200 లడ్డూలు తయారు చేయించితెచ్చి వృద్ధాశ్రమం లో పంచమని చర్ల సిస్టర్స్ కు అందజేశాం .
మధ్యాహ్నం 2-30కు
డా చర్ల విదుల గారి అధ్యక్షతన గణపతి శాస్త్రిగారి 113 జయంతి పురస్కార సభ జరిగింది .శ్రీమతి వాణీ ప్రభాకరి ప్రార్ధన గీతం శ్రావ్యంగా ఆలపించారు .మమ్మల్నిద్దర్నీ వేదికపైకి .ఆహ్వానించి శాలువా ,జ్ఞాపిక,పుష్పమాలలతో శ్రీ ఆనంద్ దంపతులు ,మాద్దరికీ చెరొక సీల్డ్ కవర్ అందజేయగా డా.చర్లమృదుల డా విదుల సిస్టర్స్ ఆత్మీయ సన్మానం చేసి నాకు కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ చర్ల గణపతిశాస్త్రి గారి సాహిత్య పురస్కారం ,మా శ్రీమతి ప్రభావతికి శ్రీమతి చర్ల సుశీల సేవా పురస్కారం అందజేశారు .శ్రీమతి వాణీ ప్రభాకరి రాసిన అభినందన బిరుదు సన్మాన పత్రాలను మాకు గౌరవంగా అందజేసి ,నాకు ‘’ఆధునిక ఆంద్ర భోజుడు ‘’’బిరుదును ,మా శ్రీమతికి ‘’ఆధునిక ఆదర్శ మహిళ’’ బిరుదు ప్రదానం చేస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ,వీణా రవళి శ్రీమతి వాణీ ప్రభాకరి గారి చేత హర్షధ్వానాల మధ్య ప్రకటింప జేశారు .సరసభారతి చేస్తున్న సాహిత్య, ఆధ్యాత్మిక కృషిని చర్ల సిస్టర్స్,శ్రీమతి వాణి సభాముఖంగా తెలియజేశారు . శివలక్ష్మి దంపతులు జాగృతి నిర్వాహకులు మమ్మల్ని రోజా పుష్పమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించి అభిమానం చూపారు .
నేను మాట్లాడుతూ ‘’గణపతి శాస్త్రి గారి వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి బహు భాషా వేత్త ,మహాత్ముని ఆదర్శాలైన సత్యాహి౦సలను ఖద్దరు ధారణా జీవితాంతం త్రికరణ శుద్ధిగా పాటించి భారత స్వాతంత్రోద్యమం లో ఉత్సాహంగా పాల్గొని .చేసిన సేవలకు ప్రభుత్వమిస్తానన్న భూమిని ,పెన్షన్ ను తిరస్కరించిన ఆదర్శమూర్తి వినోబా భూదానయజ్ఞానికి తనస్వంతభూమి అయిదు ఎకరాలు దానం చేసిన త్యాగామయులు ఉత్తమ ఉపాదాయాయులు విజ్ఞానాత్మక ,కర్తవ్య బోధగా రాసిన బహు గ్రంధకర్త ,అస్పృశ్యత ను నిరసిస్తూ తన ఇంట్లో అస్ప్రుశ్యునికి స్థానం కలపించిన ఆదర్శమూర్తి ,సాహిత్య సేవకు కళాప్రపూర్ణ ,కేంద్ర సాహిత్య అకాడెమి పురాస్కారం పొందిన విజ్ఞాన దాత ,ఆర్ష విజ్ఞాన సర్వస్వం ,దాని వ్యాప్తికి అహరహం కృషి సల్పిన సంస్కారి ,నిగర్వి అనుక్షణ సేవాతత్పరులు అయిన కళాప్రపూర్ణ పద్మ శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి సాహితీ పురస్కారం అ౦దు కొంటున్నందుకు నాకూ ,ఆపన్నులపాలిటి అన్నపూర్ణ ,సేవాతత్పర చారుశీల శ్రీమతి చర్ల సుశీల సేవాపురస్కారం మాశ్రీమతి శ్రీ మతి ప్రభావతి అ౦దుకొంటున్నందుకు గర్వంగా ఉందనీ వినమ్రంగా స్వీకరిస్తున్నామని ,సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన డా చర్ల సిస్టర్స్ తలిదండ్రుల ఆదర్శాన్ని పాటిస్తూ సమాజ సేవ చేసి అభినందనలు అందుకోవటం మనకు గర్వకారణమనీ మాటల కంటే చేతలతో ప్రజా హృదయాలను గెలుస్తున్నారని ‘’చెప్పాను . విశాఖ నుంచి వచ్చిన శ్రీ ఆనందరావు దంపతులు ,తమ తల్లిగారు ఆశ్రమానికి అందజేసిన 1 కోటి రూపాయల ధనాన్ని, చర్ల సిస్టర్స్ కు అందజేయటమేకాక అమెరికానుంచి స్నేహితులు పంపిన నూతన వస్త్రాలను ఆశ్రమం లోని మహిళకు తమ చేతుల మీదుగా అంద జేసి ఎందరికో ప్రేరణ కలిగించారు .ఈ దంపతులకు సరసభారతి పుస్తకాలు అందించి శాలువా కప్పి అభినంది౦చాము .మరో ప్రముఖులు ఆశ్రమానికి 15 వేల రూపాయలు అందించారు .అక్కడి ప్రముఖులకు కూడా సరసభారతి పుస్తకాలు అందజేసి ,అందరికీ వీడ్కోలు చెప్పి ,సాయంత్రం 4గంటలకు బయల్దేరి తణుకు మీదుగా ఉయ్యూరు చేరే సరికి రాత్రి 8-30అయింది .మా రమణ తెచ్చిన ఇడ్లీలు తిని కాస్త విశ్రాన్తితీసుకోన్నాం పోద్దుతినుంచీ పాల్గొన్న కార్యక్రాల ఫోటోలు అందరికీ పంపి ఈ వ్యాసం రాశాను. రాస్తూ వారిచ్చిన కవర్ లో ఏముందో అని చూస్తె చేరి మూడు వేల రూపాయలు ఉన్నాయని గ్రహించి ఆశ్చర్యపోయాం. శ్రీ ఆనంద్ దంపతుల వితరణకు కృతజ్ఞతలు తెలియ జేస్తూ –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-1-20-ఉయ్యూరు