అక్షరం లోక రక్షకం
సరసభారతి శ్రీ ప్లవ ఉగాది వేడుకలు
-సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ, స్థానిక రోటరీక్లబ్ సంస్థ తో కలిసి ,కె.సి.పి.షుగర్ ఫాక్టరీ వద్ద గల రోటరీక్లబ్ ఆడి టోరియం లో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ( ఉగాదికి పదిరోజులముందు) 4-4-21 ఆదివారం సాయంత్రం 3.30 గం లకునిర్వహింపబడును . .సాహిత్య ,సంగీతాభిమానులు ,కవిమిత్రులు విచ్చేసి,పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
కార్యక్రమ వివరాలు
1-‘’రామాయణ గానం ‘’ .శ్రీ కంభంపాటి సోదరులు –హైదరాబాద్ –
2- ‘’నేటి ప్రజాస్వామ్యం ‘’ అంశం పై –ప్రముఖ కవి మిత్రులచే –కవి సమ్మేళనం
3- శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ రచించి(25,26), ,సరసభారతి ప్రచురించిన(37,38,39) 3 గ్రంథాల ఆవిష్కరణ –
1-Nuclear scientist Dr.Akunuri Venkata Ramayya –(శ్రీ దుర్గాప్రసాద్ రాసిన అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య పుస్తకం కు ఆంగ్లానువాదం )-స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)
2-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష – స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా) –ముందుమాటలు రాసినవారు -1.డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు ,పరశు రామాయణం వంటి సంస్కృత గ్రంథ రచయిత,జ్యోతిష్య పండితులు –పొన్నూరు 2-డా.పుట్టపర్తి నాగపద్మిని గారు –సంస్కృత, ఆంద్ర, ఆంగ్ల, హిందీ భాషా విదుషీమణి ,రచయిత్రి, విమర్శకురాలు –హైదరాబాద్ .
3-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు .ముందుమాటలు రాసినవారు –డా .వెంపటి కుటుంబ శాస్త్రి గారు రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ పూర్వ వైస్ చాన్సలర్ ,అంతర్జాతీయ సంస్కృత సంస్థ అధ్యక్షులు 14,,15,16,17వ విశ్వ సంస్కృత సమ్మేళనం నిర్వహించిన వారు ,విస్తృత వేద అధ్యయన నిర్వహణ బోర్డ్ సభ్యులు ,బహు గ్రంథ కర్త ,కృష్ణాజిల్లా టేకుపల్లి వాస్తవ్యులు ప్రస్తుతం పూణే నివాసి .
4- సరసభారతి జీవన సాఫల్య పురస్కారప్రదానం
గ్రహీతలు
1-శ్రీ ఉప్పులూరి .సుబ్బరాయ శర్మ గారు –ప్రముఖ ,నాటక ,రేడియో, టి.వి..సినిమా నటులు –హైదరాబాద్
2-శ్రీ బెల్లం కొండ నాగేశ్వరావు గారు –వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ,ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్,తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత ,తెలుగు భాషోద్యమ సమాఖ్యనాయకులు –చెన్నై ,
3-శ్రీ చలపాక ప్రకాష్ –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకులు ,కవి ,కధకులు విమర్శకులు,ప్రచురణ కర్త –విజయవాడ
5-కీ.శే.విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయశాస్త్రి ,శ్రీమతి భవానమ్మదంపతుల స్మారక ఉగాది సాహితీ పురస్కార ప్రదానం
గ్రహీతలు
1-శ్రీ కట్టా నరసింహులు –కడప బ్రౌన్ స్మారక లైబ్రరి ట్రస్ట్ పూర్వ కార్యదర్శి ,శ్రీతిరుమలతిరుపతి దేవస్థానం పోతన భాగవత ప్రాజెక్ట్ సభ్యులు –తిరుపతి
2-డా .శ్రీమతి చిల్లర భవానీ దేవి –బహు ప్రక్రియల రచయిత్రి –హైదరాబాద్
3-డా శ్రీమతి నోముల నర్మదా రెడ్డి –ప్రముఖ ప్రపంచ పర్యాటకురాలు ,గాయని ,బాడ్ మింటన్,రన్నింగ్ చాంపియన్ –హైదరాబాద్
4-శ్రీ రహ్మనుద్దీన్ షేక్ –ప్రసిద్ధ తెలుగు అంతర్జాల నిపుణులు –విజయవాడ
6-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి గార్ల -స్వయం సిద్ధ ఉగాది పురస్కారప్రదానం
గ్రహీతలు
1-శ్రీ గాదిరాజు రంగరాజు –ప్రముఖ కవి ,విశ్లేషకులు –ఉండి
2-శ్రీ ధూళిపాళ రామభద్ర ప్రసాద్ ––తెలుగు భాషా వికాస సమితి సమన్వయకర్త ,-గుడివాడ
3-శ్రీమతి పి.శ్రీవల్లి –లైబ్రేరియన్ –సారస్వత నికేతనం –వేటపాలెం
4-శ్రీ జమ్మలమడక శ్రీనివాస్ –అసిస్టెంట్ సెక్రెటరి ,లాండ్ డిపార్ట్ మెంట్ –విజయవాడ
5-శ్రీ జంపాన శ్రీనివాస గౌడ్ –మాజీ సర్పంచ్ ,విశిష్ట సామాజిక సేవాకర్త –గురజాడ
6-గుర్రాల నాగేంద్రరావు –అమృత ఎలెక్ట్రికల్స్ –ఉయ్యూరు –
7-శ్రమశక్తి పురస్కార ప్రదానం –గ్రహీతల పేర్లు తరువాత తెలియజేస్తాము .
ఆహ్వానించు వారు
గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు, మరియు రోటరీ క్లబ్ ఉయ్యూరు -25-2-21
మార్పులు , చేర్పులతో ,పూర్తి వివరాలతో ఫైనల్ ఆహ్వాన పత్రిక మార్చి రెండవవారం లో అందజేయ బడుతుంది .
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు