మధ్యప్రదేశ్ ఛత్తాపూర్ జిల్లా బాస్నా గ్రామం లో ద్రౌపదితో భీముడు కాపురం చేశాడని చెబుతారు .ఇక్కడే గొప్ప జలాశయంఉంది .పంచపాండవులు ఇక్కడ కొద్దికాలమున్నారు .ఇక్కడ ఉన్న జలాశయాన్ని భీమ కుండ్ అంటారు .పాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి వచ్చారని ఐతిహ్యం .ఇక్కడ ఎడారుల్లాంటి కొండలు అద్భుతంగా వారికి కనిపించి ఇక్కడ ఉన్నారట .ద్రౌపది అసూర్యంపశ్య అంటే సూర్య రశ్మి తాకితే కళ్ళు తిరిగి పడిపోతుంది .ఇంత సుందర ప్రాంతం లో నీరు లేకపోవటం చూసి భీముడు గదతో కొట్టి భూ గర్భ జలాన్ని పైకి తెప్పించి మహోపకారం చేశాడు ఈ జలాశయం లోతును ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు .డిస్కవరీ చానల్ వాళ్ళు డైవర్స్ ను పంపి లోతు కనుక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళు సుమారు వంద అడుగులకంటే ఎక్కువ లోతుకు వెళ్ళ లేకపోయారట .దీనికీఅరేబియా సముద్రానికి సంబంధం ఉందని భావించారు .ఆ సముద్ర ఆలల తాకిడి తోపాటు ,సముద్రాలలో ఉండే అరుదైన జీవరాశులు అంత లోతు నీటిలో కనిపించి పెద్ద ఆశ్చర్యానికి లోనయ్యారట .
ఇక్కడే ఒక అద్భుత శివలింగముంది .ఎక్కడ సునామీ వచ్చినా, ఈ జలకుండం లోని నీరు దాదాపు 40అడుగుల ఎత్తునున్న శివలింగాన్ని సెకండ్ల కాలం లోనే తాకుతుందట .గుఅరాత్ ,మనీలా లలో సునామీలోచ్చినప్పుడు ఇలానే జరిగింది .ఈ కుండం లో ఎంతమంది స్నానం చేసినా స్విమ్మింగ్ పూల్ ను క్లీన్ చేస్తే యెంత క్లిస్టల్ క్లియర్ గా ఉంటుందో ఇక్కడా ఎప్పుడూ నీళ్ళు అంత స్వచ్చంగా ఉంటాయి .నారదుడు ఇక్కడ విష్ణుమూర్తి కోసం తపస్సు చేసినందువల్ల దీన్ని నారద కుండం అనీ అంటారు . విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఈ నీటిలో స్నానిచటం వలన ఆ నీలిమేఘశ్యాముని రంగు ఈనీటికి అంటి నీలంగా కనిపిస్తుంది . ఈ కుండును డీప్ టాంక్ అంటారు. ఇందులోని నీరు ఈ కుండానికీ అరేబియా సముద్రానికి ,పవిత్ర గంగానదికీ సంబంధం ఉందంటారు .కానీ గంగ వెయ్యి కిలోమీటర్లదూరం లో, అరేబియా సముద్రం అయిదు వందలకిలో మీటర్ల దూరం ఉంది .
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ కుండం లోతు తెలుసుకొనే ప్రయత్నం లో మూడు పెద్ద పెద్ద మోటార్లు పెట్టి వారం రోజులు నీటిని బయటికి తోడేసినా, ఒక్క అంగుళం కూడా నీటి లోతు తగ్గలేదు. చేతులెత్తేసింది ప్రభుత్వం .ప్రతి సంక్రాంతికి ఇక్కడి ప్రజలు గొప్ప జాతర ఇక్కడ జరుపుతారు .నది ,సముద్రం, కాలువలలో ప్రమాదవశాన మునిగిన వారి శరీరాలు ఉబ్బి పైకి తేల్తాయి .కానీ ఇక్కడ ఎంతోమంది ప్రమాదానికి లోనై చనిపోయినా ఎవరి శవాలు బయట పడలేదట .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-21-ఉయ్యూరు