గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4
571-భేద విద్యావిలాస కర్త –గురురాజాచార్య రాజా –(1921)
వేదాంత శిరోమణి, వేదాంత విద్వాన్ గురురాజాచార్య రాజా 17-9-1921న కర్ణాటకలో జన్మించి మద్వ సిద్ధాంత సాహిత్యం లో నిష్ణాతుడయ్యాడు .గురు సార్వ భౌమ సంస్కృత పాఠశాలకు గౌరవ ప్రిన్సిపాల్ గా ,సమీర సమయ సమవర్ధిని సభకు సెక్రటరిగా పని చేశాడు .భేద విద్యా విలాసం ,ఉపాసన సంగ్రహ విజయం ,ఐతరేయ మంత్రార్ధం ,వైగ్వైఖరి వంటి 8సంస్కృత గ్రంథాలు రాశాడు .కమలేశ్ అనే మారుపేరుతో సంస్కృత శ్లోకాలు రాశాడు .విద్యా వైభవ ,సాహిత్యాలంకార ,ధర్మ శాస్త్ర భూషణ్ ,విద్వత్ చూడామణి బిరుదాంకితుడు .సంస్కృత సాహిత్య కృషికి రాష్ట్రపతి పురస్కారం పొందాడు .
572- సంస్కృతం పై కామశాస్త్ర ప్రభావం కర్త -విశ్వనాథ హంపి హోలీ (1955)
1-6-1955లో బెల్గాం లో జన్మించిన విశ్వనాథ హంపి హోలీసంస్కృత ఎం. ఏ .పిహెచ్ డి.సంస్కృతం పై కామశాస్త్ర ప్రభావం వంటి 8పుస్తకాలు రాశాడు .
573-కిరీ ఆబాస్య కర్త –హర్ష కుమార్ (1936)
విష్ణు సహస్రనామాలపై కిరీ అభ్యాసం తోపాటు పద్య పుష్పాంజలి రాసిన హర్ష కుమార్ 4-12-1936న ఢిల్లీ లో పుట్టి ,సంస్కృత పి.హెచ్. డి .చేశాడు .ఒకే ఒక సంస్కృత రచన కిరీ అభ్యాసం రాశాడు .
574-చెన్నమ్మ నవలాకర్త –శ్రీనాథ్ హోసూర్కర్ (1924)
26-2-1924లో పుట్టిన శ్రీనా థ్ హోసూర్కర్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ కాలేజిలో సంస్కృత లెక్చరర్ .చెన్నమ్మ సి౦ధుకన్య నవలతోపాటు అజాత శత్రు ,ప్రతిజ్ఞా పూర్తి ,రాశాడు .
575-సంస్కృత భరత నర్తన మాల కర్త – ,శ్రీపాద శాస్త్రి హోసుర్కర్ (1886)
కొల్హాపూర్ లోని హసూర్ లో 10-6-1886న జన్మించిన శ్రీపాద శాస్త్రి హోసుర్కర్ హోల్కార్ సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరై,నిండోర్ లోని మహారాజా యశ్వంతరావు కాలేజీలో పనిచేశాడు .సంస్కృతం లో 15పుస్తకాలు రాశాడు .సంస్కృత భరత నర్తన మాల ,రాణాప్రతాప ,వల్లభాచార్య ,శివాజీ ,సమర్ధ రామదాస ,పృధ్విరాజ ,గురునానక్ ,మహావీర ,బుద్ధ మొదలైనవి వీటిలో ప్రసిద్ధాలు .ఇంగ్లీష్ లో ది గ్రేట్ వుమెన్ ఆఫ్ మహారాష్ట్ర ,అండ్ రాజస్థాన్ రాశాడు .’’మోక్షమందిరస్య ద్వాదశ దర్శన సోపానావలి’’అనే ఉద్రంథ౦ ఆయనకు చిరయశస్సు సాధించిపెట్టింది .
576-గణేశ మీమాంస కర్త –గణపతిశాస్త్రి హెబ్బార్ (1901)
1901లో కర్ణాటకలోని మంగుళూరు లోజన్మించి , 1986లో మరణించిన గణపతిశాస్త్రి హెబ్బార్ –ఋగ్వేద న్యాయ వేదాంత రాజనీతి శాస్త్ర కోవిదుడు .మహామహోపాధ్యా య లక్ష్మణశాస్త్రి ,పండిత భీకం భట్ పట్వర్ధన్,పండిట్ రాజేశ్వర శాస్త్రి గార్ల శిష్యుడు .గణేశ మీమాంస గ్రంధం రాశాడు .విద్యాభూషణ్ ,సర్వతంత్ర బిరుదాంకితుడు .
577-శివ స్వారోదయ కర్త –హేమలత (1943)
భాగల్పూర్ లో 15-2-1943న పుట్టిన హేమలత భాగల్పూర్ యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ ,హెడ్. శివ స్వారోదయ రాసింది .
578-వ్యాకరణ శాస్త్ర కర్త –హింద్ కేసరి (1947)
ఉత్తరప్రదేశ్ మణిపూరి జిల్లా లోని కేసరిలో 15-8-1947 న పుట్టిన హింద్ కేసరి జైపూర్ లో సంస్కృత సంస్థాన్ ప్రిన్సిపాల్ .గోవిందం శాస్త్రి,పండిత రాం ప్రసాద్ త్రిపాఠీ ఆమె గురుపర౦పర .సంస్కృత వ్యాకరణం తో పాటు అయిదు పుస్తకాలు రాసింది .62వ ఏట 2009లో మరణించింది .
579-వివేచని కర్త –నవీన్ హోల్లా (1973)
మంగుళూరులో 1973డిసెంబర్ 8న పుట్టిన నవీన్ హోల్లా,శృంగేరి రాజీవ్ గాంధి కాంపస్ లో సంస్కృత అసిస్టెంట్ ప్రొఫెసర్.వివేచని అని ఒకే ఒకపుస్తకం రాసింది .
580-వసంత సేన కర్త –కృష్ణన్ ఇలాయత్ (1897)
31-5-1897న కేరళ కల్లూరు లో పుట్టిన కృష్ణన్ ఇలాయత్ ఆచార్య ,విద్వాన్ .పటమన వాసుదేవ ఇలయత్ ,కే వాసుదేవన్ ముసత్ ,శ్రీనివాస రాఘవాచార్య ,అనుజన్ రాజా ,నీల కంఠ శర్మగురువు గార్ల శిష్యుడు .వసంత సేన ,సుహృత్ పుస్తకాలకర్త .
581- తార్కికరక్ష కర్త –ఎఫ్.ఇరిమాల్(1945)
పారిస్ యూని వర్సిటిలో సంస్కృత ఎం.ఏ .పిహెచ్. డి చేసిన ఎఫ్.ఇరిమాల్ –ఫ్రాన్స్ లోని కేన్ లో 1945మార్చి 27 న పుట్టాడు .గురుపర౦పర –ఎల్ రెనోట్,ఏ మినారి ,సి కైలత్ .భవభూతెహ్ మహా విరచితం ,భవభూతెహ్ సమయం ,తార్కికరక్ష .అనే మూడుపుస్తకాలు రాశాడు
582-మండన మిశ్ర స్య స్పోట సిద్ధి కర్త –కేయే ఎస్ అయ్యర్ –(1896)
7-9-1896న కేరళ పాల్ఘాట్ లోపుట్టిన కె.యస్. అయ్యర్-నారాయణ శాస్త్రి ,ప్రొఫెసర్ సిల్విన్ లేవి ,డా బ్రినేట్ ,మిసెస్ రైస్ డేవిస్ ల శిష్యుడు .ప్రొఫెసర్ సత్యవ్రట్ సింగ్ ,ప్రొఫెసర్ కేసి పాండే లవద్ద మెళకువలు నేర్చాడు .12గ్రంథాలురాశాడు వాటిలో కాళిదాస విరచితం మాలవికాగ్నిమిత్రం ,మలయాల మా మహాభారతం మండన మిశ్రస్య స్పోట విధి ,భర్తృహరి ప్రణీతం వాక్య పదీయం ఉన్నాయి .అనేక విశ్వవిద్యాలలాలో గౌరవ స్థానం పొందాడు .లక్నో,ఫ్రాన్స్ ,హాలండ్ ,బెల్జియం జర్మని స్విట్జర్లాండ్ ఆస్ట్రియా ,ఇటలీ లలోని లోని అఖిలభారతీయ సంస్కృత పరిషత్ వ్రాత ప్రతుల కేటలాగ్ చీఫ్ ఎడిటర్ .యుపి సంస్కృత సంస్థాన్ విద్వాన్ పురస్కారం ను, ప్రెసిడెంట్ అవార్డ్ ను అందుకున్నాడు .
583-శబ్ద శక్తి కర్త –విరూపాక్ష జడ్డిపాల్ –(1970)
21-7-1970న ఎల్లాపూర్ లో పుట్టిన విరూపాక్ష జడ్డిపాల్ –సంస్కృత ఇంగ్లిష్ చరిత్రలలోఎం. ఏ ..విద్యావర్ధిని తిరుపతి సంస్కృత విద్యా పీఠ౦ ప్రొఫెసర్ .శబ్దశక్తి ,టీచింగ్ ఆఫ్ సంస్కృత మొదలైన నాలుగుపుస్తకాలురాశాడు .
584-జినాష్టకావలి స్తోత్ర కర్త –అభయ్ జైన్
సాహిత్యార్యుడైన అభయ్ జైన్ గవర్నమెంట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ .జినాష్టకావాలి స్తోత్రం సంపాదక కర్త .
585-సంవేగ చూడామణి కర్త –అనేకాంత కుమార జైన్ –(1978)
అనేకా౦త కుమార జైన్ 1978లో ఆగస్ట్ 16న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా దలపత్ పూర్ లో జన్మించాడు ఢిల్లీ లోని SLBSR విద్యా పీఠ సంస్కృత ప్రొఫెసర్ .దయానంద భార్గవ శిష్యుడు .6పుస్తకాలురాశాడు .అందులో సంవేగ చూడామణి ,సద్దర్శనేషుప్రమాణ ప్రమేయ సముచ్చయ ,ఆవశ్యక నిరుక్తి ఉన్నాయి .
586-జైన ధర్మ మీమాంస కర్త –అశోక్ కుమార్ జైన్ –(1959)
1-3-1959లలితపూర్ లో పుట్టిన అశోక్ కుమార్ జైన్- జైన దర్శన ఆచార్య .బెనారస్ హిందూ యూనివర్సిటి ప్రొఫెసర్ .జగన్నాథ ఉపాధ్యాయ ,ప్రొఫెసర్ వీరేంద్రకుమార్ వర్మల శిష్యుడు. అనే కాంతజైన్ వద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .16పుస్తకాలురాశాడు .అందులో జైనధర్మమీమాంస ముఖ్యమైనది ఆచార్య జ్ఞాన సాగర మహారాజా దార్శనిక వివేచన వగైరాలు ఇతర రచనలు .
587-నైతిక శిక్షావతికర్త –అశోక్ జైన్ (1962)
20-6-1962న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బందా లో పుట్టిన అశోక్ జైన్-సాధనే కే సూత్రా , శిక్షావతి ,జినేంద్ర పూజావలి రాశాడు
588-అమరభారతి కర్త –దయా చంద్ర జైన్ (1915-2006)
1915ఆగస్ట్ 11న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా సాహ్పూర్ మార్గావ్ లో దయా చంద్ర జైన్ పుట్టి ,గణేష్ దిగంబరజజైన్ సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ అయ్యాడు .ఈయన గురుపరంపర లో –గణేష్ ప్రసాద్ వర్ని ,పండిట్ దయాచంద్ర సిద్ధాంత శాస్త్రి, పండిట్ హజారీలాల్ న్యాయ తీర్ధ ,పండిట్ ముకుల్ శాస్త్రి క్షిష్టే లోకనాథ శాస్త్రి కపాలేశ్వర ఝా , పండిట్ బాబూరాం ఝా ఉన్నారు .అమరభారతి ,శ్రీ చతుర్వింశతి సంధాన మహాకావ్య ,భగవాన మహా వీర ముక్తక స్తవం ,విశ్వతత్వ ప్రకాశ సయాద్వాద ,వార్నీజీ కా జీవన పరిచయ .12-2-2006న చనిపోయాడు
589-ప్రాచీనాభి లేఖ కర్త -భగచంద్ర భగేందు జైన్ (1937)
ఆచార్య ,కావ్యతీర్ధ ,గాంధీ దర్శన ,సాహిత్యరత్న భగచంద్ర భగేందు జైన్1937 ఏప్రిల్ 2న మధ్యప్రదేశ్ రితి కట్నిలో పుట్టాడు .దామోPG కాలేజి సంస్కృత హెడ్ .భోపాల్ సంస్కృత అకాడెమి సెక్రెటరి .సంస్కృత ప్రాకృత జైన విద్యా అనుసందాన్ కేంద్ర డైరెక్టర్ .దయాచంద్ర సిద్ధాంత ,పన్నాలాల్, ప్రొఫెసర్ రాంజీ ఉపాధ్యాయ ల శిష్యుడు .సావిత్రీ జైన్ నరేంద్ర సింగ్ రాజ్ పుట్ ల వద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .ప్రాచీనాభిలేఖ మొదలైన నాలుగు గ్రంథాలురాశాడు .లక్ష్మీదేవి జైన్ అవార్డ్ ,అహింసా ఇంటర్నేషనల్ సాహిత్య అవార్డ్ ,జైన్ రాష్ట్ర గౌరవ అలంకరణ అవార్డ్ ,కుండల్పుర పురస్కారం ,రిషభ దేవ్ పురస్కారం అందుకొన్నాడు .
590-తిలోపపన్నతి సాంస్కృతిక మూల్యాంకన కర్త –ధర్మేంద్ర జైన్ (1940)
సంస్కృత ,ప్రాకృత జైన ,క౦పాపరటివ్ మతాల లో ఎం.ఏ .అయిన ధర్మెంద్రజైన జైన దర్శనాచార్య 24-8-1940లో పుట్టాడు సాహిత్య దర్శన జైన బౌద్ధ ఆచార్య .జైపూర్ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ డెవలప్ మెంట్ ఆఫీసర్ .తిలోపపన్నత్తి సాంస్కృత మూల్యాంకన అనే ఏకైక పుస్తకం రాశాడు .ముని పుణ్య అవార్డ్ గ్రహీత .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-21-ఉయ్యూరు