గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 591-జైన సంస్కృత కోశ కర్త –భగ చంద్ర జైన్ (1936)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

591-జైన సంస్కృత కోశ కర్త –భగ చంద్ర జైన్ (1936)

భగ చంద్రజైన్ 1936 సెప్టెంబర్ 11న మధ్యప్రదేశ్  చత్తర్పూర్ లో పుట్టి సంస్కృత ,ప్రాకృత జైనాలలో ఆచార్యు డయ్యాడు .నాగ పూర్ ,మద్రాస్ యూని వర్సిటీలలో ప్రొఫెసర్ గా పని చేసి ,మైసూర్ యూనివర్సిటి ప్రాకృత ,అండ్ రిసెర్చ్ కు డైరెక్టర్ అయ్యాడు .ఈయన గురుపరంపర –పన్నాలాల్ జైన్ ,పండిత కైలాస చంద్ర సిద్ధాంత శాస్త్రి ,డా నారాయణ సమతిని .డా కస్తూర్ చంద్ర జైన్ ,డా బి మొహరిల్ ,డా లోఖండే,డా ఖండేర్కర్ ,డా.మలాతీ బొదలె ,డా కాలా త్రికూలె ,డా అధవాలే లవద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .75గ్రంథాలు రాసిన మహా రచయిత.అందులో జైన సంస్కృత కోశ ,చత్సుచ్చతకం మొదలైనవి ఉన్నాయి .అహింసా ఇంటర్నేషనల్ అవార్డ్ ,ప్రెసిడెంట్ అవార్డ్ మొదలైన ఎన్నో పురస్కార గ్రహీత చాలా దేశాలలో విజిటింగ్ ప్రొఫెసర్ .

592-కర్మ ప్రకృతి కర్త-గోకుల్ చంద్ర జైన్ –(1934)

5-11-1934న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా పిదుర లో గోకుల్ చంద్ర జైన్ పుట్టాడు .వారణాసి సంపూర్ణానంద సంస్కృత యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ . కర్మ ప్రకృతి సత్యశాసన పరీక్షా పరిసంవాద వంటి ,అయిదు గ్రంథాలు రాశాడు .గోమటేశ్ విద్యా పీత పురస్కారం ,ప్రశస్తి పురస్కారం ,ప్రెసిడెంట్ అవార్డ్ లు పొందాడు .

593-సిరికుమ్మ చరితం కర్త –జినేంద్ర జైన్ (1962)

మధ్యప్రదేశ్ సిందుది జిల్లా కట్ని లో జినే౦ద్ర జైన్ 1962లో జూన్ 14జన్మించాడు సంస్కృత  ఎం .ఏ. పిహెచ్ డి .రాజకోట్ లోని జైన్ విశ్వభారతి యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .అక్ఖానాయ మణి కోశం ,సిరికుమ్మ చరితం ,అనువాద ప్రాకృత సాహిత్యం ఏవం జైన దర్శన సమీక్ష వగైరా 13 పుస్తకాలు రాశాడు .

594-జైన ఉద్ధరణ కోశ కర్త –కమలేశ్ కుమార్ జైన్ (1960)

జైన దర్శన ,ప్రాకృత ఆచార్య కమలేశ్ కుమార్ జైన్ 21-6-1960న రాజస్థాన్ లో పుట్టి ,జైపూర్ సంస్కృత  యూనివర్సిటిలో జైన ఫిలాసఫీ రీడర్ గా ఉన్నాడు .రెండు భాగాల జైన ఉద్ధరణ కోశం రాశాడు .పండిత గోపాల దాస్ బరేయా స్మారక అవార్డ్ గ్రహీత .

595-జైన పురాణ కోశ కర్త –కస్తూర్ చంద్ర జైన్ (1936)

సుమన్ గా ప్రసిద్ధుడైన కస్తూర్ చంద్ర జైన్ 1936 లో ఏప్రిల్ 12న మధ్యప్రదేశ్ బన్సా జిల్లా తర్ఖేడ దామో లో పుట్టాడు .సంస్కృత ఎం .ఏ .పిహెచ్ డి .రాజ్ కోట్ జైన్ విద్యా మహా సంస్థాన్ శ్రీ విరాజీలో రిసెర్చ్ అసిస్టెంట్ .జైన పురాణ కోశం ,భారతీయ దిగంబర జైన అబిలేఖ ,ప్రాణాన పరీక్షా భాషా వచనిక మొదలైన 5పుస్తకాలు రాశాడు .జైన పురాణ కోశక అవార్డ్ ,శ్రుత సంవర్ధన అవార్డ్ పొందాడు .

596-పాలీ ప్రవేశిక కర్త –కోమల్ చంద్ర జైన్ (1935)

మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బినాలో 20-8-1935న జన్మించిన కోమల్ చంద్ర జైన్ సంస్కృత పిహెచ్ డి చేసి బెనారస్ హిందూ యూనివర్సిటిలో సంస్కృత ప్రొఫెసర్ చేశాడు .పాలీప్రవేశిక ,ప్రాకృత ప్రవేశిక ,రాశాడు .

597-క్షణ భంగుర జీవన కర్త –కృష్ణ జైన్ (1959)

గ్వాలియర్ అటానమస్ ప్రభుత్వ కాలేజిలో ప్రొఫెసర్ కృష్ణ జైన్ 1-7-1959న మధ్యప్రదేశ్ లో పుట్టాడు ,క్షణ భంగుర జీవన ,దశధర్మ గ్రంథాలు రాశాడు .

598-రత్న యోగ సార కర్త –మున్ని పుష్ప జైన్ (1928)

మున్ని పుష్ప జైన్ 22-6-1928న మధ్యప్రదేశ్ దామో లో పుట్టి ,జైన దర్శన ఆచార్య అయింది .రత్న యోగ సార ,పంచేంద్రియ సంవాద వంటి 5పుస్తకాలు రాసింది .

599-మూలాచార కర్త –మున్ని జైన్ (1957)

1957లో జూన్ 22న దామో లో పుట్టిన మున్ని జైన్ –జైన ఫౌండేషన్ డైరెక్టర్ .పండిట్ కైలాస చంద్ర జైన్ ,పండిట్ ఫూల్ చంద్ర సిద్ధాంత శాస్త్రి గురువులు .మూలాచార ,పంచేంద్రియ సంవాద సంయక్త్వ ప్రచ్చిసి ,రత్నయోగ సార రాసింది

600-ముక్తాహార కర్త –పన్నాలాల్ జైన్ (1911)

పన్నాలాల్ జైన్ సాహిత్య ఆచార్య ,శాస్త్రి .5-3-1911న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా పర్గువలో పుట్టాడు .సాగర్ లోని శ్రీ గణేష్ దిగంబర జైన సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ .గురుపరంపర –గణేష్ ప్రసాద్ వర్ని ,దయాచంద్ర సిద్ధాంత శాస్త్రి ,కైలాష్ చంద్ర ,హజారీలాల్ న్యాయ తీర్ధ ,కోక్ నాద శాస్త్రి ,కపిలేశ్వర్ ఝా . ప్రొఫెసర్ భగచంద్ర జైన్ ,ప్రొఫెసర్ భగ చంద్ర భాస్కర్ ,డా హరీంద్ర భూషణ్ జైన్ ,.వినయాంజలి అనే కావ్య సంగ్రహం ,ముక్తాహార ,సంయకత్వ చింతామణి ,సుజ్ఞాన చంద్రిక ,ధర్మ కుసుమోధ్యయనం మొదలైన 5గ్రంథాలు రాశాడు .రాష్ట్రపతి పురస్కార గ్రహీత .

601-ప్రారంభిక బౌద్ధ దర్శన్ కర్త –విజయకుమార్ జైన్ (1956)

1-7-1956 ఉత్తరప్రదేశ్ లో పుట్టిన విజయకుమార్ జైన్ లక్నో లోని  RSKS కాలేజి ప్రొఫెసర్ .పండిట్ కైలాష్ చంద్ర శాస్త్రి ,డా కేసి జైన్ ల శిష్యుడు .10పుస్తకాలు రాశాడు .పాలీ సద్దాతృ సంగ్రహ ,ప్రారంభిక బౌద్ధ దర్శన,సంస్కృత సూక్తి సముచ్చయ అందులో ముఖ్యమైనవి .యుపి సంస్కృత సంస్థాన్ అవార్డ్ ,సృత్సంవర్ధన్ అవార్డ్ ,దిగంబర్ జైన్ శాస్త్రి పరిషత్ పురస్కార పొందాడు .సృత్సంవర్ధిని పత్రిక సంపాదకుడు కూడా .

602-జ్ఞాననిది కర్త –యోగేష్ కుమార్ జైన్ (1978)

1978 జులై 4 మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బారాలో జన్మించిన యోగేష్ కుమార్ జైన్ జైన దర్శన ఆచార్యుడు .రాజస్థాన్ విశ్వభారతి యూని వర్సిటి లాడ్నం నాగౌర్ లో ప్రొఫెసర్ .జ్ఞాననిది పుస్తకం ఒక్కటే రాశాడు .

603-నీతిశత కకర్త –సునీతా జైస్వాల్ (1968)

ఉత్తర ప్రదేశ్ గోరఖ్ పూర్ లో 1968 ఫిబ్రవరి 8 న పుట్టిన సునీతా జైస్వాల్ డిఫిల్ చేసి ,యుపి లోని ప్రభుత్వ పిజి డిగ్రీకాలేజి సంస్కృత ప్రొఫెసర్ చేసింది .నీతిశతకం ,కుమార సంభవం ,ఈశా వాస్య ఉపనిషత్ వంటి 5పుస్తకాలు రాసింది .

604-సంస్కృత న్యాయ శాస్త్ర కర్త –జై కుమార్ జలాజ్ (1934)

యుపి లో లలితాపూర్ లో 2-10-1934న పుట్టిన జైకుమార్ జలాజ్ అలహాబాద్ యూని వర్సిటి ప్రొఫెసర్ .28గ్రందాల రచయిత.రాసిన వాటిలో సంస్కృత న్యాయశాస్త్ర ,ఏక పూర్వ విచార ,ఐతిహాసిక భాషా విజ్ఞాన ,మరికొన్ని హిందీ రచనలు ఉన్నాయి అఖిలభారత విశ్వనాధ అవార్డ్ ,భోజ పురస్కారంసాహిత్య సరస్వత్ సమ్మాన్  వంటి అవార్డ్ ల గ్రహీత .

605-లవారస కర్త –హర్ష దేవ మన్ సుఖలాల్ జైన్ (1954)-,

లవారస ,స్వప్నకావ్యం రాసిన హర్ష దేవ మన్ సుఖలాల్ జైన్ 20-10-1954న గుజరాత్ భావనగర్ లో పుట్టి ‘’మాధవ్’’ పేరుతొ పిలువబడ్డాడు .సాహిత్య శాస్త్రం లో నిపుణుడు .

606-నైషధ కావ్యస్య చందు పండిత కృత టీకా కర్త –జయదేవ్ అరుణోదయ్ జాని (1951)

జయదేవ్ అరుణోదయ్ జాని 5-2-1951న గుజరాత్ బరోడా లో పుట్టాడు . అరుణోదయ్ జాని,సురేంద్ర చంద్ర కుంతేవాలా,విద్యాభాస్కర ,మణి శంకర ఉపాధ్యాయ ల శిష్యుడు . నైషధ కావ్యస్య చందు పండిత కృత టీకా అనే ఒకేఒక పుస్తకం రాశాడు .

607-జైన ఆచార సంహిత కర్త –ఉత్తమ సింగ్ జాట్(1975)

ఉత్తమ సింగ్ జాట్15-7-1975న రాజస్తాన్ భరత్ పూర్ లో జన్మించాడు .సంస్కృత ఎం ఏ పిహెచ్ డి.గురుపరంపర –విజయ కుమార్ జైన్ ,ప్రొఫెసర్ ఆజాద్ మిశ్రా ,జేబీ షా .రాసిన 4పుస్తకాలలో జైన ఆచార సంహిత ,జైన ధర్మ దర్శన ,ముఖ్యమైనవి .

608-వాల్మీకి యుగీన భారతం కర్త –మంజులా జయస్వాల్ (1950)

మంజులా జయస్వాల్ 1950మే 6న అలహాబాద్ లో పుట్టి డిఫిల్ చేసింది అలహాబాద్ సంస్కృత యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .వాల్మీకి యుగీన భారత రాసింది .

609-ముహూర్త మార్తాండ కర్త –నేమి చంద్ర జయస్వాల్( 1922)

 సంస్కృత డిలిట్ నేమి చంద్ర జయస్వాల్ రాజస్తాన్ లో బాబర్ పూర్ జిల్లా ధౌల్ పూర్ లో16-9-1922 న  పుట్టాడు .ముహూర్త మార్తాండ ,భారతీయ జ్యోతిష ,సంస్కృత కావ్యాను చింతనం మొదలైనవి రాశాడు .

610-వాస్తు నిర్దోష ప్రకరణం కర్త –శ్వేత జెజూర్కర్ (1973)

సంస్కృత పిహెచ్ డి, సంగీతం లో ఎం ఏ .శ్వేత జెజూర్కర్1973 జూన్ 29న గుజరాత్ వడోదరజిల్లా నిజాంపూర లో జన్మించి ,మహారాజ్ శాయోజీ రావు యూనివర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ చేసింది .డా ఉమా దేశ పాండే శిష్యురాలు. 20పుస్తకాలు రాసింది .అందులో వాస్తు నిర్దోషక ప్రకరణం ,సిద్ధాంత కౌముది ,ముఖ్యమైనవి .

  సశేషం

మనవి –నేను రాసి సరసభారతి ప్రచురించిన గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ 3భాగాలలో 1090మంది సంస్కృత కవులను పరిచయం చేశాను .ఈ గీర్వాణం-4లో ఇప్పటికి 610 గీర్వాణ కవులను పరిచయం చేశాను .అంటే మొత్తం మీద ఇప్పటికి 1700 మంది సంస్కృత కవులను పరిచయం చేసే అదృష్టం దక్కింది .ఇంకా చాలామందే ఉన్నారు .వారినీ పరిచయం చెస్తాను .ఈ నాలుగవ భాగం లో చాలామంది 20వ శతాబ్దానికి చెందిన వారు ,మన సమకాలీనులు కూడా ఉండటం విశేషం .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.