గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4
611-హరిశ్చంద్ర ఉపాఖ్యానం కర్త –అద్యాచరణ ఝా (1921)
1-11-1921న బీహార్ లో మధుబని జిల్లా మంగ్రోనిలో పుట్టిన అద్యాచరణ ఝా సాహిత్య అలంకార వ్యాకరణ ఆచార్య .బీహార్ KSSV కు ప్రతి కులపతి .25పుస్తకాలు రాశాడు .అందులో మనోరమ శబ్దరత్న ప్రకాశిక ,సంస్కృత రచనా సంగ్రహ ,భారతీయ వాణీ మయేషు రామకథా వర్ణనం , హరిశ్చంద్రోపాఖ్యానం ఉన్నాయి .అనేకరచనలు రేడియో ద్వారాప్రసారాలయ్యాయి ,ప్రెసిడెంట్ అవార్డీ,సాంస్క్రిట్ రత్న సమ్మాన్ ,యుపి సంస్కృత అకాడెమి పురస్కారం పొందాడు .
612-ఆనంద మధు మందాకిని కర్త –ఆనంద్ ఝా (20వ శతాబ్ది )
వ్యాకరణ ఆచార్య , వేదాంత వాగీశ ఆనంద్ ఝా ఆనంద మధు మందాకినీ మాత్రమె రాశాడు .లక్నో యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .సకల దర్శన కానన్, సంచార పంచానన్ అనే బిరుదు .రాష్ట్రపతి పురస్కార గ్రహీత .
613- సంస్కృతోద్గార కర్త –అనిల్ కుమార్ ఝా (1964)
డిలిట్ అయిన అనిల్ కుమార్ ఝా 1964లో జనవరి 26న బీహార్ దర్భా౦గ లో పుట్టాడు .రాసిన 4పుస్తకాలలో సంస్కృతోద్గార ఒకటి .
614-గూడార్ధ తత్వాలోకనం కర్త –ధర్మ దత్త బచ్చా ఝా (1860-1918)
బీహార్ మధుబని జిల్లా మిథిలతాలూకా నివాని లో 1860లో ధర్మ దత్త బచ్చాయా పుట్టాడు సులోచనా మాధవ చంపూ ,గూడార్ధ తత్వాలోకనం(జగదీశుని సిద్ధాంత లక్షణం పై వ్యాఖ్యానం ) రాశాడు .1918లో 58ఏళ్ళకే చనిపోయాడు .న్యాయ శాస్త్రం లో ఎదురులేని వాడు .
615-ప్రమోద లహరి కర్త –బదరీ నాద్ ఝా (1893)
1893లో జనవరి 20న బదరీ నాద ఝా బీహార్ లో పుట్టాడు .న్యాయ ,నవ్య వ్యాకరణ ఆచార్య .జమ్మూ లోని RSKS లో సంస్కృత ప్రొఫెసర్ .7గ్రంథాల రచయిత.కర్ణభారం ,ఊరు భంగం ప్రతిజ్ఞా యౌగంద రాయణ౦ ,మేఘ దూతం వ్యుత్పత్తి వాదం లపై సంస్కృత వ్యాఖ్యానాలు రాశాడు .
616-పంచమి సాహిత్య విద్య కర్త –బటోహి ఝా (1951)
సాహిత్య ఆచార్య,శిక్షా శాస్త్రి అయిన బటోహి ఝా10-10-1951న బీహార్ దర్భంగ లోపుట్టాడు .లక్నో సంస్కృత సంస్థాన్ లో సాహిత్య ప్రొఫెసర్ .పంచమి సాహిత్యవిద్య ,భాగవత సహస్రనామ ,సప్తశతి సహస్రం ,గీతానాంత రసం రాశాడు
617-ఆషాఢరభ విరచిచితస్య కోవిదానందస్య సిద్ధాంత లఘు మంజూషస్య సమీక్షాత్మకం అధ్యయనం కర్త –భవేంద్ర ఝా (1949)
బీహార్ మధుబని జిల్లా లఖ్నోర్ లో భవేంద్ర ఝా3-1-1949న పుట్టాడు .వ్యాకరణ ఆచార్య .LBSసంస్కృత విద్యా పీఠ౦ లో ప్రొఫెసర్ .ఒకేఒక్క ఉద్గ్రంధం ఆషాఢరభ విరచిచితస్య కోవిదానందస్య సిద్ధాంత లఘు మంజూషస్య సమీక్షాత్మకం అధ్యయనం రచించాడు .
618-దిల్లీస్థః వి౦శ శతాబ్దయః రచనా కారః కర్త –చంద్ర భూషణ ఝా (1969)
8-7-1969 న బీహార్ దర్భంగా లో పుట్టిన చంద్ర భూషణ ఝా ఎంఫిల్ పిహెచ్ డిచేసి ,ఢిల్లీ యూని వర్సిటి షెఫెర్డ్ కాలేజి సంస్కృత ఆచార్యుడుగా చేశాడు .మహర్షి బాదరాయణ సమ్మాన్ ,గ్రహీత . దిల్లీస్థః వి౦శ శతాబ్దయః రచనా కారః రాశాడు .
619-వాజపేయి శతక కర్త –నారాయణ దేవ్ ఝా (1952)
సాహిత్య ,వ్యాకరణ ఆచార్య నారాయణ దేవ్ ఝా 12-01-1952 న బీహార్ సీతామండిలో పుట్టాడు ,దర్భంగా సంస్కృత కళాశాల సంస్కృత ప్రొఫెసర్ .ఈయన గురుపరంపరలో పట్టాభి రామ శాస్త్రి, ప్రొఫెసర్ ద్విజెంద్రనాద్ మిశ్రా ,బటుకనాద శాస్త్రి ఉన్నారు .సంస్కృతం లో వాజపేయి శతకం ఒక్కటే రాశాడు .
620-బృహత్ పరాశర హోర కర్త –దేవానంద ఝా (1921)
దేవానంద ఝా 1921లో అక్టోబర్ 15న బీహార్ నాగవాస లో పుట్టాడు .జ్యోతిష ,సాహిత్య ఆచార్య .దీనాలాల్ చౌదరి,ముకుంద శాస్త్రి ల శిష్యుడు . బృహత్ పరాశర హోర ఒక్కటి మాత్రమె రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-3-21-ఉయ్యూరు