గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4
631-తత్వ ప్రకాశిక టీకా కర్త –కృష్ణ మాధవ ఝా (1898-1996)
1898లో బీహార్ లో జన్మించి 98 ఏళ్ళ సార్ధక జీవితాన్ని గడిపి 1996లో చనిపోయిన కృష్ణమాధవ ఝా పరమ లఘు మంజూష కు తత్వ ప్రకాశిక టీకా అనే ఒకే ఒక గ్రంథం రాశాడు
632-సిద్ధాంత లక్షణ బోధిని కర్త –కృష్ణ మాధవ ఝా (1899-1985)
బీహార్ మధుబని జిల్లా సరిసాబ్ పాహి తాలూకా బిట్టో గ్రామ౦ లో కృష్ణమాధవ ఝా 1899లో జన్మించి 1985లో మరణించాడు .సిద్ధాంత లక్షణ బోధిని అనే ఏకైక గ్రంథం రాశాడు .
633-కాత్యాయన శ్రౌత సూత్ర కర్త –లక్ష్మీశ్వర్ ఝా (1948)
శుక్ల యుజుర్వేద ఆచార్యుడు లక్ష్మీశ్వర ఝా బీహార్ సహస్రా జిల్లా బాఘ్వాలో 5-6-1948 న పుట్టి ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి కేంద్రీయ సంస్కృత విద్యా పీఠ లో ప్రొఫెసర్ చేశాడు మూడు గ్రంధథాలు రాశాడు. అందులో కాత్యాయన శ్రౌత సూత్ర, వేదాంత సిద్ధాంత ముక్తావళి ,వైదికవాజ్మయ ఇతిహాస ,గౌడపాద కారికా కా సమీక్షాత్మక్ అధ్యయన ఉన్నాయి .గురువులు శీలకా౦త ఝా ,శివదాస మిశ్రా .
634-జాతి బాధక పరిష్కార కర్త –లోక నాథ ఝా (20వ శతాబ్ది )
బీహార్ లో పుట్టిన లోకనాథ ఝా మహామహోపాధ్యాయ .ఉభయ భావ దివాకర పరిష్కార ,జాతి బాధాక పరిష్కార రాశాడు .
635-రసగంగాధర వ్యాఖ్య కర్త –మదన మోహన ఝా (1922)
జగన్నాథ పండిత రాయలు రాసిన రస గంగాధర అలంకార శాస్త్రానికి సంస్కృతం హిందీలో వ్యాఖ్యానం రాసిన మదనమోహన ఝా 1922లో డిసెంబర్ 2 న మధుబనిలోని నవనిలో పుట్టాడు .సాంప్రదాయ విద్య నేర్చాడు .పాట్నాప్రభుత్వ సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్.యదుపతి మిశ్రా, ఈశ్వర నాథ ఝా ల శిష్యుడు .వ్యాకరణ సాహిత్య శాస్త్రాలలో నిష్ణాతుడు .
636-వైదిక దర్శన విమర్శ కర్త –మోహానంద ఝా (1972)
15-8-1972 న బీహార్ సమస్తిపూర్ లో పుట్టిన మోహానంద ఝా సంస్కృత పిహెడి.రాసిన 4 గ్రంథాలలో వైదిక దర్శన విమర్శ,తర్క సంగ్రహ సర్వస్వం ,న్యాయ సిద్ధాంత ముక్తావళి ఉన్నాయి .
637-సపర్యాస్టకం కర్త –మహేష్ ఝా (1946)
నవ్యన్యాయ ఆచార్య మహేష్ ఝా 4-2-1946న మధుబనిలో పుట్టాడు .గురుపరంపర –పండిట్ మురళీధర్ ఝా ,బెచేన్ ఝా ,డా.అయోధ్యాప్రసాద్ సిన్హా .చండికా శతకం ,ఆర్యాశతకం ,సపర్యాష్టకం రాశాడు
638-భూ పరిక్రమణ౦ కర్త –మునీశ్వర్ ఝా (1928)
1928 నవంబర్ నాలుగున బీహార్ కరామౌలి లో పుట్టిన మునీశ్వర్ ఝా సంస్కృత ,హిందీ డిలిట్.12పుస్తకాలు రాశాడు.అందులో భూ పరిక్రమణ౦, వేదం వాగ్వివృత్తి,ఉన్నాయి ప్రెసిడెంట్ అవార్డీ.
639- విద్యాపతి వాజ్మయ కర్త -మునీశ్వర్ ఝా (1928)
1928నవంబర్ 4న మధుబని లో పుట్టిన మునీశ్వర్ ఝా సాహిత్య ఆచార్య ,మహామహోపాధ్యాయ, విద్యా వాచస్పతి .వైస్ చాన్సలర్ .రాసిన 10పుస్తకాలలో విద్యాపతి వాజ్మయ ,కావ్య ఔర్ భాషా వున్నాయి .ఫ్రాన్స్ జర్మని ట్రినిడాడ్ వెస్ట్ ఇండీస్ సందర్శనచేశాడు .
640-సంస్కార దశ కర్మ పధ్ధతి టీకా కర్త-పరమేశ్వర్ ఝా (1853-1924)
పరమేశ్వర్ ఝా 1853లో దర్భంగా జిల్లా తరువని లోపుట్టి ,వ్యాకరణ ధర్మశాస్త్ర మీమాంస సాంఖ్య వేదాంత ఆచార్య .దర్భాన్గాలోని రామేశ్వర లతా సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేశాడు .ఈయన గురు పరంపర లో చిరంజీవి మిశ్రా ,పండిట్ రాజారాం శాస్త్రి ,పండిట్ బాల శాస్త్రి ,పండిట్ తారా చరణ్ భట్టాచార్య ,పండిట్ విశ్వనాథ ఝా ఉన్నారు .ప్రత్యెక శిక్షణ పండిట్ మార్కండేయ మిశ్రా ,పండిట్ త్రిలోక నాథ ,శివానంద ఠాకూర్ ల వద్ద పొందాడు .రాసిన 13గ్రంథాలలో సంస్కార దశ కర్మ పధ్ధతి టీకా ,ఛాందోగ్య వృషోత్సర్గ ,సదాచార దర్పణ ,పరమేశ్వర కోశ ,మిధిలేశ ప్రశస్తి ఉన్నాయి .1924లో 71వ ఏట మరణించాడు .భారత ప్రభుత్వం మహామహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరించింది .వైయాకరణ కేసరి ను భారతార్ధం మహా మండల ప్రదానం చేసింది .
641-ఋతు దర్శన కర్త –పరమేశ్వర ఝా (1856)
1856లో బీహార్ తర్రోనిలో పుట్టిన పరమేశ్వర ఝా 30ఉద్గ్రంథాలు రాసిన సంఖ్య ధర్మ శాస్త్ర వేదాంత వ్యాకరణ ఆచార్య .మిదిలాతత్వ విమర్శ ,రుతుదర్శనం ,యక్ష సమాగమ ,పరమేశ్వర కోశ నిఘంటు ,మొదలైనవి రాశాడు .వైయ్యాకరణ కేసరి బిరుదాంకితుడు .
642-నేపాల సామ్రాజ్యోదయం కర్త –పశుపతి ఝా (1930)
27-4-1930 న పశుపతి ఝా నేపాల్ లో సాధు లో పుట్టాడు .నవ్య వ్యాకరణ ,సాహిత్య ఆచార్య .ప్రొఫెసర్ .గురుపరంపరలో బాలబోధ మిశ్రా ,జీవననాద్ ఝా ఉన్నారు .నేపాల సామ్రాజ్యోదయం రాశాడు .
643-గ్రహార్ఖ దర్శన కర్త –ప్రేమ కాంత్ ఝా (1957)
1957జులై 1న మధుబనిలో ప్రేమ కాంత్ ఝా పుట్టి ,INM సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ చేశాడు గ్రహార్ఖ దర్శన అనే ఏకైక రచన చేశాడు .
644-యోగ రత్నాకర కర్త – రాం కిషోర్ ఝా(1959)
బీహార్ ముఝపర పూర్ లో 5-11-1959న పుట్టిన రాం కిషోర్ ఝా పిహెచ్ డి .రాసిన 4పుస్తకాలలో యోగ రత్నాకర ,విఖ్యాత వ్యాజ్యం ,చండికా చరిత చంద్రిక ఉన్నాయి .
645-లఘు కౌముది వ్యాఖ్య కర్త –రామ చంద్ర ఝా (1951)
సంస్కృత హిందీలలో 21పుస్తకాలురాసిన రామచంద్ర ఝా 1951న జనవరి 19న దర్భా౦గా లో పుట్టి , గణిత, ఫలిత జోశ్య ,ధర్మ శాస్త్ర ఆచార్య .KSDసంస్కృత విశ్వవిద్యాలయ జ్యోతిష్ హెడ్ .సిద్ధాంత కౌముది లఘు కౌముది మధ్య కౌముది లకు సంస్కృత హిందీ వ్యాఖ్యానాలు రాశాడు
646-శివ తత్వ విమర్శ కర్త –రామేశ్వర్ ఝా (1905-1981)
1905లో సమస్తిపూర్ జిల్లా పాటసగ్రాం లో పుట్టిన రామేశ్వర్ ఝా 76 వ ఏట 12-12-1981న మరణించాడు .ఈయన గురువులు రామదత్త మిశ్రా ,రాదా కాంత్ ఝా సదానంద ఝాఉగ్రానంద ఝా , ,పండిట్ బాలకృష్ణ .పురాణతా ప్రత్యభిజ్ఞా,శివ తత్వ విమర్శ రాశాడు .మహామహోపాధ్యాయ బిరుదు ,ప్రెసిడెంట్ సర్టి ఫికేట్ పొందాడు .
647-ముగ్ధా శతకకర్త –రాం కిషోర్ విభాకర్ ఝా (20వ శతాబ్ది )
ముగ్ధాశతకం ,విభాకర వైభవం రాసిన రాం కిషోర్ విభాకర్ ఝా 20వ శతాబ్ది కవి .బీహార్ దర్భా౦గ లో పుట్టాడు .సంస్కృత హిందీ మైధిలి భాషలలో ఎం ఏ .పిహెచ్ డి.దేవఘర్ మహావిద్యాలయ సంస్కృత ప్రొఫెసర్ .
648-మాలవీయ ప్రశస్తి కర్త –రతి నాథఝా (1922)
1922లో బస్ట్ లో పుట్టిన రతి నాథ ఝా వారణాసి లో సంస్కృత ప్రొఫెసర్.మహావీరాభ్యుదయం గాంధీ శతకం ,మాలవీయ ప్రశస్తి ,అరవింద శతకం ,మహావీరాభ్యుదయ మహాకావ్యం ,వాణీ విలాసం రాశాడు .
649-ఉషతి గోమతి కర్త –సర్వ నారాయణ ఝా (1962)
గణిత ,ఫలిత జోశ్య ఆచార్య సర్వనారాయణ ఝా డిలిట్ 5-6-1962న బీహార్ సహరసా లో పుట్టాడు .లక్నో ssలో సంస్కృత ప్రొఫెసర్ .మేఘమాల ,వైష్ణవి ,ఉషతి గోమతి రాశాడు .
650-సురత చరిత మహాకావ్యపరిశీలన కర్త –సతీష్ చంద్ర ఝా (1947)
10-5-1947 మధుబని చమపూర లో పుట్టిన సతీష్ చంద్ర ఝా డిలిట్.BRA బీహార్ యూనివర్సిటి సంస్కృత ప్రొఫసర్, హెడ్ .సురత చరిత మహాకావ్యపరిశీలనం ,కాత్యాయన వార్తికానాం ,భాషా శాస్త్రీయ అధ్యయనం రాశాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -12-3-21-ఉయ్యూరు