విశిష్ట యోగ వాసిష్టం” ప్రత్యక్షప్రసారం
సాహితీ బంధువులకు శుభ కామనలు .ఎల్లుండి మార్చి 23 మంగళవారం 64వచివరి భాగంతో సరసభారతి ఫేస్ బుక్ ద్వారా అందిస్తున్న శ్రీ శంకర విజయం ప్రత్యక్ష ప్రసారం పూర్తవుతుంది .పూర్వం ప్రకటించినట్లు వెంటనే నారదుడు వగైరా ప్రసారం చేయటం వాయిదా వేశాం .
కానీ , మార్చి 24 ఫాల్గుణ శుద్ధ ఏకాదశి బుధవారం ఉదయం 10గం. నుంచి వాల్మీకి మహర్షి రచించిన అద్భుత ఆధ్యాత్మిక బృహద్గ్రంథ౦ 32వేల శ్లోకాల” యోగ వాసిస్టం” ను సంక్షిప్త పరచి ”విశిష్ట యోగ వాసిస్టం”గా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది .మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-3-21-ఉయ్యూరు