చిన్నప్పటి నుండి సమస్య లకు ఎదురువెళ్ళే తత్వం.
ఒంటరిగా పోరాడే మనస్తత్వం.
తను దూరంగా పిల్లలు అందరికీ దగ్గరగా పెంచిన విశిష్ట లక్షణం.
ఫోన్ లోనే ఆరోగ్య పరిష్కారం.
హస్తవాసి తో గ్రామ గ్రామాన ధన్వంతరి గా వచ్చిన పేరు.
ఏమి ఆశించకుండా వైద్యం.
23 జిల్లాల లో ఆర్ఎంపీ సంఘం కి చేసిన సేవలు.
రాజకీయ నేతల కు సైతం మనసుకు దగ్గరగా పని చేసే చతురత.
అందరి పిల్లలని ఒకే విధంగా చూసే నైజం.
తల్లిదండ్రుల ఆరోగ్యం కంటికి రెప్పలాగ కాపాడిన వైనం.
తన గమ్యానికి పథక రచన ధైర్యం. ….
ఒక్కటేమిటి ఎన్నో. ఎన్నో..
చివరకు ‘ మంచి ‘ అంతా ‘నీళ్ళ ‘ లాగా మారి పోయి ఎందరికో. దాహం తీర్చి. .
కానీ. ఒక్కటే అప్పుడు ఫోటోలలో లేడు ఇక ఇప్పుడు కనబదడు.
–నీ అన్నలు ..అక్కలు. తమ్ములు. చెల్లెళ్ళు
నివాళి
సీసపద్యము.
~~హస్త నాడిని జూచి వస్తు తత్త్వమునెంచి – ఔషధం బిచ్చెడు హస్తవాసి
~~మనిషి బాధల జూచి మనసు తో మాట్లాడి- బాధల నుడి పెడు బాంధవుండు
~~ ఎట్టి కష్టమునైన నిట్టె యధిగమించు- స్థిర చిత్తమతియౌ ధీయుతుండు
~~ తనను వెనుక నుంచి ,తన సేవ ముందుంచి -కన్గోని సాయంపు కరము నిచ్చు
తే.గీ.~తల్లిదండ్రుల సేవలో తనియు నెపుడు
~ ద్వేష మెఱుగని రాగమ్ము విరియ జేసి
~త్రిదివ మేగిన గోపాల కృష్ణమూర్తి!
~బంధుజన నివాళి యిదిగొ అందుమయ్య!
~శివుని సాయుజ్యమందున చేరి నీవు!
శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు -విజయవాడ —