గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

671-నీతిమాల కర్త –విశ్వేశ్వర ఝా (1935)

వ్యాకరణ ఆచార్య విశ్వేశ్వర ఝా 1-2-1935న మధుబనిలో పుట్టి ,అక్కడి సంస్కృత మహా విద్యాలయం లో ప్రొఫెసర్ చేసి రిటైర్ అయ్యాడు .గురుపరంపర –పండిట్ దీనబంధు ఝా ,శ్రీ మధుసూదన మిశ్ర .ప్రత్యేక శిక్షణ   డా ఉమారమణ ఝా ,డా.విశ్వనాథ ఝాల వద్ద పొందాడు .నీతిమాల ,సుకనాశోపదేశం ,సంస్కార వివేచన ,స్వప్న వాసవ దత్తం రాశాడు .

672-సత్యబోధ విజయ కర్త –విఠలాచార్య శేషాచార్య సూను ఝుజర్వేద్(1931)

8-4-1931న కర్నాటక బిజాపూర్ లో బాగల్పేట్ లో పుట్టిన విఠలాచార్య శేషాచార్య సూను ఝుజర్వేద్ ప్రభుత్వ సంస్కృత విద్యాశాఖలో ఇన్స్పెక్టర్ .కేశవాచార్య శిష్యుడు .సత్యబోధ విజయం మాత్రమె రాశాడు .

673-అష్టాధ్యాయి భాష్య కర్త –బ్రహ్మదత్ జిజ్ఞాసు (1892-1972)

1892లో జలంధర్ లో పుట్టిన బ్రహ్మదత్ జిజ్ఞాసు -స్వామి పూర్ణానంద సరస్వతి ,దేవనారాయణ తివారి ,మ. మ.పండిట్ చిన్నస్వామి ల శిష్యుడు .అష్టాధ్యాయి భాష్యం ఒక్కటే రాశాడు .21-2-1964న 72వ ఏట చనిపోయాడు  .కాశీలో మోతీ జీల్ లో పాణిని కాలేజ్ స్థాపించాడు .రాష్ట్రపతి పురస్కార గ్రహీత .

674-జైనతత్వ వివేక కర్త –న్యాయ తీర్ధ జీవన్ ధార్(1974 న మరణం )

1974లో మరణించిన న్యాయతీర్ధ జీవన్ దార్ జైనతత్వ వివేకం మాత్రమె రాశాడు

675- ఆనంద మీమాంస కర్త -తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి(1901 )

ఆనంద మీమాంస ,జ్యోతి నిబంధ ,శుద్ధి సర్వస్వం ,మొదలైన 11పుస్తకాలు రాసిన తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి 27-1-1901న మహారాష్ట్ర లో పిమ్పల్నేర్ లో పుట్టాడు .గురుపరంపర –కె.రాజేశ్వర శాస్త్రి ద్రావిడ్ ,వామాచరణ్ భట్టాచార్య ,తర్కతీర్ధ సంస్కృత పండిట్ బిరుదాంకితుడు .1976లో పద్మభూషణ్ పొందాడు .ధర్మకోశ పత్రిక సంపాదకుడు .స్వాతంత్ర్య సమర యోధుడుకూడా .

676-బాలచంద్ర శాస్త్రి జోషి (1916)

నవ్యన్యాయ ,వేదాంత, మీమాంస ,వ్యాకరణ జ్యోతిష ,అలంకార ధర్మ శాస్త్ర ఆచార్యుడైన బాలచంద్ర శాస్త్రి జ్యోషి 15-6-1919న కర్ణాటకలో పుట్టి విలువైన 4 సంస్కృత గ్రంథాలు రాశాడు .ధార్వాడ జగద్గురు శంకరాచార్య సంస్కృత పాఠశాల ప్రిన్సిపాల్ .సాంప్రదాయ విద్యావిధానం లో విద్యనేర్చి ,నేర్పాడు .అనేకమంది పీఠాదిపతులు అనేక బిరుదులతో సత్కరించి సన్మానించారు .చాలామంది పీఠాదిపతులు ఈయన శిష్యులే .ప్రెసిడెంట్ అవార్డీ.

677-కర్ణభారం కర్త –హరేశ్ అరుణ్ భాయ్ జోషి (1963)

15-12-1963న గుజరాత్ లోని పోర్ బందర్ లో పుట్టిన హరేశ్ అరుణ్ భాయ్ జోషి వేదాంతం లో ఎం ఏ .నీతిశతకం ,కర్ణ భారం ,స్వప్న వాసవ దత్తం ,సంస్కృత సాహిత్య ఇతిహాసం ,వేదాంత దర్శనం అనే 5పుస్తకాలు రాశాడు .

678-ఉదయనాచార్య కృత న్యాయ కుసుమాంజలి కర్త –హేమ చంద్ర జోషి (1925)

1925జులై 31న యుపి అలహాబాద్ లో పుట్టిన హేమచంద్ర జోషి సాహిత్య, న్యాయ, మీమాంస ఆచార్య .గోరఖ్ పూర్ సంస్కృత విశ్వవిద్యాలయప్రొఫేసర్ .ఉదయనాచార్య కృత న్యాయ కుసుమాంజలి మాత్రమే రాశాడు .లక్నోలోని అఖిలభారత సంస్కృత పరిషత్ స్థాపకుడు .ప్రెసిడెంట్ అవార్డీ.

679-శ్రీ శని మహాత్మ్యం కర్త –జాజిరాం పురుషోత్తం జోషి (1924)

కావ్యతీర్ధ జాజిరాం పురుషోత్తం జోషి 9-4-1924 న మహారాష్ట్ర లో రైన్ మాడ్ లోని రోహాలో పుట్టాడు .సాహిత్య శిక్షా శాస్త్రికూడా .గడగిల శంకర శాస్త్రి ,శ్రీధర్ శాస్త్రి ,హరిహర్ ఝా ల శిష్యుడు .శ్రీ శని మహాత్మ్యం కావ్యం  తోపాటు  .ప్రాకృత కావ్యానువాదం రాశాడు .

680-భారతీయ సంస్కృతి కర్త –కేదార్ నారాయణ్ జోషి (1948)

సాహిత్యాచార్య ,వ్యాకరణ తీర్ధ కేదార్ నారాయణ్ జోషి 3-4-1948న మధ్యప్రదేశ్ లో కాన్నౌడ్ లోని  దేవాస్ లో పుట్టాడు .ఉజ్జైన్ విక్రం యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .గురుపరంపర –డా రేవా ప్రసాద్ ద్వివేది ,డా.రమ్ని హాల్ శర్మ ,డా లక్ష్మణ్ నారాయణ్ శుక్ల .ప్రత్యెక శిక్షణ డా రమేష్ చంద్ర శర్మ ,డా.రామధర్ మాలవ్యాల వద్ద పొందాడు. భారతీయ సంస్కృతీ,సంస్కృత కావ్యేషు వైదిక చిన్తనస్య ప్రభావః ,శ్రీపాద శాస్త్రి హసూరకార వ్యక్తీ ఏవం అభి వ్యక్తీ ,సంస్కృత కావ్యశాస్త్ర ఔర్ నిరాలా రాశాడు .ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్ అవార్డ్ ,బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాఅవార్డ్ ,వాగర్ధ సమ్మాన్, సమాజ్ రత్న సమ్మాన్ పొందిన మహా పండితుడు .

681-మరీచి భాష్యం కర్త –కేదార్ దత్ జోషి (1910)

1910లో అల్మోడా లో పుట్టిన కేదార్ దత్ జోషి ,కాశీ  సంస్కృతకాలేజి లెక్చరర్ .హరిదత్త జోషి ,పండిట్ బలదేవ్ పాఠక్  ల శిష్యుడు .గ్రహ గణితాధ్యాయః ,వాసనాభాష్య౦ ,మరీచి భాష్యం ,గ్రహలాఘవం ,ముహూర్త చింతామణి రాశాడు .

682- రహస్యమయి నాటకం కర్త –కేశవ రాం రావ్ జోషి (1928)

7-4-1928న మధ్యప్రదేశ్ చింద్వాడ జిల్లా రంగరి లో పుట్టిన కేశవ రాం రావ్ జోషి సాహిత్యాచార్య .అమ్బాదాస శాస్త్రి పాండేయ,శంకర శాస్త్రి ,పండిట్ హరి రాం శుక్లాల శిష్యుడు నీల కంఠ విజయ కావ్య౦ ,రహస్యమయి నాటకం రాశాడు .

683-ప్రాధమిక పాణినీయ వ్యాకరణ కర్త –మాధవ్ గణేష్ జోషి (1918)

ప్రాధమిక పాణినీయ వ్యాకరణం ను సంస్కృత ,ఇంగ్లిష్ ,కన్నడ ,మరాటీ భాషలలో రాసిన మాధవ్ గణేష్ జోషి 1918లో పుట్టాడు .కర్నాటక బెల్గాం లోని విద్యామందిర్ లో సంస్కృత టీచర్ .

684-వేదాంత నివేదనం కర్త –మహావీర్ ప్రసాద్ జోషి (1914-2002)

1914లో ఝుంఝును జిల్లా దండ్ లోడ్ లో పుట్టిన మహావీర్ ప్రసాద్ జోషి ఆయుర్వేద సాహిత్య ఆచార్య .రాజ్ ఘర్ సాహిత్య సమితి చైర్మన్ .భవానీదేవి హాస్పిటల్ సెక్రెటరి .రాసిన 22పుస్తకాలలో ప్రతాప చరితం ,ప్రార్ధనా పుష్పాంజలి ,వేదాంత నివేదనం ,పంచతంత్రం, రుద్రాసాధ్యాయి ,ఉన్నాయి 2002లో 88వ ఏట మరణించాడు .సంస్కృత రత్నాకర భారతి మాసపత్రికలలో ఎన్నో విలువైన వ్యాసాలూ రాశాడు .

685-మహారాష్ట్ర పండిత వైదికజ్ఞానం కర్త –మోరేశ్వర్ త్రయంబక శాస్త్రి జోషి (1924)

మోరేశ్వర్ త్రయంబక శాస్త్రి జోషి 1924లో మహారాష్ట్ర లో ఎలం బహాట్ లో పుట్టాడు .కావ్యరత్న ,స్మృతి తీర్ధ ,ధర్మ శాస్త్ర .వినాయక్ శాస్త్రి తిల్లు,అచ్యుత్ శాస్త్రి పద్వేల శిష్యుడు . మహారాష్ట్ర పండిత వైదికజ్ఞానం అనే ఒకే ఒక పుస్తకం రాశాడు .

686-కారక మీమాంస కర్త –మోతీలాల్ జోషి (1935)

దర్శన సాహిత్య వ్యాకరణ కావ్యతీర్ధ ఆచార్య మోతీలాల్ జోషి 1935లో రాజస్థాన్ జైపూర్ లోని సహారాపుర జిల్లా బడీ జోడి లో పుట్టాడు .జైపూర్ మహారాజ సంస్కృత కాలేజ్ ప్రిన్సిపాల్.ప్రభుత్వ సంస్కృత డిపార్ట్ మెంట్ డైరెక్టర్ .సిండికేట్ మెంబర్ .కారకమీమాంస ,ప్రబోధ చంద్రోదయ విమర్శ రాశాడు .జైపూర్ శాహిపురా బాగ్ లో టీచర్ ట్రెయినింగ్ కాలేజి స్థాపించాడు .

687-అధ్యాపక శిక్ష కర్త –ఆర్.ప్రహ్లాద జోషి (1971)

సైకాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ .శిక్షా ఆచార్య ,విద్యా వారిది .23-6-1971లో గుల్బర్గా లో పుట్టాడు .తిరుపతి రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ప్రొఫెసర్ .అధ్యాపక శిక్షమాత్రమే రాశాడు .

688-కరుణా కటాక్ష లహరి కర్త –రసిక్ బిహారీ జోషి (1929)

రాజస్థాన్ బైవార్ లో 1929లో పుట్టిన రసిక్ బిహారీ జోషి రాసిన 5పుస్తకాలలో మోహ భంగ ,కరుణా కటాక్ష లహరి ,సారస్వతం ,ప్రజ్ఞాపారిజాతం ,శ్రీ గోవర్ధన గౌరవం ఉన్నాయి .

689-రాధా సహస్ర నామ కర్త –రసిక్ విహారీ జోషి(20వ శతాబ్ది )

పుట్టిన తేదీ తెలీదుకాని హిందీ ఆనర్స్ ,శాస్త్రి ,డిలిట్.ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ ,ఇన్వేస్టి గేటర్,el కోలీజియో డి మెక్సికో .35పుస్తకాలు రాశాడు అందులో రాధా సహస్రనామం ,లక్ష్మీ నృసింహ సహస్రనామస్తోత్రం , ,ది యూని వర్సల్ ట్రూత్ ,ఫ్రెంచ్ గ్రామర్ లిటరేచర్ ,యోగ అండ్ మెడిటేషన్ . సంస్కృతకవి .,యుపి సంస్కృత అకాడెమి ,గౌరవ డాక్టరేట్, వెనిజుల అవార్డ్ ,దాల్మియా అవార్డ్ ,సాహిత్య అకాడెమి ,ఢిల్లీ సంస్కృత అకాడెమీ అవార్డ్ తోపాటు ప్రెసిడెంట్ అవార్డీ.హరిత రుషి అవార్డ్ పొందాడు .వార్సా ,బుడాపెస్ట్ ,జెకోస్లోవేకియా ,కంబోడియా ,కొలంబో,మెక్సికో  యూనివర్సిటీ లకు విజిటింగ్ ప్రొఫెసర్ .

690-చిచంద్రిక వ్యాఖ్యాన  కర్త –గోపాలాచార్య కహద్క ర్  (20వ శతాబ్ది )

మహారాష్ట్ర లో పుట్టి ,నీల కంఠ శాస్త్రి శిష్యుడైన గోపాలాచార్య కహద్కర్ ఒకే ఒక్క పుస్తకం సంస్కృతం లో రాశాడు . దుశక్ర దోద్ధాదిని రాసిన చిచంద్రికపై అనేక వ్యాసాలూ రాశాడు ‘

691-అపరాజిత మహాకావ్య కర్త –పూర్ణ చంద్ర శాస్త్రి కలవాటియా(1928)

10-10-1928 న ఒరిస్సాలో పుట్టిన పూర్ణ చంద్ర శాస్త్రి కలవాటియా ఆయుర్వేద ఆచార్య సాహిత్య రత్న .డాక్టర్. అపరాజిత మహాకావ్య౦ ఒక్కటే రాశాడు .

692-తంత్ర అధికారి నిర్ణయ కర్త –అశోక్ కుమార్ కాలియా (1944)

20-4-1944న యుపి బహ్రేచి లో పుట్టిన అశోక్ కుమార్ కాలియా లక్నో యూనివర్సిటి సంస్కృత రిటైర్డ్ ప్రొఫెసర్ .గురుపరంపర –శ్రీమద్ అభీన రంగనాథ్ శిష్యుడు .రాసిన 7పుస్తకాలలో తంత్ర అధికార నిర్ణయం ,లక్ష్మీ తంత్ర ,పంచారాత్ర పరిశీలన ,పురుషోత్తమ సంహిత ఉన్నాయి .అజస్ర సంస్కృత క్వార్టర్లి ఎడిటర్ .2009లో ప్రెసిడెంట్ అవార్డీ.

693-కోసూర శివమాత కర్త –బద్రినాథ్ కల్లా (1931)

3-3-1931 కాశ్మీర్ శ్రీనగర్ లో పుట్టిన బద్రినాథ్ కల్లా –శాస్త్రి .కాశ్మీర్ యూని వర్సిటి లో సంస్కృత డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ .సెంటర్ ఫర్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ లో ప్రొఫెసర్ .కోసూర శివమాత ,విటస్థ మహాత్మ్యం ,మానసాదర పాన అనే హిందీ పుస్తకం రాశాడు .రాష్ట్రీయ భాషా ప్రచార సమితి అవార్డ్ పొందాడు .

694-శ్లోకత్రయ వివరణ కర్త –వరగూర్ రామనాథ శాస్త్రి కళ్యాణ సుందర్ (1911)

సాహిత్య ,వేదాంత శిరోమణి వరగూర్ రామనాథ శాస్త్రి కళ్యాణ సుందర్,,తమిళనాడు తంజావూర్ లో పుట్టాడు .గురుపరంపర – మహా మహోపాధ్యాయ  యజ్ఞస్వామి ,కే.కృష్ణ శాస్త్రి ,వి వైద్యనాధ శాస్త్రి ల శిష్యుడు .వృత్తి మీమాంస ,శ్లోకత్రయ వివరణం రాశాడు ,సుందర రామాయణం ,సతీ విలాసం  వేంకటేశ శతకం ,భగ వనుధ్యాన చంపుకావ్యం ,విచార సారంగధర ,పతంజల మహాభాష్య౦,నీతి ప్రకాశిక ,హరిహరాద్వైత భూషణం పాణిని సూత్ర వ్యాఖ్య,కల్పతరు వ్యాఖ్య ,న్యాయ సిద్ధాంతామృతం  లను తన సంపాదకత్వం లో ముద్రించాడు .

695-వ్యాస సూక్త కర్త –కె.కమల్ (1938)

తెలంగాణా మహబూబ్ నగర్ లో 3-6-1938న పుట్టిన కె.కమల్ హైదరాబాద్ నిజాం కాలేజి సంస్కృత ప్రొఫెసర్ .తెలుగులో కాదంబరి కావ్య సుషమ,శాంతిపర్వ సూక్తులు ,సంస్కృతం లో వ్యాస సూక్తం రచనలు .

696-సంస్కార సాహిత్య ఐతిహాసిక కర్త –కమల్ రత్నం (1914)

1914అలహాబాద్ లో పుట్టిన కమల్ రత్నం ఢిల్లీ లోని రంజాస్ స్కూల్ ప్రిన్సిపాల్..గయా ప్రసాద్  దీక్షిత్ , కె.ఎ. సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యుడు .సంస్కృత సాహిత్యేతిహాసిక –సంస్కృత పరిప్రేయే-కాళిదాస ,కాళిదాస జన్మ భూమి ,అన్వేషణ రాశాడు

697-ఉత్కీర్ణ లేఖా స్తబక వ్యాఖ్య సహిత కర్త –జియాలాల్ కంబోజ (1932)

హర్యానా కర్నాల్ లో 12-2-1932న పుట్టిన జియలాల్ కంబోజ  న్యు ఢిల్లీ హిందూ కాలేజి ప్రొఫెసర్ . ఉత్కీర్ణ లేఖా స్తబక వ్యాఖ్యసహిత అనే ఒకే పుస్తకం రాశాడు .

698-వాగ్భటకృత అష్టాంగహృదయస్య సాంస్కృతిక మధ్యయనం కర్త –వసంత కృష్ణ రావు కన్హే (1939)

1939 డిసెంబర్ 3న రాయపూర్ లో పుట్టిన వసంత కృష్ణ రావు కన్హే సాహిత్యాచార్య .సరస్వతి ప్రసాద్ చతుర్వేది ,డా హస్రూర్కర్ ,డా ఆర్ యెన్ శర్మ ,డా.రేవా ప్రసాద్ ద్వివేది ,పండిట్ రామానందన్ ఓఝా ,పండిట్ రాజేంద్ర చౌదరి ,కరపత్ర స్వామిల శిష్యుడు. వాగ్భటకృత అష్టాంగహృదయస్య సాంస్కృతిక మధ్యయనం మాత్రమె రాశాడు .

699-12పుస్తకాలు రాసిన దిలీప్ కుమార్ కంజీలాల్ (1933)

దిలీప్ కుమార్ కంజీలాల్ 1-8-1933న కలకత్తా లో పుట్టి ,పిహెచ్ డిచేసి ,ప్రభుత్వ సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .రవీంద్రభారతి విజిటింగ్ ప్రొఫెసర్ .కామన్ వెల్త్ యూని వర్సిటీలచే ఎంపిక చేయబడిన విజిటింగ్ ఫెలో .ఏన్శేంట్ అష్ట్రోనాట్ సోసైటీ లైఫ్ మెంబర్ . అమెరికా బోరి ,పూనా చెన్నై లను సందర్శించాడు. ప్రెసిడెంట్ అవార్డీ

700-అభినవ సంస్కృత కథ కర్త –నారాయణ శాస్త్రి కంకార్ (1930)

1930జులై 30న జైపూర్ లోపుట్టిన నారాయణ శాస్త్రి కంకార్ వ్యాకరణ సాంఖ్య యోగ దర్శన ఆచార్య .సాహిత్య రత్న ,ప్రభాకర్ .జైపూర్ మహారాజ సంస్కృత కాలేజి ప్రొఫెసర్ .ప్రభుత్వ ఆయుర్వేద కాలేజి సెక్రెటరి .నవల్ కిషోర్ కంకార్ శిష్యుడు .రాసిన 29పుస్తకాలలో అభినవ సంస్కృత  కథ,రచనాభ్యుదయ మహాకావ్యం ,అభినవ సంస్కృత సుభాషిత సప్తశతి,సంస్కార కథా కౌతుకం  ,వినాయక నామాభినందనం ఉన్నాయి .వ్యాకరణ కేసరి బిరుదాంకితుడు .మద్రాస్ ,రాజస్థాన్ ప్రభుత్వ సంస్కృత అకాడెమి పురస్కారాలు పొందాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-4-21-ఉయ్యూరు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.