1-ఇజ్రేలీ ఇండాలజిస్ట్ –డేవిడ్ షుల్మన్(1949)
1-13-1949న అమెరికా లోని లోవా లోని వాటర్లూ లోపుట్టిన డేవిడ్ డీన్ షుల్మన్-ఇజ్రాయిల్ ఇండాలజిస్ట్ ,కవి ,శాంతిప్రబోధకుడు .1967లో వాటర్ లూ హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ చేసి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందాడు.వెంటనే ఇజ్రాయిల్ కు వలస వెళ్లి హీబ్రూ యూని వర్సిటి చేరి ,1971లో ఇస్లామిక్ హిస్టరీ అందులో అరెబిక్ ముఖ్య విషయంగా గ్రాడ్యుయేట్ అయ్యాడు .ఇంగ్లిష్ ఎకనామిక్ హిస్టోరియన్ డేనియల్ స్పెర్బెర్ సాన్నిహిత్యం స్నేహం,ప్రేరణ వలన ఇండియన్ స్టడీస్ పై ఆసక్తి పొందాడు .తర్వాత ఫైలాలజిస్ట్ ,సెమెటిక్ భాషలలో నిష్ణాతుడు అయిన చిన్ రాబిన్ వలన స్పూర్తి పొందాడు .ఐడిఎఫ్ లో పని చేసి ,తర్వాత ఇజ్రేలి దేశం 1982లెబనాన్ ఆక్రమణ లో పిలువబడి ,ఆర్మీసర్విస్ లో వైద్య నైపుణ్యం పొంది ,సెటిలర్ల హి౦స వలన గాయపడిన పాలస్తీనియన్ లకు సేవలందించాడు .
సంస్కృత ,తమిళాలలో డాక్టరేట్ చేశాడు .తమిళ శైవ తలపురాణ౦ ముఖ్య అంశంగా పరిశోధన పత్రం రాశాడు .1972-76కాలం లో లండన్ యూని వర్సిటి లో స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ లో ‘’ది మైధాలజి ఆఫ్ తమిళ్ శైవ తల(స్థల )పురాణ0 పై జాన్ ఆర్ .మార్ వద్ద పరిశోధన పత్రం రాసి సమర్పించాడు .దీనికోసం తమిళ నాడులో ఫీల్డ్ వర్క్ కూడా చేయాల్సి వచ్చింది .దీనిఫలితంగా హీబ్రూ యూని వర్సిటిలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ అండ్ కంపారటివ్ రెలిజియన్ శాఖలో ఇంస్త్రక్తర్ గా చేరి ,లెక్చరర్ అయి తర్వాత 1985లో ప్రొఫెసర్ అయ్యాడు .1987-1992కాలం లో మెక్ ఆర్ధర్ ఫెలో గా ప్రొఫెసర్ షుల్మన్ ఉన్నాడు .1988లో ఇజ్రాయిల్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ హ్యుమానిటీస్ కు మెంబర్ గా ఎన్నికయ్యాడు .2015లో అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీ కి ఎన్నికయ్యాడు .జెరూసలెం యూని వర్సిటి ఆఫ్ అడ్వాన్సెడ్ స్టడీస్ కు ఆరేళ్ళు డైరెక్టర్ గా పని చేశాడు .క్లే సాంస్క్రిట్ లైబ్రరి ని బలపరచాడు .విగల్ బ్రోన్నేర్ తో కలిసి అక్కడే ఒక కొత్త పుస్తకం రాశాడు .2019నుంచి’’ ఇన్ఫోసిస్ ప్రైజ్’’ కు హ్యుమానిటీస్ జ్యూరీ గా సేవలందించాడు .ఐలీన్ ను పెళ్ళాడి ముగ్గురు మగ పిల్లల తండ్రి అయ్యాడు .
అహింస అంటే ప్రాణ౦ గా భావించే షుల్మన్ ‘’జాయంట్ ఇజ్రాయిల్ –పాలేస్టైన్ –లైఫ్ ఇన్ కామన్ఆర్ ట్రయోష్ గ్రాస్ రూట్స్ మువ్ మెంట్ ఫర్ నాన్ వయోలెన్స్ ఉద్యమ౦ లో ప్రముఖ శాంతి కాముక పాత్ర పోషించాడు .’’ఇరు వైపులా వారు గెలిస్తేనే ఇరుపక్షాల వారూ ఓడిపోయినట్లు ‘’అనే సిద్ధాంతం అతనిది .ఇరు వర్గాలలో నైతిక సూత్ర వైఫల్యాలను తెలియ జెప్పేవాడు This conflict is not a war of the sons of light with the sons of darkness; both sides are dark, both are given to organized violence and terror, and both resort constantly to self-righteous justification and a litany of victimization, the bread-and-butter of ethnic conflict. My concern is with the darkness on my side.[4]
2007లో ‘’డార్క్ హాప్’—వర్కింగ్ ఫర్ పీస్ ఇన్ ఇజ్రాయిల్ అండ్ పాల స్టైన్’’’అనే పుస్తకాన్ని రాసి ప్రచురించి అక్కడ శాంతి సాధన ఎంతటి ముండ్ల బాట పై ప్రయాణమో కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు .దాదాపు 40 విలువైన ఆర్టికల్స్ వివిధ పత్రికలలో రాసి ప్రచురించాడు .సహ రచయితలతోకలిసి 10 పుస్తకాలకు సంపాదకత్వం వహించాడు .
ఈనాటి తమిళ భాష సంస్కృత పదాలతో సంపన్నమైనదని వివరంగా రాశాడు “Modern Tamil is astonishingly rich in Sanskrit loan words. Indeed, there may well be more straight Sanskrit in Tamil than in the Sanskrit-derived north-Indian vernaculars. Sanskrit words tend to be Tamilised in accordance with the Tamil phonematic grid, much in the way they were already at the time of the Tolkappiam grammar.”
తమిళం కూడా సంస్కృతం లాగానే దేవ భాష అని ‘’ముక్తాయింపు’’ ఇచ్చాడు .అతి స్వచ్చ సంస్కృతం అతి స్వచ్చ తమిళం లేవు అన్నాడు .Muttusvāmi Dīkṣitar and the Invention of Modern Carnatic Music: The Abhayâmbā Vibhakti-kṛtis అనే పుస్తకం రాశాడు .స్ప్రింగ్ ,హీట్ అండ్ రైన్స్ అనే దక్షిణ దేశ యాత్ర దర్శిని రాశాడు ..
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-4-21-ఉయ్యూరు