సరసభారతి పుస్తక ప్రసాద వితరణ
సాహితీ బంధువులకు శుభ కామనలు -సరసభారతి శ్రీ ప్లవ ఉగాదికి ఆవిష్కరించాల్సిన -1-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లి నాథ సూరి మనీష 2-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు అనే రెండు పుస్తకాలను 13-4-21శ్రీ ప్లవ ఉగాది మంగళ వారం ఉదయం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి పవిత్ర పాదాల వద్ద ఉంచి స్వామియే ఆవిష్కరించి నట్లు భావించాము .21-4-21 బుధవారం శ్రీరామనవమి నాడు మన ఆలయం లో జరిగిన శ్రీ సీతా రామ కల్యాణం సమయం లో అమెరికా నుంచి వచ్చిన మా అమ్మాయి శ్రీమతి విజయలక్ష్మి తో స్వామి వారి సన్నిధానం లో పై రెండు పుస్తకాలను ఆవిష్కరి౦ప జేసి ,సుమారు 60మంది భక్తులకు 60 సెట్లు పుస్తక ప్రసాదంగా అందజేయించాము . .
ఆ తర్వాత ఈ నెల 22నుంచి 27 వరకు సాహితీ బంధువులకు ,బంధు మిత్రులకు బుక్ పోస్ట్ లో ,రిజిస్టర్డ్ పార్సిల్ ద్వారా 140 సెట్లు పంపాము దాదాపు అందరికి అందుతున్నట్లు మెసేజ్ లు,ఫోన్ లు వస్తున్నాయి .ఇలా మొత్తం 200 సెట్లు అంటే 400పుస్తకాలు పుస్తక ప్రసాదంగా అందరికీ అంద జేసి సంతృప్తి చెందాము .మీ -దుర్గా ప్రసాద్ -27-4-21