203-అమెరికాదేశ సాహిత్యం -20
20వ శతాబ్ది సాహిత్యం -12
ఆఫ్రికన్- అమెరికన్ సాహిత్యం
20వ శతాబ్ది నల్లజాతి రచయితలు రిచార్డ్ రైట్యోక్క్ కోపం ,సాంఘిక నిరసన సంప్రదాయానికి భిన్నంగా కొత్త విధానం కనిపెట్టారు .జేమ్స్ బాల్డ్విన్ ,రాల్ఫ్ ఎల్లిసన్ లు రైట్ మార్గగాములు అయినా అమెరికాలో నల్ల వారి సంక్లిష్ట పరిస్థితులను చిత్రించే అనేక వివాదాస్పద వ్యాసాలతో సాహిత్య రచన చేశారు . బాల్డ్విన్ తన 1935లో రాసిన మొదటి నవల ‘’గో టెల్ ఇట్ ఆన్ ది మౌంటేన్ ‘’లో హార్లెం ప్రపంచాన్ని ,నల్ల వారి చర్చి విషయాలను తన యవ్వన అనుభవాలతో రాశాడు .గ్రామీణ జానపదుల గురించి అబ్సర్దిస్ట్ హాస్యం ను వాస్తవాన్ని జోడించి రాశాడు .రాల్ఫ్ ఎల్లిసన్ మాత్రం నల్లవారి అనుభవాలు గ్రామీణ వ్యవసాయం ,వివక్షత తో కూడిన విద్య ,ఉత్తరప్రాంతాలకు వలస పోవటం ,ఘెట్టో భయానక స్థితులు లపై జాతీయత ,కమ్యూనిజం ప్రేరణకలిగిస్తూ నవలలు రాశాడు .1952లో యితడు రాసిన ‘’ఇన్ విజిబుల్ మాన్ ‘’ను యుద్దానతరం వచ్చిన గొప్ప నవలగా భావించారు .
తర్వాత ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రులు యుద్ధానంతర అమెరికన్ ఫిక్షన్ రాశారు .1970లో వచ్చిన ది bhiest ఐ’’,1973రచన ‘’సులా ‘’,1977లోని ‘’సాంగ్ ఆఫ్ సాల్మన్ ‘’1987లో ‘’,బిలవ్డ్’’,1992లో జాజ్ ,1998లో ‘’పారడైజ్ ‘’తోపాటు టోనీ మారిసన్ అనేక విధాల లిరికల్ రి కలెక్షన్ ,మాజిక్ రియలిజం దాకా రాశాడు . .ఎల్లిసన్ లాగా మారిసన్ వైవిధ్య జానపద గీతాలు ,బ్లాక్ హిస్టరీ లను బానిసత్వాన్ని బిలవ్ద్ లో హార్లేన్ రినైసేన్స్ ను జాజ్ లో చిత్రించింది .ఎంతో కవిత్వం రాసిన ఎలిస్ వాకర్ 1976లో పౌరహక్కుల సమస్యపైనవల’మెరిడియన్’’ రాసి,’’కలర్ పర్పుల్ ‘’అనే బ్లాక్ ఫెమినిస్ట్ నవలకు 1982లో పులిట్జర్ ప్రైజ్ పొందింది .నల్లజాతి పురుషులు కూడా విజ్రుమ్భించి సాహిత్య సృజన చేశారు ఈకాలం లో .వారిలో ఇస్మాయిల్ రీడ్,వైల్డ్ కామిక్ రాస్తే ,జేమ్స్ అలాన్ ,మెక్ ఫెర్సన్ చిన్నకథలు రాశాడు .చార్లెస్ జాన్సన్ రాసిన’’ ది ఆక్స్ హీర్దింగ్ టేల్ ‘’,(1982),డి మిడిల్ పాసేజ్ -1990 నవలలో చారిత్రాత్మక ఊహాత్మకత ప్రదర్శించాడు .Gay రచయిత రాండాల్ కెన్మాన్ మాత్రం ఫోక్ ఇమాజినేషన్ తో బాల్డ్విన్ ఎలిసన్ ల శైలిలో రాశాడు .కాల్సన్ వైట్ హెడ్ ఫోక్ ట్రడిషన్ లో ప్రయోగాలు చేసి, ది ఇంట్యూ షనిస్ట్-1999,జాన్ హెన్రి డేస్-2001లో రాశాడు .
న్యు ఫిక్షనల్ మోడ్స్-రెండవ ప్రపంచ యుద్ధం ,కోల్డ్ వార్ ,అటామిక్ బాంబ్ ,కలవర పరచే కన్స్యూమర్ కల్చర్ ధోరణి ,1960లోని కల్చరల్ క్లాషేస్ కు ప్రేరితులైన రచయితతలు సంప్రదాయ ఫిక్షన్ ను వదిలి కొత్త అన్వేషణకు దారి చూపారు .దీని ఫలితంగా పోస్ట్ మోడరన్ నవల పుట్టింది .విలియం గాడిస్,జాన్ బార్త్,జాన్ హాక్స్ ,డోనాల్డ్ బార్తల్మే,ధామస్ పించాన్ ,రాబర్ట్ కూవర్ ,పాల్ ఆస్టర్,డాన్ డెలిలో వాస్తవానికి పెద్దపీట వేసి రియాలిటి కే రియాలిటి తెచ్చారు .వారి నవలలు ‘’ఆర్టి ఫాక్ట్స్’’ అయ్యాయి .రియలిస్టిక్ టెక్నిక్ లను ఐరానికల్ గా ప్రయోగించారు .హింస ను మరింత పెంచారు .డాక్యుమెంటేషన్ కు విలువ పెంఛి ఫాంటసి కి దారి తీశారు .నార్మన్ మైలర్ ,జాయ్స్ కరోల్ ఓట్స్ లు ఈ కొత్తదారి నిర్మాతలు .
1948లో మైలర్ -రచయిత డాస్ పాసోస్ సాంఘిక నిరసన ధోరణి సంప్రదాయం లో ‘’ది నేకెడ్ అండ్ ది డెడ్’’రాశాడు .దీని పరిమితులకు లోబడి ఫేబుల్స్ లో సర్రియలిస్టిక్ ఫాంటసి ప్రవేశ పెట్టి ,యాన్ అమెరికన్ డ్రీం – 1965,వై అర్ వియ్ ఇన్ వియత్నాం -1967రాశాడు .ఇతని సబ్జెక్ట్ ఏమిటి అంటే రాజకీయం గా, వ్యక్తిగతంగా ‘’నేచర్ ఆఫ్ పవర్’’.తర్వాత దారిమారి ‘’నాన్ ఫిక్షన్ ఫిక్షన్ ‘’లేక ఫిక్షన్ ఆజ్ హిస్టరీ ‘’ఇన్ ది ఆర్మీస్ ఆఫ్ ది నైట్ ‘’,మియామి అండ్ సీజ్ ఆఫ్ చికాగో -1968సృష్టించాడు .మైలర్ తన స్వంత గొంతును గొప్పగా ఉన్న స్వకీయమై ,కామిక్ అయినా మేధోవిలసిం గా సృస్టించు కొన్నాడు .ఈ నూతన విధాన ట్రూ లైఫ్ నవల ‘’ది ఎక్సి క్యూషనర్స్ సాంగ్ ‘’రచనకు 1979లో పులిట్జర్ పొందాడు .మళ్ళీ ఫిక్షన్ కు వచ్చి సెంట్రల్ ఇంటలిజెన్స్ పై ‘’హార్లాట్స్ ఘోస్ట్’’ -1991రాశాడు అతడి చివరి నవలలు –(జీసెస్ క్రైస్ట్-ది గాస్పెల్ అకార్దింగ్ టు సన్)1997, ,అడాల్ఫ్ హిట్లర్ (ది కాజిల్ ఇన్ ది ఫారెస్ట్ )2007రాశాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-21-ఉయ్యూరు