203-అమెరికాదేశ సాహిత్యం -21
20వ శతాబ్ది సాహిత్యం -13
ఆఫ్రికన్- అమెరికన్ సాహిత్యం -2
ఎ గార్డెన్ ఆఫ్ ఎర్త్లి డిలైట్ ,-1967,దెం-1969 రాసిన జాయ్స్ కరోల్ ఓట్స్ – డెట్రాయిట్ హింస లాంటి అర్బన్ ప్రాంత హింస ను సహజ సిద్ధంగా వర్ణించి రాసింది .1971 సర్రియలిజం ను ప్రయోగాత్మకం గా వాడి ‘’వండర్ లాండ్’’ నవల రాసింది .1980లో గోధిక్ ఫాన్సీ తో బెల్లె ఫ్లూయర్,1986లో అప్ స్టేట్ అయిన న్యు యార్క్ లోని బ్లీక్ బ్లూ కాలర్ వరల్డ్ గురించి మార్యా నవల రాసింది .తర్వాత బ్లాండే-ఎ నావెల్ -2000,లో నటి మార్లిన్ మన్రో జీవిత చరిత్ర రాసింది .వాస్తవతను పట్టుకోవటానికి మాత్రమె కాకుండా మలైర్ ,ఓట్స్ లిద్దరూ ఆ శక్తిని ఫిక్షనల్ మోడ్స్ తో చూపించారు .
1970లో ఫెమినిజం ప్రవేశించి ,కొత్తతరం స్త్రీ రచయితలూ వచ్చారు .ఎరికా జంగ్ –సెక్సీ అండ్ ఫన్నీ గా ఫియర్ ఆఫ్ ఫ్లైయింగ్ 1974,రీట మే బ్రౌన్ –లెస్బియన్ లైఫ్ ను రూబీ ఫ్రూట్ జంగిల్ 1973లో రాసింది .1970లో వచ్చిన ఇతర ఫిక్షన్ స్త్రీ రచయితలలో ఆన్ బీటీ –చిల్లీ సైన్స్ ఆఫ్ వింటర్ నవలలో ,కధల్లో1960తర్వాతకాలపు జనరేషన్ చిత్రించింది .గైల్ గాడ్విన్1974లో రాసిన ది ఆడ్ వుమన్ లో ఉన్నత నాగరకత ప్రదర్శించింది .మేరీ గార్డెన్-ఐరిష్ కేధలిక్ జీవితాలను ఫైనల్ పే మెంట్స్ -1978 చిత్రిస్తే ,అలిసాన్ లూరీ,అన్నే టైలర్ లు సోషల్ కామెడీలు రాశారు .
రేమండ్ కార్వర్ ప్రభావం – 1970లో వచ్చిన ప్రేరణాత్మక ఫిక్షన్ రైటర్ మాత్రం రేమండ్ కార్వర్.ఇతడు ఫసిఫిక్ నార్త్ వెస్ట్ లోని బ్లూ కాలర్ లైఫ్ ను కధల్లో చిత్రించిన మరొక రియలిస్టిక్ రచయిత , 1981లో వచ్చిన ఇతడి ‘’వాట్ ఉయ్ టాక్ వెన్ వుయ్ టాక్ అబౌట్ లవ్ ‘’,1983లో వచ్చిన కేతేడ్రేల్ కధా సంపుటాలు దీనికి నిలువెత్తు సాక్ష్యాలు .జీవితాలను స్వయంగా నాశనం చేసుకొనే అతడి పాత్రలు జీవితాన్ని కోల్పోయిన వారే .అతడి శైలి పై హెమింగ్వే ,సామ్యుల్ బెకెట్ ప్రభావం జాస్తి .గొప్ప సలహాదారుగా దర్శనమిస్తాడు రచయిత .అక్కడక్కడ బార్తేల్మే మేరీ రాబిన్సన్ ,అమీ హేమ్పెల్ లను చెత్తగా అనుకరించినా, ఆ తరాన్ని బాగా ప్రభావితం చేశాడు . కార్వార్ ప్రేరణతో అతన్నే అనుకరించి గొప్పగా నవలలు రాసిన వారిలో రిచర్డ్ ఫోర్డ్ –రాక్ స్ప్రింగ్స్ – 1987,రస్సెల్ బాంక్స్ –కాంటి నెంటల్ డ్రిఫ్ట్-1984,టోబియస్ ఉల్ఫ్ –ది బారక్స్ ధీఫ్-1984,దిస్ బాయ్స్ లైఫ్ -1989 ఉన్నారు .1960కాలపు కౌంటర్ కల్చర్ రియలిస్టిక్ రచయిత రాబర్ట్ స్టోన్ ఉద్బవించాడు .ఇతడి డాగ్ సోల్జర్స్ -1974,లో వియత్నాం జనరేషన్, డ్రగ్స్ ముఖ్య విషయం. 1981లో వచ్చిన ఎ ఫ్లాగ్ ఫర్ జనరేషన్ మధ్య అమెరికా లోని అస్పష్ట విషాద కాన్రాడ్ రాజకీయ నవల .అతని పాత్రలలో ఆధ్యాత్మిక అశాంతిని అసలు సాధారణ జీవితం కంటే ఎక్కువగా వర్ణించాడు .1986లో అతడి హాలీ వుడ్ నవల చిల్డ్రన్ ఆఫ్ లైట్ -1986,లో ,డమాస్కస్ గేట్-1989లో హోలీ లాండ్ లోని అలౌకిక వాతావరణం –(అపోకలిప్టిక్ అట్మాస్ ఫియర్ )చూపాడు .రిచార్డ్ రూసో మంచి హాస్యం ,సూక్ష్మ విషయాలతో కూడా వాయవ్య రాష్ట్రాలలో బ్లూ కాలర్స్ కోల్పోయిన జీవితం యొక్క శిధిలతను రిస్క్ పూల్ -1988,నో బడీస్ ఫూల్ -1993,ఎంపైర్ ఫాల్స్ -2001లో చిత్రించాడు. ఇతడే అకాడెమియా పై సెటైరికల్ గా స్ట్రైట్ మాన్ -1997 నవల రాశాడు .
కొంతమంది స్త్రీ రచయితలైన ఇ.అన్నీప్రౌల్క్స్ పురుష పాత్రలను చిత్రిస్తూ ది షిప్పింగ్ న్యూస్ -1993,క్లోజ్ రేంజ్-వైమింగ్ స్టోరీస్-1999,రాస్తే ,ఆండ్రియా బారెట్ –షిప్ ఫీవర్ -1996,రాసింది .స్త్రీలలో రిలేషన్ షిప్ గురించి మేరీ గేయిట్స్ స్కిల్ సెటైరికల్ గా -టు గరల్స్ ఫాట్ అండ్ ధిన్-1991ను నబకోవ్ ,మేరీ మేకార్ధి ప్రభావం తో రాసింది .లారీ మూర్ –వ్యక్తిగత నాణ్యమైన కధలను నవలలుగా రాసింది .డిబోరా ఐసెన్ బెర్గ్ ,అమీ బ్లూమ్ ,ఆంటోన్యా నెల్సన్ ,ధామస్ జోన్స్ లు 20వ శతాబ్ది చివరికాలాన్ని చిరస్మరణీయమైన కధలతో నింపారు .
బహుళ సాంస్కృతిక సాహిత్యం -20వ శతాబ్దం చివర్లో మల్టి కల్చరల్ సాహిత్యం బాగా ఊపు అందుకొన్నది .కొత్త జ్యూయిష్ వాయిసెస్ ఫిక్షన్ లో వినిపించాయి ఇ.ఎల్.డాక్టర్రో తన సాహిత్యం లో చారిత్రకాన్ని నవలా ఫిక్షన్ లో కలిపి రాగ్ టైం-1975,వాటర్ వర్క్స్ -1994 రాశాడు .సింధియా ఒజిక్ –ఎన్వి లేక యిద్ధిష్ అమెరికా 1969లో యిద్ధిష్ లిటరేచర్ లోని లీడింగ్ మోడల్ కారక్టర్స్ లో వర్ణించింది .1980లో రాసిన ఈమె కథ’’షాల్’’ లో నాజి కాన్సేన్ట్రేషన్ కాంప్ లో ఒక బేబీ హత్యోదంతం ఉంది .డేవిడ్ లివిట్-హోమో సెక్సువల్ ధీమ్స్ ను పరిచయం చేసి ఫామిలి డాన్సింగ్ -1984లో మిడిల్ క్లాస్ జీవితాన్ని చిత్రించాడు .21వ శతాబ్ది ఆరంభానికి పూర్వపు సోవియెట్ యూనియన్ కు చెందిన గేరీ స్టైయింగార్ట్,లారా వాప్నవర్ రచయితలు అమెరికా చేరిన వలస జనం అనుభవాలను వర్ణించారు .తర్వాత నవలా ప్రస్థానం గురించి తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-4-21-ఉయ్యూరు