బహుళ సాంస్కృతిక సాహిత్యం -2
ప్రపంచ దేశాల సారస్వతం
20వ శతాబ్ది సాహిత్యం -14
బహుళ సాంస్కృతిక సాహిత్యం -2
ఎన్.స్కాట్ మామడి రాసిన ‘’హౌస్ మేడ్ ఆఫ్ డాన్’’నవలకు 1969లో పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .జేమ్స్ వెల్ష్ రాసిన’’వింటర్ ఇన్ ది బ్లడ్—1974,’’ఫూల్స్ క్రో’’-1986,లెస్లీ మార్మన్ సిల్కో రాసిన ‘’సెరిమని ‘’-1977,లూయీ ఎండ్రిచ్ నవల ‘’లవ్ మెడిసిన్ -1984,ది బీట్ క్వీన్ -1986,యాంటి లోప్ వైఫ్ -1998 నవలలు నేటివ్ అమెరికన్ హిస్టరీ,అస్తిత్వ పరిశోధన పై అస్పష్ట శక్తివంతమైన నవలలు .మెక్సికన్ అమెరికన్ లగురించి రుడాల్ఫోఎ.అనయ రాసిన ‘’బ్లెస్ మీ ఉల్టిమా’’-1972,రిచార్డ్ రోడ్రిగెజ్ రాసిన స్వీయచరిత్ర లాంటి ‘’హంగర్ ఆఫ్ మెమరి ‘’-1981,సాండ్రా సిస్నేరోస్ రాసిన ‘’ది హౌస్ ఆన్ మాంగో స్ట్రీట్ ‘’-1983,ఈమెదే అయిన వుమన్ హోలరింగ్ క్రీక్ ,అదర్ స్టోరీస్ సంపుటాలు మెక్సికన్ లైఫ్ ను చూపేవే .
పాత, కొత్త సంస్కృతుల లో పెరిగిన వాటిని బాగా అర్ధం చేసుకొన్న ఇమ్మిగ్రంట్ రచయితలైన ఆస్కార్ హిజులోస్ –ది మామ్బో కింగ్ ప్లే సాంగ్స్ ఆఫ్ లవ్ ‘’-1989,క్రిస్టినా గార్సియ –డ్రీమింగ్ ఇన్ క్యూబన్ -1992, ది ఎజిలిరో సిస్టర్స్ -1997,ఆంటిగ్వా లో పుట్టిన జమైకా కిన్కైడ్ రాసిన అన్నీ జాన్ -1984,లూసీ -1990,ఎయిడ్స్ జ్ఞాపకాలైన మై బ్రదర్ -1997,సి నౌ అండ్ దెన్-2013,డొమినికా లోపుట్టిన జునాట్ డయాజ్ రాసిన పులిట్జర్ ప్రైజ్ పొందిన నవల –ది బ్రీఫ్ వండ్రస్ లైఫ్ ఆఫ్ ఆస్కార్ వావో -2007,బోస్నియన్ ఇమ్మిగ్రెంట్ అలేక్జాండర్ హెమాన్ రాసిన క్వేస్చిన్ ఆఫ్ బ్రూనో -2000,నో వేర్ మాన్ -2002,చైనీస్-అమెరికన్ రచయియిత్రి మాక్సిన్ హాంగ్ కింగ్స్టన్ రాసిన వుమన్ వారియర్ -1976,చైనా మెన్-1980 నవలలో ప్రాచీన చైనా వారసత్వం ,అద్భుత కుటుంబ చరిత్ర నుచూపింది . శాన్ఫ్రాన్సిస్కో లోని బే ఏరియాలో 1960 నాటి బోహీమియన్ ప్రపంచాన్ని ‘’ట్రిప్ మాస్టర్ మంకీ,-హిజ్ ఫేక్ బుక్ అనే మొట్టమొదటి నవలో చూపింది .ఇతర ఏషియన్ –అమెరికన్ రచయితలలో గీష్ జెన్ -1991లో రాసిన టిపికల్ అమెరికన్ నవలలో వలస మనుషుల జీవన పోరాటం ఫ్రస్ట్రేషన్ కళ్ళకు కడుతుంది .కొరియన్ –అమెరికన్ రైటర్ –చాంగ్ రే లీ –రాజకీయ జాగృతి కుటుంబ వ్యవస్థ ,తరాల భేదాలను –నేటివ్ స్పీకర్ -1995,గెస్చర్ లైఫ్-1999లో చూపిస్తే ,హా జిన్ –వైటింగ్ -1999,నవలకు నేషనల్ బుక్ అవార్డ్ వచ్చింది .చైనాలో కల్చరల్ రివల్యూషన్ కాలం లో, ఆతర్వాత ఉన్న పిరికితనం ,అణచివేత ,దెబ్బతిన్న ప్రేమ ,పాత కొత్త తరం చైనా లో ఇమడలేని స్థితిని రచయిత అద్భుతం గా ఆవిష్కరించాడు .ఇండియా అమెరికాలో ఉండే భారతి ముఖర్జీ –దిమిడిల్ మాన్ అండ్ ఆదర్ స్టోరీస్ -1988,జాస్మిన్ -1989,డిజైరబుల్ డాటర్స్ -2002,ది ట్రీబ్రైడ్-2004 రాసింది .ఇంకా చాలామంది మాలతి కల్చరల్ రచనలు చేసి ,మారుతున్న అమెరికన్ సాహిత్యాన్ని పరిపుష్టి చేశారు .
1900కాలం లో చాలా మంది ఫిక్షన్ రైటర్స్ తమ శక్తి యుక్తుల్ని స్వీయ జీవిత చరిత్రలు రాసుకోవటం లో సార్ధకం చేసుకొన్నారు .మేరీ కార్ రాసిన ది లయర్స్ క్లబ్ -1995లో టెక్సాస్ గల్ఫ్ కోస్ట్ లో కుదేలైన కుటుంబ వ్యవస్థ చూపించింది .ఫ్రాంక్ మెక్ కోర్ట్1996లో రాసిన ఎంజలాస్ యాషెస్ లో డికెన్స్ బాల్యం లాంటి జీవితం ,ఐరిష్ మురికి కూపాలు వర్ణించింది .అన్నే రోఫే-తన ధనిక తలిదండ్రుల నిర్దయ , ఎయిడ్స్ తో అన్న చనిపోవటం మొదలైనవి –‘’1185 పార్క్ అవెన్యు -1999 లో దయనీయంగా వర్ణించింది .డేవ్ ఎగ్గర్ –‘’ఎ హార్ట్ బీటింగ్ వర్క్ ఆఫ్ స్టాగరింగ్ జీనియస్ ‘’2000లో అనేక కష్ట నష్టాలు అనుభవిస్తూ ఒక యువకుడు తన తలిదండ్రులు చనిపోతే తమ్ముడిని ఆదుకొని తీర్చి దిద్దిన విధానం చూపించాడు .
నవలల పై చాపల్యం చావలేదు .అనేక పెద్ద ప్రతిష్టాత్మిక నవలలు తెగరాసి పారేశారు రచయితలు .వీరిలో డేవిడ్ ఫాస్టర్ వాలెస్-ఇన్ఫినిట్ జెస్ట్ -1996,లో ఎన్సైక్లో పీడిక్ మార్మిక నమ్మకాలతో సోషల్ ఫిక్షన్ ,పోస్ట్ మోడరన్ ఐరని కలిపి దంచాడు .జోనాధన్ ఫ్రాన్జేన్-నేషనల్ బుక్ అవార్డ్ పొందిన నవల –ది కరెక్షన్స్ -2001,ఫ్రీడం-2010 నవలలు ఫామిలి పోర్ట్రైట్ లే.డాన్ లిలోస్ –అండర్ వరల్డ్ -1997,లో ప్రచ్చన్న యుద్ధ అంటే కోల్డ్ వార్ స్థితిగతుల్ని ఫిక్షనల్ ,హిస్టారికల్ పాత్రల కళ్ళతో చూపించి మనము౦దు౦చాడు.ఈ మూడు నవలలో మరీ ఆలస్యమైపోయిన ఏకీకృతం కాని సాంఘిక రియలిజం నుPynchonesque invention గా కొత్తగా చూపించాడు .పించాన్ బతికి వచ్చి చారిత్రిక నవలలు రాసినట్లు అనిపిస్తుంది ప్రతిదీ కళ్ళకు కట్టిస్తాడు .1997లో రాసిన మేసన్ అండ్ డిక్సన్ లో 18వ శతాబ్దపు ఇద్దరు ప్రసిద్ధ సర్వేయర్లు ,వారి అమెరికన్ కాలనీల గురించి పరిశోధనలు అన్వేషణలు,మాప్ లు తయారు చేయటం గురించి రాస్తే ,2006లో రాసిన ఎగైనెస్ట్ ది డే లో 20వ శతాబ్ది నుంచి 21వ శతాబ్ది కి పయనం కనిపిస్తుంది . రెండవ ప్రపంచ యుద్ధానంతర కవిత్వం గురించి తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-21-ఉయ్యూరు