ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -23
20వ శతాబ్ది సాహిత్యం -15
యుద్ధానంతర కవిత్వం
పోస్ట్ వరల్డ్ వార్-2 కాలం లో పుష్కలంగా కవిత్వం పండింది .కానీ టిఎస్ ఇలియట్ ,ఎజ్రా పౌండ్ ,వాలెస్ స్టేవెన్స్ రాబర్ట్ ఫ్రాస్ట్ ,విలియమ్స్ కార్లోస్ విలియమ్స్ ,ల ప్రభావం చూపిన కవులు తక్కువే .వీరి సుదీర్ఘ కవితాకాలం సమాప్తి చెందే రోజులవి .1945-60మధ్య వచ్చిన కవిత్వం ఆధునిక కవిత్వంగా ఐరానిక్ కవిత్వంగా పేరు పొందింది .మామూలు ఛందస్సు లయ కు ప్రాధాన్యం ఉన్నదే .1950 తర్వాత ప్రారంభమైన కవుల కవిత్వం లో వెరైటీ తోపాటు వివిధ భావాల ప్రభావం ఉంది .ఉన్నదానితో తృప్తి పడకుండా ,తిరుగుబాటు చేసి ప్రయోగాలు చేస్తూ ,ఇంకా వాడుక భాషలో ,ఇంకా విస్పష్టంగా కవిత్వం రాశారు .
అధికారిక –ఫార్మల్ కవులు -1940తర్వాత కవులలో రాబర్ట్ లో వెల్ కవి ,ఇలియట్ ప్రభావం తో ,మెటా ఫిజికల్ కవులు జాన్ డోన్నె,జేరాల్ద్ మాన్లి హాప్ కిన్స్ ప్రభావం తో ఆధ్యాత్మిక ,కుటుంబ సంబంధ కవితలు ‘’లార్డ్ వీరీస్ కాజిల్ ‘’-1946లో రాశాడు .ప్రభావితం చేసిన ఇతర ఫార్మల్ కవులలో దయోడర్ రోత్కే,కవి విలియం బట్లర్ యేట్స్ ప్రభావం తో ఐరానిక్ లిరిక్స్ ను అత్య౦త ప్రతిభావంతంగా ,ప్రకృతిపై మక్కువతో ‘’దిlost son అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’-1948లో రాస్తే ,రిచర్డ్ విల్బర్1956లో ‘’ధింగ్స్ ఆఫ్ ది వరల్డ్ ‘’కవితా సంపుటి ,రా౦డాల్ జారెల్ 1948లో’’ losses’’ రాశాడు .డబ్లు హెచ్ ఆడెన్ ప్రభావంతో కొందరు యువకవులు జేమ్స్ మెర్రిల్ ,డబ్లు ఎస్ మెర్లిన్ జేమ్స్ రైట్ ,అడ్రిన్నే రిచ్ జాన్ హోలా౦డర్ లు కవిత్వం రాశారు .అద్భుత టెక్నికల్ నైపుణ్యం ప్రదర్శించినా ,వీళ్ళకు ఆడేన్స్ నాడి దొరకలేదు .ప్రయోగాలు ,బీట్ కవిత్వం -1950మధ్యకాలం లో గొప్ప ప్రతిక్రియ ఒకటి ఏర్పడింది .కవులు ఇలియట్ ,మెటాఫిజికల్ కవిత్వాలను వదిలేసి మరింత రొమాంటిక్ గా ,మరింత వచనాత్మకం గా రాయటం మొదలెట్టారు .ఇలాంటి కవులలో వాల్ట్ విట్మన్ ,విలిం కార్లోస్ విలియమ్స్ ,హార్ట్ క్రేన్,డి.హెచ్ లారెన్స్ ఉన్నారు .పడమటి నార్త్ కరోలినా లోని బ్లాక్ మౌంటేన్ కాలేజి కి చెందిన కవుల గ్రూప్ ఒకటి –చార్లెస్ ఓల్సన్ ,రాబర్ట్ క్రీలీ ,రాబర్ట్ డంకన్,ఎడ్వర్డ్ డార్న్,డెనిస్ లీవర్ స్టవ్ లు కవిత్వం లో ఫారం కంటే విప్పి చెప్పటానికే ప్రాధాన్యమిచ్చారు .ఓల్సన్ రాసిన ‘’మాక్సిమస్ పోయెమ్స్ ‘’-1953-68లో బెల్లం పాకం లాంటి ,అసమానంగా ఉండే ధారతో ఎజ్రా పౌండ్ యొక్క ‘’కాంటోస్’’,విలియమ్స్ రాసిన ‘పాటర్సన్ ‘’ధోరణిలో రాశారు .అలేన్స్ గీన్ బర్గ్ –అసంకల్పిత ,మతప్రవక్త ప్రబోధ విధానం లో 1956లో ‘’హౌల్ ‘’ను,మనసును కదిలించే తనతల్లి స్మృతి కవిత’’కాడ్డిష్’’-1961లో రాసి శక్తి వంతమైన ‘’బీట్ కవిత్వానికి ‘’నాంది పలికాడు .అసాధారణ తీవ్రత తో రాసిన ఈ కవితలు వాల్ట్ విట్మన్ విలియం బ్లేక్ ,క్రిస్టఫర్ స్మార్ట్స్ కవితలు ప్రభావితం చేసినట్లు ప్రభావం చూపాయి .దీనితో పాటు ఫ్రెంచ్ సర్రియలిస్ట్ కవుల డ్రీం లాజిక్ ,జాజ్ సంగీత కళా సౌందర్యారాధన భావనలన్నీ గిన్స్ బెర్గ్ స్నేహితుడు నవలాకారుడు జాక్ కేరోనాక్ లో కనిపిస్తాయి ఇతర బీట్ కవులలో లారెన్స్ ఫెర్లి౦ఘెట్టి. ,గ్రిగరికోర్సో ,గేరీ సిండర్స్ ఉన్నారు ..ఈస్టర్న్ రెలిజియన్ కు చెందిన స్టూడెంట్ -సిండర్స్ కవి 1974లో రాసిన ‘’టర్టిల్ ఐలాండ్ ‘’లో అమెరికన్ సంప్రదాయమైన నేచర్ కవిత్వం రాయటం విశేషం .
కప్పి పుచ్చటం కన్నా ,విప్పి చెప్పటం లోనే ఆనందం పొందిన బీట్ కవిత్వం విలియమ్స్ కవిలోని సూటి విధానం నచ్చి లో వెల్ కవి ,కొత్త ఆటోబయాగ్రఫికల్ శైలిని లాకోనిక్ కవిత్వం వచనం లలో ‘’లైఫ్ స్టడీస్ ‘’-1959,’’ఫర్ ది యూనియన్ డెడ్’’-1964లో ప్రయోగించాడు .లోవేల్స్ రాసిన ఈ కొత్తరకం కవిత్వం దాదాపు అందరు అమెరికన్ కవులకు ప్రేరణ కలిగించింది .కాని కన్ఫెషనల్ గ్రూప్ కు చెందిన కొద్దిమంది కవులు –ఆన్నే సెక్స్టన్,తన ‘’బెడ్లా౦అండ్ పార్ట్ వె బాక్ -1960.,ఆల్ మై పోయెట్రీ-1962,సిల్వియా ప్లాత్ మరణానంతరం 1965లోప్రచురింపబడిన ‘ఏరీల్ ‘’ ప్రేరణ పొందలేదు .ప్లాత్ మాత్రం వైట్ హాట్ ఎమోషనల్ ఇంటేన్సిటి లోని ఐసి సర్కాసిజం కు ఆకర్షితురాలైంది .లోవెల్ ప్రభావం పొందిన మరొక కవి జాన్ బెర్రిమన్ ‘’డ్రీం సాంగ్స్ ‘’-1964,68 లో ఆటో బయాగ్రఫికల్ ఎలిమెంట్ ను సంగీతం ,స్వీయ వ్యక్తీకరణ ,కామిక్ ట్రాజిక్ విషాదం రంగరించి రాశాడు .సెక్స్టన్,ప్లాత్,బెర్రిమేన్ లు విషాద జీవితాలే గడిపారు .ఫ్రెడరిక్ సీడెల్2021లో రాసిన ‘’లైఫ్ ఆన్ ఎర్త్ ‘’అలాగే అవార్డ్ పొందిన సన్ రైజ్ –1980కవితలు లోవెల్ ప్రభావానికి లోనై రాసినవే .
డీప్ ఇమేజ్ కవులు –తన మేగజైన్,స్వంత చారిస్మాతో దిఫిఫ్టీన్ ,ది సిక్ష్టీస్,ది సేవెంటీస్.లతో రాబర్ట్ బ్లై-ఎందరెందరో కవులను తమ స్వంత గొంతుకలను వినిపించమని ప్రోత్సహించి రాయించాడు .ఈ ప్రభావం తో రాసినవారిలో గాలవే కిన్నేల్ ,జేమ్స్ రైట్ ,డేవిడ్ ఇగ్నటోవ్,లూయిస్ సింప్సన్ ,జేమ్స్ డిక్కీ ,డోనాల్డ్ హాల్ ఉన్నారు .వీళ్ళనే ‘’డీప్ ఇమేజ్ కవులు ‘’అన్నారు .బ్లై,అతని స్నేహిత కవులు స్పిరిట్యువల్ ఇంటేన్సిటి,ఆత్మను అధిగమించే ఆలోచనలతో తాత్కాలికానికి స్వస్తి చెప్పి రాశారు .వీరిని ప్రభావితం చేసిన వారిలో స్పానిష్ ,లాటిన్ అమెరికన్ రచయితలైన ఫెడ్రికో గార్సియా లోర్కా ,జువాన్ రేమాన్ జిమ్మేన్జ్ ,సేసార్ వేల్లిజో ,పాబ్లో నెరూడా ఉన్నారు .వీళ్ళందరి సర్రియలిజం ఇమేజేరి ,వారి గ్రీన్ హౌస్ పోయెమ్స్ -1946-48కవితలు తర్వాత వచ్చిన రోత్కే రాసిన మెడిటేటివ్ కవితలు ,వాటిలోని ప్రకృతి అనుభవం ఈకవులకు ఆధ్యాత్మిక పరివర్తనకు మార్గ దర్శనం చేశాయి .కాని వాళ్ళ హిస్పానిక్ మోడల్స్ ల రాజకీయ కవిత్వం అంటే వియత్నా౦ యుద్ధం పై వ్యతిరేక కవితలు .,లారెన్స్ ప్రేరణ ఉన్న కవి కిన్నేల్ ‘’ది పోర్క్యుపైన్,ది బేర్ కవితలలో ప్రకృతికిరాతకం ,మిత్ కున్న శక్తి చాటాడు .అతడి వాటిక్ సీక్వెన్స్ –ది బుక్ ఆఫ్ నైట్ మేర్-1971,ది మోర్టల్ యాక్ట్స్ ఆఫ్ ,మోర్ట ల్ యాక్ట్స్ ,మోర్టల్వర్డ్స్ -1980 లు ఆలంకారిక కవితలు. సమకాలీన కవులను బాగా ప్రభావితం చేశాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-21-ఉయ్యూరు