మనకు తెలిసీ తెలియని సంగతులు
‘’బృహత్ శంకర విజయం ‘’లో గోవిందుడు అనే ఆయన పూర్వాశ్రమం లో చంద్ర శర్మ అనీ అతడే శ్రీ హర్ష విక్రమాదిత్యుని తండ్రి అని ఉన్నది .క్రీ.పూ లో మాళ్వ రాజ్యాన్ని పాలించే బ్రాహ్మణ రాజు తన కూతుర్నిమహా విద్వాంసుడైన చంద్ర వర్మకిచ్చి పెళ్లి చేశాడు .ఈ దంపతులకు శ్రీ హర్ష విక్రమార్కుడు పుట్టాడు .హర్షుడు రాజ్యానికి వచ్చాక తండ్రి చంద్ర వర్మనర్మదా తీరం లోని గౌడ పాదుని ఆశ్రయించి ,గోవింద భగవత్పాదుడు అయ్యాడు .ఈయనే మన శంకరాచార్యుల వారి గురువు .గౌడపాడుడు పతంజలి మహర్షి నుంచి వ్యాకరణ౦,శుక మహర్షి నుంచి బ్రహ్మ విద్య నేర్చాడు .హర్ష విక్రమాదిత్యుడు నేపాల్ ను కూడా పాలించాడు .పార శీకుల్ని ఓడించి పారద్రోలాడు .ఈపారశీకులు’’ శకే ‘’అనే దేశ౦ నుంచి వచ్చారు,ఓడిపోయారుకనుక విక్రముడికి ‘’శకారి’’ బిరుదు వచ్చింది .ఇతడు క్రీపూ.457లో చనిపోయాడు .అప్పటి నుంచి హర్ష శకం ప్రారంభమైంది .
పారమార వంశానికి చెందిన మరో విక్రమార్కుడు ఉజ్జయిని ని పాలించాడు .ఇతడు క్రీ .పూ.57న విక్రమ శకం ప్రారంభించాడు .ఇతడి కొడుకే శాలివాహనుడు .శాలివాహనుడు క్రీ శ 54లో రాజ్యానికి వచ్చి ,క్రీ శ.78లో శకులను ఓడించి ,శాలివాహన శక కర్త అయ్యాడు .ఇలా మూడు శకాలు ప్రారంభమయ్యాయి .
చంద్ర వర్మ పూర్వాశ్రమం లో గౌడ పాదుని శిష్యుడై ,విద్యనేర్చి నాలుగు వర్ణాలలోని నలుగురు కన్యలను పెళ్ళాడి వాళ్ళ వలన వరరుచి ,విక్రమాదిత్య ,భట్టి, భర్తృహరి అనే కొడుకులకు జన్మ నిచ్చాడు .వరరుచి పాణిని కి సహాధ్యాయి .విక్రమార్కుడు ఉజ్జయిని చక్రవర్తి అవగా ,భట్టి మహా కవిగా రాజాస్థానం లో ఉన్నాడు .భర్తృహరి ‘’వాక్య పదీయం’’అనే వ్యాకరణం ,శతకాలు రాశాడు .
పతంజలి శాపానికి గురైన గౌడ పాదుదు బ్రహ్మ రాక్షసిగా పుట్టి ,సమర్ధుడైన వాడికి తన వ్యాకరణం బోధించి ,శాప విమోచనం పొందాడు .గురువు ఆదేశం తో ఉత్తరదేశయాత్ర చేస్తూ,చంద్రవర్మకు వ్యాకరణం బోధించి శాపం పోగొట్టుకొన్నాడు .
చంద్ర వర్మ గోవింద భగవత్పాదుడై,నర్మదా నదీ తీరం లో అమరేశ్వరం (ఓంకార క్షేత్రం )లో శిష్యులకు బోధ చేస్తూ ,నర్మదా ద్వీపం అయిన మాంధాత ద్వీపం లో క్రీ.పూ.494న సిద్ధి పొందాడు .అప్పుడు కొడుకు విక్రమాదిత్యుడు ఓంకార నాధ దేవాలయం నిర్మించి ,అమరేశ్వర లింగ ప్రతిష్ట చేశాడు .శ్రీ హర్ష విక్రమాదిత్యుడు ఉజ్జయిని చక్రవర్తి అయి ,శకులను ఓడించి క్రీపూ 457 శ్రీ హర్ష శకం ప్రారంభించాడు .గుప్త వంశ చక్రవర్తి చంద్ర గుప్తుడు కూడా విక్రమాదిత్య బిరుదు పొంది ,పారశీకులను ఓడించి క్రీపూ 270లో మగధ రాజ్యాధిపతి అయ్యాడు .మాళవ దేశ రాజు విక్రమాదిత్యుడు క్రీపూ 57లో పట్టాభి షిక్తుడై ,విక్రమార్క శకం ప్రారంభించాడు .ఇలా ముగ్గురు విక్రమాదిత్యులు ఉండటం తో చరిత్రకారులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు .
పూర్ణ వర్మ అనే రాజు జావా ద్వీపాన్ని పాలించాడు .మరో పూర్ణ వర్మను చైనాయత్రికుడు హుయాన్ సాంగ్ ప్రస్తావించాడు .ఈకాలం క్రీ శ 540 కనుక శంకరాచార్య ఆ కాలానికి చెంది ఉంటాడు అని తెలంగ్ అనే పండితుడు ఉవాచ .శశాంకుడు అనే రాజు బౌద్ధులకు ప్రాణప్రదమైన బోధి వృక్షాన్ని నరికి౦చేశాడు .అశోక వంశానికి చివరి రాజైన పూర్ణవర్మ వెయ్యి ఆవులపాలతో దానికి అభిషేకం చేసి చిగురింప జేశాడు .ఆ బోధి వృక్షం చుట్టూ 24అడుగుల ఎత్తైన గోడ కట్టించాడని,హుయాన్సాంగ్ వచ్చేనాటికి గోడ శిధిలమై 4అడుగుల ఎత్తు మాత్రమె ఉందని హుయాన్ సాంగ్ రాశాడు .
క్రీ శ 750లో పాటలీపుత్ర నగరం గంగానది వరదలలో మునిగిపోతే ,ప్రస్తుతం ఉన్న పాట్నా క్రీశ 1541లో ఉద్ధరింప బడింది .అలాగే ‘’సుఘ్న నగరం ‘’ధానేశ్వరం’’దగ్గర యమునా నది ఒడ్డున ఉండేది .ఈ రెండు పట్టణాలను శ్రీ శంకరులు పేర్కన్నారు .వీటన్నిటి వలన తేలిన విషయం –శ్రీ శంకర భగవత్పాదులు పాశ్చాత్యుల లెక్క ప్రకారం క్రీ శ లో పుట్టిన వారు కానే కాదు. క్రీ.పూ .500ప్రాంతం వారు .ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే క్రీ పూ 509 కి చెందిన వారు .
ఆధారం –శ్రీఅనుభవానంద స్వామి వారి’’ సర్వ సిద్ధాంత సౌరభం’’ .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-21-ఉయ్యూరు
శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గార్కి వినమ్రతతో,
ఆర్యా,
నా పేరు ఆర్. వి. యస్. చౌదరి. వయస్సు 70 సం|| లు.సెంట్రల్ గవర్నమెంట్ లో ‘సివిల్ ఇంజనీర్’గాపనిచేసి యున్నాను. మా స్వగ్రామము కృష్ణాజిల్లా-తిరువూరు దగ్గర లక్ష్మీపురము. ప్రస్తుతము హైదరాదులో ఉంటున్నాను. సంస్కృతభారతి వారి సౌజన్యంతో సంస్కృతం నేర్చుకుంటున్నాను.
తమరు “సరస భారతి” ఇ-మెయిల్ ద్వారా పంపుతున్న సమాచారము గొప్పగా ఉంటున్నది. తమరుచాలా సేవచేస్తున్నారు మన తెలుగువాళ్ళకు, మాలాంటి వాళ్ళకు.
శ్రీ శంకర భగవత్పాదులు క్రీ. పూ. 509 కిచెందిన వారు అని వ్రాసారు. చాలా గొప్ప సమాచారము.
మన చరిత్ర, సంస్కృతి నాశనమయ్యాయి – తురుష్కల వలన, ఆంగ్లేయులవలన, మనపాలకుల (మోడీ గారి కంటే ముందు) వలన.
నాకు చాలా సమాచారము తెలుసుకోవాలని ఉన్నది. మచ్చుకుకొన్ని:
1. ‘అష్టాధ్యాయి’ సంస్కృతవ్యాకరణము రచించిన పాణిని మహర్షి ఏ కాలం నాటి వాడు?
2. ‘అష్టాధ్యాయి’ కి భాష్యము (మహా భాష్యము) రచించిన పతఞ్జలి మహర్షి ఏ కాలం నాటి వాడు?
3.(పతఞ్జలి) యోగసూత్రములు రచించిన పతఞ్జలి మహర్షి ఏ కాలం నాటి వాడు?
4. ఈ పతఞ్జలి మహర్షి అ పతఞ్జలి మహర్షి ఒకరేనా?
5.చక్రవర్తి అశోకుడు ఏ కాలం నాటి వాడు? ఆయన నిజ చరిత్ర ఏమి?
ఆర్యా, నాకు సరియైన సమాచారము దొరకడం లేదు. ఈ సరియైన సమాచారముఎచట దొరుకుందో చెప్పగలరు.
భవదీయుడు.
ఆర్. వి. యస్. చౌదరి
మీ సందేహాలకు నాకు తెలిసిన సమాధానాలు -పాణిని క్రీ.పూ.350 వాడు
2-పతంజలి క్రీ.పూ.184వాడు పాణిని వ్యాకరణానికి చూర్నిక అనే భాష్యం రాశాడు యోగ
వైద్య శాస్త్రాలనూ రాశాడు .
3-అశోకుడు క్రీపూ.304-232 వాడు అశోకుని చరిత్ర అంతా నిజమే -దుర్గాప్రసాద్
Virus-free.
http://www.avast.com
On Mon, May 3, 2021 at 11:59 AM సరసభారతి ఉయ్యూరు wrote:
>