ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -25
20వ శతాబ్ది సాహిత్యం -17
నాటక సాహిత్యం –రెండవ ప్రపంచ యుద్ధానంతర నాటక కర్తలలో ఇద్దరురుముఖ నాటక రచయిత యూజీన్ ఓ నీల్ తో సరి సమాన గౌరవం పొందారు .అందులో ఒకడు అయిన ఆర్ధర్ మిల్లర్ తన మనసులోని ఆధునికత .ప్రజాస్వామ్య కాన్సెప్ట్ అయిన ట్రాజెడీ ,అబ్స్త్రాక్ట్ ,అలిగారికల్ గానే అనేక వ్యాసాలలో వివరి౦చాడు .ఈ భావనలన్నీ తన అసామాన్య నాటకం –డెత్ ఆఫ్ ఎ సేల్స్ మాన్ నాటకం లో -1949లో బయట పెట్టాడు.మిల్లర్ డ్రామాలన్నీ 1930 నాటి హెన్రిక్ ఇబ్సన్ కుటుంబ సమస్యాత్మక నాటకాలు లాగానే ఉంటాయి.ముఖ్యంగా క్లిఫ్ఫోర్డ్ ఆర్డేట్ ను పోలి ఉంటాయి .కాని మిల్లర్ తన నాటకాలకు మెటాఫిజికల్ రంగు అద్దాడు 1947లో మిల్లర్ రాసిన ఆల్ మై సన్స్ నుండి 1968లోని దిప్రైస్ వరకు నాటకాలు చాలా బలంగా తండ్రీ కొడుకుల మధ్య బాంధవ్యాన్ని ఆనాటి అతి భయానక డిప్రెషన్ నేపధ్యం లో చూపించాడు. మిల్లర్ అసమ్మతి నిరసన స్వరాన్ని స్పష్టంగా ప్రకటించాడు. 1953లో రాసిన –ది క్రూసిబిల్ లో సేలెం విచ్ ట్రయల్స్ గా మెకార్ధీ కాలపు దెయ్యపు పాలన పై విరుచుకు పడ్డాడు .
రెండవ నాటక కర్త –టెన్నెస్సీ విలియమ్స్ ఒకే మాదిరి రచనలు చేయకపోయినా మిల్లర్ కంటే శక్తివంతమైన ,ప్రభావ శీలి అయిన నాటక కర్త అని పించుకొన్నాడు .ఆడ వారి పాత్ర చిత్రణ లో గొప్ప మెళకువలు చూపాడు .మనసుకు హత్తుకొనే కవితాత్మక వాక్యాలు ,దక్షిణ ప్రాంతపు ట్రాజిక్ విజన్ లను –డి గ్లాస్ మేనేజేరి -1944,ఎ స్ట్రీట్ కార్ నేమ్డ్ డిజైర్ -1947,కాట్ ఆన్ ఎ హాట్ టిన్ రూఫ్ -1955,ది నైట్ ఆఫ్ ది ఇగువాన -1961 నాటకాలలో ప్రదర్శించాడు .అతని పాత్రల కలలు ,భ్రాంతులు ,ఫ్రస్ట్రేషన్ లు ,జీవన పోరాటం లో ఓడిపోవటాలు మొదలైన వాటిని తన స్వంత కలలు,నిరాశా నిస్పృహలకు షార్ట్ ఫిక్షన్ లో ప్రాణం పోశాడు .వీటిలోంచే తననాటకాలకు ఇతి వృత్తాన్ని తీసుకొన్నాడు కూడా .
మిల్లర్ ,విలియమ్స్ లిద్దరూ పోస్ట్ వార్ ధియేటర్ ను 1960 దాకా దున్నేశారు .వీరిద్దర్నీ చాలెంజ్ చేసే కొద్దిమంది నాటకకారులు వచ్చారు.1962లో ఎడ్వర్డ్ అల్బీ చిన్న నాటకాలు –ది జు స్టోరీ -1959,ది అమెరికన్ డ్రీం-1960లతో స్థిర స్థానం సాధించి ,హు ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ వర్జీనియా ఉల్ఫ్ నాటకాన్ని యూరోపియన్ నాటకకర్తలైన సామ్యుల్ బెకెట్ ,యూజీన్ అయోనేస్కో ల ప్రభావం తో అమెరికా ధియేటర్ లో అతి ముఖ్య పాత్ర పోషించాడు .కాని క్రమ౦గా క్రేజ్ ,రెప్యుటేషన్ తగ్గుతూ 1964లో రాసిన టైని ఆలీస్ ,1966లోని ఎ డెలికేట్ బాలెన్స్ నాటకాలతో పతనం చెందాడు .కాని గోడకు కొట్టిన బంతి లాగా ఓ నీల్ లాగా 1994 ఆటో బయగ్రాఫికల్ నాటకం త్రీ టాల్ వుమెన్ ‘’నాటకం తో పూర్వ వైభవంపొందాడు .
off బ్రాడ్వే అసెండేన్స్ –అమెరికన్ డ్రామా కేంద్రం బ్రాడ్వే నుంచి off off బ్రాడ్వే కు జాన్ గీల్బెర్ రాసిన –ది కనెక్షన్స్ -1959,నాటకం తో మారింది .అమెరికన్ నాటక కర్తలు లివింగ్ ధియేటర్,ఓపెన్ ధియేటర్ మరికొన్ని సాహస కొత్త కంపెనీలతో కలిసి ఉచితంగా రాడికల్ సృజనాత్మక నాటకాలు రాయటానికి ఒప్పందాలు చేసుకొన్నారు .డేవిడ్ బేబ్ 1974లో రాసిన –ది బేసిక్ ట్రెయినింగ్ ఆఫ్ పావ్లో హమ్మెల్,స్టిక్స్ అండ్ బోన్స్-1972నాటకాలు అమెరికాదేశపు మిలిటరీ నేషనలిజాన్నీ,సాంస్కృతిక శూన్యాన్నీ ఎత్తిచూపే వ్యంగ్యాత్మక నాటకాలు .డేవిడ్ మామేట్ నాటకకర్త –న్యూయార్క్ డ్రామా క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ ను 1976లో రాసిన ‘’అమెరికన్ బఫ్ఫెలో ‘’నాటకానికి పొందాడు .గ్లెంగర్రీ గ్లెన్ రాస్ 1984 మొదలైన నాటకాలలో మనషులు ఎలా ఆశలు ,నిరాశలు సూటిగా కాకుండా వాలుగా మర్మ గర్భ మాటలతో వ్యక్తం చేస్తారో చూపాడు .1992లో రాసిన –ఒలియన్నా నాటకం లో సెక్సువల్ హరాస్మెంట్ పై జెండర్ వార్ చిత్రించాడు .
అమిరి బరాకా (లి రాయ్ జోన్స్),ఎడ్ బుల్లిన్ లు ఇద్దరూ యాంగ్రీ బ్లాక్ నేషనలిస్ట్ దియేటర్ ను ప్రభావితం చేశారు .బరాకా రాసిన –డచ్ మాన్ ,దిస్లేవ్-1964 నాటకాలలో జాతి విద్వేషం ప్రతిబింబిస్తే ,బుల్లిన్ రాసిన –ఇన్ ది వైన్ టైం-1968 నాటకం లో వీధి గీతాలను –స్ట్రీట్ లిరిసిజం ను ప్రయోగించాడు .మేరియా ఇరీన్ ఫార్నెస్1977లో రాసిన ఫెఫు అండ్ హర్ ఫ్రెండ్స్ నాటకం లో మహిళల రిలేషన్ షిప్ ల అన్వేషణ జరిగింది .కనుక off బ్రాడ్వే నాటక ఆధిక్యత 1979లో అమెరికన్ డ్రామా చరిత్రలో పెరిగి ,సాం సేఫార్డ్ అనే ఫలవంతమైన ప్రయోగాత్మక నాటక రచయిత రాసిన –బరీ చైల్డ్ నాటకం పులిట్జర్ బహుమతి పొందింది .షెఫర్డ్ అంతకు ము౦దురాసిన –ది టూత్ ఆఫ్ క్రైం-1972నాటకాలు రాక్ నేపధ్యం ,1960నాటి కౌంటర్ కల్చర్ ను,అమెరికన్ వెస్ట్ లోని మిత్నిక్ వరల్డ్ ను ప్రత్యక్షం చేశాయి .ఆఫ్ బీట్ డ్రామాలతో యితడు శిఖరాగ్రం చేరాడు . తీవ్రమైన ఫామిలి కాన్ ఫ్లిక్ట్ –కర్స్ ఆఫ్ ది స్టార్వింగ్ క్లాస్ -1976,ట్రూ వెస్ట్ -1980,ఫూల్ ఫర్ లవ్-1983,ఎ లై ఆఫ్ ది మైండ్ -1986,నాటకాలలో ఉన్నాయి .
అమెరికన్ డ్రామాలో కొత్త స్వరాలు లాన్ఫోర్డ్ విల్సన్ ,రాసిన టాల్లీస్ ఫాలీ-1979నాటకం పులిట్జర్ పొందింది .జాన్ గువారే 1971లో రాసిన హౌస్ ఆఫ్ గ్రీన్ లీవ్స్ లో సీరియస్ ఫార్స్ చేస్తే ,సిక్స్ డిగ్రీస్ ఆఫ్ సెపరేషన్ -1990లో ఫ్రెష్ సోషల్ డ్రామా గా రాశాడు .నిటోజేక్ శాంఘే –కోర్ పొయెం-‘’ఫర్ కలర్డ్ గర్ల్స్ హు హావ్ కన్సిడర్డ్ సూసైడ్ /వెన్ ది రెయిన్ బౌఈజ్ ఎనఫ్ ‘’నాటకాలు బ్రాడ్వే నుకూడా కుదిపేశాయి .స్త్రీ నాటక కర్తలలో మార్షా నార్మన్ ,బెత్ హెన్లి,టినా హవ్,వెండి వాసర్ స్టెయిన్ ఉన్నారు .మా రైనీస్ బ్లాక్ బాటం -1984,ఫెన్సేస్-1987,నాటకాలకు పులిట్జర్ ప్రైజ్ పొందాడు.జో టర్నర్ కం అండ్ గాన్ -1986,రాశాడు .ఆగస్ట్ విల్సన్ బ్లాక్ ప్లే రైట్ గా1980లో ఆవిష్కారం పొంది ,20వ శతాబ్దం లో ప్రతి దశకానికి సంబంధిన విషయాలను నాటకంగా మలచి ,1990లో రాసిన దిపియానో లెసన్ నాటకానికి రెండవ పులిట్జర్ ప్రైజ్ అందుకొన్నాడు .ఈవిధంగా ఆశతాబ్దికి చెందిన పది దశకాలకు సంబంధించి పది డ్రామా సైకిల్ ను 2005లో తనమరణానికి కొద్ది కాలం ముందు రాసి పూర్తి చేశాడు .ఆగస్ట్ విల్సన్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-5-21-ఉయ్యూరు