రెండు రోజుల వ్యవధిలో నలుగురు కళాకారుల మరణం
1-సుమధుర సినీ గాయకుడు ,స్వరమాధురి స్రష్ట శ్రీ జి .ఆనంద్ ,2-విజయవాడ రేడియో నాటక రంగానికి వెన్నెముక ,ప్రయోక్త ,సౌమ్యుడు ,పెరాలిసిస్ వచ్చినా ,ధైర్యంతో అధిగమించి రేడియో నాటక సేవ చేస్తున్న , మాజీ స్టేషన్ డైరెక్టర్ ,అందరిచేతా ‘’పాండు రంగ ‘’గా పిలువబడే శ్రీ పి.పాండురంగా రావు ,3-కూచి పూడినాట్యాచార్య ,అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి కార్యదర్శి,వైవిధ్యభరిత ,పలుభాషల నాట్య ప్రదర్శనలు కూచిపూడిలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ సిద్ధేంద్ర కళాక్షేత్రానికి ,నాట్యాచార్యునిగా సేవలందిస్తూ ,తమ ఇలవేల్పు అయిన శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి దేవాలయానికి వంశ పారంపర్య ధర్మకర్త ,కృష్ణా విశ్వ విద్యాలయ కాంపస్ ను కూచిపూడిలో ఏర్పాటు చేయించి విద్యార్ధులకు శిక్షణ నిస్తూ ,ప్రతియేటా కూచిపూడిలో నాట్యోత్సవాలు నిర్వహిస్తూ ,ఇతర సాంప్రదాయ నాట్య కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయిస్తున్న ,విస్తృత ప్రజాసంబందాలతో తలలో నాలుకలా ఉంటున్న సౌజన్య శీలి ,అలుపెరుగని కళా మూర్తి శ్రీ పసుమర్తి కేశవ ప్రసాద్ ,4-దాదాపు అర్ధ శతాబ్దిగా నాటక రంగం ముఖ్య౦ గా పౌరాణిక నాటక రంగానికి విశిష్ట సేవలందిస్తూ ,తెలుగు పద్యాన్ని హృదయంగమంగా ,అర్ధ, భావ గాంభీర్యంతో గానం చేస్తూ ,మైక్ తో పనిలేకుండా వేలాది ప్రేక్షకులను అలరిస్తూ ,93ఏళ్ళ వయసులోనూ ఎక్కడా స్వరంలో మార్పులేకుండా,పలు పౌరాణిక నాటక పాత్రల పద్యాలను సుమధురంగా గానం చేసే ,సహృదయులు ,విజ్ఞానఖని ,అవిశ్రాంత నటులు,పరిచయం అయి రెండేళ్ళు మాత్రమె అయినా ,,15రోజులకొకసారి ఫోన్ చేసి ఆత్మీయంగా పలుకరించే , శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వర రావు గార్లు రెండు రోజుల వ్యవధిలో మరణించటం తెలుగు కళా రంగానికి తీరని ,పూడ్చరాని లోటు .వారందరికీ ఉత్తమ గతులు కలగాలని ,వారి కుటుంబాలకు సాను భూతి తెలియ జేస్తున్నాను .
గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-21-ఉయ్యూరు
చాలా చాలాబాధాకరమైన విషయము. వారి కుటుంబీకులకు మా ప్రగాఢ సంతాపములు.
ఆర్. వి. యస్. చౌదరి, హైదరాబాదు