అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య
శ్రీశంకర సాహిత్యం
‘’శ్రీ శంకరుని గూర్చి ఏం చెప్పగలం?పరమ పావన ఉదకాలై ,పర్వతం నుంచి జాలువారే నిత్య స్రవంతులుగా ఉపనిషత్తులకు ,మిక్కిలి ప్రశా౦త అరణ్య సరోవరమైన భగవద్గీతకు ,చివరికి అగాధ కాసారమైన బ్రహ్మసూత్ర భాష్యాలకు ,తన కరుణామయ ప్రజ్ఞా సంపదనుంచి వివేక చూడామణిని ,కాల మత్సరం అనే మలినం నుంచి కాపాడిన ధర్మపాలకుడు శంకరులు ‘’అని పొంగిపోయి కీర్తించాడు డా.చార్లెస్ జాన్స్టన్ తన ‘’శంకరాచార్య ఆఫ్ ఎస్.ఎస్.ఎస్ .శాస్త్రి పుస్తకం లో .వేదా౦తార్ధ రస సంరక్షకుడై ,భారతీయ తత్వ శాస్త్ర నిర్మాతలలో అతి ముఖ్యుడై ,తాను ఆ ఆధ్యాత్మిక ఆనందం లో మునిగి ఉండే సాధరనానుభవజ్ఞుడి లాగా ఉండిపోయే తృప్తి పొందకుండా ,ఆ ఆనంద విభూతులను అసాధారణ ప్రజ్ఞతో శ్రుతి,యుక్తి ,అనుభవ బద్ధం చేసి ,శ్రుతులకు ఆధారాలుగా ఉపనిషత్తుల భాష్యం రాసి ,అనుభవ సారంతో భగవద్గీతకు భాష్యాన్ని అందరికి ఉపయోగపడేట్లుగా రచించారు శంకరులు ‘’అని కొనియాడాడు జి.తిబౌట్.ఆయన మాట ప్రకారం శంకరులు ‘’Un doubtedly occupies high rank ‘’నిస్సందేహంగా శంకరులు అత్యున్నతస్థానం ఆక్రమించారు .
‘’Bewitching and marvelous and simple .It is at once the language of the child ,and the philosopher is one ‘’శంకరులశైలి సమ్మోహనమై అద్భుతమై స్పష్టంగా శిశు భాష లాగా ,తత్వ వేత్త భాష తో ఏకమై ఉండటం చేత అత్యంత ప్రశస్తి పొందాయి ఆయన రచనలు ‘’అన్నాడు సి యెన్ కృష్ణస్వామి అయ్యర్ .చిత్త సంస్థితి కి శైలినే భావిస్తే అది శంకరునిలో పుష్కలం .అత్యున్నత భావాలను అతి సులభాభాషలో చెప్పటం లో బహు నేర్పరి ఆయన .ఏ దృష్టి తో చూసినా ,ఆయన రచనలు కొద్దిగా చదివినా ,ఆయన శ్లోకాలు విన్నా ,అది అరుదైన అదృష్టమే ‘’అంటాడు కృష్ణస్వామి అయ్యర్ .’’ఆయన రచనలు కేవలం యుక్తి యుక్తంగా మాత్రమె గాక ,’’but rather that of a scientific treatise ‘’అవి శాస్త్రీయ రచనలు నిగూఢాలు,.కాని ఆయన వివరణం స్పష్టం తేట తెల్లం ‘’’’clear and transparent ‘’అని మెచ్చాడు మాక్దోనాల్ద్ పండితుడు .’’In clearness of vision ,singleness f purpose ,clarity and depth of the style of expression few if any can rival Shankara ,while none has excelled him ‘’ ఆయన భాష్యం ప్రసన్న గంభీరం .విస్పష్ట దృక్పధం లో ,ఏకీ కృత సంకల్పం లో ,శైలిలో ఉన్న ఆగాధత్వం,స్పష్టత్వంలలో కొందరు ఆయనతో పోటీ పడవచ్చుకానీ ,ఎవ్వరూ ఆయన్ను మించిపోలేరు .ఈరాచనా విధానానికి అనుకూలం గా ,ఇతరులు తమ జీవితాలను ప్రారంభించని లేత ప్రాయం లోనే సర్వ సంగ త్యాగం చేసి ,,తన జీవిత కార్యాన్ని ముగించిన ఆ లేత యవ్వన సన్యాసి కి అద్భుత ఆకర్షణ శక్తి ఉన్నది ‘’అన్నారు ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి గారు .
శంకరుల రచనలను 1-భాష్యాలు 2-ప్రకరణాలు 3-స్తోత్రాలు గా విభజించవచ్చు .వీటికి కాల నిర్ణయం చేయటం చాలా కష్టం .దీనిపై పండితులు అనేక ఊహాగానాలు చేశారు .దాని ప్రకారం శంకరుల విష్ణు సహస్రనామ భాష్యం అన్నిటికంటే ము౦దురాశారు .భగవద్గీతా భాష్యం చివరకు రాశారు .కానీ అది ఉచితం కాదు స్తోత్ర రచనలతో ప్రారంభించి ,క్రమంగా ప్రకరణ భాష్య రచనలు చేశారు అని భావించటం సరైనది అన్నారు శ్రీ అనుభవానంద స్వామి.
శ్రీ శంకర భాష్య గ్రంథాలు
‘’ఈశ కేన కఠప్రశ్నముండ,మాండుక్య తిత్తిరః-ఐతరేయం చ ఛాందోగ్యం,బృహదారణ్యకం దశః ‘’అని 10 ముఖ్యమైన ఉపనిషత్తులున్నాయని ముక్తికోపనిషత్ చెప్పింది .ఇవికాక నృసింహ తాపిన్యుప నిషత్తు శ్వేతాశ్వరోపనిషత్తు ,సనత్సుజాతీయం, ఆధ్యాత్మ పటలం ,హస్తామలకీయం ,విష్ణు సహస్రనామం ,లలితా త్రిశతి ,బ్రహ్మ సూత్ర శారీరకం ,భగవద్గీత అనే మొత్తం 19గ్రంథాలకు శంకరులు భాష్యాలు రాశారు .ఇందులో 1-రూఢిగాశంకర రచనలు 2-సంశయాస్పదాలు 3-ఇతరాలు అని ఉన్నాయని ఎస్ కే బెల్వార్కర్ పండితుడు తెలిపాడు .బ్రహ్మ సూత్ర ,దశోపనిషత్,గీతా భాష్యాలు శంకరులు రాసినవే అని గట్టిగా భావించాడు .కానీ ఉపనిషత్ భాష్యాల విషయాలపై కొంత సందేహం ఉంది .శంకరులు మొత్తం 108ఉపనిషత్తులకు భాష్యం రాయలేదు .వాటిలో దశోప నిషత్తులకు మాత్రం భాష్యం రాశారు .శ్వేతాశ్వతర ,నృసి౦హ తాపీనులకు రాసి ఉండరని ఆతర్వాత వారు రాసి ఆయనపెరుపెట్టారని ఊహించాడు .మా౦డూక్యకారికా భాష్యం కూడా శంకర కృతం కాదన్నాడు .కారణం భాష్యరచనంలో తేడా ఉండటం అన్నాడు .కానీ ఇంతమాత్రం చేత ఇవి శంకర రచనలు కాదనటం సముచితం కాదన్నారు శ్రీ అనుభవానందులు .అద్వైతం లో పూర్వ ఆచార్యుల భావాలను శంకరులు ఉపయోగించుకొన్నారు .శంకరులు రాయలేదని 31 గ్రంధాలను బెల్వార్కర్ త్రోసి పుచ్చాడు .సాంఖ్యయోగ సంబంధం వాత్సాయన కామశాస్త్రం ,అమరుక శతకం శంకరకృతం కాదంటాడు .
శంకర భాష్య రచనా విధానం తర్వాత తెలుసుకొందాం
ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి ‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-21-ఉయ్యూరు