కొత్త శకం –కొత్త కొలమానం
కరోనా వైరస్ వలన మానమంతా ఒక కొత్త విషయానికి అలావాటు పడ్డాం .మళ్ళీ మన ముసలి తలిదండ్రులయెడ అలాగే ఉందామా ?కొత్త ఆలోచనలకు ,నూతన అవగాహనలు ఇదే మనకున్న మంచి అవకాశం .మానవులం గా మన పాత పద్ధతులను మార్చుకోవాల్సిన తరుణం .సమూల మార్పుకోసం ఆలోచంచాల్సిన సరైన సమయం ఇదే అని మర్చి పోరాదు.సమాజం,శాంతి లపై కొత్త దృక్పధం ఇప్పుడే రావాలి .
మానవులం గా మనం ఉన్నతమైన విజ్ఞానానికి శిక్షణ ,పెంపకం ఇచ్చుకోవాలి .సమస్యలను హాయిగా పరిష్కరించుకొనే బుద్ధి మానవ జాతికి పుష్కలంగా ఉంది .కాని ఏవేవో కారణాలవలన అది మూసుకు పోయింది లేక గందర గోళం లో పడిపోయింది .ఆణుశక్తి ఉత్పాదన తర్వాత ప్రముఖ సైంటిస్ట్ ఆల్బర్ట్ అయిన్ స్టీన్ ‘’అణుశక్తి కనిపెట్టిన తర్వాత మన జీవిత విధానం తప్ప అంతా మారిపోయింది .మనం భావనకు అందనంత సంక్షోభం లోకి నెట్టి వేయబడుతున్నాం .కనుక ఇప్పుడు మానవాళి బ్రతకటం కోసం మనకు కొత్త ఆలోచనలు రావాలి ‘’అన్నాడు .
ఇప్పుడు మనం కోవిడ్ 19వైరస్ ప్రభావం లో ఉన్నాం .అది మానవ జీవిత విదానాలన్నటిపైనా తీవ్ర ప్రభావం చూపింది .దీని విపరీత పరిణామం కోట్లాది జనులకు ధనాదాయం లేక ,ఆరోగ్యంలేక , చివరికి ప్రాణాలు కోల్పోవటం జరిగింది.గ్లోబల్ సొసైటీ సహకారం లేకుండా ఈ సంక్షోభం నుంచి మనం బయటపడలేము .అందుకని మనం కొత్త నిర్వాహక విధానం అంటే మానెజీరియల్ అప్రోచ్ ను స్వీకరించాం .లేక మనం నిజం గా లోతైన మార్పుల్ని చూస్తున్నామా ?ఏ ఆకస్మిక విపత్తయినా ,మనకు పునరాలోచనకు అవకాశమిస్తుంది .అందుకే మనకు కొన్ని ఆశావహ ధనాత్మక మార్పులు కనిపిస్తున్నాయి .ఉదాహరణకు కమ్యూనికేషన్ తగ్గటం ,కుటుంబంతో హాయిగా గడిపే సమయం పెరగటం ,పచ్చదనాన్ని పెంచుకోవటం ,గాలి కాలుష్యం తగ్గిపోవటం .అంతేకాదు డబ్బుతో మాత్రమె సంతోషాన్ని ఆరోగ్యాన్ని కొనుక్కో వచ్చు అనే భ్రమ తొలగింది .సంక్షేమం కోసం డబ్బుబాగా ఉపయోగపడుతుందని తెలుసుకొన్నాం .కొన్ని ప్రభుత్వాలు తమ ప్రజల ఆరోగ్యం ,భద్రత లపై కాకుండాతమ ఆర్ధిక స్థితిని పెంచుకోవటం లో శ్రద్ధ చూపాయి .
వైరస్ అనేది మెడికల్ ,సోషల్ కూడా ..సందర్భాన్ని బట్టి విజ్రుమ్భిస్తుంది .ఇవాల్టి పరిస్థితిలో గ్లోబల్ పర్యావరణం ,మానవ సమాజం విపరీతమైన పెళుసుతనం అంచున (ఫ్రగైల్)ఉన్నాయి .ప్రతి ఏడూ అత్య౦త శక్తివంతమైన కొత్త టెక్నాలజీ ని అభి వృద్ధి చేస్తూనే ఉన్నారు .యువత ఇదివరకు ఎన్నడూ లేనంత నూతన సాంకేతిక విద్య నేరుస్తూనే ఉన్నది.కానీ సహజ ప్రకృతి వనరులు అంటే అడవులు, పచ్చగడ్డిమైదానాలు ,నదులు సముద్రాలు అన్నీ పూర్వం కంటే అధికమైన దారుణ స్థితిలో ఉన్నాయి .ఆహరం మంచినీరు ఆరోగ్యం ,శక్తిజనకాలు ,భద్రతా మొదలైనవి దినదిన గండంగా జీవితం గడిపే కోట్లాది మానవులకు గగన కుసుమంగా ఉంది.నిరక్షరాస్యులు ,యేవో నాలుగు అక్షరాలూ నేర్చినవారి బతుకులు ఆరోగ్య హీనంగా గాలి బతుకులైపోయాయి .విద్యా ఆరోగ్యభద్రత వారికి అందుబాటులో లేనేలేవు.చాలా ప్రాంతాల్లో విపరీతమైన హింస రాజ్యమేలుతోంది .బుద్ధిజీవులైన మానవులు యుద్ధ ప్రాంతాలలో ,శరణార్ధ శిబిరాలలో జీవితాలను వ్యర్ధం చేసుకొంటున్నారు .
మనం ఈ లోకానికి ఎలా వచ్చామో అర్ధం చేసుకొంటే ,మనం సర్దు బాటుకు అలవాటు పడతాం .ఈ విషయం లో కరోనా వైరస్ మనకు జ్ఞాన కాంతి నిస్తోంది .అధిక, అనవసర ప్రయాణాలు ,మైనారిటీల భోగ విలాస జీవితం,గృహం ఆరోగ్యం ,ఆదాయం లో విపరీతమైన వ్యత్యాసాలు ,ఆధార వలయాలు ,ఆలోచనలేని అర్ధరహిత ప్రభుత్వ నిర్ణయాలు ,స్థూల కాయత్వం –ఒబీసిటి,కాలుష్యం మొదలైన భౌతిక విషయాలపై అవగాహన బాగా పెంచుకొనే సావకాశమిచ్చింది .
పరిస్థితి విపర్యం పారడాక్సికల్ గా ఉంది. కారణం ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలలోఅంటే విద్యా వైద్య పారిశ్రామిక రంగం లోని పని చేసే వారంతా తమకు తమ తోటి వారికీ యుద్ధం కంటే శాంతినే కోరతారు .ఆకలిబాధతోమరణం కంటే సంక్షేమమే వా౦ఛిస్తారు ,రోగాలకంటే మంచి ఆరోగ్యాన్నే కోరుకొంటారు .సద్భావన ,ప్రయత్నలోపం వలన సంక్షోభం తలెత్తదు.పరిస్తితులు చాలా సంక్లిష్టమై ,అధిగమించరానిదై అఖండమై తామే సృష్టించుకొన్న సంక్షోభాన్ని ఉపశమింప జేసుకోవటానికి అధిగమించటానికి శక్తికి మించినదైఉంటుంది .బ్రేకులు లేని రైలు అగాధం అంచుకు చేరితే ,దాన్ని సారైన సమయం లో ఆపటానికి ఎవరూ సమర్ధులు కాలేరు
అయినా మనకు ఇంకా ఒక అవకాశం ఉంది .ట్రెయిన్ ను ఆపవచ్చు బ్రేకుల్ని రిపైర్ చేయచ్చు .రైలు మార్గాన్ని వెనక్కి మరల్చవచ్చుకూడా ,వీలయితే నడిపే డ్రైవర్ ముసలాడు అయితే అతడిస్థానం లో వేరొకర్ని నియమించవచ్చుకూడా . మానవులు అఖండ మేధావులు అపూర్వ సృష్టికర్తలు .అద్భుత చాతుర్యం కలవారు .మరోఉత్కృష్ట ప్రపంచ నాగరకత ను సృజి౦ప గలరు ,ఇప్పటికే మనం సాంఘిక సంక్షేమం ,స్త్రీవాదం ,పచ్చదనం పరిశుభ్రత ,శాంతి క్రియాశీలత ,అంతర్జాతీయ సహకారం మొదలైన మార్గాలను ప్రయత్నించాం .కాని దురదృష్ట వశాత్తు అవేవీ పని చేయటం లేదు అనుకొన్న ఫలితాలు కల్గించలేదు .ఒకవేళ అవి బాగా పని చేసి ఉండక పోవనూ వచ్చు .సంక్షోభాన్ని అతిపెద్ద ఎత్తున నివారించే సమర్ధత చూపించలేక పోవచ్చు .ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వనప్పుడు మళ్ళీ ఆ మూస విధానాలనే అనుసరించటం విజ్ఞత అని పించు కొంటు౦దా?ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసి పునరాలోచించుకొనే అత్యవసర సమయం వచ్చిందని మనమందరం గ్రహించాలి
సశేషం
ఆధారం –అలాన్ హంటర్ వ్యాసం –న్యూ ఎరా న్యు డైమెన్షన్
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-5-21-ఉయ్యూరు