కొత్త శకం –కొత్త కొలమానం -3
నైతికత
చాలామందికి మంచితెలివి తేటలుంటాయి ,కానీ వాళ్ళు వినాశకర పద్ధతులలోనే వ్యవహరిస్తారు లేదా సరైన నిర్మాణాత్మక మార్గం లో పనిచేయరు .వాళ్ళ తెలివి తేటల్ని నేర ప్రవృత్తిలో,పర్యావరణ నాశనం లో ,ఇతరులను తిట్టటం లో ఉపయోగిస్తారు .అన్ని దేశాల సంస్కృతిలో మానవులు ధర్మపరులుగా ,ఇతరులఎడ దయా సానుభూతి పరులుగా ఉండమనే మౌలిక సిద్ధాంతం .ప్లేటో వేదాంతి భావనలో ‘’మంచిగా ఉండటం అనేది కేంద్రం గా ఉండాలి .అన్ని సంస్కృతులకు ఇదే స్వర్ణ నియమం .చైనావేదాంతం మరింత ముందుకు వెళ్లి నీతిని ,దయాగుణాన్ని మేధస్సు పెంచాలని చెప్పింది .కంఫ్యూషియస్ వేదాంతి సిద్ధాంతం లో మేధాస్సుసరైన న్యాయ నిర్ణయాలు ,తీర్పులుచేయాలని అందుకే మేధావి అంటే కలవరపాటు(పెర్ప్లేక్సిటి) లేని వాడు అన్నాడు .మేధావి మంచి చెడులపై తన తీర్పుపై తొట్రుపాటు పడరాదు .కానీ ఇది పేర్కొన తగిన సూక్తికాదు.ఇవాల్టి గ్లోబల్ క్రైసిస్ అనైకత ,దయా రాహిత్యం లపై స్థాపించబడింది .ఇదంతా మేధావుల దురాశా, ద్వేషాలపై నిర్మాణమైంది.
ప్రకృతి
మానవాళి ఈ భూమిపైకి వచ్చిన కొత్త ,పరిపక్వం కాని జీవరాశి .పరిపక్వత లేనివారు ప్రకృతిని జయి౦చ గలమని అనుకొంటారు .నేను అంతముసలి వాడిని కాకపోయినా ,నాకున్న అనుభవాన్ని బట్టి వాళ్ళు ప్రకృతిని జయించలేరు .అది అసాధ్యం కూడా .మనలో ఏ ఒక్కరికన్నా ప్రకృతి బలీయమైనది ,గొప్పది .మనం డబ్బు బాగా సంపాదించవచ్చు ,చాలా మంది డాక్టర్లను ఏర్పాటు చేసుకోవచ్చు .గొప్ప సంపూర్ణాహారాన్నితినవచ్చు .దంతాలు కట్టించుకోవచ్చు .పిర్రల్ని మార్పించుకోవచ్చు.కానీ మనం ముసలితనానికి దగ్గరవటం చావటం తధ్యం .ప్రకృతి అంటే ఇదే .అది వ్యాధికాదు.ఆరోగ్యకరమైనది . ఈ విషయం మనకు తెలిసినా మర్చిపోతాం మనం .
జీవులు ఆహార అన్వేషణలో అడవుల్ని సముద్రాలను నాశనం చేస్తూ ఉంటాయి .ఇది ఇలాగే చిరకాలం కొనసాగితే దారుణంగా మారి మహా విపత్తును(కెటోష్ట్రఫీ) కలిగిస్తుంది .దీనికి సాక్ష్యం గా మనదగ్గర సరైన శాస్త్రీయ ప్రతిపాదన ఇప్పటికి లేదుకానీ ,మనందరికీ తెలుసు ,మనం అనుభవిస్తున్నాం కూడా .పాశ్చాత్య పర్యావరణ వేత్తలు దీనిపై గత వందేళ్లుగా చర్చిస్తూనే ఉన్నారు .వాళ్ళకంటే ముందున్న చైనాలోని క్వింగ్ వంశ పండితుడు లియు ఇమింగ్ ఈ విషయాన్ని అనేక సార్లు చెప్పాడు –మానవ మేధస్సు వేగవంతమైనదీ ,సృజనాత్మకమైనదీ ,కాని తేలికగా నాశనమౌతుంది .దానికి స్వీయ క్రమ శిక్షణ కావాలి ,ప్రకృతిపిలుపును శ్రద్ధ గా వినాలి .అప్పుడే ఒక రకమైన సమతుల్యత ,సామరస్యం ,శాశ్వత ఆనందం లభిస్తుంది .
కనుక ప్రాకృతి వనరులను నాశనం చేయరాదు .ముఖ్యంగా మానవ జాతి దీన్ని ఖచ్చితంగా పాటించాలి .కానీ వాళ్ళు మనమాట పెడ చెవిన పెడుతున్నారు.కనుక మన తెలివి తేటల్ని పునః రూప కల్పన చేసుకోవాలి .దీనికి మనం ముఖ్యంగా చేయాల్సిందిమనం నాశనం చేస్తున్న ప్రకృతి మాట వినాలి .
స్థిరమైన ఊహలు
మొదట్లోనే మనం ఆయిన్ స్టీన్ గురించి చెప్పుకొన్నాం .ఆయనకు సహకరిస్తూ నడిచిన డేవిడ్ బోమ్ –David Bohm లండన్ యూనివర్సిటి దీరిటికల్ ఫిజిక్స్ ప్రొఫెసర్ .ఈయన ఫిలాసఫర్,కాస్మాలజిస్ట్ కూడా .ఆయన ‘’చెప్పుకోదగిన గుర్తింపదగిన ఒక ఇంటలిజెన్స్ మనలో ఉంది .దాన్ని దాటి ఇప్పటిమానవులు ఉపయోగిస్తున్నారు .మనం దాన్ని అందుకొక పోవటానికి ముఖ్యకారణం మనకున్నపరంపరాగతంగా సంక్రమించిన అధికారుల విధానాలు అనే స్థిరమైన భావనలో బందీ గా ఉండిపోవటమే .వీటినే ఆయన ఫిక్సెడ్ అసంప్షన్స్అన్నాడు .ఆర్ధిక విధానాలలో ముఖ్యమైన ప్రమాదం అవి అప్రకటిత ఊహారూపం లో ఉండిపోవటమే .అవి స్వయం సమృద్దినిచ్చేవి స్వయంగా నేరవేర్చేవి అనే విషయం తెలియక పోవటమే.మానవులు తమ ఊహను పరీక్షించుకొని ,అప్పుడు అదే యదార్ధం అనుకొంటారు .కనుక ఇప్పుడు ఈస్థితిలో మనం అన్వేషకులం అవ్వాలి .బుద్ధి ఒక స్థిర అభిప్రాయానికే పాతుకు పోకుండా,ఇరుక్కుపోకుండా అన్వేషణకు సిద్ధపడాలి.మానవ జాతి చరిత్ర సమస్తం అపస్మారక స్థితి లో లేక స్థిరంగా ఉన్నఅంటే బ్లాకై పోయిన కదలని ఊహల సముదాయమే .నిజానికి మానవులు ఈ ఊహలనుంచే మొదలుపెడతారు అవి తమలోనే ఉన్నాయనే స్పృహ లేకుండానే .పగ్గాలకు కట్టి వేయబడినవే ఇవి .మనమంతా ఏదో విధంగా బోనులో లేదా ఉచ్చులో పడిపోయాం అనే ఫీలింగ్ లో ఉంటా౦ అన్నాడు .
ముఖ్యమైన విషయం ఏమిటి అంటే –మనం సరైన దారిలో నడవటం లేదు వారిని కుట్రపాలు చేయటం లోనే ఉంటున్నాం .మూడు లోకాల భ్రమ నాకిష్టం-ఆవే భ్రాంతి ,మాయ ,కలయిక (ఇల్యూజన్, డెల్యూజన్, కొల్యూజన్ ) ఆట అన్నమాట. తప్పుగా ఆడటం ఇల్యూజన్ ,అవగాహనతో ఆడటం డెల్యూజన్ ,ఆలోచనతో ఆడటం కొల్యూజన్ .తమ భ్రమలనుఇల్యూజన్ డెల్యూజన్ లను సమర్ది౦చు కోవటానికి మనిషి తప్పుగా ఆడుతాడు .సమాజమంతా కొల్యూజన్ లోనే అంటే తప్పుడు ఊహలలోనే ఉంది .ప్రతి సమాజం లోనూ ఈ తప్పుడు ఊహలు చాలా ఉన్నాయి .కొందరుమాత్రమే వీటిని ప్రశ్నిస్తారు ,మరికొద్దిమంది మాత్రమె ఇంకొంచెం ఘాటుగా విమర్శిస్తారు .కనుక మనమే మనల్ని తప్పుడు విధానం పైఆదారపడిన ,స్వీయ మోసపూరితమైన ,ఇతరులను మోసపుచ్చే జీవితం విలువ ఏమిటి , అని ప్రశ్నించుకోవాలి ‘’అన్నాడు లండన్ సైంటిస్ట్ ,ఫిలాసఫర్ కాస్మాలజిస్ట్ David Bohm.
ఆధారం – అలాన్ హంటర్ వ్యాసం –న్యు ఎరా న్యు డైమెన్షన్
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-21-ఉయ్యూరు