కొత్త శకం –కొత్త కొలమానం -4(చివరిభాగం )
మానవాళికి మేధా శక్తి లోపం ఏమాత్రం లేదు .నిజానికి పుష్కలం గా ఉంది .అది ఒక్కోసారి ఇవల్యూషన్ కు దె బ్బకోడుతోంది .దానికి నైతికత సానుభూతి లోపిస్తోంది .ప్రకృతిపై దురహంకారం పెరిగి ,పాత గట్టి వాటినే అంటుకొని పోతోంది .కనుక మనం విపత్తు అనే నిద్రలో నడుస్తున్నట్లు ప్రవర్తిస్తాం . నిద్రలేపటానికి ఇదే సరైన సమయం మిత్రులారా గుర్తించండి .అనేక సందర్భాలలో మనకున్న మేధస్సును సరిగ్గా అర్ధం చేసుకొని తగినట్లుధనాత్మకంగా ప్రవర్తించటం లో ఉపయోగించలేకపోతున్నామని రుజువయ్యింది .అంటేమన తెల్వి తేటల్ని పెంచుకొని సరైన నిర్ణయం చేసేవిగా వాడటం లేదన్నమాట .అలా ఎలా కొత్తగా చేయవచ్చో ఇప్పుడు మనం తెలుసుకొందాం .
కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)
కొద్దికాలం లోనే మనం మానవ మేధస్సు కంటే మిలియన్ రెట్ల శక్తి సామర్ధ్యాలున్న కంప్యూటర్ లను వాడబోతున్నాం .దీనితో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మానవ మేధస్సు ను దాటిపోబోతోంది .భూమిపై అధిక మేధ ఉన్న వస్తువులు ఆటోమాటిక్ గా వాటి పనులు అవి చేసుకు పోతాయి .అప్పుడు మానవులకు తామేమి చేస్తున్నామో తెలియని వింత స్థితి ఏర్పడుతుంది .జీవ సంబంధికాకుండా బాగా అభి వృద్ధి చెందిన కృత్రిమ మేధస్సు వలన శక్తి వనరుల లో నానో టెక్నాలజీ , బయో టెక్నాలజి, రోబోటిక్స్ లో పెను మార్పులు తెస్తున్నాయి .ఇదంతా మహా అద్భుతంగా అత్యంత ఆశాజనకం గా అనిపిస్తుంది. అవాక్కై పోతాం . మానవ సంక్షేమానికి దాన్ని ఉపయోగించి నియంత్రించ గలగటం అత్యంత క్లిష్టం .ఇది తెలియకపోతే మళ్ళీ మనం అణుశక్తికి సమాంతరంగా ప్రయాణించి భారీమానవ హనన ప్రేలుడు పదార్ధాలు తయారుచేసే దశలోకి వెడతామని జాగ్రత్త పడాలి .లేకపోతె మన వినాశాన్ని చేజేతులా మనమే తెచ్చుకొన్న వాళ్ళం అయిపోతాం .
మొక్క ,జంతు మేధస్సు
మన పూర్వీకులకు మొక్కలో జంతువులో వాటివాటి అంతశ్చేతన ఉన్నట్లు చాలాకాలం క్రితమే తెలుసు .ఈతరం మనుషులమైనమనం కొత్త టెక్నాలజీ వ్యామోహంతో వాటితో కమ్యూనికేట్ చేయలేక పోయాం .ఇది తెలిసిన వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో మొక్క జంతువులతో సహజీవనం చేస్తున్నారు వాటి హృదయ ఘోష వింటున్నారు .బుద్ధిజీవులం అనుకొంటున్నమనం వాటిని సంహరిస్తున్నాం .ప్రస్తుత వైరస్ మనల్ని దూర దూరంగా ఉంచుతోంది .భూమి అధిక జనాభాతో నిండిపోతే ,వినాశ విధానాలు మనం అమలు చేస్తుంటే మనం ఆరోగ్యం గా ,వివాద రహితంగా ఉండగలమా ?ఈ సంక్లిష్ట సమస్యా పరిష్కారానికి ప్రకృతి ఇప్పటికే కోట్లాది పరిష్కారాలు అందించింది .అవి చూసి తెలుసుకొని మన అవసరాలకు అనుసరిస్తే మంచిది .సహజ నివారణ ప్రకృతికి ఉన్న అతంత శక్తివంతమైన విధానం .దానితో నూతన సమతుల్యాలను నిరంతరం నెలకొల్పుతూ ఉంటుంది .సైన్స్ మాత్రం జీవిత రహస్యం లో అతి తక్కువ శాతాన్ని మాత్రమె బహిర్గతం చేయగలుగు తుంది .
కనుగొన బడని మేధస్సు
భూగ్రహం మనకు ఎందరో స్త్రీ పురుషులనిచ్చింది .వీరు జాగృతి లేక మేధో సామర్ధ్య లక్షణాలు (జీనియస్ )కలిగి ఉన్నారు .అవి సహజ సిద్ధంగా ,అంతరంగికంగా నైతికతమానవ విలువలను కలిగి ఉన్నవారే .అలాంటి ఉన్నత సహజ మేదను మొరటుగా మనం తిరస్కరిస్తే ,మళ్ళీ అది మనకు లభ్యం కాదు .అది పిడివాదంగా ముద్రపడి సామాన్యులకు పనికిరాని చపల ,విపరీతమైన చేష్ట అనిపించుకొంటుంది .ఈరకమైన ఋణాత్మక తీర్పులు సహజ సిద్ధ మేధస్సును అడ్డుకొని అభ్యుదయానికి తోడ్పడదు .విద్య లక్ష్యం పరమార్ధం ఇదికాకూడదు కారాదుకూడా .
విద్యా విజ్ఞానం
అన్ని దేశాలలో విద్యకు అత్యంత ప్రాముఖ్యం ఉందికాని ఎప్పటికప్పుడు నవీకరణం చెందటం అంటే అప్ డేటింగ్ జరగటం లేదు .ఇప్పుడు మనం ఉన్నత మేధస్సు ను మన జీవితాలలోకి ముఖ్యంగా యువకుల మనస్సులలో కి ఆహ్వానించాల్సిన సమయం వచ్చింది .సాధారణ విద్యా విధానం ఉండనే ఉంది .బోధకులు పుస్తకాలు చర్చలు గోష్టులు జరుపుతూనే ఉంటారు .కొత్త ఆలోచనలకు ఆహ్వానం పలికి ఆదరించి ఆమలు చేయాలి. ఆ ఆలోచనలు మానవ సంబంధంగా సృజనాత్మకం గా ,పర్యావరణ జీవావరణ సంక్షేమ౦గా ఉండాలి .ఈ జాగృతం మన ఇంట్లో బడిలో సమాజం లో స్నేహితులలో బంధువులలో కలిగించటమే ప్రధమ కర్తవ్య౦ .
ఐడియా బాగానే ఉంది ఎలా చేయాలి అనేది సమస్య .శాంతి సహృద్భావ చేతనా ,,మరింత ఉన్నత జాగృతి .మరికాస్త అనుకూలంగా సామరస్యంగా మేధో వికసనం జరగాలి .దీనికోసం కొత్త కర్రిక్యులం ,బోధనా సామర్ధ్యం పెంచటం పోటీలు నిర్వహించటం వంటివి అక్కర్లేదు .మనదరికి డబ్బు సంపాదన ఒత్తిడి ,మనం ఎంచుకున్న రంగం లో పని సామర్ధ్యంలో నేర్పు చూపించటం,మానవత్వంతో తోటివారికి సేవచేయాలనే కోరికా, ఉంటుంది .మనం అనేక సాంఘిక ఒత్తిళ్ళు మనపై ఇంటా బయటా పని చేస్తూ ఉంటాయి .కాని మనం మార్పుకు భయపడరాదు.అది సహజం ఆరోగ్యకరం కూడా .
ప్రపంచం లోని యువత అంతా చాలాస్మార్ట్ గా ఉంది .వాళ్లకు నువ్వేమీ చెప్పక్కర్లేదు వాళ్లంతకు వాళ్ళే నేర్చుకోగలరు .వాళ్ళు నిజాయితీగా హృదయపూర్వక౦గా ,వినయంగా హృదయం లో ముఖంలో చిరునవ్వు తో దయాగుణం గా ,దురాశ,భయం కన్ఫ్యూజన్ లేకుండా తాము అవగాహన కలిగి ఉంటామనే భావం తో చేయాలి ,చేస్తారు కూడా .వారిని ప్రభావితంచేసి , ప్రేరేపించటానికి ఇది చాలు .మనం శాంతి గురించి ప్రబోదించవచ్చు .అది చాలా గౌరవ ప్రదమైన ముఖ్యమైన విషయమే .శాంతి అనేది విజ్డం కంటే ,మనసుకంటే గొప్పది .మనం ఊహించని మార్గాలలో అది విశేషంగా అనూహ్య రీతిలో ప్రవహించి , స్వయం గతంగా ,ప్రకాశమానమై ఉంటుంది .శాంతియుత మనసు బుద్ధి ఉన్న వారిలో మాత్రమె అది అభి వ్యక్తమౌతుంది (మానిఫెస్ట్ ) .
మనం మనకు తెలియకుండానే ,ఒక్కోసారి చాలా ఉదారంగా,స్వీకరణ విధానంగా వ్యవహరించవచ్చు .ఒక్కో సారి ఆబ్స్ట్రాక్ట్ లేక లోతైన విషయాలను అధ్యయనం చేస్తూ బిజీగా ఉండచ్చు .కాని మనం ఫ్రీగా ,మనమంతా ఫ్రీగా ఉండే హక్కు మనకు ఉన్నది .ఉన్నత చేతనవైపు ఉత్తమ జీవిత విధానం వైపు ,మరింత పారదర్శక మనస్సు వైపు మనమనస్సులను ట్యూన్ చేసుకొంటే మనకు తప్పకుండా ఆకస్మిక (స్పాంటేనియస్ )ఖచ్చితమైన సమాధానాలు లభిస్తాయి .ఇది ఏ రాజకీయ ఎజెండాకు,జాతీయతకు ,వయసు జెండర్ ,మతాలకు అందనంత ఉన్నతంగా ఉంటుంది .
లాటిన్ భాష లో ఇంటలిజెన్స్ కు అర్ధం ‘’అంతరార్ధం గ్రహించటం ‘’(టు రీడ్ బిట్వీన్ ది లైన్స్ ‘’అనే అర్ధం కూడా ఉంది .ప్రత్యక్షంగా చెప్పబడిన దాని వెనుకఉన్న నిగూఢ రహస్య సత్యాన్ని ఆవిష్కరించటం అన్నమాట .ప్లేటో విధానం లో ‘’సంఘటనలను లోతుగా చదవటం కాదు అందులో నిక్షిప్తమైన ఉన్నత మేధను దర్శించటమే ,కనిపించని దానిలోంచి తొంగి చూడటమే ఇంటలిజెన్స్ అంటే .కనుక ఇప్పుడు మనకున్న విపత్తు కలిగించే కరోనా వైరస్ ను పూర్తిగా అధ్యయనం చేయాలి .దానినుంచి శాంతి సంజ్ఞలను కనుక్కోవాలి .ఆ వైరస్ చాలాసూక్ష్మమైనదే .అలాగే సూక్ష్మ విషయాలు కూడా విస్తృతంగా వ్యాపిస్తాయి .దీనినుంచి అత్యంత ఉన్నత అవగాహన పొందటానికి గొప్ప అవకాశం మనకు లభించింది .మనమందరం పరిశోధించి ఎదురు చూసే నూతన సమాధానాలు రాబట్టే వీలు దొరికింది .’’ఇదే కొత్త శకం అయితే, మనకు తప్పక కావాలి నూతన కొలమానం ‘’.
సమాప్తం
ఆధారం –అలాన్ హంటర్ వ్యాసం –న్యూ ఎరా,న్యు డైమెన్షన్.
రేపు 4-6-21 శుక్రవారం శ్రీ హనుమజ్జయ౦తి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-6-21-ఉయ్యూరు.