శుద్ధ స్వచ్చ విద్యావేత్త ,బహుముఖీన ప్రతిభా పా౦డిత్యాలున్న విద్యాగురువు శ్రీ సోమంచి రామం(95) స్వర్గస్తులయ్యారు
కృష్ణా జిల్లా పరిషత్ షత్ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి ,ప్రదానోపాధ్యాయులై ,సమర్ధత తో అందరినీ ఆకర్షించి ,కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘానికి అధ్యక్షులై దక్షతతో నడిపి ,ఆంద్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ కార్యదర్శి ఆపైన అధ్యక్షులుగా పని చేసి అన్ని జిల్లాలోనూ తమ ముద్ర వేసి ,విద్యారంగ పురోభి వృద్ధికి అను నిత్యం పాటు పడి ,నాకూ శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి శ్రీ కోసూరు ఆదినారాయణ రావు శ్రీ వైవి రాజు ,శ్రీశర్మ ,శ్రీమతి ప్రమీలారాణి, శ్రీమతి భారతి, శ్రీమతి కస్తూరి మొదలైన మా సహచరులకు మార్గదర్శిగా ,గాడ్ ఫాదర్ గా వ్యవహరించిన కథా రచయిత, బాల వాజ్మయ కర్త, రేడియో ప్రయోక్త ,ప్రదానోపాధ్యయులకు కరదీపిక రాసి ,రూల్స్ విషయాలుకరతలామలకం అయెట్లు చేసి ,కర్తవ్య నిర్వహణ సామర్ధ్యం పెంచుకోవటానికి తోడ్పడి ,జిల్లా ,రాష్ట్ర .కేంద్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ్ ఉత్తమ ప్రధానోపాధ్యాయ వంటి అనేక సత్కారాలందుకొని ,కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘానికి నూత్న మార్గదర్శకత్వం కలిగించి ,సంస్థను జవ జీవాలతో తొణికిసలాడేట్లు చేసి ,జిల్లాస్థాయి ,రాష్ట్ర స్థాయి అధికారులకు తలలో నాలుకగా ,ఉపాధ్యాయ ప్రధానొపాధ్యాయులకు అత్యంత సన్నిహితంగా , రిటైరీలకు చేయూతగా ఉంటూ ,వారి సమస్యలపై కథలు నాటికలు రాసి ఎంతో సాహిత్యాన్ని సృష్టించిననా ,ఒక్క పుస్తకం కూడా అచ్చువేసుకొని ,మా సారధి సచివులు మార్గదర్శి ,ఆత్మీయులు ,జిల్లాలో రాష్ట్రం లో విద్యారంగ వ్యాప్తికి అభి వృద్ధికి అలుపెరుగని సేవలందించి సెమినార్లలో ,,సదస్సులలో ,సిలబస్ నిర్మాణం లో,ప్రశ్న పత్రాల మార్పులో ,భారమైన సిలబస్ ను కుదించటం లో విలువలతో కూడిన విద్యను బోధించటం లో తనదైన శైలిని ప్రదర్శించి,ప్రతిఫలం ఆశించక అంకిత భావంతో సేవలందించిన ,అందరికీ ‘’సోమంచి రామం ‘’గా అతి సన్నిహితులైన శ్రీ సోమంచి శ్రీరామ చంద్ర మూర్తి గారు ఈ రోజు 11-6-21 శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో కుమారుని స్వగృహం లో 95వ ఏట మరణించినట్లు మిత్రుడు శ్రీ కోసూరు ఆదినారాయణ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు .శ్రీ రామం గారికి ఉత్తమ గతులు కలగాలని కోరుతూ వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .
సుమారు రెండేళ్ళ క్రితం వారిని బందరులో ఫోర్ట్ రోడ్ లో ఉన్న వారి స్వగృహం లో కలిసి మాట్లాడాను .వారి శ్రీమతి గారు మాకందరికీ గురుపత్ని లాంటి వారు సౌమ్యులు ,ఆదర్శ ధర్మపత్ని .ఆదంపతులతో ఫోటోలుతీసుకోన్నాను. ఆ ఫోటోలు పోస్ట్ లో వారికి పంపాను కూడా .
రామంగారి సంతానం పూనుకొని తమతండ్రి చేయలేక పోయిన పనిని అంటే రామంగారి అమూల్యమైన సాహిత్యాన్ని ముద్రించి లోకానికి అందించమని మనసారా కోరుతున్నాను
గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-21