“సరసభారతి 158వ కార్యక్రమంలో భాగంగా ఉగాది పురస్కారాలు ఆదివారం నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించడమైనది. ఈ సంవత్సరం ఏప్రియల్ 4వ తేదీ జరగవలసిన కార్యక్రమం కరోనా వ్యాప్తి కారణంగ వాయిదావేసిన ది 27-6-2021 నాడు స్థానికులను ఆహ్వానించి వారికి ఉగాది పురస్కారాలను సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రంలో ముఖ్య అతిధిగా సరసభారతి గౌరవ అధ్యక్షులు శ్రీమతి శ్యామలాదేవి, జాగృతి కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు శ్రీమతి పామర్తి రాజీవి విచ్చేశారు. పురస్కార గ్రహీతలు శ్రీమతి జె శ్యామలాదేవి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. దివి చిన్మయ, విసిశ్ట్ట సామాజికవేత్త- మాజీ గురజాడ సర్పంచ్ శ్రీ జంపాన శ్రీనివాస గౌడ్ ప్రముఖ సాంఘిక, ధార్మిక, సాంస్కృతిక సేవాకర్త శ్రీ వెంట్రప్రగడ వీరాంజనేయులు,ఇంటర్నేషనల్ బ్రాహ్మణ పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర కార్యదర్శి శ్రీ దినవాహి నాగ ప్రసాద్ మా ఉయ్యూరు హ్యూమన్ కంప్యూటర్ బిల్ కలెక్టర్ (విద్యుత్ బిల్ ) శ్రీ ధేనువుకొండ సుధాకర్ రాజు, ఆయుర్వేద వైద్య సహాయకుడు శ్రీ వణుకూరు యజ్న గురుప్రసాద్ఎలెక్ట్రికల్ నిపునుడుశ్రీశిరిగుడి సురేష్ గార్లకు సరసభారతి అధ్వర్యంలో ఘనంగా శాలువాతో,సరసభారతి పుస్తకాలతో సత్కరించారు . ఈ కార్యక్రమంలో సరసభారతి కార్యదర్శి శ్రీమతి శివలక్ష్మి ,కోశాధికారి శ్రీ జివి రమణ పర్యవేక్షణలో కార్యక్రమ నిర్వహణ స్వామి వారల సమక్షం లో జరిగింది”అనతరం అందరికి విందు ను ఏర్పాటు చేశారు .
గబ్బిట దుర్గా ప్రసాద్ 28-6-21-ఉయ్యూరు