విద్యార్ధులకు ,ఉపాధ్యాయ ప్రదానోపాధ్యాయులకు మార్గ దర్శి శ్రీ ఉమా మహేశ్వరరావు
ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ,పెద్దలంటే అత్యంత భక్తి ప్రపత్తులు చాటుతూ విద్యార్ధులకు విద్య ,అందునా గణితం గరపటమంటే అమితాసక్తి ఉన్నవారు ,,అంకితభావం తో ఉద్యోగ నిర్వహణ ,చేస్తూ ,మా అందరికీ తలలో నాలుకగా వర్తించే ,లేక్కలమేస్టారు, ఆతర్వాత హెడ్మాస్టారు అయిన శ్రీ గోపిశెట్టి ఉమామహేశ్వరరావు గారు కిందటి శనివారం జూన్ 26 న అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ తో మరణించినట్లు ఇంతకు ముందే శ్రీ కోసూరు ఆదినారాయణ రావు గారు ఫోన్ చేసి చెపితే నిశ్చేష్టుడ నయ్యాను .సుమారు నెలరోజులక్రితం ఆదినారాయణ ,ఆయన ఉయ్యూరు వచ్చి మమ్మల్ని’’ పరామర్శించి’’ వెళ్ళిన దృశ్యం ఇంకా కనుమరుగు కాలేదు .ఇంతలోనే ఈ విషాదం .ఈమధ్యనే మా మార్గదర్శి శ్రీ సోమంచి రామం గారు ,కృష్ణాజిల్లా టీచర్స్ గిల్డ్ కార్యదర్శి గా అధ్యక్షులుగా విద్యారంగానికి సేవ చేసిన వారు శ్రీ తోటకూర అప్పారాయ వర్మ గారి మరణం విద్యారంగానికి పూడ్చరాని తీరనిలోటు .
కృష్ణాజిల్లా కోసూరు లో ఉంటూ కృష్ణాజిల్లాపరిషత్ లెక్కల మేష్టారుగా ,ఆపై హెడ్ మాస్టర్ గా విశిష్ట సేవల౦ది౦చినవారు శ్రీ ఉమా .మాతోపాటు కృష్ణాజిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుగా ఉంటూ ఎన్నో విలువైన సూచనలు మార్గదర్శకాలు అందించిన సునిసిత మేధావి శ్రీ ఉమామహేశ్వరరావు .ఆ చిరు దరహాసమే ఆయనకు లాండ్ మార్క్ .అదే అందరితో ఆత్మీయతకు దారి తీసింది గలగలమట్లాడే తత్త్వం .ఎంత కష్టమైనా గణిత సమస్యనైనా సులభంగా సుబోదాం గా చెప్పే నేర్పు ఆయనది .దీనికి మా మిత్రుడు శ్రీ ఆదినారాయణ ఆయనకు ప్రేరణ, ఉత్తేజం .మేమంతా రిటైరైనా ఎదో కొంతవరకు విద్యారంగానికి మా శక్తికొలదీ సాయం చేయాలనీ శ్రీ రామంగారు ,నేనూ ఆదినారాయణ ,శర్మ ,ఉమా మహేశ్వరరావు ,, వైవి రాజు, విశ్వం రాజేంద్రప్రసాద్ , ప్రమీలారాణి సుగుణకుమారి కస్తూరి ,భారతీ దేవి మొదలైన’’ ముసలి ఉత్సాహవంతులం ’ ‘’విద్యారంగం పై అమితాసక్తి ,తీర్చిదిద్దాలనే తపన ఉన్న తెన్నేరు వాస్తవ్యులుశ్రీ దేవి నేని మధు సూదనరావు గారి ఇంట్లో కనీసం ఆరు నేలలకోకసారైనా సమావేశమై చర్చిస్తాం .మా అందరి బదులు మధుసూదనరావు గారు తమకున్న పలుకుబడితో మా ఆశయాలకు రూప కల్పన చేసి,అమలు పరచేట్లు చేస్తూ విజయం సాధించి ఆ విజయం మాకందరికీ అంట గడుతున్నారు .ఆదినారాయణ ,రామం విశ్వం ,ఉమా మహేశ్వరరావు గార్లు జిల్లాపరిషత్ అధికారులతో జిల్లా విద్యా శాఖాధికారులతో మంచి సంబంధాలు పెట్టుకొని ,విద్యారంగ సమస్యలు పరిష్కరించేవారు .జిల్లా పరిషత్ లోని ఏస్కూల్ లో నైనా లెక్కల ,ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయులు లేకపోతె వెళ్లి క్లాసులు బోధించి పబ్లిక్ పరీక్షకు తయారు చేయించేవారు .ఆదినారాయణ తాను పని చేసి రిటైరై చాలా యేళ్ళయినా పెదముత్తేవి ఓరిఎంటల్ హై స్కూల్ లో రోజూ ఒకటి రెండు గంటలు ఇంగ్లీష్ బోధిస్తూనే ఉన్నారు .అదీ వారిద్దరి విద్యాసేవ .
శ్రీ ఉమా రిటైర్ అయి మేనేజిమెంట్ ఒత్తిడితో చల్లపల్లి దగ్గర చాలాపెద్ద ప్రైవేట్ హై స్కూల్ లో ప్రాదానోపాధ్యాయులుగా సర్వ సమర్ధంగా పని చేసి సత్తా నిరూపించుకొన్నారు .మొవ్వ ,చల్లపల్లి మండలాల రిటైర్ ఉపాధ్యాయ సంఘానికి ఇంకా సేవ చేస్తూ ,ప్రతిఏడాది సమావేశాలు నిర్వహిస్తూ వృద్ధులను సత్కరిస్తూ జిల్లాకే ఆదర ర్శంతీర్చిదిద్దుతున్నారు ఈ బృందం లోనివారు .ఉచిత ఆరోగ్య కాంపులు,ఉచిత కంటి పరీక్షలు రాజమండ్రి గౌతమీ హాస్పిటల్ వారి ఆధ్వర్యం లో నిర్వహింప జేస్తూ ,ఉచిత ఆపరేషనలు చేయిస్తున్నారు .రిటైరీలకు అండగా ఉంటున్నారు .శ్రమే దైవం అనుకోన్నవారికి విశ్రాంతి ఎందుకు ?ఈ విధంగా విద్యారంగ సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్న శ్రీ ఉమామహేశ్వరరావు గారి మరణం ఆత్మీయులైన మాకందరికీ తీరని బాధగా ఉంది. వారి ఆత్మకు శాంతికలగాలనీ ,వారికి ఉత్తమగతులు కల్పించాలని భగవంతునికోరుతూ ,వారి కుటుంబానికి సాను భూతి తెలియ జేస్తున్నాను .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-21-ఉయ్యూరు