అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -7
ఇలయనార్ దేవాలయం ను శేషాద్రి స్వామి రాత్రి వేళ దర్శించేవారని చెప్పుకొన్నాం ఈ ఆలయ విశేషాలేమిటో తెలుసుకొందాం .ఇలియనార్ అంటే చిన్నవాడు అని అర్ధం .కంబత్తిల్ ఇలయనార్ అంటే స్తంభం లో కనిపించిన చిన్నవాడు .ప్రౌఢ దేవరాయలకాలం లో అరుణ గిరి నాధుడు అని ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి భక్తుడు అరుణగిరి వాసి సుబ్రహ్మణ్యం .తమిళం లో వేలాది కీర్తనలు రాశాడు వాటిని ‘’తిరుష్టు గల్’’అంటారు .వీటికే అరుణగిరికీర్తనలు అంటారు .మనత్యాగయ్యగారికీర్తనల్లాగా అవి ద్రావిడ భాష లో ప్రఖ్యాతి పొందాయి .రాయలకు అరుణగిరి నాథునిపై అమిత భక్తీ .సంబంధ అండా అనే జైనుడికి ఇది ఇష్టం గా లేదు .ప్రౌఢ దేవరాయలు ఒకసారికోలువులో అరుణగిరీశ్వరుని పొగడగా సంబంధ అండా’’మీ దేవుడికి అంతమహిమ ఉంటె చూపించండి ‘’అనగా రాయలు స్వామిని ప్రార్ధించి దర్శనమిమ్మన్నాడు .’’స్వామి దర్శనాన్ని నువ్వు భరించలేవు ‘’అన్నాడు స్వామి .’’నాకళ్ళకు ఏమైనా ఫర్వాలేదు .చూడాల్సిందే ‘’అన్నాడు రాయలు .స్వామి ఆయన కోరికమన్నించి ఒక స్తంభం లో చిన్నపిల్లాడుగా దర్శనమిచ్చాడు .అందుకే ఆక్షేత్ర స్వామిని కంబత్తిలయనార్ అంటారు .
దివాన్ బహదూర్ సుందర శెట్టి 1909-10లో తిరువన్నామలై న్యాదికారికి శేషాద్రి స్వామిని దర్శించాల్నే కోరిక ఉండేది .ఒకరోజు స్వామి ఆయన ఇంటికి వెళ్ళారు .మర్యాద చేసి ఆతిధ్యం తీసుకోమనికోరగా సరే అని విస్తరిముందు కూర్చుని భోఅనం చేస్తూ మెతుకులు అటూఇటూ చల్లారు .తర్వాత కొత్త పంచను స్వామికి చెట్టి సమర్పించాడు .దాన్నికట్టుకోని శెట్టికి అ౦గ వస్త్రంగా వేసి ,తీసేసి మళ్ళీ వేశారు .ఆతర్వాత శెట్టి ఇంటినుంచి బయల్దేరాడు .1927లో శెట్టి దక్షిణ ఆర్కాటు జిల్లా జడ్జీ అయ్యాడు .కొన్ని రోజులు విశ్రాంతికోసం సెలవుపెట్టి తిరువన్నామలై వచ్చి స్వామికి నమస్కరిస్తే స్వామి అటూ ఇటూ పరిగెత్తారు .ఒకరిని వదిలి ఒకరు ఉండలేక పోయారు .శెట్టి చేతులు జాచమని చెప్పి తన చేతులతోపట్టుకొని పైకీ కిందికీ దింపారు .ఏదేదో మాట్లాడి స్వామి వెళ్ళిపోయారు .నౌకరుకు డబ్బు ఇచ్చి కొత్త వస్త్రాన్ని తెమ్మనిపంపగా అతడు రావటం ఆలస్యమవగా స్వామి వెళ్ళిపోగా ,దారిలో స్వామి అతడి దగ్గరున్న వస్త్రాన్ని తీసుకొని మెడపై వేసుకోగా చూసి శెట్టి మహదానందపడ్డాడు .సెలవుపూర్తి అయి, జాయిన్ ఆయె లోపు ఆయన కు హైకోర్ట్ జడ్జి పదవి వచ్చినట్లు వార్త వచ్చింది .ఇదంతా స్వామి అనుగ్రహమే అనుకొన్నాడు .
సబ్ ఇన్స్పెక్టర్ శివ ప్రకాశం జీతం నెలకు 75రూపాయలు .ఒక రోజుపనిమీద సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంటికి వెడుతుంటే దారిలో స్వామికనిపించి ‘’నీకు పదిరూపాయలిస్తాను తీసుకొంటావా ?’’అని అడిగితె ‘’మా సి .ఐ ,ఉన్న ఉద్యోగం పీకకుండా ఉంటె చాలు .జీతం పెంచటం కూడానా స్వామీ ‘’అన్నాడు .’’అయన ఇచ్చినా ఇవ్వకపోయినా నేనిస్తా ‘’అంటూ ఆయన టోపీ తలమీద పెట్టుకొని తన ఉత్తరీయం అతనిమెడలో వేసి ,ఇద్దరూకలిసి సి ఐ ఇంటికి వెళ్ళారు .అతనిభార్య ‘’మీకు మంచికాలం వచ్చింది ప్రమోషన్ వస్తుంది ‘’అన్నది స్వామి నవ్వుతూ తలూపారు .కాసేపు మాటలతర్వాత ఆయన తోపీ నెత్తిమీద పెట్టుకొని తన ఉత్తరీయం తీసి ‘’అందుకే పోలీసువారితో సావాసం చేయకూడదు ప్రతిదీ గుచ్చి గుచ్చి అడుగుతారు ‘’అని వెళ్ళిపోయారు .ఆరోజే అతని జీతం పదిరూపాయలు పెరిగింది .డి ఎస్పిపి కి ఇష్టం లేకపోయినా ఎ ఎస్పి రికమెండ్ చేసి జీతం పెంచేట్లు ఆర్డర్ ఇప్పించాడు .
డేనిష్ మిషన్ స్కూల్ టీచర్ వెంకటరామయ్య ను అధికారులు ఏదో సాకుతో తాత్కాలికంగాపీకేసి మూడు నెలలు జీతాలుఇవ్వలేదు కొంపగడవటం కష్టంగా ఉంది .ఒక రోజు ఆయనకు స్వామి భూతనారాయన గుడి దగ్గర కనిపించగా చెప్పులు వదిలేసి నమస్కరించగా ఒక చెప్పు తీసి ఆయన నెత్తి మీద బలంగా కొట్టారు .మాస్టారి ప్రాణాలు విలవిలలాడినాయ్ .అంతా మనమంచికోసమే అనుకోని బడికి వెళ్ళగా టేబుల్ పై ఒక కవరు ఉంటె తీసుకొని చదవటానికి గడగడ లాడి ధైర్యం తెచ్చుకొని ఎలాగో అలా తెరిచి చదివితే తనను అదే స్కూల్ హెడ్ మాస్టర్ గా ప్రమోట్ చేసి ఇచ్చిన ఆర్డర్ అది .స్వామి తనకు చేసిన పాద రక్షా పూజ ఫలితమే ఈప్రమోషన్ అనుకొన్నాడు .
ఐరావతంయ్యర్ వేలూరి స్కూల్ మాస్టర్ .శ్రీ విద్యా దీక్ష పొందాలనే కోరిక ఉండేది .ఒకసారి రమణ మహర్షిని ,గణపతి మునినీ దర్శించి కోరిక చెప్పుకొందామని తిరువన్నామలై వచ్చి అయ్యర్ హోటల్ లో కాఫీ తాగుతుంటే అకస్మాత్తుగా శేషాద్రి స్వామి వచ్చి ,అక్కడి అలమరులోని రెండుమూడు మిఠాయిలు ముక్కలు చేసి ,ఒకముక్క నోట్లో వేసుకొని మిగిలినవి ఐరావతంయ్యర్ చేతిలో పెట్టారు .అక్కడే సాగిలపడి నమస్కరించాడు అయ్యర్ .తర్వాత గణపతి ముని ఇంటికి వెళ్లి ,ఆయనకు పాదాభి వందనం చేసి లేవగా ‘’నీకు దశ పంచాక్షరి ఉపదేశిస్తా. చాలా మేలు కలుగుతుంది ‘’అని ఉపదేశి౦చగా, అదంతా స్వామి మహిమ అని గ్రహించి ఇంటికి చేరేసరికి జీతం పెరిగిన వార్త కూడా తెలిసింది .
ఒక వైష్ణవ పోలీస్ ఇన్స్పెక్టర్ కు స్వామిపై అమితభక్తి .అతడు ఒకరోజు ఎవర్నో బెత్తం తో కొడుతుంటే స్వామి వెళ్లి బెత్త౦ లాగి ఆయన్నే నాలుగు పీకారు .తప్పు చేశానేమో అని భయపడి దూరంగా వెళ్లి నిలబడ్డాడు .కొద్దిరోజులో ఆ ఇన్స్పెక్టర్ కు మైసూర్ సంస్థానం లో ఉన్నత పదవి లభించింది .
ఉద్యోగం పోయిన సబ్ మేజిస్ట్రేట్ ,పై అదికారుఅలకు అప్పీల్ చేసి స్వామి దర్సనానికి రాగా ,ఏడు రోజులదాకా స్వామి కనిపిచలేదు .ఎనిమిదవ రోజున స్వామి శివగంగ తీర్ధం లో ఉండగా దర్శించగా తన ఉత్తరీయం నీటిలో ముంచి ఆయన తలపై పిండారు .ఆయనే స్వామి అని పక్కనున్నవారు చెప్పేదాకా ఆయను తెలియలేదు .రెడురోజుల్లో ఆయన అప్పీల్ ను విచారించిన అధికారులు ఆయనకు మళ్ళీ ఉద్యోగం లో చేరే ఆర్డర్లు పంపారు .
సేలం లో పెద్ద న్యాయవాది బివి నరసింహస్వామి మద్రాస్ శాసన సభ మాజీ సభ్యుడు దేశ సేవ చేసినవాడు .ఆయనకొడుకులిద్దరూ ఆడుకొంటూ ఇంటివెనుక నూతిలోపడి చనిపోయారు .అప్పటినుంచి ఆయనకుజీవితం ఐ విరక్తికలిగి ,రమణ మహర్షిని చూడాలని వెళ్లి అనుకోకుండా శేషాద్రి స్వామిని చూసి ,మహర్షి జీవిత విశేషాలు సేకరించి జీవిత చరిత్ర రాశాడు .ఉత్తరదేశ తీర్ధ యాత్ర చేశాడు .సాయిబాబా భక్తినీ బోధనలనూ ప్రచారం చేశాడు .ఒక సారి స్వామిని దర్శించి చాలాసేపు ఇష్టాగోష్టి జరపాలనే కోరికను నారాయణ శాస్త్రి గారితో చెప్పగా ‘’మీరు రామభక్తులు కదా రామనామ జపంచేస్తే మీ సంకల్పం నెర వేరుతుంది ‘’అని సలహా ఇవ్వగా ,ఒకసారి స్వామి దర్శనం కలిగగా స్వామి మాట్లాడకుండా ‘’పూర్ణ భక్తి ఉంటె ,అన్నీ సమకూర్తాయి ‘’అని సౌజ్ఞలతో చెప్పారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-21-ఉయ్యూరు