వింత వీజీవా ?
అంటే అర్ధం కాలేదా ఇంత ఈజీయా? అని. చరణదాసి సినిమాలో రామారావు ఫోటో చూసి ‘’ఇది డాక్టర్ గారి ఫోటోవా ‘’?అని అడుగుతుంది సావిత్రి .ఒక సారి గేపకం చేసుకోండి .అక్కడినుంచి సరఫరా అయిన ‘’వా ‘’ ఇది . ఇది శీర్షికమాత్రమే .
‘’తాతయ్యా !నీ అకౌంట్ నుంచి అయిదువందలకోట్లు డికె కి ట్రాన్స్ఫర్ చేశా .’’
‘’డికే.ఎవరు దరిద్రపు నాకోడుకా ?’’
‘’అలాంటివాడే .దగుల్బాజీ నాకొడుకు ‘’
‘’నా అకౌంట్ నుంచి నువ్వు ట్రాన్స్ ఫర్ చేయటమేంటి.నాకు చెప్పద్దా.నా సంతకం వద్దా ?’’
‘’అన్నీ నేనే పెట్టాను డికే గైడెన్స్ తో ‘’
‘’దేనికే ఇ౦త డబ్బు ఏం చేద్దామని ?”’
‘’ఎలెక్షన్ లో నిలబడి గెలవటానికి ‘’
‘’నీ కింకా పదేళ్లెగా .అన్నయ్య మేజర్ ‘’
‘’నాకు పద్దెనిమిదేళ్ళు నిండినట్లు ,మేజర్ అయినట్లు డీకే డాక్యుమెంట్ తయారు చేయించాడు కనుక నో అబ్జెక్షన్ ‘’
‘’నీ కెవరు ఓటేస్తారే ‘’?
‘’వేయటం ఉండదు వేయి౦చు కోవటమే .ఇదే డీకే పధ్ధతి ‘’
‘’ఎన్నికలముందు ఎన్నెన్నో వాగ్దానాలు .రాజధాని దగ్గర్నుంచి ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ,యువతకు ఉపాధి హామీ అడుగుకోస్వంత ఇల్లు .ప్రభుత్వమే కట్టించి గృహప్రవేశం చేయించే ఏర్పాటు .తల్లికీ తండ్రికీ కాన్వెంట్ లో ఇంగ్లీష్ గర్భంతో ఉన్న తల్లికి ఇంగ్లీష్ మీడియం కోచింగ్ ,పుట్టినబిడ్డకు ఇంగ్లీష్ టీచర్ తొఆల్ఫబెట్ అభ్యాసం , ఉచితవిద్య .క్రీడాకారులకు మైదానాలపంపిణీ,స్వచ్చంద సేవకులనే పేరుతొ ప్రభుత్వోద్యాగాలు .వాళ్ళంతా పార్టీకే పని చేయాలన్న ఆర్డర్లు ,ఇలా చాలా ఉంటాయి అవన్నీ డీకే చూసుకొంటాడు .
‘’వీటికి డబ్బు ?’’
ఇసక ,గ్రావెల్ సున్నపురాయి ,పోర్ట్ లు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ లు ,ప్రభుత్వ బంగళాలు కార్పోరేషన్ స్థలాలు శ్మశానాలు కార్పోరేట్ విద్యా సంస్థలు, హోములు ట్రస్ట్ లు ఇవన్నీ స్వాధీనం, కబ్జా లతో అమ్మకాలతో .
‘’కొత్త ఫాక్టరీల నిర్మాణం ఉపాధి ఆకాశాలు ?’’
‘’పాత ప్రభుత్వ విదానాలకే కొత్త పేర్లు నాపపేరూ మానాన్నపేరు పెట్టి బ్రహ్మాండంగా లాంచ్ చేస్తాం .ఇంటింటికీ రేషన్ వాన్లతో సప్ప్లై అన్నీ దశతిరిగే ‘’దశ దిశలు ‘’ప్రణాళిక భూలోక స్వర్గమే నేను సిఎం అయితే ‘’
‘’భేతాళ,ప్రేతాలభూమి అవుతుందేమో ‘’
‘’అన్ని అనుమానాలు పడకు .డీకే హూమ్గా ‘’
‘’వీటి మీద కేసులు కోర్టులూ ‘’?
‘’పైన మనం చెబితే వినే పాలకులే ఉంటె మనకు భయమేమిటి ?జడ్జీలను మార్పిస్తాం .లేకుంట వారిపై కేసులు పెట్టించి బెదరగొడతాం .నెల నేలా ఢిల్లీ వెళ్లి పై ఇద్దరికీ సూట్ కేసులు సమర్పిస్తాం కేసుమాఫీకి ‘’
‘’మరి నీ సంపాదన ?’’
‘’నా టార్గెట్ రోజుకు అయిదువందలకోట్లు అని డీకే ఫిక్స్ చేశాడు .దానిప్రకారం మా మంత్రులుఎమ్మేలఎలు అధికారులూ వసూలుచేసి ఏరోజు కారోజు సమర్పిస్తారు .ఇదంతా స్విస్ బాంక్ అకౌంట్ లో భద్రం .లేకుంటే శంకరగిరిమాన్యాలే
‘’దేవాలయాల విషయం ‘’?
‘’ఆయనెవరో మాజీ సిఎం ఏడుకొందలాయన నాలుగు కొండలు నొక్కెసే ?’’ప్రయత్నం చేశాట్ట నీ కెరికేనా?
‘’అందుకే అధ్వాన్నపు చావు చచ్చాదనీ ఎముకలు కూడా మిగల్లెదనీ అంటారు .కొడుకే చంపించాడనీ కొందరు ,కాదు ఆనాటి పై ప్రభుత్వమే అనికొందరూ ఒక పెద్ద బిలియనీర్ అని ఇంకొందరు అని వార్తాకధనం .అయినా ఆడపిల్లవు నీకెందుకే ఈ దురద ?’’
‘’ఝాన్సీ లక్ష్మీ బాయ్, రుద్రమ దేవి నాకెందుకు అనుకొంటేచారిత్రక నారీమణులు అయ్యేవారా ?’’
‘’సడే సంబడం .ఇంతకీ తిరుపతి కొండ సంగతి ?’’
అక్కడ మనవాళ్ళే ఉంటారు లోపలాబయతా పూజారుల్లోనూ .బోలెడు హుండీ డబ్బు భక్తుల డొనేషన్లు చేతినిండా డబ్బే .’’నామాలాయనకు ‘’ఒక్క కొండమాత్రం ఉంచి మిగిలినవన్నీ అంగుళం వెయ్యిరూపాయలకు అమ్మేస్తా .బెజవాడు దుర్గామ్మకొండను ఇప్పటికే ఒకాయన దాదాపు ఖాళీ చేశాడని విన్నాను .అహోబిలం పానకాలస్వామి సింహాచలం వేదాద్రి పెనుగంచిప్రోలు అంతర్వేది మొదలైన దేవాలయాల ఆస్తులన్నీ బినామీగా మనకే వచ్చే ప్లాన్ తయారు చేశాడు డీకే .ఇంకెవరూ ఏమీ పీకలేరు .మన తరఫున ఒక పనికి రాణి స్వాములోర్ని పెడతాం .ఆయన మనకు వంత పాడుతాడు యజ్ఞాలు య్గాలూ చేయిస్తాడు గెలిస్తే తిలాపాపం తలో పిడికేడుగా ఆయన వాటా ఆయనకు చెల్లిస్తాం
‘’రాజధాని ?””
‘’ఆరు చోట్ల పెడతాం .బంగాళాఖాతం లో ప్రధాన రాజధాని ఉంటుంది .గోదాట్లో ఒకటి.నల్లమల అడవుల్లో ఒకటి ,అరకులోయలో ఒకటి ,పుట్టపర్తి లో ఒకటి .
‘’ఒక్కదానికే రూపాయి కూడా చేపని కేంద్రం ఇన్నిటికి ఎక్కడిస్తుంది ?’’
‘’మెడలు వంచుతాం .పైరవీలు చేస్తాం .ప్రాదేయపదతాం ప్రతినెలా శాలువా సూట్ కేసు సమర్పిస్తాం మోకాలు తండా వేస్తాం .ఏం మాట్లాడేమో చెప్పం .అంతా బ్లాక్ సీక్రెట్ ‘’
‘’నువ్వసలే అర్భకురాలివి ఆయనెవరో లాగా పాద యాత్ర చేస్తూ అందర్నీ కావలించుకొంటే బాగోదు .ఎలా ?
‘’ఎందరు ఎమ్మెల్యేలు గెలిస్తే అంతమంది సలహాదార్లను పెడతాను .వాళ్ళ జీతాలను చూస్తె వాళ్ళే దిమ్మ తిరిగిపోతారు .ఎం చేయాలో మేమే చెబుతాం కానీ ‘’క్రీం ఆఫ్ ఇంటలిజెన్స్’’ మాదగ్గరుంది అని బిల్డప్ ఇస్తాం ‘’
‘’అంటే జీతాలిచ్చి మేపుతూ ఏమీ చేయించరన్నమాట’’
‘’ఎక్సాట్లీ .కోర్టు కేసులకు మళ్ళీ లాయర్లు ఢిల్లీలో పెరుమోసినవాల్లనందర్నీ బుక్ చేస్తాం . మా తరఫున వాదింప జేస్తాం .వాళ్ళ ఫీజులు వింటే జనం ఫ్యూజులు మాడిపోవాల్సిందే .
‘’అలాగే చేస్తూ 150కి పైగా ప్రభుత్వం తెచ్చిన చట్టాల్ని కోర్టు లు కొట్టేశాయ్ తెలుసా ?
‘’అవన్నీ డీకే పరిధిలోవి నేను మాత్రం కుర్చీలో పైల్స్ కంప్లైంట్ వాళ్ళు కూర్చున్నట్లు కూర్చోటమే ‘’
‘’వరదలు గాస్ లీకేజీలు అగ్నిప్రమాదాలు ,కరోనా వగైరాలోస్తే ?”’
‘’కాలు తీసి బయట పెట్టను .పేపర్ స్టేట్ మెంట్లు గుప్పిస్తాను .మీడియా న౦తా కోనేస్తాను. నేను చెప్పిందే రాయాలి కాదంటే వాళ్లభరతమూ పట్టిస్తా ‘’
‘’ఇదంతా హిరణ్యకశిప, రావణ రాజ్యం గా మారుస్తున్నావేమో ఆలోచించావా ‘’.
‘’చించాను. చించే వచించాను .మనపిల్లలకు బూతులు మాట్లాడ్డం రావటం లేదు అది మన సంస్కృతికి గొడ్డలిపెట్టు .ప్రైమరీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా బూతు పంచాన్గాలే పుస్తకాలు .అవి చదివే మిగతా సబ్జెక్ట్ లు ఆప్షనల్ గా చదూకోవాలి .దీని వ్యాప్తికి ఒక ఆడ ఒక మగ బూతులమంత్రులను పెడతా .పుస్తకాలు రాయిస్తా .ఫ్రీగా సప్లై చేస్తా .బూతులు అసెంబ్లీ కౌన్సిల్ లలో తప్పని సరి చేస్తా .బూతు మాట్లాడని మంత్రికానీ శాసన సభ్యుడు కానీ మాపార్టీ లో ఊ౦డటానికి వీల్లేదు ‘’
‘’నువ్వు ఆడ పిల్లవే మరీ ఇంత బరి తెగిస్తే ఎట్లా ?’’
‘’నాతోనే బూతులు మొదలవ్వలేదు ఇప్పటికే బూతులు ధారాళంగా అసెంబ్లీలో కౌన్సిల్ లో బయటా విజ్రుమ్భించి మాట్లాడుతున్న అక్కలు ,అన్నలు చాలామందున్నారు మంత్రులున్నారు శాసన సభ్యులున్నారు,స్పీకర్లున్నారు . ఉచ్చ నీచాలు ఎంతవదిలేస్తే అంత మంచిది .అయినా వీటికో యూనివర్సిటి పెట్టిస్తాం .బూతురత్న బూతు పండిత,బూతు శరణ్య బూతు నేత,బూతు పిత బూతు పితామహ వంటి బిరుదులిచ్చి సన్మానిస్తాం వీరిని విదేశాలకూ ప౦పి౦ చి బూతు వ్యాప్తి సర్వ దేశాలలోనూ చేయిస్తాం ,కేవలం డజను మంది మంత్రులో శాసన సభ్యులో స్పీకరో మాట్లాడితే చాలదు .అదొక ఉద్యమ రూపం దాల్చాలి దానికి ఫండ్స్ వేరే ఏర్పాటు చేస్తాం ‘’
‘’పెళ్లి చేసుకొంటావా ??’’
‘’పెళ్ళా ?ఇన్ని పనులమధ్యలో దానికోసం టైం వేస్ట్ చేసుకోలేను .’’
‘’ఇంతకీ నీకు ఇన్స్పిరేషన్ ఎవరే ?’’
‘’మా నాన్న చనిపోయినా రోజూ అర్ధరాత్రి కలలో కన్పించి మాట్లాడతాడు .రోజు వారీ ఏమేం చేయాలో చెప్తాడు .ఆయన మాటే నాకు వేదం ‘’
‘’దెయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదేనేమో “”?
‘’వోటింగ్ మెషీన్లు ఉంటాయిగా అంతా నీ ఇష్టం కాదుగా వోట్ల పండక్కి ??
‘’ఆ మెషీన్లు మేమే చేయిస్తాం మా డీకే ఇందులో మహాఘటికుడు తిమ్మిని బ్రహ్మిని చేయగలడు .వాటిలో ఎవరికీ ఓటేసినా మాపార్టీ వారికే ఓటు పడే ఏర్పాటు చేస్తాం .దీనికి పై’’ ద్విమూర్తుల’’ ,పక్కరాష్ట్ర సహకారమూ డబ్బు అందించటమూ అన్నీ జరుగుతాయి .మంచి నాయకులను సేవా దృష్టి ఉన్నవాళ్ళను ఓడింటమే మా ధ్యేయం . పాపం ప్రజలు వోటు వేశామనుకొంటారు తమకు నచ్చిన నాయకుడి పార్టీకి .కానీ ఫలితాలు చూసి నోరు వెళ్ళబెడ్తారు.ఇదంతా లోపాయకారీ వ్యవహారం నీబోటి ముసిలోళ్ళ కు అర్ధం కాని ట్రెండ్ ఇది .ఇప్పుడు బీహార్ లో యుపి లో మొన్న ఎపి లో జరిగి౦ది అంతాఇదె ‘’
‘’ఎలెక్షన్ కమీషన్ ఉంటు౦ది కదే’’
‘’ఎక్కడో దూరపు రాష్ట్ర 80 దాటిన ముసలాయన్నిరాష్ట్రం లో ఎన్నికల కమీషనర్ గా వేయిస్తాం పై ‘’వాళ్ళను’’ కాకాపట్టి .వాళ్ళక్కూడా అవసరమేగా మాట్లాడరు.కరోనాకు కోవాక్సిన్ మందు అయితే ఎలేక్షన్ కు సూట్ కేసులే మందు .ఇప్పటి ట్రెండ్ ఇదే ఈ’’హవా’’నే నడుస్తోంది .
‘’ప్రజాస్వామ్యం వోటింగ్ హక్కు అని మేము జీవితాంతం పోరాడామే ఇదా నేటి రాజ స్వామ్యం అరాజక స్వామ్యం ?”’ప్రజలు వోట్లేయక్కర్లేదు ,మానిఫెస్తోలు అక్కర్లేదు పార్టీ సిద్ధాంతాలు మసిబూసి మారేడుకాయ చేయటం ,మిషన్లనే మెయింటైన్ చేయటం ,ఓటుకు పదివేలు గుప్పించటం ,గెలుపే ముఖ్యం ,డీకే లాంటి ఒకడు ఉంటె సరి .ఇదేనా నీ నీతి ?”’
‘’నేనేకాదు మహా మహా కాషాయం వాళ్ళే ‘’ఖాకీ నిక్కర్ సైన్యాన్ని’’ వదిలేసి గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రజాస్వామ్య అభి చారం ఇదే .వాళ్ళే చేస్తే ఇక మనకు తప్పేంటి ? ఆదర్శాలు వల్లి౦చ టానికే మాత్రమె. ఆచరించటానికి కాదు .’’
‘’ఈపాపం చూస్తూ అలా ఉండిపోవాల్సి౦దేనా?””
‘’ఎం చేస్తారు ప్రజలు ?.రాజదానికోసం వందలాది రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే అటు వెళ్లి పలకరించిన సినీ హీరోలు పార్టీ నాయకులే లేరు .వాళ్ళ మానాన వాళ్ళు చేస్తూనే ఉన్నారు .మీడియాకూ పట్టదు.రాజధానిలో రైతు ఉద్యమం ఉధృతంగా ఉంటె గడ్డాలూ మీసాలు పెంచటానికి తీరుబాటు గంటకోసూటు మార్చేసే నాయకులకు వారి గోడు పట్టనే లేదు .కరోనా ఒకటి రెండు వేవ్ లలో లక్షలాది మంది చనిపోతే వారి కుటుంబాలను ఆదుకొన్న ప్రభుత్వాలు లేవు .వలసకార్మికులను స్వంత ఊర్లకు పంపటానికి ఏ సోనూ సూద్ లాంటి ఉదారులే స్పందిస్తున్నారు కానీ మన రాచకీయ నాయకులు ముందుకు రావటమే లేదు .కనుక ప్రజలు స్తబ్డులై పోయారు .దబ్బనం తో గుచ్చినా వాళ్లకు ప్రజాస్వామ్య స్పృహ రాదు .ఇదే అదను నాబోటి వాళ్లకు .అయినకాడికి బొక్కి ,పైవాడి నోట్లో కొంతకుక్కి మిగిలిన వారిని కుక్కిన పేనుల్లాగా మార్చేయటం ఇప్పడు తక్షణ కర్తవ్యమ్ .అయినా ముందే చెప్పాగా మన చేతికి మట్టి అంటదు .అంతా డీకే చూస్తాడు సూపర్ మాన్ గా .ఏదైనా తేడా వస్తే వాడే జైలుకు వెడతాడు మా అధికార్లు పోతారు .మనం రాజ సింహాసనం పై చిద్విలాసం ఒలక బోస్తాం ‘’
‘’ఛీ ఛీ దేశ ద్రోహీ! ప్రజాస్వామ్య ఘాతకురాలా! .ప్రజాస్వామ్యమంటే ఇంత తేలికా ?వింత వీజీ వా ?నువ్వు బతకటానికి వీల్లేదు నేను చూస్తూ ఊరుకోను. ‘’
‘’ఏమిటండీ చూస్తూ ఊరుకోను అంటూ పలవరిస్తున్నారు .ఏదైనా పాడు కల కన్నారా ??’అనిమాఆవిడ లేపాక కాని ఇదంతా కల అనిపించలేదు .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-21-ఉయ్యూరు
.’’