అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -9
చంగల్వ రాయుడు వాత౦నొప్పుల తో బాధ పడుతు,నడవ లేకపోతుంటే ,స్వామి కాళ్ళను తడిమి తగ్గి పోతుంది అని అభయమివ్వగా తగ్గి పోయాయి .గ్రామ మునసబు కృష్ణ మూర్తి పదేళ్లుగా గజ్జితో బాధపడుతూ,స్వామిని దర్శించాలని వచ్చి హోటల్ లో కాఫీ ఆర్డర్ ఇస్తే తెచ్చిటేబుల్ మీద పెడితే శేషాద్రిస్వామి అమాంతం వచ్చి నోట్లో పోసుకోగా కృష్ణమూర్తికి కోపం వచ్చినా తమాయించుకొన్నాడు.’’వీడికి గజ్జి కదా కుంకుమపువ్వు పూస్తే పోతుంది’’అని వెళ్ళిపోయారు .ఆయనే స్వామి అని సర్వర్ చెప్పాడు .ఆయన గజ్జి దెబ్బతో తగ్గింది .
సుబ్రహ్మణ్య అయ్యర్ మరదలుకు పిశాచం పట్టి పదేళ్ళుగా బాధ పడుతుంటే ,అన్ని రకాలమందులు వాడి,తీర్ధ యాత్రలు చేసినా తగ్గలేదు పిల్లలూ పుట్టలేదు .స్వామి దగ్గరకు తీసుకు వెడితే , అయిదారు పసుపు కొమ్ములు తెమ్మని ,వాటిని తన ఛాతీకి రాసుకొని ,వాటిగంధం తీసి ఆమె ఒంటికి పూయమన్నారు .ఆపిల్ల ఆకలి ఆకలి అని పెద్ద గావు కేకపెట్టింది .అన్నం పెట్టాక ఆమెస్మృతి లోకి వచ్చి ,ఆతర్వాత ఆరోగ్యవంతురాలై సంతాన వతి కూడా అయింది ..రమణ భక్తురాలు ఎచ్చమ్మ రోజూ ఆయనకు ఆహారం పంపేది .ఒకసారి నెలరోజులు జ్వరం వచ్చి పంపలేకపోయింది .స్వామి తరచూ ఆమె ఇంటికి వెళ్ళేవారు ఒక నెలరోజులు స్వామి రాకపోతే ఆమె పెంపుడుకూతురు చెల్లమ్మ స్వామి దగ్గరకువెళ్ళివిషయం చెప్పి అమ్మ మిమ్మల్ని ఒకసారి రమ్మనమని చెప్పింది అంటే’’రేపు వస్తాను’’ అని, మర్నాడు ఉదయమే ఆరింటికే ఆమె ఇంటికి వెళ్లి పడకగదిలో ఉన్న ఎచ్చమ్మతో ‘’పెరుగన్నం తింటావా ‘’అని చెల్లమ్మను పెరుగన్నం కలిపి తెమ్మని చెప్పి ఆమె తీసుకురాగా ,ఒక ముద్ద తాను తిని మిగిలింది ప్రసాదంగా ఎచ్చమ్మకిచ్చారు .ఆక్షణం నుంచే ఆమె జబ్బు నయమవటం మొదలైంది .ఒకసారి ఆమె మనవడికి కాలు బెణికి ,ఆస్పత్రికి ఎత్తుకొని తీసుకు వెడుతుంటే ,స్వామి దార్లో కనిపించి రెండు చేతుల్తోమన్ను తీసి వాడి కాలిపై పోసి ,దానితో నుదుట బొట్టుపెట్టి ‘’ఆస్పత్రికి పోతున్నావా ఫోఫో ‘’అనగా ఆస్పత్రికి వెళ్ళగా డాక్టర్ వాడిని నడవమంటే ఏనోప్పీ లేకుండా హాయిగా నడిచి డాక్టర్ తో సహా అందరికీ ఆశ్చర్యం కలిగించాడు .
తాలూకా బోర్డ్ ప్రెసిడెంట్ వెంకట సుబ్బయ్య బామ్మర్దికి దేనిమీదా నమ్మకం లేదు .స్వామిపై భక్తీ గౌరవాలు అసలే లేవు .ఒక రోజు మధ్యాహ్నం అతనికి చేతిలో తెలుకుట్టింది .కుయ్యోమొర్రో అంటుంటే అటుగా వెడుతున్నస్వామి రాగా ‘’అందరూ మిమ్మల్ని స్వామి అంటారు నాబాధ పోగొట్టండి చూదాం ‘’అని చేతులు పట్టుకోగా ,ఎడమ చేత్తో మట్టి తీసి కుట్టిన చోట పోయ్యమనగా పోస్తూ మంత్రం చెప్పండి అనగా ‘’శేషాద్రి ‘’అని నాపేరు చెప్పు చాలు అనగా ,బాధ తగ్గి ఆతర్వాత స్వామిపై నమ్మకం కుదిరింది .
స్వామి జ్ఞాన దృష్టి
నారాయణ శాస్త్రి గీతాపారాయణ చేస్తుంటే స్వామి వచ్చి ‘’గీతా పారాయణకు ఏకాగ్రత అవసరం ‘’అని చెప్పి వెళ్ళిపోయారు. తాను గీత చదువుతున్నట్లు ఆయనకేలా తెలిసిందో అని ఆశ్చర్యపడ్డాడు శాస్త్రి .ఒకసారి శాస్త్రి నాలుగుకానుల మల్లె పూలుకొని అరుణాచలేశ్వరునికి అమ్మవారికి రమణభగవాన్ కు అర్పించి మిగిలింది స్వామి కి ఇవ్వాలనుకొని వెతికితే స్వామికనిపించలేదు .ఆ ముగ్గురికే ఇచ్చేశాడు .సాయంత్రం స్వామి కనబడి ‘’కాలణా పూలు అయితే ఏం భక్తీ ముఖ్యం ‘’అన్నారు .
విద్యాగంధంలేనితిరుప్పుగల్ స్వామి సుబ్రహ్మణ్య భక్తుడు .తిరుప్పుగల్ పాడేవారు .ఆయన తిరువన్నామలై రాగా స్వామి ‘’తిరుప్పుగలే మీకు మంత్రం ‘’అన్నారు .’’మీ పూర్వులలో కొందరు సన్యాసం తీసుకోన్నారటకదా ‘’అని అడిగితె ‘’శ్రాద్ధం పెట్టేటప్పుడు బ్రాహ్మీ మూర్తులైన అనే పదం వాడుతాము ‘’అని ఆయన చెప్పగా ‘’నువ్వూ వారిలాగా సన్యాసివి అయిపో ‘’అన్నారు .ఆయన వల్లిమలైలో స్థిరపడి బాగా ప్రసిద్ధి చెందారు .
చిదంబరం లో సన్యాసం తీసుకొని చెంగల్వరాయుడు గురువుకోసం అన్వేషిస్తూ తిరువన్నామలై వచ్చి ,ఉపవాసం తో సుబ్రహ్మణ్యేశ్వరాలయానికి వచ్చి ప్రార్దిస్తుంటే ‘’నాయనా !మూడురోజులుగా నువ్వు భోజనం చేయలేదాఅని స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడి వద్దే ఉండిపో’’అన్నారు .స్వమిలోనే మురుగన్ ను చూసుకొంటూ ఉండిపోయాడు .
సన్యాసం తీసుకొన్న న్యాయవాది చెంగల్వ రాయుడు .సుబ్బరామయ్య అనే పురోహితుని భార్య ఆత్మ హత్యా ప్రయత్నం లో ఉరిపోసుకొని చూరుకు వేలాడుతుంటే ,చుట్టుప్రక్కల వారికి తెలిసి కాపాడారు పోలీసులు ఆమెపై అభియోగం తేగా ఆమె పక్షాన వాదించాడు .ఈ విషయాలన్నీ జ్ఞాపకం రాగా స్వామిదగ్గరకు వెళ్ళాడు ‘’ఒకమ్మాయి ఉరేసుకొందికాని ఫలించలేదు ఉరిలో తగుల్కొన్నాక ఉరి అంటే ఏమిటో తెలిసి కేకలువేస్తే జనమూ పోలీసులూ రారా ?ఈవిషయం రాయుడిని అడగండి చెబుతాడు ‘’అన్నారు స్వామి తాను మనసులో అనుకొన్నది స్వామి గ్రహించారు అని తెలుసుకోగలిగాడు రాయుడు .చెంగల్వ చిన్నతనం లో పేరు అబ్బాయి రాయుడిని చూడగానే ‘’నీది వాలాజిపేట .నీ పేరు అబ్బాయి కదూ ‘’అనగానే మరింత ఆశ్చర్యపోయాడు .
రాజు శాస్త్రి శిష్యులకు మాఘుని శిశుపాలవధ కావ్యం బోధిస్తుంటే ‘’కాయమానము ‘’అనే పదం వచ్చి దాని అర్ధం చటుక్కున స్పురించలేదు దాని అర్ధం గుడారం డేరా ,శిబిరం .స్వామి అటుగా వెడుతుంటే శాస్త్రిగారు ‘’గుడారానికి పర్యాయపదం ఉంటె చెప్పండి ‘’అని అడిగితె ఠక్కున ‘’కాయమానము ‘’అని చెప్పి వెళ్ళిపోయారు తాను అనుకోన్నపదమే స్వామి చెప్పటం ఆశ్చర్యమేసింది .
పెరుమాళ్ళు స్వామి ఒక రోజుములైపాల్ తీర్ధ గట్టు లో స్నానం చేసి విభూతి సంచీ డబ్బు అక్కడే పెట్టి మర్చిపోయి వచ్చాడు.దారిలో స్వామికనిపిస్తే ‘’అంగడిలో భక్ష్యాలు కొనిస్తా రండి స్వామీ ‘’అనగా ‘’నీ దగ్గర డబ్బు ఎక్కడిది. మలై తీర్ధం పో ‘’అనగా తాను అక్కడ సంచీ మరిచిపోయిన సంగతి గుర్తుకు వచ్చింది .
సేలం వాస్తవ్యుడు,వకీలు సుబ్రహ్మణ్య మొదలియార్ బంధువులతో స్వామి దర్శనానికి రాగా ఆయన కనపడకపోతే ,నిరాశతో కంచికి వెళ్లి ,మళ్ళీ వచ్చేటప్పుడు స్వామిని చూద్దాములే అనుకోని కారెక్కి కంచి వెళ్ళే సంబరం లో ఉంటె ,స్వామి వచ్చి ‘’ఈకారు కంచికి పోతుందా ‘’అని అడుగగా ,మొదలియారు బృందం కారుదిగి అమాంతం స్వామిపాదాలపై పడి నమస్కరించారు
టికె సుందరేశమయ్యరు చిన్నతనం లో ఏడోక్లాసుచదువుతూ అరుగుమీద కూర్చుని లెక్కలు చేసుకొంటుంటే స్వామి ఏమి చేస్తున్నావని అడిగితెఅవి లెక్కలు మీకు తెలీదులెండి అన్నాడు .స్వామి ‘’అలాగా జవాబులు చెబుతా రాసుకో ‘’అని అన్ని లెక్కలకు సరైన జవాబులు చెబితే ,వాడు పుస్తకం చివర ఉన్న జవాబులతో సరి చూసుకొని కరెక్టే అని చెప్పాడు ఇలాస్వామికి లెక్కల పరీక్ష పెట్టాడాబాలుడు.ఈ సుందరశమే పెరిగిపెద్దవాడై ‘’వర్ణాశ్రమ వ్యవస్థ భ్రష్టమౌతోంది ఎవరైనా అవతార పురుషుడు వచ్చి ఉద్ధరించాలి ‘’అని తపన పడ్డాడు .స్వామి గుడికి వెడుతుంటే దారిలో కనిపించగా ‘’నీ సందేహాలు నన్నడిగితే నేను చెబుతా .నువ్వు అనుకొనే సమిష్టికర్మ అంటే యజ్ఞం .అవతార పురుషుడు పుట్టటానికి ఇంకా చాలాకాలం ఉంది ‘’అన్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-21-ఉయ్యూరు