అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -10
ఒక పశువులకాపరి కొండ చరియలలో పశువులు మేపుతుంటే చిరుతపులిని చూసి పారిపోతుంటే రాతిపైనుంచి దూకగా మోకాలికి దెబ్బతగిలితే దారిలో శేషాద్రి స్వామి కనిపించి ‘’పశువులను మేపేటప్పుడు జాగ్రత్త ఉండాలి .పులులు వస్తాయి .అయినా నిన్నేమీ చేయ్యవులే ‘’అన్నారు .తనకుమార్తెకు వివాహం చేసిజి. నరసి౦హయ్యరు దంపతులకు శేషాద్రి స్వామి ఆశీస్సులకోసం బండీ లో తీసుకు వెడుతూ స్వామి తనకెదైనాఉపదెశ౦ చేస్తే బాగుంటుంది అనుకొన్నాడు .స్వామి వెంటనే అరుణాచలస్వామి సేవ చేస్తూ ఉండు ,ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణ చేయి ‘’అనగా ఆశ్చర్యపోయాడు .అర్ధనారి అనే ఆయన తన అరుగుపై స్వామి కూర్చుని ఉంటె ఫోటో తీసి పూజలో పెట్టుకొంటే బాగుంటుంది అనుకోగా ‘’నా ఫోటో వెంకటసుబ్బయ్య ఇంట్లో ఉంది .అడిగితె ఒక కాపీ ఇస్తాడు తెచ్చి పెట్టుకో’అన్నారు
రామభద్ర శర్మ సోదరికి పొరుగూరులో ప్రసవసమయం అయింది వెళ్ళాలా వద్దా అని మధన పడుతుంటే స్వామి ‘’దిగులుపడకు ఈపాటికి ప్రసవం అయ్యే ఉంటుంది ‘’అన్నారు .ఆశ్చర్య సంతోషాలుకలిగాయి శర్మకి .తిరు వేంకటేశ మొదలియార్ మానసికంగా పంచాక్షరి చేస్తుంటే స్వామి ‘’ఇవాల్టి నుంచి పంచాక్షరి మానేసి రామనామ జపం చెయ్యి ‘’అని ఆదేశించారు .పోస్ట్ మాస్టర్ జనరల్ ఎఫ్.టి.పీటర్స్ బావ రైల్వే స్టేషన్ మాస్టర్ .ఒక పెద్ద స్టేషన్ లో ఒక గుజరాతీ వర్తకుడు రవాణా చేసిన సామాను పోయింది .స్టేషన్ మాస్టర్ అజాగ్రతే కారణమని కోర్టులో కేసువేశాడు .దానికి పది వేలరూపాయలు కట్టాలి .తన కాండక్ట్ సర్టిఫికెట్లు ఆయన దాఖలు చేశాడు .అవి మధ్యలో తప్పిపోయి కోర్టుకు చేరలేదు .దీనితో స్టేషన్ మాస్టర్ పై అనుమానం బలమైపోయింది .విషయం పీటర్స్ కు తెలిసి దిక్కు తోచక తననౌకర్నిపంపి కేసు ఏమైందో కనుక్కోమని పంపించి ,స్వామి దగ్గరకు వెళ్లి ‘’కేసు ఏమౌతు౦దిస్వామీ ‘’అని అడిగితె నవ్వుతూ స్వామి ‘’బస్ బస్ బస్ గప్ గప్ గప్ కూకూ ‘’అని ‘’ఎలాపోయిందో అలాగే దొరికింది ‘’అని వెళ్ళిపోయారు .ఈవిషయం పీటర్స్ కు టెలిగ్రాం ఇస్తే ,తప్పి పోయిన రికార్డులు అన్నీ దొరికి నట్లు పీటర్స్ కు టెలిగ్రాం వచ్చింది .కేసు కొట్టేశారు .
జిల్లాజడ్జి సుందరేశ అయ్యర్ యుక్తవయసు వచ్చిన కూతురికి వరాన్వేషణ చేస్తున్నాడు .తిరుపత్తూరులో సీతారామయ్య అనే ధనవంతుడికి ఒక కొడుకున్నాడు .అతనికివ్వాలని అయ్యరు భావించి పెళ్ళిచూపులకు ఆహ్వానించగా వచ్చి చూసి పిల్ల పెద్దగా ఉందేమో అని అనుమానించి కొంత వాదులాడుకొన్నారు .ఇంతలో స్వామి అక్కడకు రాగా అందరూ నమస్కరించగా అయ్యరుతో ‘’మీ అమ్మాయిని వీరింటికి నిరభ్యంతరంగా పంపచ్చు ‘’అన్నారు .ఆమాటలుశిరో ధార్యంగా భావించాడు సీతారామయ్య ..
ముత్తుసామి మొదలియార్ భార్య తాయమ్మ షష్టి వ్రతాలు చేసేది .ఒకరోజు ఇలిమనాక గుడికి పాలు పళ్ళు తీసుకు వెడుతుంటే స్వామి కనబడి ‘’నేనే సుబ్రహ్మ ణ్య స్వామిని నాకే ఇవ్వు’’ అని తీసుకొని పూలను నెత్తికి చుట్టుకొని పళ్ళను పిల్లలకు పంచారు .పాలుసగం తాగి మిగిలినవి ప్రసాదంగా ఇచ్చారు .కలియుగం లో సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్ష దైవంగా ప్రతీతి .ఆమె అదృష్టమే అదృష్టం .కాని అవి ఎంగిలిపాలు అని ఆమె తీసుకోటానికి ఇష్టపడలేదు .ఆపాత్రను వాడకుండా ఒక మూల ఉంచి౦దికూడా .మర్నాడు గుడికి వెడితే స్వామి ‘’పో గాడిదా నీకు మడి ఎక్కువకదా.పాలుపారబోసి పాత్రకూడా అవతల పెట్టేశావు చీచీ ఫో ఫో ‘’అన్నారు .ఆరునెలలదాకా ఆమెతో మాట్లాడలేదు .ఆతర్వాత ప్రసన్నులయ్యారు .
స్వామి అతీంద్రియ శక్తులు
సుబ్రహ్మణ్య అయ్యరు బంధువు కొడుకు ఇల్లు వదిలి వెళ్ళగా వాడు తిరువన్నామలై వెళ్ళాడని కనిపిస్తే తనదగ్గరకు పంపమని అయ్యరుకు ఉత్తరం రాశాడు .వెతికి వాడినిపట్టుకుని అయ్యరు స్వామి దగ్గరకు తీసుకు వెళ్ళగా ‘’వీడి తండ్రి వీడిని వెంటనే పంపమని నీకు రాస్తే ,ఇంకా నీదగ్గరే వాణ్ని ఎందుకు ఉంచావు””అని అడిగితే అయ్యరు అవాక్కయ్యాడు .శ్రీమంతుడు శ్రీరంగం సుందరం పిళ్ళై ,పెళ్లికాగానే భార్యతో తిరువన్నామలై వచ్చి కొన్ని రోజులున్నాడు ఆమె నగలపై ఆశపడ్డ నౌకరు దొంగిలించి ఇంటి వెనుక మురికి కాలువ కింద రహస్యంగా దాచాడు .ఏం చేయాలో తోచక నౌకరుతో సహా పిళ్ళై స్వామిని దర్శించగా ‘’ ‘’దొంగవెధవా .సిగ్గులేదా మురుగుకాల్వ కిందపెట్టిన నగలన్నీ ఒక్కటికూడా వదిలి పెట్టకుండా తెచ్చివ్వు ‘’అన్నారు ఆదొంగ నౌకరుతో .పోలీసులు అవన్నీ స్వాధీనం చేసుకొని ఇచ్చేశారు .ఈ సంఘటన జరగటానికి ముందు వాడు ఎప్పుడుకనిపించినా ‘’చేతికి బంగారుమురుగులు వేళ్ళకు ఉంగరాలు పెట్టుకొంటావా “”అని అడిగేవారు వాడికి అర్ధంయ్యేదికాదు.
తిరువన్నామలైదగ్గర గ్రామం శీలై పందిల్ లో ఉన్న జగదీశయ్యర్ ఇంటిపూజారి దీక్షితులు అంటే గురుభావం .కానీ దీక్షితులు అయ్యరు ఇంట్లోని ఎనిమిది సవరుల నగ దొంగిలించి ,గ్రామ దేవత ఆవరణలో దాచాడు .ఇంట్లో అంతా నగకోసం వెదికికి నిరాశపడ్డారు .అయ్యరుఒకసారి గుర్రబ్బండీ లో తిరువన్నామలై వచ్చి,తిరిగి వెడుతుంటే స్వామికనిపించి ‘’నేనుకూడా రావచ్చా “”అని అడిగితె మహద్భాగ్యం అని ఎక్కించు కాగా దారిలో అయ్యరు తనింట జరిగిన నగ దొంగతనం చెప్పగా’’అందుకే నేను వస్తున్నా ‘’అన్నారు .శీలై పందిల్ చేరగానే ‘’మీ ఇంట్లోనే దొంగ ఉన్నాడు .నీకు కుక్క ఉందిగా .నేను వెడతా ‘’అనగా ఆరుమైళ్ళదూరం నడవలేరు అని ఎంత చెప్పినా వినక విసవిసా నడిచిస్వామి వెళ్ళిపోయారు .ఊరివారువచ్చి దీక్షితులవాలకం అనుమానంగా ఉంది అని అయ్యరుకు చెప్పగా ,దీక్షితుల్ని పిలిపించి తీవ్రంగా మందలించగా తప్పు ఒప్పుకొని నగ తెచ్చిచ్చి కాళ్ళమీద పడ్డాడు .
అలమేలు ప్రసవించి ఖాయిలాగా ఉంటె స్వామి వచ్చి ఆమె మంచం ప్రక్క కూర్చుని ఆమె చెయ్యి తాకారు భయపడి కేకేసి౦దామె .ఆమె అన్న నరసింహారావు వచ్చి స్వామిని దూషించాడు .స్వామి మారుమాట్లాడకుండా వెళ్ళిపోయారు .మర్నాడు ఎచ్చమ్మవచ్చి స్వామిని అలమేలుకు నయమౌతుందా అని అడిగితె ‘’ఆమె చనిపోయి౦దని అందరూ చెప్పుకొంటున్నారే ‘’అన్నారట ఆరోజు రాత్రే ఆమె చనిపోయింది .
స్వామి శిష్యుడు ముత్తుస్వామి మొదలియారు దాయాది ఆయనపైదావా వేశాడు .స్వామికి నివేదిస్తే ‘’భయం లేదు వాడికి అనుకూలం కాదు ‘’అన్నారు .అన్నట్లే కేసు గెలిచాడు ముత్తుస్వామి .దాయాది హైకోర్ట్ కు వెళ్లగా స్వామికి చెబితే ‘’ఆ కేసు ఎప్పుడో తోసేశారయ్యా నీకేమీ భయం లేదు ‘’అన్నారు అక్కడా ఈయనదే జయం .శివ ప్రకాశమొదలియార్ ను చూసి ఇకరోజు స్వామి ‘’పెద్ద మంట అంటుకొన్నది ‘’అనగా ఆయనకు అర్ధం కాలేదు .మర్నాడు ఆయన కూతురు చనిపోయినట్లు వార్త వచ్చింది .పదిరోజులతర్వాత వచ్చిన ఆయన్ను స్వామి ‘’ఏ వస్తువూ మన సొంతంఅనుకోటానికి వీల్లేదు ‘’అన్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-21-ఉయ్యూరు