అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -12
ఒకసారి నారాయణ శాస్త్రి భార్యతో శేషాద్రి స్వామిని దర్శించగా ‘’మీ ఇద్దర్నీ కలిసి చూడాలని నేను అనుకొంటే ,నన్ను తోసేస్తున్నారే ‘’?అనగా అర్ధం కాకపోతే ‘’నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో బోతున్నావా ?””అని శాస్త్రిని అడిగారు. ఇది జరిగిన మూడు నెలలకే శాస్త్రి భార్య చనిపోయింది .కుమారపిల్లై కి పెళ్లి అయి పదేళ్ళయినా సంతులేదు .భార్యగతిస్తే రెండోపెళ్ళి చేసుకొన్నాడు .ఈమె కూడా ఏడాదికే చనిపోయింది .మూడోపెళ్ళి ప్రయత్నం లో ఉండి,పోలూరు తిరుక్కోవిలై లలో ఉన్న పిల్లల్ని చూసొచ్చాడు .పోలూరు అమ్మాయి అందం డబ్బున్నమ్మాయి .రెండో అమ్మాయి బీద అంతఅందం లేదు .ఎవర్ని చేసుకోవాలో తెలీకస్వామినే అడిగాడు ‘’తిరుక్కోవిల్ కాకినే చేసుకో అదే నిన్ను కాపాడుతుంది పోలూరు పిల్లను చేసుకొంటే ఎవరో దాన్ని ఎత్తుకుపోతారు ‘’అన్నారు .అలానే చేసి సుఖంగా కాపురం చేశాడు .వెంకట సుబ్బయ్య ఇంటిలో స్వామి ఉన్నప్పుడు పుదుచ్చేరి నుంచి ఒక కుష్టు రోగిని తెచ్చి స్వామిని మందు చెప్పమని కోరితే ‘’శ్వాన గ౦ధి’’సేవిస్తే తగ్గుతుందన్నారు .సుబ్బయ్యర్ వనమూలికల పుస్తకం తిర గేస్తే కాశీ దగ్గర దొరుకు తు౦దిఅని తెలియగా స్వామి ‘’అది తెప్పించి వేసుకొన్నా సగమే నయమౌతుంది .మిగిలినసగం అనుభవించాల్సిందే అతడు కర్మి ‘’అన్నారు .’’కంచి వదిలి తిరువన్నామలై లో స్థిరపడిన మీకు ఆ వనమూలిక కాశీలో దొరుకుతుందని ఎలా తెలుసు “?”అని అడిగితె జవాబివ్వలేదు స్వామి .
సేలం పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగి శేషాద్రి అయ్యర్ స్వామిని మొదటిసారిగా దర్శించగా ‘’నువ్వూ శేషాద్రివే నేనూ శేషాద్రినే.నువ్వు రామ నామ జపం ఎందుకు చేయరాదు ?’’అనగా ఆరోజు నుంచి చేశాడు .శంకరానందస్వామి శేషాద్రి స్వామి దగ్గరకు వచ్చి ‘’ఈవూర్లో చెట్టియారు కాశీ యాత్రికులకు అన్న సదుపాయం చేస్తారట .నాకు పదిరోజులకు చీటీలు ఇప్పించండి ‘’అని అడిగితె ‘’ఇప్పుడే చెట్టి రైలు దిగి ఇంటికి వెడుతున్నాడు వెళ్లి అడిగితె ఇస్తాడు ‘’అనగా ,దోవలోనే చెట్టి బండీలో కనపడగా ఏకంగా ఒక సంవత్సర కాలానికి ఆస్వామికి అన్నివసతులతో భోజన సౌకర్యం కలిగించాడు .తిరు వెంకట మొదలియార్ బంధువులింట్లో పెళ్లి కెళ్ళి అక్కడి వారు ఇవ్వగా మూడు లడ్డూలు తెచ్చి అలమర లో పెట్టాడు .ఇంతలో స్వామివచ్చి లడ్డు ఇమ్మనగా ,ఏదిచ్చినా తుంచి పారేసేయ్యటమేగా అని ఒక్క లడ్డూ ఇవ్వగా ‘’మిగిలిన రెండూ ??””అనగా తెచ్చివ్వగా వాటిని యధాప్రకారం ముక్కలు చేసి వెదజల్లారు స్వామి.
కొండమీద ఉన్న సాధువుకు భక్తులు మైసూరుపాక్ చేయించి ఇస్తే దాన్ని ఒకమూల దాచిఉంచితే ,ఒకరోజు పెద్దవానలోస్వామి ఆగుహకు వెళ్లి సాధువుతో ‘’మీకూ మైసూర్ పాక్ ఇష్టమా నాకు చాలా ఇష్టం ‘’అనగా ఆశ్చర్యంతో కొన్నిపాకులు తెచ్చి స్వామికిచ్చాడు సాధువు .జయరామ మొదలికి స్వామి అంటే మహా భక్తీ .ఆతిధ్యమివ్వాలని అనుకొనేవాడు .ఒక చంద్ర గ్రహణం నాడు గ్రహణం వదిచిన తర్వాత భక్తులు స్వామికి అనేకరకాల పదార్ధాలు తెచ్చి తిమని బలవంతం చేశారు .మొదలి అక్కడకురాగానే ‘’కొంచెం అన్నం ,చారు ,కందిపచ్చడి ‘’తీసుకొని రమ్మని చెప్పగా ఇంటికి వెళ్లి భార్యతో చేయిద్దామనుకోగా ఆమె అవే చేసి సిద్ధంగా ఉంచితే పరమాశ్చర్యపడి ,తీసుకు వెళ్లి స్వామికి నైవేద్యం పెట్టాడు అతని భార్య ఒకరోజు ఒకలోటాపాలు తెచ్చి స్వామికి నైవేద్యం పెట్టగా ‘’ఇంటికి వెళ్ళద్దు ఇంట్లో పాము ఉంది కరుస్తుంది ‘’అన్నారు . భయం తో అక్కడే చతికిలబడింది .కాసేపయ్యాక’’పామును చంపేశారు హాయిగా వెళ్ళు ‘’అని పంపించారుస్వామి .ఇంటికి వెడితే ,చచ్చి పడి ఉన్నపాముకనిపించింది .
ఒకరోజు స్వామి జయరామమొదలితో ‘’ఒక మామిడి పండు ఉంటె బాగుండునే ‘’అనగా ‘’ఇది సీజన్ కాదు దొరకదు.పాలు తెస్తాను తాగండి ‘’అనగా ‘’పండు తిన్నాక పాలుతాగితే బహు పస౦దు గా ఉంటుంది .వెళ్లి వెతుకు దొరక్కపోదు ‘’అనగా .పండ్ల దుకాణాలన్నీ తిరిగాడు. ఒకే ఒకచోట ఒక్కటే మామిడిపండు దొరికింది .దాన్నికొని ,పాలతో సహా తెచ్చి స్వామికిచ్చాడు .ఒకసారి స్వామి నడివీధిలొ పదేపదే సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటే ,అర్ధం కాక అడిగితె ‘’కంచిలో ఏకామ్రనాధుడు రధం ఎక్కుతున్నాడు .మీరూ దారాళ౦గాస్వామిని సేవించవచ్చు ‘’అన్నారు .మాణిక్యస్వామిని చూసినప్పడల్లాస్వామి ‘’నిద్రపోకు యముడు పట్టుకు పోతాడు ‘’అనేవారు .ఒఅరోజు రాత్రి తోమ్మిదికే తిన్నేమీదకూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు మాణిక్యం.కాసేపట్లో కలలో యమదూతలు దున్న పోతుపై ఎక్కిన యముడిని అనుసరిస్తూ రావటం ,వాడినిపట్టుకో వీడినిపట్టుకో అని ఆజ్ఞలివ్వటం ,తనదగ్గరకువచ్చి ‘’ఈసోమరినీ బంధించ౦డి’’ అనటం జరిగింది .అదేసమయంలో స్వామికనిపించగా ‘’రక్షించ౦డి ‘’అని వేడుకోగా భయపడవద్దని వెన్ను తట్టారట. వెంటనే మెలకువ వచ్చింది .మాణిక్యం ఇంటికి వచ్చి అరుగుమీద కూర్చుని ఉంటె స్వామి అటుగా వెడుతూ ‘’యమదూతలు భయంకరంగా ఉన్నారా పట్టుకు పోతామన్నారా ?నిద్రపోవద్దుంటే విన్నావుకాదు ‘’అనగా ‘’బుద్ధి వచ్చింది స్వామీ ‘’అని లెంపలేసుకొన్నాడు .ఆరోజు రాత్రి 12వరకు భయంతో నిద్రపోలేదు ..అర్ధరాత్రయింది నిద్రపో ‘’అనిస్వామి అంటే ‘’నిద్రపోను ‘’అంటే ‘’స్వామి నవ్వుతూ’’ రోజూ నిద్రపోయేముందు నన్ను తలచుకొని విభూతిపెట్టుకో.యముడు నీ జోలికి రాడు ‘’అనిచేప్పారు స్వామి .
చెంగల్వరాయుడికి గణపతిపై మహా భక్తీ .స్వామివద్ద రోజూ చాలాసేపు గడిపేవాడు .ఒకరోజు ఇలయనార్ గుడికి వెళ్ళిపడుకోగా కలలో పెద్ద ఏనుగు ,దానికి తాటిచెట్టంత తొండం ,ప్రక్కన ఒక స్త్రీ .’’కనిపిస్తే గణపతి స్వయ౦గా దర్శనమిచ్చాడని సంతోషించి ,కలలో ను౦చి మేల్కొన్నాక ఆనందం పట్టలేక ,నిద్రపోవటానికి మనస్కరించక కాలం గడిపి పొద్దున్నేలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్వామి వద్దకు వెళ్ళగా ‘’నువ్వు చూసిన ఏనుగు బ్రహ్మాడంగా ఉందికదూ .తొండం తాటి చెట్టంత .దాని ప్రభావం తెలుసా?’’అణో రణీయాన్ మహతో మహాన్తాన్ ‘’అనగా స్వామికి తనకల విషయం ఎలా తెలిసిందో ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు .
సబ్ రిజిస్త్రార్ సుందరేశం చెట్టియార్ కున్న ఇద్దరమ్మాయిలు జానకి ,పార్వతి లకు పెళ్ళికాలేదు స్వామిని దర్శిస్తూ ఉండేవారు .ఒకరోజు జానకికి కలలో తానూ పార్వతీ శివగంగలో స్నానం చేస్తుంటే స్వామి వచ్చి పార్వతిని గట్టుపైకి లాగారట .ఇద్దరూ కలిసి ఇంటికి వస్తుంటే దారిలో ఒకపెద్ద తొండ జానకిని తరిమింది .స్వామివచ్చి దాన్ని తోలేసి జానకి భయం పోగొట్టారట .తెల్లారాక జానకి తనకల ను పార్వతికి చెబితే ,ఇద్దరూ కలిసి స్వామిని చూడటానికి వెడితే ‘’శివగంగ తీర్ధం చాలాలోతుఅని జాగ్రత్త అని పార్వతిని మందలి౦చలేదా?దాన్ని పట్టుకొన్న యముడు తొండరూపం లో నిన్నుపట్టుకు పోవాలనుకొన్నాడు .ఫరవాలేదు ఇకమీదట భయం ఉండదు ‘’అన్నారు స్వామి .
చిన్న గురుకులు తల్లీ ,కళ్ళులేని అత్తగారు వృద్ధులే .తల్లికి జబ్బు రేపోమాపో అన్నట్లుగా ఉంది .తల్లిమీనమ్మ అత్తగారు సవర్ణా౦బ బుజం పై వాలి ఉంటె మీనమ్మ హాయిగా చనిపోయింది .కళ్ళులేని సవర్ణ రెండుమూడుగంటలు ఆశవాన్ని అట్లాగే మోసింది .మీనమ్మ చనిపోయే సమయం లో స్వామి ‘’అదిగో మీనమ్మ స్వర్గానికి పోతోంది ‘’అన్నారు .ఈవార్త చిన్నగురుకులు విని ఇంటికి వెళ్ళగా అత్తగారిబుజం పై వాలి చనిపోయిన తల్లిని చూశాడు .
తిరువన్నామలై దగ్గర ఊరిలో విఠోబాస్వామి సిద్ధిపొందారు .స్వామి బజార్లోపోతూ ‘’అదో విఠోబాస్వామి పోతున్నాడే జోరుగా పోతున్నాడే ‘’అన్నారు .అప్పుడుకానీ ఆస్వామి చనిపోయినట్లు ఎవరికీ తెలీదు .తిరువన్నామలై లో ఎండలు ఎక్కువ వానలు తక్కువ నీటికి కరువు .ఒకసారి వర్షాభావం ఎక్కువైతే జనం స్వామికి బాధలు వివరించగా ‘’ఆకాశం నిర్మలంగా ఉంది. వర్షం వస్తుందిలే ‘’అన్నారు .పదినిముషాలలో కుంభవృష్టి మూడు గంటలు దంచేసి బాధలన్నీ పోగొట్టింది .
నారాయణస్వామి 1921లో తిరుచ్చి ను౦ఛి తిరువన్నామలై వచ్చి శేషాద్రిస్వామిని దర్శింఛి కొంతకాలం అక్కడే ఉన్నాడు .ఒకరోజు భాగవతం చదువుతుంటే తటాలున స్వామి వచ్చి భాగవతం తెరిచి చూడకుండా ఫలానా శ్లోకం చదువు అన్నారు .అది దశమ స్కంధం పంచమాధ్యాయం లో ‘’నందస్యాత్మజ ఉత్పన్నే ‘’అనే సంప్రదాయంగా ఉపదేశించే మొదటి శ్లోకం .స్వామి తనకు ఉపదేశమిచ్చారని నారాయణస్వామి సంతోషించాడు .తెచ్చుకొన్న డబ్బు అయిపోగా ట్రిచి కి టికెట్ కు కూడాడబ్బులేదు .ఏం చెయ్యాలో తోచక స్టేషన్ కు వెళ్ళాడు .అక్కడ పరిచయం లేని ఒకపెద్దమనిషి విల్లిపురానికి టికెట్ కొనిచ్చాడు .అక్కడినుంచి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడు .అంతాదిగిపోయారు స్వామీ ఇచ్చిన కొబ్బరికాయ ,తనభాగవతం ఉంచిన స౦చీనిఎవరొ దొంగిలించారు .బాధపడుతూ ఊర్చున్నాడు .ఇంతలో రుద్రాక్షలు విభూతి ధరించిన గొప్ప వర్చస్సుతో ఉన్న సాధువు ,పెట్టెలో చాలా సీట్లు ఉన్నా శాస్త్రిపక్కనే వచ్చి కూర్చుని ‘’ఎందుకు దుఖిస్తావ్ .చిదంబర నటరాజును దర్శిస్తే ఎంతటి విచారమైనా పోతుంది ‘’అన్నాడు .తన సంగతిసాదువుతో చెప్పుకొన్నాడు ‘’అనుగ్రహం భాగవతం లో ఉందా కొబ్బరికాయలో ఉందా .అది కంటికి తెలీదు స్వామి అనుగ్రహం మీకు ఉంటె అది ఉండనే ఉంటుంది .ఎక్కడికీ పోదు ‘’అని తరవాత స్టేషన్ లో దిగిపోయాడు సాధువు .స్వామే వచ్చి ఓదార్చారు అనుకొన్నాడు .చిదంబరం లో దిగి నటరాజస్వామిని దర్శించి ఆతాండవ శివుని చూస్తూ మధురానుభూతిపొందాడు శాస్త్రి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-21-ఉయ్యూరు