రజనీ ప్రియ
రజనీ ప్రియ అనే చిన్నకావ్యాన్ని కీ.శే. గుంటూరు సత్యనారాయణ ఎం.ఏ.రాసి ,’’చిత్ర కళా కవిత్వాలలో అసమాన ప్రతిభ చూపి పద్దెనిమిదేళ్ళు ఉజ్వలతారగా ప్రకాశించి తమల్ని వీడి ‘’దివ్య కళా’’ వైదుష్యాన్నిఅలవర్చుకోవటానికి దివికేగిన తన చిన్ని తమ్ముడు ‘’ వేణు’’కు అంకితమిచ్చి ,మద్రాస్ అడయార్ లోని వసంత ప్రెస్ లో1944లో ముద్రించారు వెల.రూపాయిపావలా .ఈ పుస్తకం గురించి విశాఖలో ఉన్న సరసభారతి ఆత్మీయులు 95ఏళ్ళ జ్ఞాన వయో వృద్దు డా రాచకొండ నరసింహశర్మ-ఎం.డి. గారు ఈమంగళవారం రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పి ,ఈకావ్యం టెన్నిసన్ అనే ఆంగ్లకవి కవితను ఆధారంగా కవి రాశాడని అతని తండ్రిపేరు గుంటూరు సుబ్బారావు గారనీ ఈ కవిపేరు జ్ఞాపకం లేదనీ ,అందులోని కధను సూక్ష్మంగా చెప్పి , అందులో తమకు జ్ఞాపకం వచ్చిన ఒక పద్యాన్ని పాడి వినిపించి గొప్పకావ్యం అని చెప్పారు .’’మీకు తెలుసా ‘’?అని నన్ను అడిగితె ‘’తెలియదు.మా అబ్బాయి శర్మతో నెట్ లో వెతికి౦చి దొరికితే మీకు పంపిస్తాను ‘’అని చెప్పగా చాలా సంతోషించారు .మా శర్మకు ఈ విషయం మెయిల్ చేయగా వాడు వెతికి పంపగా నిన్న ఉదయం శర్మగారికి ఫార్వార్డ్ చేసి ఫోన్ చేసి చెప్పి ‘’మీరు అనుకొన్న టెన్నిసన్ కవిత కాదు దానినిWS.LANDORకవి రాసింది ,కావ్యకర్తపేరు సత్యనారాయణ ,ముందుమాటలు డా దివాకర్ల వెంకటావధాని గారు రాశారు’’ అని చెబితే మహదానంద పడ్డారు .ఆ రజనీ ప్రియ విశేషాలే ఇప్పుడు మీకు తెలియ జేస్తున్నాను .
కవి సత్యనారాయణ తన ముందుమాటలలో ‘’ఈకావ్యం లో చివరిఘట్టం రాణి నగరం లో వస్త్రహీనగా తిరగటం ‘’అనేది WS.LANDOR కవి రాసిన ‘’Leofric and Godiva ‘’ లోనిది .మిగతాదంతా తాను కల్పించిందే అనీ ,అందులో విహారికధలో సూపర్ నేచురల్ ను కల్పించటం కొందరికి నచ్చలేదన్నారు .అలా జరిగే అవకాశం ఉందని తాను భావి౦చాననీ ,కథా శిల్పానికి అది చాలా అవసరమనీ చెప్పాడు .రజనీ ప్రియ,తోరమాన్ ల నైసర్గిక స్వభావాలను పరిశీలిస్తే ,అది ఎంతఅవసరమో తెలుస్తుంది అన్నాడు .రజనీ ప్రియ ముగ్ధ ,సహజ కారుణ్య శీల.రాజ్ఞీత్వం రాగానే ,మానవ సహజమైన ఆత్రానికి లొంగి అంతఃపుర భోగాల కొత్త అనుభవాలకు ఎరఅయింది .తోరమానుడు సహజ క్రూరుడు .అపార శక్తి ధన అధికారాలున్నాయి .ఐహిక సుఖాలన్నీ అనుభవించాడు. పరపీడన దౌర్జన్యం వాడి లీలలు.బాధ ,పేదరికం వాడురోజూ చూసేవే .అలాంటి వాడిని మార్చటానికి లౌకిక శక్తులు చాలవు లోకాతీత శక్తి మాత్రమె మారుస్తుంది .మన చర్యలన్నీ ఒక అదృశ్యమూర్తి లేక శక్తి నిరంతరం గమనిస్తూనే ఉంటుందని అన్నిమతాలు చెప్పాయి .దీన్ని అందరూ అంగీకరించారు .దుష్టుని దౌర్జన్యం పెరిగినకొద్దీ వాడు ఇలాంటి శక్తికి భయపడి పోతూ ఉంటాడు .రజనీ ప్రియ త్యాగంతో భర్తను మార్చలేకపోయింది .కానీ ఆత్యాగం లో ఆమెలో అణగిఉన్న అతీంద్రియ శక్తి ఆపని చేయగలిగింది.త్యాగమహాత్మ్యం అంత గొప్పది .అని తన కావ్యాన్ని సమాదరించమని విశాఖదగ్గర ఉండే యలమంచిలికి చెందిన ఈ కవి సత్యనారాయణ కోరాడు .
ఈ కావ్యం పై ‘’ప్రవేశకము ‘’రాసిన డా దివాకర్ల వేంకటావదానిగారు –ఈకవి సత్యనారాయణ ఇంటర్ తమకాలేజి లో చదివి ,అప్పటికే కవిత్వం,రాస్తూ ,నాటకాలు ఆడుతూ ,,ఎం ఎ ఇంగ్లీష్ పాసైన సూక్ష్మగ్రాహి.ఈ కావ్యాన్ని అతడు రాసినందుకు తనతోపాటు తోటి అధ్యాపకులుకూడా సంతోషిస్తున్నారన్నారు .స్వర్ణయుగమైన గుప్తయుగం అంతరించాక హూణులు పాలించారు .వారిలో తోరమానుడు హిందూ శిల్ప విజ్ఞాన ,మణి,కనక సంపదలు అభిమాన సంపదలను దోచుకొని క్రూర దమన కాండ సాగిస్తూ ,ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తూ ఆటవిక పాలన సాగించాడు .వాడి దౌర్జన్యాలను రూపుమాపి ప్రజలతరఫున నిలబడి వారికి ఆశా జ్యోతిగా కనిపించింది రజనీ ప్రియ .
రజనీప్రియ చిన్నతనం లోనే తలిదండ్రులను కోల్పోగా వృద్ధ బౌద్ధ సన్యాసి ఆమెను పెంచి పెద్ద చేసి యవ్వనవతికాగానే భిక్షాటనతో ఆయన్ను అనుసరించేది .ఆమెను చూసి తోరమానుడు ఆమెను కామించగా ,తన స్వంతం కావాలని కోరుకోగా సన్యాసి ఎంత చెప్పినా వినక ,సేనాపతిని పంపితే వాడు రధాన్ని ఆయనమీదుగా తోలి చంపి ,ఆమెను చక్రవర్తి కి అప్పగించాడు .ఆమె చాలా అనునయంగా చెప్పింది వారించింది .వాడు బలవంతంగా తనకోరిక తీర్చుకొన్నాడు .ఆమె తన శీలం భగ్నం అవటం కంటే హుణ చక్రవర్తి తోరమానుడి ‘’హృదయరత్నాన్ని జార్చాలనుకొన్నది .తనువు చిక్కిన పేదలకు సేవ చేయాలనుకొన్న కరుణామూర్తి ఆమె .’’మనసు మాలిన్యమైన ధనయుతు డికే సేవ చేస్తూ ,వాడిలో పరివర్తనం తేవాలని నిశ్చయించింది .తన శీలాన్ని కోల్పోయి ,పరసేవా పరతంత్రగా చరిత్రలో నిలిచిపోయిన మావీయమూర్తి రజనీ ప్రియ .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-21-ఉయ్యూరు