కోటప్ప కొండ లో’’గబ్బిట వారి అన్నసత్రం ‘’
కోటప్ప కొండపై వెలసిన శ్రీత్రికోటీశ్వరస్వామి దర్శనానికి వచ్చే యాత్రికులకు భోజన వసతి ఉండేదికాదు .యాత్రికుల బాధలు గుర్తించి బొప్పూడి గ్రామ వాస్తవ్యులు శ్రీ గబ్బిటకోటయ్యగారు ,కొండ దిగువన అన్న సత్రం పెట్ట దలచి ,శాశ్వత చందాదారులను ఏర్పరచి ,ఆద్రవ్యం తో 1991లో ఖరనామ సంవత్సరం నుంచి అన్నదానం చేయటం ప్రారంభించారు .మొదట్లో వందరూపాయల తో అయిదు వందలమంది బ్రాహ్మణులకు ఒక రోజు భోజనం పెట్టారు .రెండవ ఏడాది శివరాత్రి నాడు రెండు వేలమందికి శనగ గుగ్గిళ్ళు ఫలహారం గా పెట్టారు .మూడవ ఏడాది రెండు రోజులు అన్న సంతర్పణ ,శివరాత్రినాడు శనగలఫలహారం పంచిపెట్టారు .ఆతర్వాత వరుసగా మాఘ బహుళ ఏకాదశి మొదలు మాఘబహుళ చతుర్దశి మహా శివరాత్రి వరకు అన్నప్రదానం ,శివరాత్రి నాడు అరటిపళ్ళు ఫలహారం ,మర్నాడు సంతర్పణ నిర్వహిస్తూ వచ్చారు .
మొదట్లో తాటాకు పందిళ్ళు వేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ ,1901లో ఒక రాతి సత్రం కట్టటం ప్రారంభించి అందులో ఏర్పాటు చేస్తూ ,సత్రాన్ని 1909కీలక నామ సంవత్సరం లో పూర్తి చేశారు .1910నుంచి శివరాత్రినాడు శనగలకు బదులు అరటిపళ్ళను ఇవ్వటం ప్రారంభించారు .ప్రతి ఏడాది అన్నసంతర్పణకోసం తెలిసిన బ్రాహ్మణులను రాష్ట్రమంతటా పంపి చందాలు వసూలు చేయించేవారు .వారు ఏడాదికి ఒక్కసారే శివరాత్రికి సుమారు రెండు నెలలముందు ప్రతి బ్రాహ్మణ కుటుంబాల ఇంటింటికీ వచ్చి సంవత్సరానికి రెండు రూపాయలచందా తీసుకొని రసీదు ఇచ్చి శివరాత్రితర్వాత స్వామివారి విభూతి అక్షింతలుపోస్ట్ లో పంపేవారు వీరందరూ అంకిత భావం తో పనిచేసే శివ సైన్యమా అనిపించేవారు .నాకు 1951నుంచీ ఈవిధానం తెలుసు ,మానాన్నగారికాలం లో మాఅమ్మగారికాలం లోరెండురూపాయలు కొంతకాలం అయిదు రూపాయలు మరికొంతకాలం ఇచ్చేవారం ,నా కాలం లో కూడా వచ్చి చందాలు వసూలు చేసుకు వెళ్ళేవారు ఆతర్వాత దాదాపు నలభై ఏళ్లుగా కోటప్పకొండ గబ్బిటవారి అన్న సత్రానికి చందా కోసం ఎవ్వరూ రావటం లేదు .ఆవచ్చిన ఆయన మా ఇంట్లోనే భోఅనం చేసి ,ఊరంతా తిరిగి చందాలు వసూలు చేసుకోనిచివరిరోజు భోజనం కూడా మా ఇంట్లోనే చేసి వెళ్ళేవారు. ఒక బక్కపలచాటి కొంచెం నలుపు రంగు బ్రాహ్మణుడువీభూతి కుంకుమబొట్టు పిలక , చెవులకు కుండలాలు నీర్కావి బట్టలతో వచ్చేవారు .పేరు జ్ఞాపకం లేదు అదొక పవిత్రకార్యంగా మా ఇంటిల్లిపాదీ భావించేవారు. మనగబ్బిటవారి అన్నసత్రానికి డబ్బు ఇస్తున్నాం అనే మహా సంతృప్తి ఉండేది మాకందరికీ .అంతకు మించి పెద్దగా చేయి విదిలించింది లేడుమేము ఇప్పుడు తలచుకొంటే సిగ్గేస్తోంది .ఆమహానుభావుడు గబ్బిట కొటయ్యగారి ఆలోచనకు శిరసువంచి పాదాభివందనం చేయాలి .మేము గత పదేళ్ళలో రెండు సార్లు కోటప్పకొండ వెళ్లాం కొండదిగువన గబ్బిత వారి సత్రం చూసి ఫోటోలు తీసుకొన్నాం కూడా .ఆగబ్బితవారిప్పుదుఎక్కద ఉన్నారని అక్కడి బంత్రోటును అడిగితె చిలకలూరి పేటలో ఉంటున్నారనే శివరాత్రినాడు మహా వైభవంగా అన్న సమారాధన బ్రాహ్మణులకు జరుపుతున్నారనీ చెప్పాడు .చాలా సంతోషించాం
ప్రతి ఏడాదీ చందాలు వసూలు చేయటం కష్టంగా భావించి ఇరవై వేల రూపాయలతో భూమిని కొని దానిపై వచ్చే ఆదాయంతో సత్రం నడపాలని అనుకొన్నారు .కానీ పింగళి సంవత్సరం చైత్రశుద్ధ చతుర్దశి 6-4-1917న గబ్బిట కొతయ్యగారు శివసాయుజ్యం చేరటం తో ప్రయత్నం ముందుకు సాగలేదు .ఆయన తర్వాత ఆయన తమ్ముడు చీమలమఱ్ఱి వాస్తవ్యుడు గబ్బిటకృష్ణయ్య గారు,,సంతమాగులూరు వాసి రెంట చింతల గురవయ్యగారు ధర్మకర్తలుగా ఉంటూ అన్నసత్రాన్ని నడిపారు .కృష్ణయ్య గారు ఈశ్వర సంవత్సర ఫాల్గుణ బహుళ సప్తమి నాడు స్వర్గస్తులవగా,వారికుమారుడు దైవ సహాయంగారు ధర్మకర్తగా కొనసాగి సత్ర నిర్వహణ చేశారు .
గబ్బిటవారి అన్నదాన సత్ర నిర్మాణానికి ఎందరెందరో ధన సహాయం అందించారు వారిపేర్లన్నీ స్తంభాలపై చెక్కించారు.నరసరాపేట తాలూకాతూబాడు గ్రామస్తులు .శ్రీ తూబాటి శేషాద్రిగారు సత్రానికి పీపాలతో పెరుగు పంపించేవారు .ఎక్కడ అన్న సంతర్పణ జరిగినా శేషాద్రిగారు తనవంతుకర్తవ్యంగా పెరుగు పంపటం రివాజుగా ఉండేది .
అమరావతి జమీ౦దారిణి శ్రీమతి వాసిరెడ్డి జ్ఞానప్రసూన ప్రసూనా౦బా బహద్దర్ రెండుగదులు , పెట్రూరిపాలెం వాసి కటికి నేని వెంకట రమణయ్యగారు ఒకటి,,బొప్పూడి నివాసి గబ్బిట సుబ్బమ్మ గారుఒకటి ,నరసారావు పేట తాడేపల్లి ఆంజనేయులుగారు ఒకటి ,చాగల్లు శివారు కంద్లగుంట వాస్తవ్యులు జంపని బుచ్చయ్యగారు ఒకటి ,ఈ వెంకయ్య ,గుంటుపల్లి వెంకయ్య ,చెరుకూరిచంద్రయ్య ,ఈ చౌదరమ్మ ,పురుషోత్తమపట్నం వాసి బత్తినేని అనంతయ్య ,చిలకలూరిపేట భండార౦ వెంకమ్మగార్లు తలొకగది నిర్మించి సత్ర నిర్మాణానికి సహకరించారు .15మంది వదాన్యులు రాతి స్తంభాలను ఇవ్వగా ,సింహద్వారం పైకప్పు బండ ను నరసరావు పేట కు చెందిన బలిసేట్ల గోత్రుడు మండవ లక్ష్మీ పతి అందించారు .
సత్రనిర్వాహన కోసం భూములు ఇచ్చినవారిలో గోనేపూడి వాసి పాపరాజు కోటయ్య -1య.25సెంట్ల మెరకభూమి ,పెద చెరుకూరు వాస్తవ్యురాలు కక్కెర సుబ్బారాయుడుగారి భార్య లక్ష్మీ దేవమ్మగారు -1య.08 సెంట్లు శేరి పల్లం భూమి ,ముత్తనపల్లి వాస్తవ్యుడు శాఖమూరి వెంకట కృష్ణా నాయుడు రావిపాడు వాసి , 4 ఎకరాల అగ్రహారం భూమి , రావిపాడు వాస్తవ్యుడు గబ్బిట కోటయ్యగారు 8ఎకరాల సొంత ఈనాం మెరకభూమి అబ్బినగుంటపాలెం వాసి మైలవరపు వెంకటప్పయ్యగారు 2ఎకరాల స్వంత ఈనాం మెరకభూమి ,కొమిరేపూడి వాస్తవ్యుడు పున్నావఝల వీరభద్రయ్య భార్య పేరమ్మగారు -2ఎకరాల స్వంత ఈనాం మెరకభూమి ,కొలలపూడికి చెందిన కందిమల్లరామస్వామి కుమారుడు శేషయ్యగారి కొడుకు వీరయ్య -1ఎకరం శేరీ మెరక భూమిరాసిచ్చియధా శక్తి అన్నదానానికి తోడ్పడ్డారు
గబ్బిట కొతయ్యగారు శివరాత్రి అన్న సత్ర నిర్వహ౦చటమే కాకుండా ,కోటప్పకొండ మధ్య సోపానమార్గం లో మధ్యమధ్య విశ్రాంతి మందిరాలు కట్టించి చెట్లు నాటి౦ చారు .కేతముక్కలవారి అగ్రహారం లో శివాలయం ఆంజనేయ దేవాలయం కట్టించారు. ఆ అగ్రహారీకులు శివుడికి 18ఎకరాల మెరక ఒక ఎకరం పల్లం ,ఆంజనేయస్వామికి కోటయ్యగారు అక్కడే 11ఎకరాలమమెరక ,విప్పర్లలో ఒకయకరం పల్లం సమర్పించారు .కేసానుపల్లె –బయస్కాపురం మధ్యలో రోడ్డుపక్క కనపర్తి భూమిలో బావి, విశ్రమశాల, చెట్లు ఏర్పాటు చేశారు కోటయ్యగారు కృష్ణానది ఉత్తరవాహిని సత్తెనపల్లి తాలూకా మాదిపాటికిదక్షిణ౦గా భారద్వాజ ఆశ్రమం ,ఉత్తరేశ్వర స్వామికి ప్రతిసోమవారం నివేదన ఏర్పాటు చేశారు .చేజెర్ల కపోతేశ్వరాలయం లో తు౦గ దుర్తి బుచ్చయ్యగారి సమాధికి నైవేద్యానికి వసతి ఏర్పాటు చేసి గబ్బిట కోటయ్యగారు మహా వదాన్యులు దైవభక్తి పరాయణులు అనిపించారు .మాకూ వారికీ పరిచయాలు లేకపోయినా మా గబ్బిట వారైనకోటయ్యగారి ధార్మిక సేవకు మేమూ గర్వపడుతున్నాం .
ఆధారం –శ్రీ మద్దులపల్లి గురు బ్రహ్మ శర్మ రాసిన శ్రీ త్రికోటీశ్వర చరిత్రము(వచనం ) –కోటప్పకొండ –
ఈపుస్తకాన్ని కోటప్పకొండ దేవస్థానం నరసరావు పేట శార్వాణీ ప్రెస్ లో 1939లో ముద్రించారు
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-7-21-ఉయ్యూరు .