21వ శతాబ్దం లో మతం
మానవాళ జీవితం లో మతం ప్రముఖమైనది .వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది .దేశాలకు వర్గాలకు అస్తిత్వాన్ని ప్రసాదిస్తుంది .దీనివలన ఐక్యత ,స్వంత భావన ఏర్పడుతుంది .సైన్స్ ఫిలాసఫీ ,సాహిత్యాలను ప్రభావితం చేస్తాయి . పాశ్చాత్య దేశాలలో 19,20శతాబ్దాలలో సైన్స్ టెక్నాలజీ ,హేతువాద వ్యాప్తిపై మతంపై యుద్ధాలే జరిగాయి .రాజకీయ ఆర్ధిక ఉద్యమాలు సోషలిజం కమ్యూనిజాలు మతాన్ని చాలా తక్కువ చేసి మూక మనస్తత్వం అని అవహేళన చేశాయి .దీనితో అభి వృద్ధిలో దాని ప్రాధాన్యత తగ్గి పనికిమాలినదని పించుకొంది. . ఆధునిక విజ్ఞానం సహజ సిద్ధ ప్రపంచం ను పట్టించుకొంటే ,మతం నేచురల్ సూపర్ నేచురల్ ను రెండిటినీ పట్టించుకోన్నది .మతం దేవునిపై విశ్వాసం కల్పిస్తుంది,పారదర్శకం గా ఉంటుంది .ఇంద్రియ గోచరమైన దాన్నే నమ్ముతాము అంటుంది సైన్స్ .అనుభావికకు(ఎమ్పెరికల్ ) తావు లేదు అంటుంది.’’ఫెయిత్ వర్సెస్ ఫాక్ట్’’ అనే తనపుస్తకం లో జెర్రీ ఎ కొనే ‘’సైన్స్ రెలిజియన్ రెండూ అననుకూలమైనవి (in compatible)దేన్ని ఎంచుకోవాలో నీదే నిర్ణయం ‘’అన్నాడు .దీనికి రెండు కారణాలు పేర్కొన్నాడు .1-సైన్స్ ద్వారా మతాన్నిబలపరచటం లేక వాటిమధ్య ఘర్షణ నివారించటం వ్యర్ద ప్రయత్నం.2ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటం లో సైన్స్ ,మతం అంతర్గతం గవ్యతిరేక భావం కలిగినవి .
సైన్స్ మానసపుత్రిక అయిన టెక్నాలజీ విశ్వ వ్యాప్తం గా మానవ జీవితాలపై అత్యధిక ప్రభావం చూపిస్తోంది .టెక్నాలజీ సాధించిన విజయాలు మత సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకం .విశ్వం విషయమై అరిస్టాటిల్ ఆలోచనలను క్రిష్టి యన్ చర్చి సమర్ధించినా ,సాంకేతికాభి వృద్ధితో గెలీలియో కనిపెట్టిన టేలిస్కోప్ ఆవిర్భావంతో చెల్లకుండా పోయింది .అయినా కానీ, టెక్నాలజీ జీవిత విలువలను తెలియ జేయ లేకపోతున్నా ,మతం చక్కని సూచనలు చేస్తోంది.
దాదాపు పాశ్చాత్య ఫిలాసఫీ అంతా మానవ జీవిత సమస్యలను పరిష్కరించటం లో మత విశ్వాసాల సమర్ధతను.చర్చి ఆధిపత్యాన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి .కార్ల్ మార్క్స్ ‘’మానవ సారాంశాన్ని (ఎస్సెన్స్ )సాక్షాత్కరింప జేయటం లో యదార్ధ జ్ఞానం కంటే మతం ఒక గొప్ప అద్భుతమైన విజయం సాధించింది ‘’అన్నాడు. అంటే మానవుడు నైరూప్య(ఆబ్ ష్ట్రాక్ట్ ) జీవికాడు బయట చతికిలపడి కూర్చోటానికి .కాని మతం మానవుడికి స్వీయ చేతనా ,ఆత్మ గౌరవం పొందటం లేక పోగొట్టుకొన్నది సాధించటం , నిలబెట్టుకోవటానికి బలిపీఠం అవుతోంది .ఇది అత్యంత బాధాకరం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-21-ఉయ్యూరు