21వశతాబ్దం లో మతం -2
సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆధునిక సైకాలజీ ప్రకారం ‘’మతవిశ్వాసం విశ్వవ్యాపిత మనో వ్యాకులమైన ముట్టడి (యూని వర్సల్ అబ్సేషనల్ న్యూరోసిస్ ‘’).దేహెంద్రియప్రపంచం పై మతం పెత్తనం వహిస్తోందని సూచన చేశాడు .ఇది చిన్నపిల్లలమనో భ్రాంతి వంటిది అన్నాడు .మానవజాతి పరిణామానికి మతం కి౦చపరచేదిగా ఉ౦దన్నాడు.
21వ శతాబ్దిలో మతం పాత్ర ఏమిటి ?
పాశ్చాత్య పండితులు21వ శతాబ్దిలో మతం వహించాల్సిన సిద్దా౦తా లగురించి చాలా చెప్పారు .వీటిలో రెండు సిద్ధాంతాల గురించి తెలుసుకొందాం .ఇజ్రాయిల్ ప్రసిద్ధ రచయిత యువాల్ నోవా హరిరి వీటికి సమాధానాలు చెప్పాడు .1-మత౦ మానవ జాతిభవితకు ఆచరణీయమైన విజన్ సృస్టించ గలదా ? ఈయన రాసిన ‘’ట్వెంటి వన్ లెసన్స్ ఫర్ ట్వెంటి ఫస్ట్ సెంచరి ‘’పుస్తకం లో ‘’సెక్యులర్ మనుషులు మతాన్ని కించపరుస్తున్నా ,కోట్లాది జనం మాత్రం మత విశ్వాసాలు వదలలేదు .మత ఉద్యమాలు ఇండియాతో సహా అనేక దేశాల రాజకీయాలను ప్రభావితం చేశాయి .ఇందులో టర్కీ అమెరికా రష్యాలున్నాయి .దురదృష్ట వశాత్తు మత విద్వేషాలు అనేక దేశాలలో శత్రుత్వానికి ఆజ్యం పోశాయి .
ప్రపంచం ఎదుర్కొనే ఈ సమస్య కు మతం ఏ విధంగా సమర్ధంగా పరిష్కరించగలదు?ఇదే బిలియన్ డాలర్ క్వస్చిన్ .మతాన్ని ఉపెక్షించటం పరిష్కారమా .ఈ సందర్భంగా హిరారి ‘’21వ శతాబ్దం లో సాంకేతిక ,వ్యావసాయక ,ఆర్ధిక మొదలైన సమస్యలు పరిష్కరించటానికి మతం పాత్ర అసంబద్ధం(ఇర్రిలవెంట్ ).అయినా’’ మాస్ ఐడెంటిటీ’’లను అంటే సామూహిక గుర్తింపు ల సృజనకు మతం పాత్ర వహించాలి .మత ఉత్సవాలు కర్మకాండలు ఉత్సవాలు నమ్మకాల వలన ప్రజలంతా ఐకమత్యంగా ,విధేయంగా ,తమ తమ సంస్థల లో గుర్తింపుగా ,ఇతరులకు విరుద్ధంగా కన్పిస్తారు .అందుకని హరారి ‘’రెలిజియస్ ఐడెంటి టీలు ,కర్మకాండలు తప్పనిసరిగా కొత్త టెక్నాలజీ తోజరుపుతూ అత్యధిక రాజకీయ అధికారాన్ని సాధించి ,దేశీయ ఐక్యతను సంఘటితం చేయాలి ‘’అని అభిప్రాయ పడ్డాడు .
అంతర్జాతీయ విలువలు ,విశ్వ ప్రామాణికత లను బహిర్గతం చేయటానికి సంప్రదాయ మతాలు అవసరమే అని హరారి ఒప్పుకొన్నా ,అవన్నీ ఇప్పుడు కుటుంబ తయారీ అయినఆధునిక జాతీయత అంటాడు .ఆధ్యాత్మిక ,నైతిక అవగాహన ఏర్పరచటానికి మతాలు పని చేయాలని అత్యధికులు ,ధామస్ బెర్రీ లాంటి స్కాలర్స్ కూడా అభిప్రాయ పడుతున్నారు ,.
బెర్రీ ‘’సంప్రదాయ మతం ఆధునిక ప్రపంచానికి దూరమావుతున్నందుకు ,ఆధునిక ప్రపంచం ఒక ఆధ్యాత్మిక ప్రతిష్టంభనకు లోను కావటం అవసరమైన వారికి ,సాదికారతగలవారికీ దూరమవటం అత్యంత బాదాకరం ‘’అన్నాడు.అది మేధస్సును చూపటంకానీ ,మనతో కలిసి ఆధినిక వైభవం ,అవమానాలలో నడవటానికి కానీ సిద్ధం గా లేదు ..బాధా సర్పదష్టుల పాలిటి ఓదార్పుగా స్థై ర్యాలనిచ్చి అక్కున చేర్చుకొనే మానవత్వమున్న ట్లుగా మతం ప్రవర్తించటం లేదు .కనుక ఇలాంటి విపత్కర పరిస్థితిలో ‘’ ఆధ్యాత్మిక ,ఆధ్యాత్మిక సంప్రదాయాల ను గౌరవిస్తూ ,ప్రతిస్పందించే ఆధునిక ప్రపంచం కావాలి,రావాలి ‘’అన్నాడు .మానవాళికి అవి ఆశాజ్యోతిగా భాసి౦చాలి .
విశ్వ వ్యాప్తంగా మత సంస్థలన్నీఆధ్యాత్మిక ,నైతిక పిలుపులను ఇవ్వలేక పోతున్నాయి .అవన్నీ నమ్మకాన్నీ గౌరవాన్నీ కోల్పోతున్నాయి .ఆధునిక ప్రపంచ సవాళ్ళను ఎదుర్కోతానికి పెళుసుగా ,పనికి రాని వాటిగా తయారయ్యాయి .దీని పర్యవసానం గా పూరి౦పరాని మత సంప్రదాయం ,నైతిక ధర్మ కర్తృత్వం చచ్చిపోవటం జరుగుతుంది .దీనితో సెక్యులర్ విషయాలలో ప్రాధాన్యత పెరిగి ,తమకున్న ఆధ్యాత్మిక నైతిక స్వభావ లక్షణాలు తప్పకుండా కోల్పోతాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-21-ఉయ్యూరు