మాల్యాద్రి నృసింహ శతకం
మాల్యాద్రి నృసింహ శతకాన్ని నరసింహ భక్తాగ్రేసరుడు శ్రీ ముత్తరాజు నృసింహరావు గారు సర్వజిత్ నామ సంవత్సర పుష్య శుద్ధ తదియ స్థిరవాసరం అంటే 1887 డిసెంబర్ లో రచించి,నృసింహా చార్య పండితుని చే పరిష్కరింప జేయించి ,నెల్లూరు శ్రీ రంగనాయక లీలా ముద్రాక్షర శాల యందు 1889నవంబర్ 5న ముద్రించారు .మాల్యాద్రి నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా చుండి జమీందారీ లో ఒక పర్వతం .గొప్ప నృసింహ క్షేత్రం .
కవి గారు శతకాన్ని కందపద్యాలతో దేవతా స్తుతితో ప్రారంభించారు మొదటగా నృసి౦హ స్తుతిగా –‘’శ్రీ రామామణి సేవిత –స్మేరా౦చిత భక్త కుముద సితకర విహితా –శ్రీ రాజిత శైల శ్రీ నృసింహా ‘’చెప్పి ,తర్వాత –‘’మురహర పురహర ధాతల –నిరవొందగ బ్రస్స్తుతి౦చి ఎరగెదమదినీ –వరరూపములై చెలగుట –స్థిర తరముగా మాల్యశశైల శ్రీ నృసింహా ‘’ఆతర్వాత శారద వినాయకులను స్తుతించి –
‘’శతకముగా గాను కందము –లతి వైఖరి తోడ జెప్పి యార్యులు మెచ్చన్ –గృతి నిచ్చెద వందనములు-క్షితి గైకొను– ‘’ శతక మకుటం ‘’మాల్యశైల శ్రీ నృసింహా ‘’
ఆతర్వాత ప్రహ్లాద జనన దశకం రాస్తూ –‘’అన్నిటదానై వెలిగెడు –సన్నుత చరితుండవుకా –వెసద్భక్తులకైమిన్నగు రూపము దాల్చుట –చిన్నలెకదా—‘’
పిమ్మట నృసింహ ఉద్భవ దశకం చెప్పాడు –‘’ధవళ ధరాధర దీర్ఘ దు –రవలోక న దివ్య దేహ యాశాష్టగజా- శ్రవణవిభేదన గర్జన –శివసన్నుత మాల్య శైల — అని నృసిమ్హావిర్భావం వర్ణించి ,ఆతర్వాత శత్రు సంహార దశకం లో –‘’శాత్రవుని బట్టి బల్-సూత్రమునవధి౦చి తౌర చూపరులు దగన్ –ధాత్రిని సంతోషింపగ జిత్రముగ –‘’’’అరి కసిపుని దునిమి భక్తుని –నరి సుతు ప్రహ్లాదు జూచి యఖిల సుఖంబు –ల్గరుణ యగుపడ గ నీయవే –సిరినాయక –‘’
ఆతర్వాత దశకం లో గ్రహోచ్చటన వర్ణించాడు కవి –‘’వేదం విచారులు కర్మా-మోదప్రచారులు-నీడయకే పాత్రులు అని వేదాన్తరహస్యం విప్పారు .నృసింహ అష్టాక్షరి మంత్రం జపిస్తే తీరని కోరిక ఉండదన్నారు .తర్వాత మహిమాను వర్ణన దశకం ,లీలావతార వర్ణక దశకం చెప్పాడు –‘’నీలీలలు నీ చర్యలు –నీ లీలా జనకర్మ నిపుణత’’ఎన్నాతానికి ఆశక్తుడనన్నాడు .ఇందులో దశావతార లీలలు వర్నిన్చాడుకవి ..ఆపిమ్మట అర్ఘ్యపాద్యాది పూజా వర్ణన పది పద్యాల్లో చెప్పి ,ధూప దీప నైవేద్య దశకం చెప్పి ,దూషణ భూషణ తిరస్కార దశకం చెప్పి ,చివర్లో గడుసుగా ‘’స్తుతి చేయ నేరని –నా స్థితి నంతయు జెప్పి నాడ జిత్తము నీవె-గతినైనను బ్రోవగ వలె’’అన్నాడు .
గ్రంథాంత శాంతి రత్నమాలిక లోకూడా పద్య దశకం చెప్పి –‘’మ౦గళము శ్రీ నృసింహా -మంగళము సుభక్త పోషక మంజుల వేషా –మంగళము కావ్య రమకున్ –శృంగార కరుణ రస –మాల్య వర శైల నరశ్రీ –నరసిమహార్పణ మంచు మతినిచ్చి –కర మష్టోత్తర శతకము –సిరివర గొనుమా ‘’అని ఆస్వైకే అంకితమిచ్చి ధన్యుడయ్యాడు కవి శ్రీ ముత్తరాజు నృసి౦హారావు .
ఈశాతకమూ ఈకవీ కూడా లోకానికి పట్టినట్లు లేదు .ఈ శతకాన్నీ ఆనృసింహ భ్క్తకవినీ పరిచయం చేసే భాగ్యం నాకు కలిగిందని సంతోషిస్తున్నాను
మాల్యాద్రి అంటే కొండలహారం అని అర్ధం .మాలకొండ అని కూడా పిలుస్తారు .ప్రకాశం జిల్లా వలేటి వారి పాలెం లో ఈ మాల్యాద్రి ఉంది .స్వామి లక్ష్మీ నృసింహస్వామి .దీనికి పడమర అహోబిల నరసింహ దేవాలయం ,ఉత్తరాన శ్రీ శైలం ,దక్షిణాన వృక్షాచల క్షేత్రం ,తూర్పున సింగరాయకొండ నరసింహ దేవాలయం ఉన్నాయి .మాల్యాద్రికి దక్షిణాన పినాకిని అంటేపెన్నా నది ,ఉత్తరాన కృష్ణానది ప్రవహిస్తున్నాయి .మాల్యద్రిలోని భక్తులు తమ సంతానానికి మగవారైతే నరసింహ నామ౦ ,ఆడవారైతే మహాలక్ష్మీ పేరు ఎక్కువగా పెట్టుకొంటారు .
మాల్యాద్రి నృసింహ స్వామికి ఒక చేత సుదర్శన చక్రం మరో చేతిలో శంకు ఉంటాయి .అమ్మవారు శ్రీ మహా లక్ష్మి ఆయన అంకం మీద కూర్చుని దర్శనమిస్తుంది .స్వామి ఒక చేయి ఆమె బుజం పైనా ,మరొక చేయి వరద హస్తం గా ఉంటాయి .స్వామివారు యక్ష కిన్నర సిద్ధ ,దేవమునిగణాలకు ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఆరు రోజులు దర్శన భాగ్యం కలిగిస్తారు .మానవులకు మాత్రం శనివారమే దర్శన భాగ్యం కలిగిస్తారు .మాల్యాద్రి దేవత మహా లక్ష్మీ దేవి మాల్యాద్రి పర్వత శిఖరం పైన కొలువై ఉంటుంది .మహాలక్ష్మీ సమేత మాల్యాద్రి నృసింహస్వామి భక్త వరదుడు. పిలిస్తే పలుకుతాడనే విశ్వాసం భక్తులలో ఉన్నది .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-21-ఉయ్యూరు