శ్రీ దాసు లింగమూర్తి -3
దాసుగారు ముదిగల్లు ,కళ్యాణ దుర్గం ,గంగవరం ,సిర్పి ,అనంతపురం మొదలలైన చోట్ల నామభజన సప్తాహాలు చేశారు .పినాకిని పత్రిక కవరేజ్ ప్రకారం అనంతపురం లో శ్రీరామ నామ సప్తాహం చేశారు .ముదిగల్లులో శివాలయ ఉద్ధరణ చేసి రామనామ సప్తాహం ,ఈశ్వరుడికి లక్ష బిల్వార్చన చేశారు .ఒకయువకుడు ‘’అయ్యా రాత్రి ఏమి కలవచ్చింది ఇన్ని చేస్తున్నారు ‘’అని వ్యంగ్యంగా అంటే దాసుగారు ‘’దేవుడికి తన ఆలయ పునరుద్ధరణ ప్రీతికరం .సర్వాత్మ తేజమే లింగం అనేది సత్య౦ అయితే శివుదిపైకి వేసిన ఈపువ్వు గాలిలో నిలిచి ఉండుగాక ‘’అని ఒక పువ్వు విసిరేశారు .అది వాడకుండా ఆకార్యక్రమాలు అయ్యేవరకు అలాగే నిల్చి ఉంది .ఈవిషయం పెద్దాపురం లో దాసుగారిపై రచించబడిన ‘’భక్త విజయ ధ్వజం ‘’లో –
‘’ముదముగలు లోన మూఢ జనముల్ మిము గైతవ దాసు డంచుస –మ్మదమున దూలనాడ జనమాన్ద్యము వాపగ ,జూడు మంచు స-
మ్మదమున లింగ మూర్ధమున బుష్పము వేయగనద్ది గాలిలో –బదిలముగాగనిల్చె నొకవారము మీదగు శక్తి జాటదే’’
కళ్యాణ దుర్గం లో సప్తాహం 21రోజులు చేశారు .ఒక రోజు ఆపోశన పోస్తూ ‘’ఈ పవిత్రోదకం ఎవ్వరి చేతి నుంచి ఎన్ని బిందువులు కింద రాలితే ,అన్ని పది సంవత్సరాలు బీదయై వస్త్రాలు లేకుండా ఉంటాడు అని నాకు తోస్తోంది కనుక జాగ్రత్తగా గ్రహించండి ‘’అన్నారు .ఒక శ్రీమంతుడు ధనగర్వంతో ఆపోశన ఉదకాన్ని కిందపోశాడు .దాసుగారికి కోపం వచ్చి ‘’సృష్టికర్త అందరి హృదయాలలో ఉంటె ,దేవాలయాలలో తన కళలు నిలపటం సత్యమైతే ఈ బ్రాహ్మణుడు ఇరవై నాలుగు గంటలలో పాప ఫలం అనుభవిస్తాడు ‘’అన్నారు .భోజనాలైపోయి అందరూ తాంబూలాలు వేసుకొంటు౦టే ,ఆ బ్రాహ్మడు హఠాత్తుగా దాసుగారి దగ్గరకు వచ్చి చేతులు జోడించి ‘’నాకు పుత్రభిక్ష పెట్టండి ‘’అని దీనంగా ప్రార్ధించాడు .ఆయన దుఖానికి కారణం అడిగి తెలుసుకొని ,కలరాతో బాధ పడుతున్నాడని తెలిసి ‘’భయం లేదు కలరాతగ్గిపోతుంది ‘’అని అభయమిచ్చి స్వామి ప్రసాదమిచ్చి పంపారు. కుర్రాడు తేరుకొన్నాడు ..ఆరాత్రి ఆకొడుకును తెచ్చి దాసుగారి పాదాలవద్ద ఉంచాడు .కానిఅతనికే కలరావచ్చి చచ్చిపోయాడు .నూతి మడుగు గ్రామం లో ఒక గొప్ప ఆంజనేయ విగ్రహం నాగ జెముడు పొదల్లో పడి ఉందని తెలిసిన దాసుగారు ,ఆ విగ్రహం తేజస్సుకు అబ్బురపడి ఊరి జనాన్ని పిలిపించి ఆలయం కట్టమని అడిగితె వాళ్ళు విముఖత చూపారు .అప్పుడు దాసుగారు ఒక గొనె సంచి తీసుకొని మొదటి రోజు ఒకబస్తా జొన్నలు సంపాదించి పని ప్రారంభించారు .ఉత్సాహంగా ఇచ్చినవారి దగ్గర డబ్బు తీసుకొని తన డబ్బు కొంత ఖర్చు చేసి కొంత పని చేయగా జనాలకు అప్పుడు బల్బు వెలిగి వారే ముందుకు వచ్చి హనుమ దేవాలయ నిర్మాణానికి దాసుగారికి పూర్తీ సహకారం అందించారు .అప్పటికి ఆరు సంవత్సరాలుగా అక్కడ వర్షాభావం .కాని స్వామి ప్రతిష్టతర్వాత వర్షాలే ,వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ జీవనం సాగించారు .ఆలయానికి యాభై వేల నికర ద్రవ్యం సమకూరి రంగరంగా వైభవం గా కార్యక్రమాలు జరుగుతున్నాయి .శ్రీరాం ఎర్రప్పనాయుడు తన భార్యచని పోయిన దగ్గర్నుంచి యావదాస్తీ దేవాలయానికి రాసిచ్చి నిత్యం స్వామి సేవలో ధన్యతచెందుతూ పుష్పోద్యానం వగైరా ఏర్పాటు చేశాడు .ఇలాంటి ఘనకార్యాలు ఎన్నిటినో లింగమూర్తి దాసుగారు అనంతపురం ప్రాంతం లో చేసి ఘనకీర్తి పొందారు .