కేరళ పాణిని -4
ఉద్యోగం లో ఉన్నత దశ
రాజరాజ వర్మ అధ్యాపక వృత్తిలో శిఖరాగ్రం అందుకొన్న కాలం ఇది .పాశ్చాత్యులు మాత్రమే అధిష్టించాల్సిన ఉన్నత పదవులు వర్మకు దక్కటం ఆయన ప్రతిభా విశేషం .19 10 లో సంస్కృత ,ద్రావిడ భాషలకు ఆచార్యుడయ్యాడు .ఈ విషయం మేనమామ కేరళ వర్మకు ముందు తెలిసి మేనల్లుని అభినందిస్తూ టెలిగ్రాం పంపాడు .1910 నుంచి 15 వరకు ఆచార్యుడుగా ఉన్న ఈ అయిదేళ్లు సవ్యంగా జరగలేదు .కళాశాల పాలక వర్గ సమావేశాలలో ఈయనకు ,ప్రొఫెసర్లు అయిన యూరోపియన్ లకు ఏక వాక్యత కుది రేది కాదు .సంస్కృతానికి మాళ యాళానికి వేర్వేరుగా ట్యూటర్లు నియమించాలని వర్మ అభిమతం .అది కుదరదని వారు అడ్డుపడే వారు .అయినా అంతిమ విజయం వర్మకే దక్కింది . ఆ ప్రకారంగా నండియార్ వీట్టిల్ పరమేశ్వర పిళ్ళే , అత్తూరు కృష్ణాపీషరాడి లు తిరువనంతపురం మహారాజా కాలేజీలో ఆచార్యులుగా నియమితులయ్యారు . వీరు మలయాళ భాషాభివృద్ధికి అంకితభావం తో కృషి చేశారు . యూరోపియన్లకు ,భారతీయులకు జీతాల్లో కూడా తేడా లుండేవి . తెల్ల ప్రొఫెసర్ కు 75౦ ,నల్లవారికి 45౦ రూపాయాలిచ్చేవారు .మూడేళ్లు పోరాడితేకానీ సామాన్య జీతాలు రాలేదు . యూరోపియన్ లే ప్రిన్సిపాల్స్ అయ్యేవారు .19 13లో వర్మ ను కేవలం 8 రోజులు ప్రిన్సిపాల్ గా ఉంచటం గగన మైంది.19 16 లో 7 నెలలు ,19 18 లో 3 నెలలే తాత్కాలిక ప్రిన్సిపాల్ గా ఉన్నాడు వర్మ .
సంస్కారణాభి లాష
19 14 లో కళాశాల వర్ధంతి ఉత్సవాలకు వర్మ అధ్యక్షత వహించి ,తన అధ్యక్షోపన్యాసన్ని జాగ్రత్తగా రాసి సెనేట్ , సిండికేట్ ,అకడమిక్ ,విశ్వవిద్యాలయ సభ్యులకు , ఇతర అధికారులకు , సభ్యులకు పంపాడు . మద్రాస్ యూని వర్శిటీ లో దేశ భాషలను నిర్బంధ పాఠ్య భాగం గా తొలగించడాన్ని ఖండించాడు . అందులో కొన్ని ముఖ్య విషయాలు -దక్షిణ భాషలలో జరిగే ఉన్నత పరీక్షలకు అనువైన పుస్తకాలు కనీసం వచనం లో నైనా లేవు .ఒకటి రెండు ఉన్నా ఆంగ్ల సాహిత్యం లో ఉన్నస్థాయిలో లేవు దీనిపై నిర్లక్ష్యం చూపించటం దారుణం .ఆధునిక బోధనా పద్ధతులను ,విమర్శ సూత్రాన్నీ అన్వయించి పండితులు బోధించటం లేదు .. అందుకే అవి విద్యార్ధులకుఏవగింపుగా ఉన్నాయి . పరీక్షాధికారులు అర్ధరహితమైన ప్రశ్నలడిగి విద్యార్ధులను గందరగోళ పరుస్తున్నారు . ఇవి నిష్పక్షపాతంగా ,కళ్ళు తెరిపించేవిగా రాజరాజ వర్మ చెప్పిన సత్యవాక్కులు .జాతీయ సంస్కృతీ ప్రచారానికి ఆయన కొన్ని సూచనలు చేశాడు -దేశ భాషలను సవరించాలికానీ తొలగించకూడదు . వాటి అధ్యయనానికి న్యాయం జరగాలి . చాలా కాలేజీలలో దేశభాషల బోధకులకు ఉత్తమ శిక్షణ ఇవ్వటం జరగటం లేదు . నామ మాత్ర జీతాలిస్తూ ,వారిని పస్తులు0చుతున్నారు .పాతకాలపు పండితులకే ఈఉద్యోగాలివ్వటం న్యాయం కాదు . అందుకని విద్యార్ధుల దృష్టిలో భాషలకు న్యాయం జరగటం లేదు . మలయాళం లో వచ్చిన బోధన పుస్తకాలు బాగానే ఉన్నాయి .సాహిత్య విమర్శ ,విజ్నాన శాస్త్రాలలో నాణ్యమైన పుస్తకాలు రావాలి . వీటి రచనకు సుశిక్షితులైన పట్టభద్రులు కావాలి . పాత పండితులలో ఉన్న మూఢత్వం పోగొట్టి ,ఆధునిక దృక్పధం అలవరచాలి . నూతన ప్రణాళికలు కావాలి .ఆంగ్ల భాష నుంచి ఇతరభాషాలకు ఇతరభాషాలలోని వాటిని ఇంగ్లీష్ లోకి అనువాదించటానికి విశ్వ విద్యాలయ విద్యాప్రణాళికలో నిర్బంధంగా చోటు కల్పించాలి . ప్రాంతీయ భాషలే ప్రజల భాషలు . ఇంగ్లీష్ తో వీటికి సరైన సామాన్య స్థాయి కల్పించాలి . విదేశీ సంస్కృతి ,విజ్నాలాలలో కొంతవరకైనా దేశీయ భాషలవారికి అవగాహన కల్పించాలి ”అని వర్మ రాసిన అధ్యక్షోపన్యాసాన్ని వేలాది మంది విద్యావేత్తలు ప్రశంసించారు . బిఎ ఆనర్స్ భారతీయ భాషలలొ ప్రవేశ పెట్టాలనీ ,తిరువనంతపురం లో మరొక విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలనీ ,మద్రాస్ యూని వర్శిటీ తన తప్పులు తాను సవరించుకోవాలని కోరాడు . ఆనాటి వర్మకొరికలు గొంతెమ్మకోరికలు అని అప్పటి వారికి అనిపించి ఉండచ్చు . ఆతర్వాత జరిగిన సంఘటనలు వర్మ దూర దృష్టికి ఎలా నిదర్శన లుగా ఉన్నాయో తెలుస్తుంది .19 35 లో తిరువనంతపురం మహారాజాకాలేజీ లో మాలయాలభాషలో బిఎ ఆనర్స్ ఏర్పడింది .19 37 లో తిరువనంతపురం యూని వర్శిటీ ఏర్పడింది .ఇవన్నీ వర్మ సూచనలు కోరికలు ఫలాప్రాప్తి న0దాయి . ఇదే తర్వాత కేరళ విశ్వ విద్యాలయం అయింది .
విద్యా విషయక వ్యాసంగాలు
ప్రొఫెసర్ గా ప్రిన్సిపాల్ గా ఉంటూనే వర్మ భాషా ప్రణాళికా ,సామాన్య విద్యా విధాన బాధ్యతలు కూడా తలకెత్తు కోవాల్సి వచ్చి సమర్ధంగా నిర్వహించాడు . పాఠ్య పుస్తక ప్రణాళికా సభ్యుడుగా ఉన్నాడు .ఆరాష్ట్ర పాఠ్య పుస్తక సంఘ సభ్యుడు గా గణనీయమైన సేవలందించాడు . బహిరంగ ఉపన్యాస సంఘానికి కార్యదర్శీ కూడా .భాషా పరిష్కరణ సంఘ సభ్యుడు . ఇన్నిటిలో బిజీబిజీ గా ఉన్నా రచన ప్రక్రియ మాత్రం మానలేదు . ఉద్యోగం లో ఉన్న చివరి ఎనిమిదేళ్ళ కాలం లో రాజరాజ వర్మ -సాహిత్య సహ్యం ,అభిజ్నాన శాకుంతలం కు మలయాళ అనువాదం ,లఘు పాణినీయ ద్వితీయభాగం ,మాలవికాగ్ని మిత్రం ,చారుదత్తం ,స్వప్న వాసవ దత్తం నాటకాలు అనువదించాడు . పాఠశాల వాచకాలు కూడా రాశాడు . రాజరాజ వర్మ రాసిన ”కేరళ పాణినీయం ”సంపూర్ణంగా పరిష్కరింపబడి 19 17 లో ప్రచురితమైంది . ఎనిమిదేళ్లలో ఇన్ని గ్రంధాలా అని అనుమానించే వారికి ఆయన డైరీలే సాక్షి .ఉదయం 6 కు లేచి ,8 కి ఒకకప్పు కోకా తాగి 10 కి స్నానం పూజ,11 కు భోజనం ,నేలపై నిద్ర ,పిల్లలతో కాలక్షేపం ,గంటన్నర నిద్ర ,తర్వాత ఏదో ఫలహారం ,తర్వాత చదవటం రాయటం ,3 -30 కి కాఫీ ,తర్వాత కరెస్పానడేన్స్ ,5 కు గృహా ఆవరణలో నడక ,లేదా క్లబ్ లో టెన్నిస్ ఆట ,ఇంటికి వచ్చి స్నానం చేసి పత్రికలు గ్రంధాలు చదవటం ,రాత్రి 8 కి భోజనం ,తర్వాత కుటుంబ సభ్యులతో పిచ్చాపాటీ ,10 కి నిద్ర .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2 -9 -21 -కాంప్ -మల్లం పేట -హైదరాబాద్
వీక్షకులు
- 995,045 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.11వ భాగం.25.3.23.
- రీ అణుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.28వ భాగం.న్యాయ దర్శనం.25.3.23
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.10వ భాగం.24.3.23
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.27వభగం.న్యాయ దర్శనం .24.3.23.
- హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,952)
- సమీక్ష (1,307)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (386)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు