అగస్త్య లింగ శతకం
శ్రీ తాడికొండ పూర్ణ మల్లికార్జున అయ్య వార్ల౦గారు ‘’అగస్త్యలింగ శతకాన్ని పూర్తిగా సీసపద్యాలతో రచించి ,1935లో బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షరశాలలో ,వరంగల్ కు చెందిన చిదర రాజమౌళి గారి రాజశేఖరం,అక్షయ లింగం గార్ల ద్రవ్య సహాయం తో ముద్రి౦చారు .దీనితోపాటు శివభజన కీర్తనలు కూడా ఉన్నాయి .వెల తెలుపలేదు .దీనికి ముందుమాటలుకృష్ణాజిల్లా నందిగామకు చెందిన ‘’నిగమాగమ విశారద ముదిగొండ వీర భద్రేశ్వరార్యులు రాశారు .
శ్రీ ముదిగొండ వీరేశ లింగం గారు కవిగారి జీవిత చరిత్ర చక్కగా తెలియజేశారు .మల్లికార్జునకవిది గుంటూరు జిల్లా తాడికొండ గ్రామం .ఇదే ఇంటిపెరుకూడా .వ్యవహార నామం పూర్ణయ్య శాస్త్రి .భారద్వాజస గోత్రం ఆపస్తంభ సూత్రం .యజుశ్శాఖ బ్రాహ్మణులు .మతం శైవం ఆరాధ్యులు .1776 ఆనంద నామ సంవత్సరంలో గుంటూరుజిల్లా ఈమనిలో జనన౦.బుచ్చమా౦బా , రాజ లింగారాధ్యులు తలిదండ్రులు . తల్లి పండితారాధ్యుల రాజలింగారాధ్యుల కుమార్తె .రాజలింగం గారు మంత్రం శాస్త్ర ప్రవీణులు .సోమవార ,కార్తీక నక్త వ్రతాలు ఆచరించారు .
కవి తాత గారు మల్లనారాధ్యుడు సంస్కృతాంధ్ర కోవిదుడు .నంది వెలుగు గ్రామం లో తొమ్మిది ఎకరాల ఈనాము భూమి సంపాదించాడు.ఆ నాటి ప్రభువు శ్రీ మల్యాలరాయ వెంకట గుండారాయ ని దర్శించి ఆశువుగాతొమ్మిది సీసాపద్యాలు ,ఏకాక్షర కంద శతకం చెప్పి,రాజును మెప్పించి ఏం కావాలని అడిగితె ‘’ఈమనికి తూర్పుగా నా మాన్యం ఉంది .పంటపండటం లేదు .దీన్ని తీసుకొని దక్షిణంగా ఉన్న భూమి నాకు ఇవ్వండి అని మరి రెండుకందాల్లో తెలియజేశాడు .రాజుగారు కవిప్రతిభకు సంతోషించి ఈమనికి దక్షిణంగా ఏకంగా 25 ఎకరాల మాన్యాన్ని ఇచ్చి సత్కరించాడు .
మల్లికార్జునకవి కుటుంబం వాడైన శ్రీశైల పతిశ్రీ శైల తూర్పు ద్వారం వద్ద తపస్సు చేసి శివానుగ్రహం పొంది ,వివాదాలలో బిల్వ దళం లో పంచాక్షరి రాసి దానితో తులాభారం తూగి ‘’శ్రీశైల ప్రాగ్వార ప్రణవ పంచాక్షరీ తులాభార ప్రసిద్ధులు ‘’అని పించుకొన్నాడు .చన్నబసవ పురాణకర్త అత్తలూరి పాపకవి ,ఈ కవి వంశీకుడైన నందీశ్వరుడిని గురువుగా భావించి స్తుతించాడు .ఇలాంటి ప్రసిద్ధ వంశం లో పుట్టిన మల్లికార్జునకవి బాల్యం నుంచీ ఉభయ భాషా ప్రవీణుడై ,సంగీత ,మంత్రం శాస్త్రాలలో కూడా ప్రతిభా సంపన్ను డయ్యాడు .ఈతని గురువు ,లింగ ధారణ నిచ్చినవాడు పండితారాధ్యుల రాజలింగ ఆరాధ్యులు .ఆతని రచన ‘’కూకద మారయ్యకధ లో పద్యాలు తెలియజేస్తున్నాయి .
కవి పెద్ద సోదరి రాజమ్మ పండితారాధ్యుల జోగయ్యారాధ్యుల భార్య .చిన్నావిడ భ్రమరాంబ పండితారాధ్యుల కొటయ్యారాధ్యుల భార్య . మనకవి అష్ట విధ ఆర్జనపరుడు . షట్కాల శివ పూజాదురంధరుడు .ఎందరికో విద్యనేర్పిన గురువు .మొదటిభార్య ఇవటూరి లింగయ్యగారి కూతురు చనిపోతే ,జగ్గయ్యపేటకు చెందినశివాపురం కోటయ్యా రాధ్యులపుత్రిక రాజేశ్వరి ని చేసుకొని ,భ్రమరాంబ ,పూర్ణానందం లను పొందారు .పెద్ద మేనల్లుడికి ఒకకూతురిని ఇస్తే కొద్దికాలం లో ఆమె చనిపోయింది .పూర్ణాన౦దానికి శివపురం వీర భద్రా రాధ్యుల కుమార్తె అగస్త్యేశ్వరినిచ్చి పెళ్లి చేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-9-21-ఉయ్యూరు